EVM tamper
-
KSR Live Show: మాయ మాయ అంతా మాయ.. ఈవీఎంలపై కొత్త రగడ
-
పారదర్శకతే ప్రాణం!
మన ఎన్నికల సంఘం(ఈసీ)కి ఇష్టమున్నా లేకున్నా ఈవీఎంలపై సంశయాలు తరచు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక్కడే కాదు... వేరే దేశాల్లో సైతం సందేహాలు వినబడుతూనే వున్నాయి. ఆ మధ్య టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయటం సులభమని, దీన్ని తాను నిరూపించగలనని సవాలు విసిరారు. ఇప్పుడు ఆ వరసలో అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సైతం నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో కేబినెట్ భేటీలో ఆమె ఈవీఎంల భద్రతా లోపాలపై పలు ఆధారాలు సమర్పించారు. యథావిధిగా దీనిపైనా మన ఈసీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలు మన ఈవీఎంలకు వర్తించబోవని మాట్లాడింది. సమస్యంతా అక్కడేవుంది. మన దేశంలో పార్టీలు చేసే ఆరోపణలకు ఆ సంఘం నోరు మెదపదు. ఒక జాతీయ పార్టీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో చేసిన ఆరోపణలకు వెనువెంటనే జవాబివ్వడానికి ఈసీకి తీరిక లేకపోయింది. పార్లమెంటులో ఈవీఎంలపై తీవ్ర దుమారం రేగాక మాత్రమే స్పందించింది. గత ఏడాది నవంబర్ 4న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఆ నెల 23న ఫలితాలు ప్రకటించారు. ఆ తర్వాతనుంచి కాంగ్రెస్, ఎన్సీపీ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే వచ్చాయి. 95 నియోజక వర్గాల్లో ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌లూ తనిఖీ చేసి అవి సరిపోలాయో లేదో చెప్పాలని 104 అభ్యర్థనలు వచ్చాయి. వాటిని అంగీకరిస్తే దాదాపు 755 ఈవీఎంల తనిఖీ తప్పనిసరవుతుంది. ఇందులో ఎన్సీపీనుంచి దాఖలైనవే ఎక్కువ. ఇవిగాక న్యాయస్థానాల్లో దాఖలైన ఎన్నికల పిటిషన్లు సరేసరి. హరియాణాలో సైతం ఈవీఎంలపై ఆరుచోట్ల అభ్యర్థనలొచ్చాయి. జమ్మూ కశ్మీర్లో ఒక స్థానం నుంచి ఈ మాదిరి వినతి వచ్చింది. ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈసీ ఇచ్చే జవాబు ఒకే విధంగా ఉంటున్నది. మన ఈవీఎంలు సురక్షితమైనవి, జొరబడటానికి అసాధ్యమైనవి అన్నదే దాని వాదన. అలాగే అవి ఇంటర్నెట్‌తోసహా దేనికీ అనుసంధానించి వుండవు కనుక వైఫై, బ్లూటూత్‌ల ద్వారా ఏమార్చటం ఏమాత్రం కుదరదని కూడా చెబుతోంది. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన సాంకేతిక సదస్సులో కంప్యూటర్ శాస్త్రవేత్త అలెక్స్ హాల్డర్‌మాన్ ఆనవాలు మిగల్చకుండా ఈవీఎంను హ్యాక్ చేయటం, ఫలితాన్ని తారుమారు చేయటం ఎంత సులభమో నిరూపించారు. వీవీ ప్యాట్ యంత్రాలతో అనుసంధానించివున్నా ఈవీఎంల పనితీరు ఎన్ని సంశయాలకు తావిస్తున్నదో వివరించే గణాంకాలు సదస్సులో సమర్పించారు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఎకార్ట్ ఈవీఎంలో వోటేసిన వెంటనే స్క్రీన్‌పై ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరే కనబడుతున్నా వేరేవారికి వోటు పడటంవంటి ఉదంతాలను వివరించారు. ఇంటర్నెట్తో ఈవీఎంలను అనుసంధానించకపోయినా హ్యాక్ చేయటం సాధ్యమేనన్నారు. ఈవీఎంలలో గుట్టుచప్పుడు కాకుండా రిమోట్ యాక్సిస్ సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేయటంద్వారా ఇది చేయొచ్చన్నది ఆయన వాదన. అసలు ఈవీఎంల రవాణా, పంపిణీ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని సమాచార హక్కు చట్టంకింద అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు వెల్లడించాయి. తన నిర్వహణలో సమర్థవంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో సందేహాలకు తావు లేదని ఎన్నికల సంఘం నమ్మటం తప్పేమీకాదు. ఆమాత్రం ఆత్మవిశ్వాసం ఉండటాన్ని ఎత్తిచూపించాల్సిన అవసరం లేదు. కానీ అదే విశ్వాసం అందరిలో కలగటానికి అది చేస్తున్నదేమిటన్నదే ప్రశ్న. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, ఆ రోజు రాత్రి, ఆ తర్వాత విడుదల చేసే పోలింగ్ శాతం వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నా, వాటిల్లో ఎందువల్ల వ్యత్యాసం చోటుచేసుకుంటున్నదో సందేహాతీతంగా అది వివరించలేకపోతున్నది. నిరుడు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కావొచ్చు... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావొచ్చు పోలింగ్ శాతం పెరుగుదలలో తీవ్ర వ్యత్యాసం కనబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏపీలో పోలింగ్ జరిగిన రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ నమోదైందని చెప్పిన ఈసీ మరో నాలుగు రోజులకల్లా దాన్ని 80.66 శాతంగా ప్రకటించింది. నాలుగురోజుల వ్యవధిలో ఈ పెరుగుదల ఏకంగా 12.5 శాతం! సంఖ్యా పరంగా 49 లక్షల వోట్లు పెరిగినట్టు లెక్క! మొదటగా అనుకున్న శాతానికీ, చివరిగా ప్రకటించిన శాతానికీ మధ్య తేడాకు కారణాలేమిటో వివరించే ప్రయత్నం ఈనాటికీ ఈసీ చేయలేదు. మహా రాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిశాక 58.2 శాతం పోలింగ్ అని చెప్పి, ఆ తర్వాత దాన్ని 65.02కు పెంచి తీరా కౌంటింగ్ ముందు అది 66.05 శాతం అన్నారు. బ్యాలెట్ విధానంలో ఇలాంటి వ్యత్యాసాలు కనబడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. లెక్కించేది మనుషులే గనుక పొర బడ్డారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఈవీఎంల విధానంలో అలా కాదు. ఎప్పటి కప్పుడు పోలైన వోట్ల సంఖ్య తెలిసిపోతుంది. మరి ఈ తేడాల వెనకున్న మతలబేమిటో ఎందుకు చెప్పరు? ఈవీఎంల చార్జింగ్ అమాంతం పెరిగిపోవటంపైనా అనేక సందేహాలున్నాయి.ప్రశ్నించినప్పుడు మౌనం వహించటమే పెద్దరికమవుతుందని ఈసీ భావిస్తున్నట్టుంది. ప్రజాస్వామ్యానికి కీలకమని భావించే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కరువైతే అది చివరకు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం పాలు చేస్తుంది. అది ఇప్పటికే ఎంతో కొంత మొదలైంది. అందుకనే బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్న డిమాండ్ క్రమేపీ పుంజుకుంటున్నది. ఈవీఎంలు నమ్మదగ్గవి కాదని ప్రపంచంలో ఏమూల ఎవరు చెప్పినా ఇక్కడ భుజాలు తడుముకోవటంవల్ల ప్రయోజనం లేదు. అలాగే పారదర్శకతకు ప్రత్యామ్నాయం కూడా ఉండదు. -
ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు రావాల్సిందే: ఖర్గే
అహ్మదాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతో మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీ మోసానికి పాల్పడి గెలిచిందని, ఈరోజు కాకపోయినా రేపైనా వాస్తవాలు బయటపడతాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఈ క్రమంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను తిరిగి తీసుకురావాల్సిందేనని గట్టిగా గళం వినిపించారాయన. బుధవారం ఏఐసీసీ సమావేశంలో పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఖర్గే.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్లుతోంది. కానీ, మనం ఇంకా ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాం. ఇదే అతి పెద్ద మోసం. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మళ్లీ.. ఈవీఎంల మోసాల్ని నిరూపించాలని వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు. ఈ విషయంలో యువతరం మేల్కొవాలి. బ్యాలెట్ పేపర్లు కావాలని ముందుకు వచ్చి పోరాడాలి. మహారాష్ట్రలో ఏం జరిగింది?. ఈవీఎంలతో అతిపెద్ద మోసం జరిగింది. అక్కడ ఎలాంటి ఓటర్ల జాబితాను రూపొందించారు?. బీజేపీ 90 శాతం సీట్లు ఎలా నెగ్గింది?. ఎన్నికల చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదు. అసలు మహారాష్ట్ర ఎన్నికలే పెద్ద మోసం. ఈ అంశాన్ని మేం దాదాపు ప్రతీ చోటా ప్రస్తావించాం. రాహుల్ గాంధీ గట్టిగా గళం వినిపించారు. హర్యానాలోనూ అదే జరిగింది. మా లాయర్లు, నేతలు.. ఆ దొంగలను దొరకబట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఏదో ఒకనాటికి వాస్తవాలు బయటపడక తప్పదు.చట్టసభల్లో ప్రతిపక్షంగా మన గళం వినిపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏకపక్షంగా కేంద్రం బిల్లులను ఆమోదించుకుంటోంది. అలాంటప్పుడు ప్రజల గొంతుకను ఎలా వినిపిస్తాం?. అమెరికా టారిఫ్‌ల మీద చర్చకు అవకాశం ఇవ్వలేదు. మణిపూర్‌పై వేకువ జామున 4 గంటలకు చర్చిస్తామన్నారు. ఉదయం చర్చించాలని నేను అడిగితే తిరస్కరించారు. ప్రభుత్వం ఏదో దాస్తుందో కాబట్టే ఇలాంటి పనులు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నెమ్మది నెమ్మదిగా అంతం చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం మీద గత 11 ఏళ్లు దాడి జరుగుతూనే ఉంది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పలు సంస్థలను స్థాపించింది. కానీ, ప్రభుత్వ సంస్థలను మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులపరం చేసింది. జాతి ప్రయోజనాల కంటే.. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యంగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఆఖరికి.. రిజర్వేషన్లనూ ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే దేశాన్ని అమ్మేసే ప్రమాదం లేకపోలేదు. బీజేపీ ఆరెస్సెస్‌లు మతపరమైన అంశాలతో వివాదాలు సృష్టించాలనుకుంటున్నాయి. మసీదుల కింద శివలింగాలను వెతకడం లేదంటూనే ఆ పని చేస్తున్నారు. ప్రధాని మోదీ మంట పెడితే.. ఆరెస్సెస్ దానికి ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్ ఆల్వార్ ఘటనతో బీజేపీ దళిత వ్యతిరేక ధోరణి బయటపడింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సౌజ్ డ్యూటీ సుంకాలు పెంచడం, గ్యాస్ ధరలను పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతుంటే.. అమిత్ షా కఠిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు?. పలు రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం కోర్టు తీర్పు ఒక చెంపపెట్టు. ప్రజాహితం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు పలు చట్టాలు చేశాయి. భూసేకరణ చట్టం, నిర్భంద విద్య, అటవీ రక్షణ చట్టాలు చేసింది. ఈ అంశాలపై మనం పోరాడాల్సిన అవసరం ఉంది.ఇక డీసీసీలదే పవర్ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పవర్స్ కట్టబెట్టింది. ఇక నుంచి అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీలదే నిర్ణయమని వెల్లడించింది. ఇది ఏఐసీసీ నిర్ణయంగా ఖర్గే బుధవారం ప్రకటించారు. -
ఢిల్లీలో ఈవీఎంల తారుమారు
సీతమ్మధార: ఢిల్లీలో స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో భారత ఎన్నికల కమిషన్ విఫలమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎ.పాల్ ఆరోపించారు. ఆయన ఆశీలమెట్టలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ఓడించడానికి బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల దుర్వినియోగాల గురించి వారం ముందు ఆప్ నాయకుడు, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను హెచ్చరించానని వెల్లడించారు.జాతీయ రాజకీయాల్లో తన ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న ఏ రాజకీయ నాయకుడినైనా బీజేపీ లక్ష్యంగా చేసుకుని తొలగిస్తోందని హెచ్చరించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల సమగ్రతను కాపాడటానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఆయన ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను కోరారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కించినట్లయితే, వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 కంటే ఎక్కువ గెలుచుకోలేదన్నారు. 76 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజకీయాలు ఎందుకని ఎద్దేవా చేశారు. తనకు మద్దతిస్తే.. ఆట మొదలెడతానని అన్నారు. దేశంలో టాప్ 10 పొలిటికల్ పార్టీలు మోదీ ముందు లొంగిపోయాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు పూర్తిగా సందిగ్ధంలో ఉందన్నారు. ట్రంప్‌తో యుద్ధం చేసైనా తెలుగువాళ్లను కాపాడుకుంటానన్నారు. ఈ దేశానికి సేవ చేయడానికి రాజ్యసభ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి తెలుగు సినిమాలు లేకపోతే.. హాలీవుడ్లో అవకాశాలు ఇప్పిస్తానని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చెప్పిన సనాతన ధర్మం ఎక్కడుందని ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌కు ఒమర్ అబ్దుల్లా షాక్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎంల)పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీపార్టీ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నుంచే గట్టి షాక్ తగిలింది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ విమర్శలను జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్ మాట్లాడారు. ఓడినప్పుడు మాత్రమే ఈవీఎంలను నిందించడం సరికాదన్నారు. ఓటింగ్ విధానంపై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఒమర్ సూచించారు. ఎన్నికల్లో ఫలితం ఏదైనా అంగీకరించాలన్నారు. ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే వాటిపై పోరాటం చేయాలన్నారు. అవే ఈవీఎంల సాయంతో 100 మంది సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు, పార్టీ విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఒమర్ గుర్తుచేశారు. కొన్ని నెలల తర్వాత తాము ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని ఈవీఎంలపై విమర్శలు చేయడం సరికాదనిదని ఒమర్ అన్నారు. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదని, ఓటమికి సాకుగా వాటిని చూపించకూడదన్నారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని ఎన్నుకుంటారన్నారు.గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటికీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇందుకు ఓ ఉదాహరణ అని చెప్పారు. ఇటీవల జరిగిన హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
EVM Row: ‘ఒకవేళ సీఈసీని తొలగించమని కోరితే..!’
దేశంలో ఇటీవల జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(EVM) పనితీరు మీద ఎన్నో సందేహాలకు కారణమయ్యాయి. ఈవీఎంలను ఎవరో.. ఎక్కణ్ణుంచో ఆపరేట్ చేస్తున్నారని.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నా ఎన్నికల సరళికి ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న సుజా సయీద్ అనే ఉద్యోగి తాను ఈవీఎంను హ్యాక్ చేయగలను అని ఛాలెంజ్ చేసినందుకు ఆయనమీద ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా అయన మీద కేసు కూడా బుక్కైంది... మొన్న మహారాష్ట్రలో పోలింగ్ జరిగిన తీరుమీద సందేహాలు వ్యక్తం చేస్తూ షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తహసీలులో 1900 ఓట్లున్న మర్కర్‌వాడీ గ్రామం ప్రజల వినూత్న పోరాటం చేస్తున్నారు. ఈవీఎంల మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించారు. అధికారవర్గాలకు కంగారు పుట్టించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఊరుమొత్తాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఏకంగా ప్రజలను కర్ఫ్యూ పేరిట నిర్బంధించారు.ఇదిలా ఉండగా దేశంలో పలు చోట్ల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు.. వాటిని హ్యాక్ చేసేందుకు ఉన్న అవకాశాల మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. గతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిన్నటి మహా రాష్ట్ర ఎన్నికల్లోనూ పోలింగ్ సమయానికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓట్లకు, కౌంటింగ్ రోజున బయల్పడిన ఓట్లకు భారీ వ్యత్యాసం రావడంతో ఓడిపోయిన పార్టీల్లో బోలెడు సందేహాలు ముప్పిరిగొన్నాయి. దేశంలో మళ్ళీ బ్యాలెట్ విధానం రావాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. ఈ తరుణంలో భాను ప్రతాప్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా చీఫ్ ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేయండి.. ఈ మేరకు లోక్ సభలో నోటీస్ ఇవ్వండి అంటూ కాంగ్రెసుకు సలహా ఇచ్చారు. మీరు డిమాండ్ చేసినట్లు ఈసీని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోదు కానీ ఒక చర్చ అయితే అవుతుంది కదా.. ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం అంత ఈజీ కాదు కానీ మీ ప్రయత్నం వల్ల ఈవీఎంల పనితీరు మీద ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది కదా.. ఈ దిశగా ఒక అడుగు వేయండి అంటున్నారు ఆ అడ్వకేట్.ఇక ఎన్నికల కమిషన్ నిర్మాణం..కమిషనర్ తొలగింపు పద్ధతులు చూద్దాం..భారత ఎన్నికల సంఘం:-భారత ఎన్నికల సంఘం (ECI) దేశంలో ఎన్నికల ప్రక్రియలను నిర్వహించడానికి బాధ్యత వహించే స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థభారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం గురించి పేర్కొన్నారుకమిషన్ ప్రధానకార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ కమిషన్ భారతదేశంలోని లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలతోబాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుందిప్రస్తుతం రాజీవ్ కుమార్ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు.ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే : ఎన్నికల కమిషనర్ తొలగింపు గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5)లో పేర్కొన్నారు.లోక్‌సభ, రాజ్యసభలలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండి దానికి ఓటు వేయడానికి అవసరమైన అభిశంసన ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనరును తొలగించవచ్చు. దీంతోబాటు ముఖ్య ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై ఇతర ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి తొలగించవచ్చు. ఇదిలా ఉండగా 2009 లో, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారంటూ ఎన్నికల కమిషనరు నవీన్ చావ్లాను తొలగించాలని అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు సిఫార్సు పంపినా దాన్ని రాష్ట్రపతి ఆమోదించలేదు.-సిమ్మాదిరప్పన్న -
ఓటు, డౌటు మిషన్.. గ్యాంబ్లింగ్ జరుగుతుంది
-
మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారట! కాకుంటే మళ్లీ ఈమీఎంతోనేనట!!
-
ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(EVM)ల పనితీరుపై రాజకీయ వర్గాల్లోనే కాదు.. జనాల్లోనూ చాలా అనుమానాలే ఉన్నాయి. ఊహించని రీతిలో వెలువడే ఫలితాలే.. ఆ అనుమానాల్ని బలపరుస్తుంటాయి. అలాంటప్పుడే గో బ్యాక్ టూ బ్యాలెట్ పేపర్ అనే వాయిస్ వినిపిస్తుంటుంది. అయితే లోపాల సంగతిని పక్కనపెట్టి.. అవకతవకలకు ఆస్కారం లేదంటూ ఎన్నిక సంఘం, కేంద్రం వాటి వినియోగాన్ని సమర్థిస్తుంటాయి. తాజాగా.. ఇవాళ సుప్రీం కోర్టు సైతం బ్యాలెట్ పేపర్లను వెనక్కి తేలేమంటూ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే..మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాఢి ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 16 స్థానాల్లో గెలిచింది. ఓడినవాళ్లలో.. దూలే రూరల్ నుంచి పోటీ చేసిన కునాల్ పాటిల్ కూడా ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర పాటిల్ చేతిలో ఓటమి చెందారు. అయితే..కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో జనం ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ గ్రామంలో.. కునాల్‌కు జీరో ఓట్లు వచ్చాయని, అందుకే ఈవీఎంలకు వ్యతిరేకంగా వాళ్లు నిరసన తెలుపుతున్నారనేది ఆ వీడియో సారాంశం. అయితే..ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ.. ఈవీఎంల పని తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీళ్లలో యూపీ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పాన్ఖురి పాథక్ కూడా ఉన్నారు. గ్రామంలోని 70 శాతం జనాభా కునాల్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈవీఎంలను బీజేపీ తప్పుడుగా ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. కానీ..In Maharashtra people are out on the streets protesting against EVM manipulation... Will any Godi Media channel dare to show this ?NO. https://t.co/yTtAyoqav0— Pankhuri Pathak पंखुड़ी पाठक پنکھڑی (@pankhuripathak) November 25, 2024ఎన్నికల సంఘం ఆ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. అవధాన్లో కునాల్ పాటిల్‌కు 1,057 ఓట్లు పోలయ్యాయని ధూలే జిల్లా ఎన్నికల కార్యాలయం ప్రకటించింది. అలాగే.. రాఘవేంద్ర పాటిల్‌కు ఇక్కడ 1,741 ఓట్లు వచ్చాయని పేర్కొంది. దీంతో.. ఆ వీడియో ఫేక్ అనేది స్పష్టమైంది.నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. నవంబర్ 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ధూలే రూరల్ నియోజకవర్గంలో రాఘవేంద్ర పాటిల్‌కు 1,70,398 ఓట్లు, కునాల్ పాటిల్‌కు 1,04,078 ఓట్లు పడ్డాయి. -
ఈవీఎంలు వద్దు.. మాకు బ్యాలెట్ పేపర్లే కావాలి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్లే తాము కోరుకుంటున్నట్లు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ పేపర్‌కు తిరిగి వచ్చేందుకు భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ఐక్యత కావాలంటే విద్వేషాలను విస్తరించడం మానుకోవాలని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరు రాజ్యాంగాన్ని పొగిడి, దానికి నమస్కరించి భక్తిని ప్రదర్శిస్తుంటారని, లోపల మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు సమాజంలోని అన్నివర్గాల ప్రజలు కదిలివచ్చారని తెలిపారు.VIDEO | "Some people praise the Constitution, but only superficially; inside, they are undermining it. To protect the Constitution, Rahul Gandhi ji launched the Bharat Jodo Yatra, and to save democracy, all minorities came forward, which is why we were able to stop PM Modi.… pic.twitter.com/qrQfMQJKb8— Press Trust of India (@PTI_News) November 26, 2024మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నిర్వహణలో బీజేపీ అవకతవకలకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించాయి. -
మరోసారి తెరపైకి EVM ట్యాంపరింగ్..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
-
యంత్రమా..? కుతంత్రమా..? ఎలాన్ మాస్క్, శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు చెబుతున్నదేంటి.. ?
-
ఈవీఎంల హ్యాకింగ్ చాలా సులభం.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..
-
ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలను ఈసీ నివృత్తి చేయలేదన్న జగన్
-
దేశవ్యాప్త ప్రజా ఉద్యమంతోనే ఈవీఎంల అసలు గుట్టు సాధ్యం!
హమ్మయ్యా.. ఎట్టకేలకు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఎన్నికల కమిషన్ నోరు విప్పింది. అయితే ఈ వివరణ మొత్తం ఏదో బుకాయిస్తున్నట్లు మాత్రమే ఉంది. ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఒక పత్రిక విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంల మ్యానిప్యులేషన్పై ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అయితే ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లు కానీ ఈ అనుమానాలను సంతృప్తికరమైన సమాధానం ఇచ్చినట్లు కనిపించలేదు. పైగా ప్రశ్నలు వేసినవాళ్లు అధికులు ఉత్తరాది వారు కావడం వల్లనేమో లేక సమాచారం లేమి కారణంగానో తెలియదు కానీ.. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన తంతుపై ఎక్కువ ప్రశ్నలు రాలేదు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఉండటంపైనే ప్రశ్నలు కొనసాగాయి. అలాగే ఒక కాంగ్రెస్ ఎంపీ ఈవీఎంలను హిజ్బొల్లా వాడిన పేజర్లతో పోల్చి.. ఇజ్రాయెల్ సైన్యం వాటిని పేల్చివేసిన వైనం గురించి ప్రస్తావించిన సంగతిని కోట్ చేసి అడిగారు. సహజంగానే ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషనర్లు ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై అనుమానాలు రేకెత్తించేలా సమాధానమిచ్చారు. మొదటి గంటలోనే ఫలితాలు ఎలా వస్తాయని ఈసీ ప్రశ్నించింది. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కాదు సమస్య. హరియాణాలో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారం అన్న అంచనాకు వచ్చాయి. కొన్నిసార్లు ఈ అంచనాలు తప్పవచ్చు కానీ.. అన్ని సర్వేలూ తప్పు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలకు భిన్నంగా ఈవీఎం ఓట్ల లెక్కలు ఉండటం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. భారత్ వాడే ఈవీఎంలు హిజ్బొల్లా వాడే పేజర్ల కన్నా సమర్థమైనవని, ఎవరూ హ్యాక్ చేయలేరని ఈసీ అన్నప్పటికీ, దానిని సహేతుకంగా నిరూపిస్తామని చెప్పలేకపోవడం గమనార్హం. ఈవీఎంల బాటరీ ఛార్జింగ్ పోలింగ్ నాటి కన్నా, కౌంటింగ్ నాటికి ఎలా పెరుగుతుందన్న దానికి వీరు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఇజ్రాయిల్ హ్యాకింగ్ దిట్ట అని పేరు. పెగసస్ గూఢచర్య పరికరాలు, సాఫ్ట్వేర్లు అక్కడ తయారవుతున్నాయి. హిజ్బొల్లా వాడిన పేజర్లను తయారు చేసే తైవాన్ కంపెనీనే మేనేజ్ చేసి టాంపరింగ్ చేసి, వాటిని పేల్చివేయగలిగిందని వార్తలు వచ్చాయి. అలాంటి ఇజ్రాయిల్ నుంచి ఈవీఎం టాంపరింగ్ పరిజ్ఞానాన్ని ఎవరైనా ఇండియాకు తెచ్చారా అన్న సంశయం కొందరిలో ఉంది. దీన్ని మనం నిర్ధారించలేము కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు, వెల్లడైన ఫలితాలు, ఆ తర్వాత ఈసీ అధికారులు ప్రవర్తించిన తీరులను గమనిస్తే పలు సందేహాలు రాక మానవు. ప్రముఖ సర్వే నిపుణుడు ఆరా మస్తాన్ కొద్ది రోజుల క్రితం చాలా స్పష్టంగా ఈవీఎంలను హాక్ చేయవచ్చని, ఈ విషయాన్ని పలుమార్లు నిపుణులు రుజువు చేశారని అన్నారు. ఎలాన్ మస్క్ వంటివారు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా భారత ఎన్నికల సంఘం సరైన తీరులో స్పందించకపోవడం సందేహాలకు తావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో అత్యధిక సర్వే సంస్థలు పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఫలితాలు కూడా అలాగే ఉంటాయని, ఇరుపక్షాల మధ్య తేడా ఉంటే ఐదు లేదా పది సీట్లు ఉండవచ్చని అంచనా వేశాయి. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ వైఎస్సార్సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోసం జరిగిందని స్పష్టం చేశారు. కాకపోతే ఆధారాలు లేవని అన్నారు. కానీ ఆ తర్వాత పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఆరా మస్తాన్ వంటివారు మొత్తం స్టడీ చేసి ఈవీఎంల మానిప్యులేషన్ జరిగిందన్న భావనకు వచ్చారు. అన్నిటిని మించి ఎన్నికల కమిషన్ ఎన్ని అరోపణలు వచ్చినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే మోసం జరిగిందన్న దానికి పెద్ద ఎవిడెన్స్ అన్న భావన ఉంది. ఎన్నికల నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓట్ల శాతం ఎలా పెరిగిందన్న ప్రశ్నకు ఈసీ నుంచి జవాబు లేదు. ఏపీలో సుమారు 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా వచ్చాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం చేసిన ఆరోపణపై సరైన సమాధానం రాలేదు. ఒంగోలు, విజయనగరంలలో వీవీప్యాట్ స్లిప్ లను లెక్కించాలని, ఈవీఎంలతో పోల్చాలని చేసిన అభ్యర్థనను పక్కదారి పట్టించడం, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, దానిని అమలు చేయకపోవడం మరో డౌటు. ఈ ఒక్క విషయాన్ని ఎన్నికల సంఘం క్లియర్ చేసి ఉంటే ఈవీఎంలపై సందేహాలు వచ్చే అవకాశం ఉండదు. అలా చేయకపోవడంతో ఈవీఎంలను మేనేజ్ చేశారని అందువల్లే ఏపీలో జగన్ ప్రభుత్వం ఓటమికి గురైందని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. వీవీప్యాట్ స్లిప్ లను పది రోజులలోనే దగ్ధం చేయాలని అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి జిల్లా అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్నది ఇంతవరకు తేలలేదు. వీటన్నిటిపై అప్పటి వైసీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టుకు వెళితే, రెండు నెలలు దాటినా తీర్పు రాకపోవడం మరో చిత్రంగా భావిస్తున్నారు. ఇక ఫారం 20లో ఆయా పార్టీలు, అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు నమోదు చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉన్నా, ఏపీలో 108 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? వాటిని పరిశీలిస్తే అనేక ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని నియోజకవర్గాలలోని పోలింగ్ బూత్‌లలో వైసీపీకి ఒక్క ఓటు మాత్రమే రావడమేమిటో అర్థం కాదు. పైగా అసలు అంతగా ఉనికిలో లేని కాంగ్రెస్‌కు అదే బూత్ లో 470 ఓట్లు వచ్చాయని నమోదు కావడం మరో వింతగా చెబుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత, వీటిపై ఎన్నికల సంఘం ప్రజల ముందుకు వచ్చి ఈ అనుమానాలను నివృత్తి చేయకపోవడంపై అంతా విస్తుపోతున్నారు. మీడియా సమావేశంలో ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం ద్వారా ప్రజాస్వామ్య రక్షణకు గొడుగుగా ఉండవలసిన ఈ సంస్థకు ఏదో అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. పోనీ ఏపీ, ఒడిషా, హరియాణలలో గెలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలైనా ఈవీఎంలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న డౌట్ల ను క్లియర్ చేయాలని ఎన్నికల సంఘానికి సూచించకపోవడం మరో సంశయంగా ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంటివారు ఎన్నికలలో ఈవీఎంలను ఎలా టాంపర్ చేయవచ్చో, పలుమార్లు వివరించారు. ప్రస్తుతం ఆయన గెలిచారు కనుక ఆ అంశాల జోలికి వెళ్లడం లేదు. ఏపీలో కూటమి ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తీరు అంతా ఏకపక్షంగానే సాగిందన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో దేశ ప్రజల కర్తవ్యం ఏమిటి? అయితే ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలి. అలా చేయకపోతే ప్రజాబాహుళ్యం నుంచి ఒత్తిడి మొదలు కావాలి. అది ఉద్యమ రూపం దాల్చాలి. ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారిన ఈవీఎంల వ్యవస్థను తొలగించే వరకు అంతా ఉద్యమించాలి. దీనిపై దేశ వ్యాప్తంగా కదలిక రాకపోతే భవిష్యత్తులో ఇది మరింత అపాయంగా మారుతుంది. ఎవరికి వీలైతే వారు ఈవీఎం లను హాక్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వైఎస్సార్సీపీ అధినేత జగన్ దీనిపై ప్రజా ఉద్యమం తీసుకురావడానికి పూనుకోవాలని అంతా భావిస్తున్నారు. ముందుగా ఆయా సర్వే నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రముఖులతో సమావేశం జరిపి, దేశ స్థాయిలో వివిధ ప్రాంతాలలో సెమినార్లు కండక్ట్ చేసి అందరిలోను ఒక కదలిక తీసుకు రాగలిగితే ఆయన దేశానికి ఒక మార్గదర్శకుడు అవుతారు. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదని, ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయరని ఎక్కువమంది నమ్ముతారు. తొలుత ఆయన పార్టీ పరంగా తనకు ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడికరించి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలి. వారు స్పందిస్తారా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. ఈవీఎంలపై అందరిని సంతృప్తిపరిచేలా ఈసీ జవాబు ఇవ్వగలిగితే ఓకే. అలా కాకుండా జగన్ గతంలోనే చెప్పినట్లు పేపర్ బాలెట్ ద్వారానే ఎన్నికలు జరిగేలా ఈ నాలుగేళ్లు ఉద్యమం చేపట్టడం అవసరం అనిపిస్తుంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ హరియాణ ఎన్నికల ఫలితాల ద్వారా ఈసీకి పలు ఫిర్యాదులు చేసింది. వాటిలో వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కూడా ఉంది. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఈవీఎంల వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దానికి కేంద్రం, ఈసీ ఎటూ అంగీకరించవు. కాబట్టి.. ప్రజా ఉద్యమమే ఈ సమస్య పరిష్కారానికి మేలైన మార్గం కాగలదు! కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఈసీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న, జార్ఖండ్‌కు రెండు విడతల్లో నవంబర్ 13న, 20న పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారుఎగ్జిట్స్ పోల్స్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ భారీ అంచనాలనే సృష్టిస్తాయని చెప్పారు. ఇందువల్ల ప్రజల్లో గంగరగోళం ఏర్పడుతోందని, ఈ విషయంలో మీడియా సహా భాగస్వామ్య పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి అవసరం ఉందని, స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు.అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌కు శాంపిల్ సైజ్ ఏంటి.,? సర్వేలు ఎక్కడ జరిగాయి. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే మన బాధ్యత ఎంతవరకు? అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాలు.. తుది ఫలితాలకు మధ్య ఉండే తేడా.. పార్టీలకు, అభ్యర్థులకు, చివరకు ప్రజల్లో కూడా తీవ్ర నిరాశకు దారితీస్తోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.చదవండి:మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. తుది ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా బీజేపీకి పట్టం కట్టిన నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్ గురించి ఎన్నికల కమిషనర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక హర్యానా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. స్పష్టతనిచ్చారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలు ఉంటాయని,ఆరు నెలల ముందే ఈవీఎంలను పరిశీలించి ఎన్నికల నిర్వహణలో ఉపయోగిస్తామని తెలిపారు. నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని పేర్కొన్నారు.ఈవీఎంలపై వచ్చిన 20 ఫిర్యాదులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఓట్ల లెక్కింపు మొదలైన అరగంటలోపే మీడియాల్లో.. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేయడాన్ని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. అంత తొందర్లోనే ఫలితాల గురించి ఒక అంచనాకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఉదయం 9:30 గంటల కంటే ముందు ఇచ్చే ఫలితాలు అంతా బోగస్ అని కొట్టిపారేశారు. -
Editor Comment: ప్రమాదంలో ప్రజాస్వామ్యం హర్యానా ఫలితాల్లో బయటపడ్డ నిజం
-
జమ్మూలో ఈవీఎంలు మంచివేనా: కిషన్‌రెడ్డి ప్రశ్న
సాక్షి,హైదరాబాద్:హర్యానాలో ఈవీఎంల అక్రమాలు జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదని,కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు ఎందుకు రావడం లేదని కేంద్రమంత్రి,జమ్మూకశ్మీర్ ఇంఛార్జ్ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి శుక్రవారం(అక్టోబర్11) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘ఓట్లు జమ్మూలో ఒక రకంగా పోలరైజ్ అయ్యాయి. కశ్మీర్లో మరోరకంగా పోలరైజ్ అయ్యాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ రాగానే మంత్రి వర్గ కూర్పు పై రాహుల్, సోనియా దగ్గర క్యూ కట్టారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశం లేదు.ఆర్టికల్ 370పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదు. జమ్మూ కశ్మీర్లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే.బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే. 19 మంది కొత్తవాళ్ళు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదు. జమ్మూలో టెర్రరిజం పై మరింత జాగ్రత్తగా ఉంటాం. జమ్మూలో సరిహద్దు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఒక్క రాయి విసిరిన సంఘటన జరగలేదు.భారతదేశంలో పాకిస్థాన్ ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గింది.పెద్ద నోట్ల రద్దుకు పాకిస్తాన్లో దొంగ నోట్ల ముద్రణ ఒక కారణం. పాకిస్తాన్‌కు ఇతర దేశాల మద్దతు లేకుండా చేయడంలో భారత్ సక్సెస్ అయ్యింది.ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతోంది. ఇదీ చదవండి: ఆదాయం ఎందుకు తగ్గింది -
చంద్రబాబు.. మరి ఇప్పుడు కప్పదాటు మాటలు ఎందుకు?
సాక్షి,తాడేపల్లి: ఈవీఎంలపై మాట్లాడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుందా? అని నిలదీశారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఇంకోమాట మాట్లాడటం ఆయనకు అలవాటన్నారు మేరుగ. గత ఎన్నికల తర్వాత ఈవీఎంలపై ప్రజలకు అనుమానం కల్గిందని, ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఈసీపై ఉందన్నారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన మేరుగ.. ఈవీఎంలపై అనేక అనుమానాలున్నాయరు‘విజయనగరంలో ఒక ఈవీఎం ఫుల్ చార్జింగ్‌తో ఉండటంతో మాకు అనుమానం వచ్చింది. ఒంగోలులో ఓట్ల విషయంలో కూడా అనుమానం వచ్చింది. దీనిపై మేము కోర్టుకు వెళ్లాం. హర్యానా ఎన్నికల ఫలితాల్లో కూడా ఇలాంటి అనుమానాలే ఉన్నాయని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం అని జగన్ అన్నారు. దీనిపై మేము ప్రశ్నిస్తే చంద్రబాబు కోప్పడుతున్నారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చంద్రబాబే చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేశారు. మరి ఇప్పుడు కప్పదాటు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అని మేరుగ నాగార్జున మండిపడ్డారు. సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గుచూపుతున్నాయనే విషయాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా మేరుగ గుర్తు చేశారు. -
KSR Live Show: EVMలతో ఖూనీ.. ఇక ఎన్నికలు ఎందుకు?
-
ఈవీఎంల ట్యాంపరింగ్ పై విజయసాయిరెడ్డి ట్వీట్
-
ఎలక్షన్ కమిషన్ ఎందుకు తడబడుతుంది?.. మేరుగు నాగార్జున సంచలన వ్యాఖ్యలు
-
అధికారులకు ముఖేష్ మీనా సూచనలు ఈవీఎం స్లిప్ లు తగలబెట్టండి..
-
KSR Live Show: పక్కాగా ఈవీఎం గోల్ మాల్.. నిమ్మకు నీరెత్తినట్టు ఈసీ
-
ఈవీఎంలపై YSRCP ఫిర్యాదు.. ఈసీ ఎందుకు కంగారుపడుతుంది?
-
ఈవీఎంలలో గోల్ మాల్..
-
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్‌కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్‌లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
ఈవీఎంల ట్యాంపరింగ్‌కు చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాటి ట్యాంపరింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ‘2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రశ్నించిందే టీడీపీ (అప్పుడు నేను ఆ పార్టీలోనే ఉన్నా). ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీనిపై సెమినార్ నిర్వహించి అవగాహన కల్పించాం. అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి’ అని చెప్పారు. ‘ఎన్నికలకు ముందురోజు ప్రతి నియోజకవర్గానికి ఈవీఎంలను తీసుకొచ్చి పంపిణీ కేంద్రంలో ఉంచుతారు. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంల కంటే 15 శాతం ఈవీఎలను ఎక్కువగా కేటాయిస్తారు. ఎన్నికల రోజు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వీటిని వాడుకుంటారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలన్నీ తొలుత డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కే వస్తాయి. అక్కడే రాత్రంతా ఉంచుతారు. ఆ రాత్రి ఈవీఎంలను అటూ ఇటూ మార్చేలా ఏదైనా జరగొచ్చు. పోలింగ్ ముగిసిన మర్నాడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్తున్నాయి’ అని రేవంత్ పేర్కొన్నారు. ఫ్రీక్వెన్సీని బట్టి ట్యాంపరింగ్ ‘ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ఎక్కడో కూర్చుని చేశారా.. లేక చిప్‌లలోకి ఏదైనా ఫ్రీక్వెన్సీని పంపారా అనేది మనం చెప్పలేము. చిప్‌లోకి లోఫ్రీక్వెన్సీ అయితే ఒకలాగా, హైఫ్రీక్వెన్సీ అయితే మరోలాగా ఈవీఎంలను ఆపరేట్ చేయొచ్చు. కంపెనీ తయారు చేసే ప్రొగ్రామ్‌ని బట్టే ఈవీఎం పని చేస్తుంది. ప్రోగ్రాం రీరైడ్ చేయాలంటే మిషన్ చేతికి రావాల్సి ఉంటుంది. అయితే సిగ్నల్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు. ఫ్రీక్వెన్సీ ఉంటే ఒకలా, లేకపోతే ఇంకోలా దేనికి దానికే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది. గెలుపోటముల కోసం 100 శాతం మెషీన్లను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్‌గా 10 శాతం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే 10 వేల ఓట్ల వ్యవధిలోనే గెలుపోటములను డిసైడ్ చేయొచ్చు కదా’ అని రేవంత్ చెప్పారు.ఏపీలో ఐదేళ్లకు ప్రభుత్వం మార్పుప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పదేళ్లకు ఒకమారు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే ట్రెండ్ కొనసాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుందన్నారు. ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్‌కు ఎంతమాత్రం పోటీ కాదన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కంటే హైదరాబాద్ శివారు ప్రాంతాలు, వరంగల్ లేదా బెంగళూరు, చెన్నైలలోనూ పెట్టుబడి పెట్టడం మంచిదని సలహా ఇచ్చారు. -
టీడీపీ ఈవీఎం ట్యాంపరింగ్ పై శిల్పా చక్రపాణి రెడ్డి కామెంట్స్
-
ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి..
-
ఈవీఎలం భద్రత.. వెరిఫికేషన్ కోసం ఈసీకి ఎనిమిది దరఖాస్తులు
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రతపై చర్చ తారా స్థాయికి చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల అంశం దేశ వ్యాప్తంగా మరోసారి దుమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి మొత్తం ఈవీఎంల తనిఖీ, వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పదకొండు దరఖాస్తులు అందాయి.ఇందులో లోక్‌సభ ఈవీఎంల కోసం ఎనిమిది, అసెంబ్లీ ఈవీఎంల కోసం మూడు దరఖాస్తులు వచ్చాయి. వైఎస్సార్సీపీ నుంచి విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు వచ్చింది. అలాగే వైఎస్సార్సీపీ తరపున గజపతినగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు అందాయయి.తెలంగాణలో జహీరాబాద్ పార్లమెంట్లో 23 పోలింగ్ కేంద్రాలలో బీజేపీ వెరిఫికేషన్ కోరింది. ఒడిశాలో 12 పోలింగ్ కేంద్రాలలో బీజేడీ వెరిఫికేషన్ కోరింది. అయితే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసిన నాలుగు వారాలలో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. -
KSR Live Show: EVMలను పక్కన పెట్టాలి.. EVMలు హ్యాక్ చేయొచ్చు.. బ్యాలెట్ పద్ధతి బెస్ట్..
-
ఈవీఎం ట్యాంపరింగ్ పై ఉషశ్రీ చరణ్ రియాక్షన్
-
ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమే: పిట్రోడా
ఢిల్లీ: పోలింగ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాకింగ్‌కు గురువుతున్నాయంటూ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం మిషన్లను హ్యాక్ చేయడానికి, ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్, కాంప్లెక్స్ సిస్టంల రంగాల మీద సుమారు అరవై ఎళ్లపాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యం అవుతుంది.దీని వల్ల ఫలితాలకు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెక్ ఓటింగ్ విధానమే చాలా ఉత్తమమైంది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి’’ అని అన్నారు.I have spent about 60 years in the forefront of #electronics, #telecom,IT, #software, #complex systems and a lot more. I have studied #EVM system carefully and believe that it is possible to manipulate. The best approach is the traditional paper ballet to count as casted.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 ‘పోలింగ్‌లో ఉపయోగించే ఈవీఎం మిషన్లతో పాటు, వీవీప్యాట్ స్లిప్స్ కోసం వీవీప్యాట్ యాంత్రాలు కూడా అమర్చబడి ఉన్నాయి. వీవీప్యాట్ యంత్రాల సాయంతో కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని అన్నారు.The #EVM debate in #India continues to get hotter due to a comment from #Elon Musk .The facts are clear. It is not just the stand alone EVM but a complex system with #VVPAT & associated processes and logistics that is open to selective manipulation.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్, ఓటర్లు జాబితా, వేసిన ఓట్లు, లెక్కించిన ఓట్లు, మొత్తం ఓట్లు, విజేతలు(ఓట్లు), ఓడిపోయినవారు (ఓట్లు) వంటి వాటిపై పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించబడింది. వీటిని పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని శ్యామ్ పిట్రోడా సూచించారు.Confusion created about #VVPAT, #voter lists, votes casted, counted, margins, winners, losers, etc. during recent #election in #India needs careful consideration to build trust between #voters and the #ECI.— Sam Pitroda (@sampitroda) June 16, 2024ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఈవీఎంలు అస్సలు హ్యాక్ చేయడాని వీలు లేదని తెలిపింది. భారత్‌లో ఉపయోగించే ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ వంటి వైర్లెస్, వైర్ కనెక్షన్లు ఉండవని పేర్కొంది. దీంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా శ్యామ్ పిట్రోడా లేవనెత్తిన వీవీప్యాట్ మిషన్ల అంశంతో ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు వస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.సంబంధిత కథనం: ఈవీఎంల గుట్టు విప్పేదెవరు? -
ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్ చేయడం గమనార్హం. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు ఒకరు మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేసి ఆపరేట్ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు, పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలకు గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావటంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నా... తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నా.. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్ దేశం నిలదీస్తున్నా... ఇవిగో ఈవీఎం మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నా... కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకు చావండి’ అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానాన్నే అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతోపాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్ నిపుణులు వాŠయ్‌ఖ్యానిస్తున్నారు. చిప్‌లోనే చిదంబర రహస్యం..! ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్‌లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలలో బ్లూటూత్ టెక్నాలజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్‌లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్ చిప్‌లు, ఫ్లాష్ మెమరీని హ్యాక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా? అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు. భద్రతా సందేహాస్పదమే ఈవీఎంల భద్రత, నిర్వహణపైనా నీలి నీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రత లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబరు నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకూ చోటు చేసుకున్నట్లు ‘ద వైర్’ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే ఎల్రక్టానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటన ప్రకారం.. ఈసీఐ కోరిన దాని కంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. మరి చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా, ఓటింగ్ నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇతర ఈవీఎంలతో కలిపేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఈసీ మౌనం దాల్చడం గమనార్హం. ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదు? అందులో ఇబ్బంది ఏమిటి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంల భద్రత వ్యవస్థ ఎంతవరకు పటిష్టం? అనే సందేహాలున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌ల సీసీ కెమెరాల ఫుటేజీలను అన్ని పార్టీలకూ అందుబాటులో ఉంచితే పారదర్శకంగా ఉంటుంది. ఈ డిమాండ్‌పై ఈసీ కనీసం స్పందించలేదు. ఒకవైపు ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతుండగా సందేహాలను నివృత్తి చేయాల్సిన ఈసీ దాగుడుమూతలు ఆడటం అనుమానాలను బలపరుస్తోంది. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? దేశంలో ఏకంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించకపోడం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకోగా వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు ఈసీ వెల్లడించింది. మరి మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు ఇటు ఈసీగానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ జవాబు చెప్పడం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గట్టిగా డిమాండ్ చేశారు. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు తమకు అత్యంత బలమైన స్థానాల్లో కూడా ఓడిపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీల అభ్యర్థులకు అనూహ్య మెజార్టీలు వచ్చాయి. ఇక ఒడిశాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడ్డ పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో.. కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి వాహనంలో ఈవీఎంలు తరలిస్తున్న విషయం ఎన్నికల ముందే బయటపడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలను బస్సులో తరలించారు. ఓ ప్రైవేట్ వాహనంలో సైతం ఈవీఎంలు తరలించినట్లు బయటపడ్డా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే రీతిలో ఈవీఎంలను ప్రైవేట్ వ్యక్తుల పర్యవేక్షణలో తరలించినట్లు తెలుస్తోంది. అవన్నీ కనిపించకుండాపోయిన 20 లక్షల ఈవీఎంలలోనివేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదృశ్యమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో వెల్లడించాలని వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల ఈవీఎంతోనే ఎన్నికలు నిర్వహించామని, మిగిలిన 20 లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదంటూ ఈసీ దాటవేత వైఖరి అనుసరిస్తోంది. ఈసీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలను నిషేధించాలి: ప్యూర్టోరికోలో ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలను నిషేధించాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సరికాదు. వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. ఈ భూమ్మీద హ్యాక్ చేయలేనిది ఏదీ లేదు. సంబంధిత వార్త: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు! ఎలాగంటే..ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌లు: ఎక్స్‌లో రాహుల్‌గాందీఈవీఎంలు బ్లాక్ బాక్సులు లాంటివి. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం తీవ్ర ఆందోళనకరం. నిషేధిస్తూ విధాన నిర్ణయాలుప్రపంచంలో మెజార్టీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొబైల్‌తో ఈవీఎం హ్యాకింగ్‌ఈవీఎంలు ఎంత లోపభూయిష్టమో... వాటిని ఎంత సులువుగా హ్యాక్ చేయవచ్చో బహిర్గతమైంది. ముంబై నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ‘మిడ్ డే’ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి ఎంపీగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించిన శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ సమీప బంధువు మంగేశ్ పండిల్కర్ తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 4న ముంబైలోని నెస్కో సెంటర్లో నిర్వహించారు. ఎంపీ బంధువు మంగేశ్ పండిల్కర్ ఈ సందర్భంగా తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓటీపీ జనరేట్ చేయడం ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేయడం గమనార్హం. మొదట్లో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) అభ్యర్థి అమోల్ సంజన కీర్తికర్ కంటే వెనుకబడిన రవీంద్ర వైకర్ అనూహ్యంగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, అదే ఫోన్ ద్వారా శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి పలువురితో మంతనాలు జరపడంపై ముంబై పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. అయితే మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేశారన్న మిడ్ డే పత్రిక కథనాన్ని ఎన్నికల కమిషన్ ఖండించింది. -
ఈవీఎంల ట్యాంపరింగ్‌తో ఎన్నికల్లో విజయం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలోన్ మస్క్ చర్చకు తెర లేపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్లో పేర్కొన్నారు. భారత్‌లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them. Serious concerns are being raised about transparency in our electoral process.Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024 దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘భారత్‌లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు.మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్‌ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్ చేశారు.ఫోన్‌తో ఈవీఎంను అన్‌ల్యాక్ చేసిన ఎన్డీఏ అభ్యర్థి!ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ లోక్‌సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్ 4న రెస్కో పోలింగ్ కౌంటింగ్ సెంటర్ బయట ఎంపీ రవీంద్ర వైకర్ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్ వినియోగించారు. ఆ ఫోన్ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్‌కు మంగేష్ పన్హాల్కర్‌కు ఫోన్‌కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్లో ఓటీపీ సాయంతో కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్ ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్ ఫన్హాల్కర్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్‌లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని ఎవరు కనెక్ట్ చేయలేరు. కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై,ఇంటర్నెట్ను వినియోగించలేరని అన్నారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024 -
ఈవీఎం గోల్ మాల్!.. కేతిరెడ్డి సంచలన వీడియో
-
EVM ట్యాంపరింగ్ పై కోలగట్ల వీరభద్ర స్వామి రియాక్షన్
-
ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్‌తో చూసుకోండిలా..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఆరు విడతల పోలింగ్ పూర్తి అయింది. మరో విడత జూన్ 1తో ముగుస్తుంది. దేశ వ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అన్ని రాజకీయ పార్టీ, సంబంధిత పోలింగ్ ఏజెంట్లు ఫలితాల రోజు తనిఖీ చేయాల్సిన అంశాల చెక్ లిస్ట్ విడుదల చేశారు. ఫలితాల రోజు ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం మిషన్లను తెరిచే క్రమంలో పాటించాల్సిన సూచనలకు సంబంధించి ఓ చార్ట్ తయారు చేసినట్లు తెలిపారు. ‘‘చాలా మంది ఈవీఎం ట్యాంపర్ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను ఈవీఎంలు ట్యాపర్ కావు. ప్రపంచంలో ఈవీఎం మిషన్ ఎక్కడా ట్యాంపర్ కాదు. అందుకే ఈ చెక్ లిస్ట్‌ను విడుదల చేశాం’’ అని కపిల్ సిబల్ అన్నారు.చెక్ లిస్ట్ చార్ట్‌లోని తనిఖీ చేసే అంశాలు ఇవే..1. చార్ట్‌లో కంట్రోల్ యూనిట్ నంబర్, బాలెట్ యూనిట్ నంబర్, వీవీప్యాట్ (VVPAT)ఐడీ ఉంటాయి.2. చార్ట్‌లో మూడో కాలమ్ చాలా ముఖ్యమైంది.4 జూన్2024 అని మూడో కాలమ్‌లో రాసి ఉంటుంది. ఈవీఎం మిషన్ తెరిచిన సమయాన్ని మూడో కాలమ్ కింద రాయాలి.3. ఒక ఒకవేల సమయంలో తేడా వస్తే.. ఆ ఈవీఎం మిషన్ అప్పటికే ఎక్కడో ఒక తెరిచినట్లుగా నిర్ధారణకు రావాలి. కంట్రోల్ యూనిట్(CU) సీరియల్ నంబర్ రాసి ఉన్న ఫార్మాట్లో ఉంటుంది. అక్కడ ఉన్న నంబరల్ మ్యాచ్ చేసుకోవాలి.4. మొత్తం పోలైన ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కౌంటింగ్ సమయంలో ఓట్లు తేలితే సమస్య ఎదురవుతుంది.5. రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి.. పై కాలమ్‌లో వెరిఫికేషన్ పూర్తి అయ్యే వరకు రిజల్ట్ బటన్ నొక్కకూడదు. సమయంలో తేడా వస్తే.. వెలువడిన రిజల్ట్ సమయం కూడా తప్పు అవుతుంది.6. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అక్కడ కూర్చన్న తర్వాత జాగ్రత్తగా చెక్ లిస్ట్‌లోని మొదిటి కాలమ్‌ను పరిశీలించిన అనంతరం ఈవీఎంలను తెరవాలని కోరకుంటున్నాను.#WATCH: Kapil Sibal's EVM ADVICE To Political Parties, Candidates Ahead Of June 4 COUNTING Kapil Sibal Explains What Polling Agents and Leaders of #IndiaAlliance should do before EVM Machines are Opened For Counting.!🎯IMPORTANT UPDATES:▪️I have made a chart for all the… pic.twitter.com/WigELsaH7W— Gururaj Anjan (@Anjan94150697) May 26, 2024 -
ఈవీఎం ట్యాంపరింగ్‌పై స్పందించిన ఈసీ
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యలో శనివారం టీఎంసీ బీజేపీపై ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది. బెంగాల్ రఘునాథపూర్లోని బంకురాలో బీజేపీ ఈవీఎం ట్యాపరింగ్‌కు పాల్పడినట్లు టీఎంసీ మండిపడింది. దీనికి సంబంధించిన ఫోటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఐదు ఈవీఎం మిషన్లకు బీజేపీ ట్యాగ్లు ఉండటం ఆ ఫోటో గమనించవచ్చు. ఈ వ్యవహరంలో బీజేపీపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది.Smt. @MamataOfficial has repeatedly flagged how @BJP4India was trying to rig votes by tampering with EVMs.And today, in Bankura's Raghunathpur, 5 EVMs were found with BJP tags on them.@ECISVEEP should immediately look into it and take corrective action! pic.twitter.com/aJwIotHAbX— All India Trinamool Congress (@AITCofficial) May 25, 2024 ‘‘బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగి చేసి రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. ఈ రోజు రఘునాథ్‌పూర్‌లో ఐదు ఈవీఎంకు బీజేపీ ట్యాగ్లు ఉండటం మా దృష్టకి వచ్చింది. ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని టీఎంసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి ఇది తొలిసారి కాదని టీఎంసీ విమర్శలు చేసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో కూడా బీజేపీ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని, ఒట్లర్లపై సైతం దాడి చేశారని సీఎం మమతా తీవ్ర విమర్శలు చేశారు.స్పందించిన బెంగాల్ ఎన్నికల సంఘం:టీఎంసీ ఆరోపణలపై బెంగాల్ ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్ అడ్రస్ ట్యాగ్‌లను ఇస్తుంటాం. వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. టీఎంసీ పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారు.(2/1) While commissioning, common address tags were signed by the Candidates and their agents present. And since only BJP Candidate's representative was present during that time in the commissioning hall, his signature was taken during commissioning of that EVM and VVPAT. pic.twitter.com/54p78J2jUe— CEO West Bengal (@CEOWestBengal) May 25, 2024 .. అందుకే ఆ ఏజెంట్ సంతకం మాత్రమే తీసుకున్నాం. ఇక.. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించాం. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాం. ఈ ప్రక్రియనంతా వీడియో తీశాం. సీసీటీవీల్లోనూ రికార్డ్ అవుతుంది’’ అని ఈసీ స్పష్టం చేసింది. -
'ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు కూడా రాలేదు'
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అవకతవకలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. తమ నేతలతో సమీక్ష నిర్వహించిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే స్బందించారు. చిప్ ఉన్న ఎలాంటి యంత్రాన్నైనా హ్యాక్ చేయవచ్చని ఆయన అన్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లకు గాను బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది. Any Machine with a Chip can be hacked. I have opposed voting by EVM since 2003. Can we allow our Indian Democracy to be controlled by Professional Hackers! This is the Fundamental Question which all Political Parties have to address to. Hon ECI and Hon Supreme Court would you… https://t.co/8dnBNJjVTQ — digvijaya singh (@digvijaya_28) December 5, 2023 మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీని సూచించాయి. కానీ వాస్తవంగా బీజేపీ పూర్తి ఏకపక్ష మెజారిటీని సాధించింది. ఈ ఫలితంపై కాంగ్రెస్ నాయకులతో పార్టీ ప్రచార సారథి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. భారీ అపజయం వెనకు ఉన్న కారణాలను విశ్లేషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్లు కనిపించినప్పటికీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని కమల్ నాథ్ చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని చెబుతున్నారు. నిజానికి ఇది ఎలా సాధ్యమైతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Rajasthan Politics : రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే! -
‘ఈవీఎం’ ఆరోపణలు.. ఈసీ కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని బుధవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపణలకు దిగింది. ‘ ట్యాంపరింగ్‌ను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయా? ఈ విషయంలో ఈసీ వివరణ ఇవ్వాల్సిందే’ అని ఎస్పీ ట్వీట్‌చేసింది. దీంతో మంగళవారం రాత్రి ఈవీఎంలను తరలించిన ఘటనలో వారణాసి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నళినికాంత్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. అయితే.. యూపీ పోలింగ్‌లో వాడిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి తరలిస్తున్నారంటూ ఒక వీడియోను ఎస్పీ బహిర్గతం చేయడం తెల్సిందే. ఈ వివాదంపై ఎన్నికల అధికారులు గురువారం స్పష్టతనిచ్చారు. ‘ అవి పోలింగ్‌లో వాడినవి కాదు. బుధవారం శిక్షణ కోసం వాడటం కోసం తీసుకెళ్తున్నారు. బుధవారం ఉదయం తరలించాల్సి ఉండగా ముందస్తు అనుమతిలేకుండా మంగళవారం రాత్రే తరలించారు. తరలింపులో నిర్లక్ష్యం వహించిన నళినికాంత్ సింగ్‌ను సస్పెండ్‌చేశాం’ అని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ గురువారం చెప్పారు. ఈ అంశంలో ఈసీకి ఫిర్యాదుచేస్తామని, కోర్టుకెళ్తామని ఎస్పీ ప్రకటించింది. కాగా, ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిని మీరట్‌లో ప్రత్యేకాధికారిగా, బిహార్ ముఖ్య ఎన్నికల అధికారిని వారణాసిలో ప్రత్యేకాధికారిగా ఈసీ నియమించింది. సొంత వాహనంలోని ఓ పెట్టెలో బ్యాలెట్ పేపర్లు లభించడంతో సోన్‌భద్ర జిల్లా రిటర్నింగ్ అధికారి రమేశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. మున్సిపాలిటీ చెత్తకుప్పలో బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రి లభించడంతో బరేలీ జిల్లా అదనపు ఎలక్షన్ ఆఫీసర్ వీకే సింగ్‌ను సస్పెండ్ చేశారు. చదవండి: పంచ తంత్రం.. గెలుపు ఎవరిదో? -
ఎన్నికలంటే కౌంటింగ్ ఒక్కటే కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఓటింగ్ యంత్రాలైన ఈవీఎంల పుణ్యమా అని ఓట్ల లెక్కింపు మొదలైన రోజే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మొదలైన నాలుగు రోజుల వరకు ఫలితాలు వెలువడక పోవడంలో ఎన్నికల నిర్వహణలో అమెరికా, భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలంటూ ట్వీట్ల మీద ట్వీట్లు వెలువడ్డాయి. త్వరితగతిన ఫలితాలు వెలువడడం కన్నా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా సాగడం మంచిదన్న విషయం గ్రహించాల్పి అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా పోలింగ్‌లో పారదర్శకత ముఖ్యం. భారత్‌లో జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంతో ఉంటుందన్నది అందరికి తెల్సిందే. ఎన్నికల సందర్భంగా అధిక నిధులను ఖర్చుపెట్టే పార్టీలది, అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత మేరకు డబ్బుతో ప్రలోభ పెట్టి ఓట్లను కొనుక్కోవచ్చు. వీధుల్లో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రకటనలు కుమ్మరిస్తూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. రాజకీయ పార్టీలకు వస్తోన్న పెండింగ్ వల్ల ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగుతూ వస్తోంది తప్ప తగ్గడం లేదు. రాజకీయ పార్టీలకు నిధుల విరాళాలపై పారదర్శకతను తీసుకొస్తానంటూ సవాల్ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఎలక్టోరల్ బాండ్’లను తీసుకొచ్చింది. ఎవరు ఇచ్చారో, ఎంత ఇచ్చారో పార్టీలకుగానీ, ప్రజలకుగానీ తెలియకుండా ఉండేలా ఎలకోటరల్ బాండ్లను తీసుకరావడంతో రాజకీయ పార్టీలకు నల్లడబ్బంతా విరాళాల రూపంలో వచ్చి పడుతోంది. దాంతో ఎన్నికల సందర్భంగా డబ్బు ప్రభావం పెరిగింది. అన్ని పార్టీలకు నిధులు వస్తాయి కనుక ఎన్నికలపై డబ్బు ప్రభావం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది కుహనా మేథావులు వాదిస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న పార్టీకే అధిక నిధులు వస్తాయని, ఆ పార్టీయే ఎన్నికల సందర్భంగా అధిక నిధులను కుమ్మరించి లాభ పడుతుందనే విషయం మనకు కొత్త కాదు. అమెరికా తరహాలో అందరికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం మనకు లేకపోవడం భారత్ ఎన్నికల వ్యవస్థలో మరో లోపం. మన దేశంలో ఉపాధి కోసం కోట్లాది మంది వలసలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలసలు పోయారు. ఏటా కోట్లాది మంది యువత ఉపాధి కోసం వలసలు పోతూనే ఉన్నారు. ఎన్నికల సమయాలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల్లోనే ఉండి పోవడం వల్ల వారు పోలింగ్‌కు రాలేకపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి బీహార్ ఎన్నికల్లో మరి కొన్ని కేటగిరీల వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్సించారుగానీ అది సరిపోదు. అందరికి దాన్ని కల్పించాల్సిందే. భారత్‌లో పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాలే మారిపోతాయి. 2019లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యుల ఫిరాయింపును ప్రోత్సహించడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను శాఖ, పోలీసు శాఖ అధికారులు కూడా పాలకపక్షం తరఫున కొంతమేరకు ఓటింగ్‌ను ప్రభావితం చేస్తారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపర్ చేశారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా అన్నీ ఏవీఎంలకు ఎవరికి ఓటు వేశామో ఓటరు తెలుసుకునేలా రసీదు పద్ధతిని ప్రవేశపెట్టాల్సిందే. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ రసీదు సౌకర్యం కలిగిన ఈవీఎంలను ప్రతి నియోజకవర్గానికి ఐదింటిని మాత్రమే ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నికల్లో గెలవడమంటే అంతో ఇంతో డబ్బు అవసరం కనుక సామాన్యులు, నిజాయితీపరులు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఆ పరిస్థితి కూడా మారాల్సిందే. -
బిహార్‌లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారా!?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు రావడం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బిహార్‌లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 127 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, 105 స్థానాల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ముందంజలో ఉంది. ఇక మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 19 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పది రౌండ్లు ముగిసేటప్పటికీ పాలకపక్ష టీఆర్ఎస్కంటే బీజేపీ అభ్యర్థి 3,734 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. బిహార్‌లో పాలకపక్షమైన జేడీయు–బీజేపీ కూటమి ఓడిపోతుందని, ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తెలియజేయగా, వెలువడుతున్న ఫలితాల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. బిహార్ పోలింగ్‌లో అక్రమాలకు పాలకపక్షం వ్యూహం పన్నిందని, అందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారే పలు యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం కుదరదని, అయితే వేర్వేరుగా ఏ ఈవీఎంనైనా ట్యాంపరింగ్ చేయవచ్చని పలువురు సాంకేతిక నిపుణులు ఇది వరకే సాక్ష్యాధారాలతో నిరూపించారు. (చదవండి: నితీష్‌కు సీఎం పీఠం దక్కుతుందా?) ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఈవీంలను ఉపయోగిస్తారు కనుక, వాటన్నింటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని నిపుణులే స్పష్టం చేశారు. అయితే ఫలితాలను తారుమారు చేయాలంటే అన్ని ఈవీఎంలను ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదని, అలా చేయడం వల్ల అనుమానాలొస్తాయని, అవసరమైన నియోజక వర్గాల్లో, అవసరమైన చోట కొన్ని ఈవీఎంల చొప్పున ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ఎన్నికల విశ్లేషకులు పేర్కొన్నారు. బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు 2019లో జరిగిన ఎన్నికల్లో 39 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల పెద్ద ఎత్తున ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ నాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలపై కూడా తనకు విశ్వాసం లేదని, ఈవీఎంలన్నీ ‘మోదీ ఓటింగ్ మెషిన్లే’ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గత బుధవారం విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎం (ఎం2) వెర్షన్‌ను కాకుండా వాటిని ఈవీఎం (ఎం3) వెర్షన్‌గా అభివద్ధి చేసి ఉపయోగించారు. అయితే, వాటన్నింటికి ‘ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్ స్లిప్స్’ లేవు. 50 శాతం ఈవీఎంలకు ఆ సౌకర్యం ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ విషయమై సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీం కోర్టు, మధ్యేమార్గంగా ప్రతి నియోజకవర్గానికి ఓట్ల ఆడిట్ ట్రయల్స్‌కు అవకాశం ఉన్న ఐదు ఈవీఎంల చొప్పున ఉపయోగించాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాల తీరు, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా ఉండడంతో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రెట్టింపవుతున్నాయి. (చదవండి: ఒకవేళ ఓడితే.. కారణాలు ఇవే!) -
ఎన్నికల్లో బ్లాక్‌చైన్ వ్యవస్థ
న్యూఢిల్లీ: ఐఐటీ మద్రాస్‌తో కలసి బ్లాక్ చైన్ వ్యవస్థపై పనిచేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ‘టైమ్స్ నౌ సమిట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈవీఎంల గురించి పలు విషయాలు మాట్లాడారు. బ్లాక్‌చైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఒక ఓటర్ వేరే రాష్ట్రంలో ఉండి కూడా తమ రాష్ట్రంలోని ఎన్నికల్లో ఓటేయవచ్చని చెప్పారు. ఉదాహరణకు రాజస్తాన్‌కు చెందిన వ్యక్తి చైన్నైలో ఉద్యోగం చేస్తుంటే, రాజస్తాన్‌లో జరిగే ఎన్నికలకు చైన్నైలోనే ఓటేయవచ్చు. కారు లేదా పెన్నులాగే ఈవీఎంలు కూడా మొరాయించవచ్చేమోగానీ టాంపర్ చేయడం అసాధ్యమని చెప్పారు. -
ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఆశ్చర్యం
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అకాలీదళ్ పై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఆప్ స్వీప్ చేస్తుందన్న అంచనాలు తప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధిస్తుందనుకున్న తమ పార్టీకి 25 శాతం ఓట్లు వచ్చాయని, అకాలీదళ్ కు మాత్రం 31 శాతం ఓట్లు రావడం వచ్చాయని.. ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు. తమ ఓట్లు అకాలీదళ్ కు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. ఈవీఏంల పనితీరుపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని అన్నారు. వీవీపీఏటీ స్లిప్పులతో ఈవీఏంలోని ఫలితాలను పోల్చి చూస్తే గణాంకాలు సరిగా ఉన్నాయో, లేదో తెలుస్తుందన్నారు. ఈవీఏంల ట్యాంపరింగ్ కు అవకాశముందని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఏంల వినియోగంపై పునరాలోచన చేస్తున్నాయని చెప్పారు. గోవాలో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.