సాక్షి,న్యూఢిల్లీ: పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ ఇదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025-26పై కిషన్‌రెడ్డి స్పందించారు.
‘వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన బడ్జెట్ ఇది. వ్యక్తిగత ఇన్‌కమ్‌ట్యాక్స్ మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయం. ఎంఎస్‌ఎంఈలు, చిన్న పరిశ్రమలు ఆపన్నహస్తాన్ని అందించిన బడ్జెట్.
రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ ఇది. బడ్జెట్‌లో అన్ని సంక్షేమ పథకాలకు నిధులు పెంచడం అభినందనీయం’అని ప్రధాని మోదీ అన్నారు.
దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్: బండి సంజయ్
- పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ ఇది
- రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకం
- తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి ఏడాదికి రూ.80 వేల వరకు ఆదా
- గత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇది
- తెలంగాణలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.5 లక్షదాకా రుణం పొందే అవకాశం
- కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment