జమ్మూలో ఈవీఎంలు మంచివేనా: కిషన్‌రెడ్డి ప్రశ్న | Central Minister Kishanreddy Comments On Evm Tampering In Haryana | Sakshi
Sakshi News home page

జమ్మూలో ఈవీఎంలు మంచివేనా: కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి ప్రశ్న

Published Fri, Oct 11 2024 12:55 PM | Last Updated on Fri, Oct 11 2024 3:03 PM

Central Minister Kishanreddy Comments On Evm Tampering In Haryana

సాక్షి,హైదరాబాద్‌:హర్యానాలో ఈవీఎంల అక్రమాలు జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదని,కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్‌ ఆరోపణలు ఎందుకు రావడం లేదని కేంద్రమంత్రి,జమ్మూకశ్మీర్‌ ఇంఛార్జ్‌ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి శుక్రవారం(అక్టోబర్‌11) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.

‘ఓట్లు జమ్మూలో ఒక రకంగా పోలరైజ్ అయ్యాయి. కశ్మీర్‌లో మరోరకంగా పోలరైజ్‌ అయ్యాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ రాగానే మంత్రి వర్గ కూర్పు పై రాహుల్, సోనియా దగ్గర క్యూ కట్టారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశం లేదు.ఆర్టికల్ 370పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదు. జమ్మూ కశ్మీర్‌లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే.

బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే. 19 మంది కొత్తవాళ్ళు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదు. జమ్మూలో టెర్రరిజం పై మరింత జాగ్రత్తగా ఉంటాం. జమ్మూలో సరిహద్దు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఒక్క రాయి విసిరిన సంఘటన జరగలేదు.

భారతదేశంలో పాకిస్థాన్ ఐఎస్‌ఐ యాక్టివిటీ తగ్గింది.పెద్ద నోట్ల రద్దుకు పాకిస్తాన్‌లో దొంగ నోట్ల ముద్రణ ఒక కారణం. పాకిస్తాన్‌కు ఇతర దేశాల మద్దతు లేకుండా చేయడంలో భారత్ సక్సెస్ అయ్యింది.ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతోంది. 

ఇదీ చదవండి: ఆదాయం ఎందుకు తగ్గింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement