సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కిషన్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రానికి లాభం చేకూరుతంది అంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు.
తెలంగాణ కంపెనీలనే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోడం ఎంటి..?. నాకు ఏం అర్ధం కాలేదు. విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడి రావాలి. కాగితాలకే ఒప్పందాలు పరిమితం కావొద్దు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు.పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది.
ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి బయటికి వద్దామనుకుంటున్నారు.వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారు. గత ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిస్తే ఈ ప్రభుత్వం వ్యాపారులందరినీ వేధిస్తోంది.
అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారు. వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్త లేడు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
కాగా, సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొని పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో తెలంగాణకు చెందిన మేఘా కంపెనీ పెట్టుబడులు కూడా ఉండడం విమర్శలకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment