న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్లే తాము కోరుకుంటున్నట్లు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ పేపర్‌కు తిరిగి వచ్చేందుకు భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ఐక్యత కావాలంటే విద్వేషాలను విస్తరించడం మానుకోవాలని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరు రాజ్యాంగాన్ని పొగిడి, దానికి నమస్కరించి భక్తిని ప్రదర్శిస్తుంటారని, లోపల మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు సమాజంలోని అన్నివర్గాల ప్రజలు కదిలివచ్చారని తెలిపారు.
VIDEO | "Some people praise the Constitution, but only superficially; inside, they are undermining it. To protect the Constitution, Rahul Gandhi ji launched the Bharat Jodo Yatra, and to save democracy, all minorities came forward, which is why we were able to stop PM Modi.… pic.twitter.com/qrQfMQJKb8
— Press Trust of India (@PTI_News) November 26, 2024
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నిర్వహణలో బీజేపీ అవకతవకలకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించాయి.
Comments
Please login to add a commentAdd a comment