న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రతపై చర్చ తారా స్థాయికి చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల అంశం దేశ వ్యాప్తంగా మరోసారి దుమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి మొత్తం ఈవీఎంల తనిఖీ, వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పదకొండు దరఖాస్తులు అందాయి.
ఇందులో లోక్‌సభ ఈవీఎంల కోసం ఎనిమిది, అసెంబ్లీ ఈవీఎంల కోసం మూడు దరఖాస్తులు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ నుంచి విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు వచ్చింది. అలాగే వైఎస్సార్‌సీపీ తరపున గజపతినగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు అందాయయి.
తెలంగాణలో జహీరాబాద్ పార్లమెంట్లో 23 పోలింగ్ కేంద్రాలలో బీజేపీ వెరిఫికేషన్ కోరింది. ఒడిశాలో 12 పోలింగ్ కేంద్రాలలో బీజేడీ వెరిఫికేషన్ కోరింది. అయితే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసిన నాలుగు వారాలలో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment