trinamul congress
-
ఈవీఎం ట్యాంపరింగ్‌పై స్పందించిన ఈసీ
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యలో శనివారం టీఎంసీ బీజేపీపై ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది. బెంగాల్ రఘునాథపూర్లోని బంకురాలో బీజేపీ ఈవీఎం ట్యాపరింగ్‌కు పాల్పడినట్లు టీఎంసీ మండిపడింది. దీనికి సంబంధించిన ఫోటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఐదు ఈవీఎం మిషన్లకు బీజేపీ ట్యాగ్లు ఉండటం ఆ ఫోటో గమనించవచ్చు. ఈ వ్యవహరంలో బీజేపీపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది.Smt. @MamataOfficial has repeatedly flagged how @BJP4India was trying to rig votes by tampering with EVMs.And today, in Bankura's Raghunathpur, 5 EVMs were found with BJP tags on them.@ECISVEEP should immediately look into it and take corrective action! pic.twitter.com/aJwIotHAbX— All India Trinamool Congress (@AITCofficial) May 25, 2024 ‘‘బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగి చేసి రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. ఈ రోజు రఘునాథ్‌పూర్‌లో ఐదు ఈవీఎంకు బీజేపీ ట్యాగ్లు ఉండటం మా దృష్టకి వచ్చింది. ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని టీఎంసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి ఇది తొలిసారి కాదని టీఎంసీ విమర్శలు చేసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో కూడా బీజేపీ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని, ఒట్లర్లపై సైతం దాడి చేశారని సీఎం మమతా తీవ్ర విమర్శలు చేశారు.స్పందించిన బెంగాల్ ఎన్నికల సంఘం:టీఎంసీ ఆరోపణలపై బెంగాల్ ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్ అడ్రస్ ట్యాగ్‌లను ఇస్తుంటాం. వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. టీఎంసీ పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారు.(2/1) While commissioning, common address tags were signed by the Candidates and their agents present. And since only BJP Candidate's representative was present during that time in the commissioning hall, his signature was taken during commissioning of that EVM and VVPAT. pic.twitter.com/54p78J2jUe— CEO West Bengal (@CEOWestBengal) May 25, 2024 .. అందుకే ఆ ఏజెంట్ సంతకం మాత్రమే తీసుకున్నాం. ఇక.. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించాం. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాం. ఈ ప్రక్రియనంతా వీడియో తీశాం. సీసీటీవీల్లోనూ రికార్డ్ అవుతుంది’’ అని ఈసీ స్పష్టం చేసింది. -
Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
కీలక రాష్ట్రాల్లో ఒకటైన పశి్చమ బెంగాల్లో నాలుగో విడతలో సోమవారం 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాలకు గాను మూడు విడతల్లో 10 చోట్ల పోలింగ్ ముగిసింది. నాలుగో విడత అభ్యర్థుల్లో పీసీసీ చీఫ్ అదీర్ రంజన్ చౌదరి, తృణమూల్ ఫైర్‌బ్రాండ్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు...కృష్ణానగర్ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు వేదికైన స్థానాల్లో కృష్ణానగర్ ఒకటి. పార్లమెంటులో మోదీ సర్కారుపై విరుచుకుపడే తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా మళ్లీ బరిలో ఉండటమే అందుకు కారణం. ఆమె 2019లో తొలిసారి తృణమూల్ టికెట్ మీదే ఇక్కడ గెలిచి లోక్‌సభలో అడుగు పెట్టారు. లోక్‌సభలో అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలడిగేందుకు నగదు, కానుకలు తీసుకున్నారన్న ఆరోపణలపై సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా ఆమెకే తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మళ్లీ అవకాశమిచ్చారు. ఈసారి మరింత మెజారిటీతో నెగ్గి లోక్‌సభలో అడుగు పెడతానని మొయిత్రా ధీమాగా ఉన్నారు. ఆమెపై బీజేపీ నుంచి స్థానిక రాజ కుటుంబం మహరాజా కృష్ణచంద్ర రాయ్ వంశీకురాలు అమృతరాయ్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె బాగా పరిచయం. ఈ ఏడాదే బీజేపీలో చేరి టికెట్ సాధించారు. ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇక సీపీఎం అభ్యర్థి ఎస్ఎం సాది ముస్లింలతో పాటు ఇతర వర్గాల్లోనూ మంచి పేరున్న నేత. మొయిత్రాకు పడే ముస్లిం ఓట్లను సాది గణనీయంగా చీల్చి ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.బహ్రాంపూర్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అ«దీర్ రంజన్ చౌదరి 1999 ఎన్నికల నుంచి ఇక్కడ నాన్‌స్టాప్‌గా గెలుస్తున్నారు. ఈసారి తృణమూల్ నుంచి ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆయనకు సవాలు విసురుతున్నారు. నిర్మల్ కుమార్ సాహాకు బీజేపీ టికెట్ లభించింది. దాంతో ముక్కోణపు పోటీకి బహ్రాంపూర్ కేంద్రంగా మారింది. 1999కి ముందు వరుసగా మూడుసార్లు ఆర్ఎస్పీ నేత ప్రమోతెస్ ముఖర్జీ ఇక్కడ నెగ్గారు. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. బహ్రాంపూర్‌లో 50 శాతం ముస్లింలే ఉన్నారు. వారంతా కాంగ్రెస్‌కే దన్నుగా నిలుస్తున్నారు. అందుకే ఈసారి అ«దీర్‌కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పఠాన్‌ను తృణమూల్ ఎంచుకుంది. అయితే స్థానికేతరుడు కావడం ఆయనకు కాస్త మైనస్‌గా మారింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, తృణమూల్ మధ్య చీలితే బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలూ లేకపోలేదు.భోల్పూర్ బెంగాల్‌లోని బీర్భుమ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. బోల్పూర్తో పాటు బీర్భుమ్ లోక్‌సభ స్థానంలోనూ టీఎంసీ విజయంలో స్థానిక నాయకుడు అనుబ్రత మోండల్ది కీలక పాత్ర. పశువుల అక్రమ రవాణా కేసులో ఆయన రెండేళ్లుగా తిహార్ జైల్లో ఉండడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేదే. అయినా భోల్పూర్లో మోండల్ పేరుతోనే టీఎంసీ ఓట్లడుగుతోంది! దివంగత లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 1985 నుంచి 2009 వరకు ఏడుసార్లు ఇక్కడి ఎంపీగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అసిత్ కుమార్ మల్పైనే మరోసారి టీఎంసీ ఆశలు పెట్టుకుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లూ ఆ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి! ఇది తృణమూల్‌కు బాగా కలిసొచ్చే అంశం. బీజేపీ నుంచి ప్రియా షా పోటీ చేస్తున్నారు. 2014తో పోలిస్తే 2019లో బీజేపీకి ఇక్కడ ఓట్లు భారీగా పెరిగాయి. ఈసారి సీఏఏ తదితరాల దన్నుతో గెలిచి తీరతామని బీజేపీ నేతలంటున్నారు. సీపీఎం నుంచి స్థానికంగా బాగా పట్టున్న శ్యామలి ప్రధాన్ పోటీలో ఉన్నారు. భోల్పూర్ లోక్‌సభ స్థానం పరిధిలో సీపీఎంకు ఆదరణ కూడా ఎక్కువే. బీజేపీ, తృణమూల్ ఓట్లలో శ్యామలి వేటిని చీలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.రాణాఘాట్బెంగాల్లో ఈ విడతలో ఎక్కువ ఆసక్తి నెలకొన్న స్థానాల్లో ఇదీ ఒకటి. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కార్‌నే బీజేపీ మరోసారి పోటీకి నిలిపింది. ఆయన గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి రూపాలి బిశ్వాస్‌పై 2.33 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009, 2014ల్లో ఇక్కడ తృణమూల్‌దే విజయం. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల బీజేపీ చేతిలో, రెండు తృణమూల్ ఖాతాలో ఉన్నాయి. అయితే రానాఘాట్ దక్షిణ్ ఎమ్మెల్యే ముకుత్ మణి అధికారి బీజేపీకి ఝలక్ ఇస్తూ లోక్‌సభ ఎన్నికల ముందు తృణమూల్‌లో చేరారు. ఆయననే పార్టీ అభ్యరి్థగా మమత బరిలోకి దింపారు. దాంతో పోరు ఆసక్తికరంగా మారింది. కానీ ముకుత్కు టికెటివ్వడంతో స్థానిక తృణమూల్ నేతలు భగ్గుమన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం లేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన మథువా సామాజికవర్గ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. సీఏఏ అమలుతో వీరికి భారత పౌరసత్వం రానుంది. ఇది బీజేపీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. సీపీఎం తరఫున అలోకేశ్ దాస్ పోటీలో ఉన్నారు.బర్ధమాన్ – దుర్గాపూర్దేశానికి ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఇద్దరు మాజీ క్రికెటర్లు బెంగాల్లో ఈ విడత బరిలో ఉండటం విశేషం. వారిలో ఒకరు 2007 టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు యూసఫ్ పఠాన్, మరొకరు 1983 వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ‘కపిల్ డెవిల్స్’లో ఒకరైన కీర్తి ఆజాద్. వీరిద్దరూ తృణమూల్ అభ్యర్థులుగా బీజేపీకి సవాల్ విసురుతున్నారు. కీర్తి ఆజాద్ బీజేపీ మాజీ ఎంపీ. 2015లో సస్పెన్షన్‌కు గురై కాంగ్రెస్‌లో చేరారు. 2021లో తృణమూల్ గూటికి చేరారు. బర్ధమాన్–దుర్గాపూర్ లోక్‌సభ స్థానంలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్‌తో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో ఓటర్లు ఏ పార్టీని రెండోసారి దీవించిన చరిత్ర లేదు. 2009లో సీపీఎం నేత సాదుల్ హక్ గెలవగా, 2014లో తృణమూల్ అభ్యర్థి ముంతాజ్ సంఘమిత్ర నెగ్గారు. 2019 ఎన్నికల్లో ముంతాజ్‌పై బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లూవాలియా కేవలం 2,400 ఓట్లతో గట్టెక్కారు. ఈ విడత బీజేపీ అభ్యర్థి ఘోష్‌కు అజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. సీపీఎం ఇక్కడ సుకీర్తి ఘోషాల్‌ను నిలబెట్టింది.బీర్భుమ్2004 తర్వాత ఎస్సీ నుంచి జనరల్‌కు మారినప్పటి నుంచీ ఇక్కడ తృణమూల్ నేత, నటి శతాబ్దీ రాయ్ చక్రం తిప్పుతున్నారు. 2009 నుంచి ఆమే గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. 2019లో ఏకంగా 5.65 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మాజీ ఐపీఎస్ అధికారి దేవాశిష్ ధార్‌ను అభ్యరి్థగా బీజేపీ ప్రకటించగా సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హుడయ్యారు. దాంతో దేబతను భట్టాచార్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మిల్టన్ రషీద్ పోటీలోకి ఉన్నారు. అవినీతి, మహిళలపై నేరాలు, సీఏఏ తదితర అంశాలు ఇక్కడి ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయి. టీఎంసీ నేత అనుబ్రత మోండల్ అందుబాటులో లేకపోవడం బీజేపీకి కొలిసొచ్చేదే. అయితే ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి.ఆస్తుల్లో అమృతా రాయ్ టాప్ పశి్చమబెంగాల్లో నాలుగో విడతలో బరిలో ఉన్న 75 మంది అభ్యర్థుల్లో 21 మంది కోటీశ్వరులు. కృష్ణానగర్ బీజేపీ అభ్యర్థి రాయ్ రూ.554 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. తర్వాత అసన్సోల్ తృణమూల్ అభ్యరి్థ, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హాకు రూ.210 కోట్లు ఉన్నాయి. రాణా ఘాట్ స్వతంత్ర అభ్యర్థి జగన్నాథ్ సర్కార్ తన వద్ద కేవలం రూ.3,586 ఉన్నట్టు చూపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రధాని మోదీ సినిమా ఫ్లాప్.. కల్యాణ్ బెనర్జీ విమర్శలు
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారని కానీ సినిమా అంతా ఫ్లాప్ అయిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి.. నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు చెప్పే వ్యక్తి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘బేటీ బచావో, బేటీ పడావో ప్రచారంలో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర కేటాయిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రచారం పేరుతో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో మాకు జాబితా అందించండి. 2014 నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. గత పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. మోదీ అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆయన ఒక నకిలీ నటుడు. ప్రజలు నకిలీ నటుడు మోదీకి, బీజేపీ ఓటు వేయొద్దు. ప్రధాని మోదీ ట్రైలర్లో ఫెయిల్ అయ్యారు. సినిమా కూడా సక్సెస్ కాబోదు. మోదీ ఇక గుజరాత్ వెళ్లిపోతారు. మార్కెట్లో మోదీ సినిమా ఎక్కవ కాలం పని చేయదు. విదేశాలకు వెళ్లి కరచాలనాలు చేసే నకిలీ నటుడికి ప్రజలు అస్సలు ఓటువేయొద్దు’ అని ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఇక.. జనవరిలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారీగా ఎంపీలను సస్పెండ్ చేసిన విషయంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మణ్ జగదీప్ ధన్‌ఖడ్ తీరును ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
‘రాజమాత కుటుంబం బ్రిటిష్ వాళ్లకి సహాయం చేసింది’
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలో భాగంగా బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర స్థానంలో రాజమాత అమ్రితా రాయ్‌ని బరిలోకి దించింది. దీంతో ఆమె ఎవరూ అని సోషల్‌మీడియాలో చర్చ జరిగింది. అయితే అదే స్థానంలో గతేడాది ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత మహువా మొయిత్రా పోటిలో ఉంది. దీంతో టీఎంసీ అమ్రితా రాయ్‌పై విమర్శలకు తెరలేపింది. ఆమె రాజకుటుంబం భారత దేశాన్ని పాలించిన బ్రిటిష్‌వారి పక్షమని మండిపడింది. కృష్ణానగర్‌ను పరిపాలించిన రాజు రాజా కృష్ణచంద్ర రాయ్.. బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో బ్రిటీష్ వారికి సాయం చేసి అనుకూలంగా పనిచేశారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శించారు. ‘బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్‌వారి వ్యతిరేకంగా పోరాడుతున్నసమయంలో కృష్ణా నగర్ రాజకుటుంబం బ్రిటీష్వారికి సాయం చేసిందని చరిత్ర చెబుతోంది. అనాడు రాజా కృష్ణచంద్ర రాయ్.. బ్రిటీష్ బలగాలు సాయం చేశారు. బీజేపీ వీర్‌సావర్కర్ పార్టీ. ఈ పార్టీ మహాత్మ గాంధీ హత్యకు బాధ్యత వహించాలి. బ్రిటీష్వారికే సాయం చేసిన కుటుంబాన్ని ఎన్నికల బరిలో దించింది బీజేపీ. మహువా మొయిత్రా దేశంలోని అవినీతిపై పోరాటం చేస్తోంది’ అని కునాల్ ఆరోపణలు చేశారు. టీఎంసీ విమర్శలపై రాజమాత అమ్రితా రాయ్ స్పందించారు. తన కుటుంబంపై చేస్తున్నఆరోపణలు అసత్యాలని తెలిపారు. ‘టీఎంసీ చేసే ఆరోపణలను భారత్, బెంగాల్లో ఎవరూ నమ్మరు. నా కుటుంబంపై చేస్తున్న విమర్శలు అసత్యం. మహారాజా కృష్ణ చంద్ర రాయ్ బ్రిటిష్ పక్షమన్న ఆరోపణ నిజం కాదు. ఆయన అలా ఎందుకు చేశాడు?. ఆయన అలా చేసిఉంటే ఇక్కడ హిందుత్వం ఉండేదా? సనాతన ధర్మం ఉండేదా? ఆయన బెంగాల్‌కు మరో గుర్తింపు తీసుకువచ్చారు. మత వ్యతిరేకత నుంచి రాజా కృష్ణచంద్ర రాయ్ మనల్నీ కాపాడారని ఎందుకు అనుకోకుడదు?’అని ఆమె టీఎంసీ కౌంటర్ ఇచ్చారు. -
ఇప్పుడు ‘పప్పు’ ఎవరు?
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికోత్పత్తి క్షీణతలను సూచిస్తూ ఇప్పుడు పప్పు ఎవరు? అని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో అడిషనల్ గ్రాంట్స్ విడుదలపై లోక్‌సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ మేరకు నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు టీఎంసీ ఎంపీ. ‘ఈ ప్రభుత్వం, అధికార పార్టీ పప్పు అనే పదాన్ని సృష్టించాయి. తీవ్ర అసమర్థతను సూచించేందుకు, ఎదుటివారిని కించపరచేందుకు దానిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న గణాంకాలు ఎవరు నిజమైన పప్పు అనేది వెల్లడిస్తున్నాయి.’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌లో 26 నెలల కనిష్ఠానికి చేరుకున్న గణాంకాలను సూచిస్తూ ఈ మేరకు మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే తయారీ రంగం అక్టోబర్‌లో 5.6 శాతం మేర క్షీణించింది. మరోవైపు.. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సూచిస్తూ విమర్శలు గుప్పించారు మహువా మొయిత్రా. ‘అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు పప్పు ఎవరు?’ అని ప్రశ్నించారు. అలాగే.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న డేటాను ఉటంకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 1/x In the spirit of the inalienable right to question the government, #Trinamool MP @MahuaMoitra makes a point on #ModiSarkar worth paying attention: “..the greatest liars has the believers” isn’t emotive but a fact based construct as #MahuaMoitra states facts on our economy. pic.twitter.com/1ukOSUv0aT — DOINBENGAL (@doinbengal) December 13, 2022 ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని
బెంగాల్ క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారి ఈ ఏడాది రంజీ ట్రోపీలో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా జార్ఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో.. ఆపై మధ్య ప్రదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తివారి సెంచరీలతో కథం తొక్కాడు. అయితే బెంగాల్ ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.మనోజ్ తివారి టీమిండియా తరపున 12 వన్డేల్లో 287 పరుగులు, 3 టి20ల్లో 15 పరుగులు చేశాడు. ఇక 23 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన మధ్య ప్రదేశ్.. ముంబైతో అమితుమీ తేల్చుకోనుంది. రంజీల్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన మనోజ్ తివారి బెంగాల్ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఇటీవలే మనోజ్ తివారిని ఒక చానెల్ ఇంటర్య్వూ చేసింది. మంత్రిగా ఉంటూనే ఆటను ఎలా బ్యాలెన్స్ చేశారని ప్రశ్నించగా.. తన డ్యుయల్ రోల్‌పై మనోజ్ తివారి ఆసక్తికరంగా స్పందించాడు. ''ఒక రాష్ట్రానికి మంత్రిని కావొచ్చు.. కానీ టైంను మేనేజ్ చేసుకుంటే రెండు పనులు ఒకసారి చేయొచ్చనేది నా మాట. రంజీలో అడుగుపెట్టడానికి ముందే నా నియోజకవర్గంలో ఒక టీంను ఏర్పాటు చేసుకున్నా. వారితో నా ప్రజల సమస్యలకు సంబంధించిన పేపర్ వర్క్‌ను నేను ఉంటున్న హోటల్ రూంకు తెప్పించుకునేవాడిని. ఇలా పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గ పనులు పూర్తి చేసి తిరిగి పేపర్ వర్క్‌ను కొరియర్ ద్వారా పంపించేవాడిని. ఇక క్రీడాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నాకు అదనంగా మరొక మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. రంజీ క్రికెట్ ఆడినన్ని రోజులు ఆయన.. నేను చేయాల్సిన పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక బెంగాల్ క్రికెట్ కూడా నాకు అండగా నిలబడింది. జట్టు ఆటగాళ్లు కూడా ఒక మంత్రిగా కాకుండా తమలో ఒక ఆటగాడిగా చూస్తూ చక్కగా సహకరించారు. కొన్నిసార్లు రాత్రిళ్లు ఎమర్జెన్సీ ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు నాతో పాటు ఉన్న తోటి క్రికెటర్లు పరిస్థితిని అర్థం చేసుకునేవారు. వ్యక్తిగత జీవితంలో నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంది. నాలుగేళ్ల నా బిడ్డను.. ఇంటికి సంబంధించిన పనులను స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. ఆమె చేసేది చిన్న పనే కావొచ్చు.. కానీ నా దృష్టిలో అది చాలా గొప్పది. ఇక బెంగాల్‌కు రంజీ ట్రోపీ అందించాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగాను. సెమీ ఫైనల్ వరకు ఈసారి కప్ మాదే అనే ధీమా కలిగింది. కానీ అనూహ్యంగా మా ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు! బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్‌కు హక్కు ఉంటుందా? -
నామినేషన్ దాఖలు చేసిన మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి టీఎంసీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బెంగాల్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్ని కలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే పార్టీకి మెజారిటీ రావడంతో సీఎం పదవి చేపట్టారు. ఆరు నెలల తర్వాత కూడా సీఎంగా కొనసాగాలంటే ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో ఆమె గెలిస్తేనే సీఎంగా కొనసాగుతారు. నామినేషన్ వేసే సమయంలో మమతతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రి భార్య ఫిర్హాద్ హకిమ్‌తో కలసి వెళ్లారు. అనంతరం పిర్హాద్ మాట్లాడుతూ.. నంది గ్రామ్‌లో మమతపై కుట్రపన్ని ఓడించారని, ఇప్పు డు భవానీపూర్ ప్రజలు మమతను రికార్డు మెజా రిటీతో గెలిపించి చరిత్రను తిరగరాస్తారని వ్యాఖ్యా నించారు. భవానీపూర్ నుంచి 2011, 2016 ఎన్ని కల్లో మమత పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్.. భవానీపూర్‌లో మమతకు పోటీగా బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఆమె పేరును నామినేట్ చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తే ఈ ప్రియాంక తిబ్రేవాల్. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది. ఆమెతో పాటు సంసేర్గంజ్‌కు మిలాన్ ఘోష్, జంగీపూర్‌కు సుజిత్ దాస్‌లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. -
నర్సును పక్కనబెట్టి వ్యాక్సిన్ వేసిన కౌన్సిలర్; వీడియో వైరల్
కోల్‌కతా: నర్సు పక్కన ఉండగానే తృణముల్ పార్టీకి చెందిన కౌన్సిలర్ వ్యాక్సిన్ వేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన కోల్‌కతాకు 200 కిమీ దూరంలో ఉన్న అసన్సోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో చోటుచేసుకుంది. ఏ మాత్రం అనుభవం లేకుండానే కౌన్సిలర్ వ్యాక్సిన్ వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో తన ట్విటర్లో షేర్ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం తన ఇష్టారీతిన వ్యవహరిస్తుంది. అనుభవం ఉన్న నర్సులను పక్కన కూర్చోబెట్టి ఒక కౌన్సిలర్ వ్యాక్సిన్ వేయడం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ వ్యాక్సిన్ వేసే సమయంలో ఆ మహిళకు ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. పాలక సభ్యులపై టీఎంసీకి నియంత్రణ లేనట్లుగా కనిపిస్తున్నదని విమర్శించారు. ఇక విషయంలోకి వెళితే.. శనివారం అసన్సోల్ క్యాంప్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వేస్తున్నారనే దానిని పరిశీలించడానికి తృణమూల్ కౌన్సిలర్ తబస్సుం అరా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన ఒక మహిళను కుర్చీలో కూర్చోబెట్టి తాను వ్యాక్సిన్ వేస్తానని తబస్సుం నర్సుకు తెలిపారు. ఆ తర్వాత ఆమె వ్యాక్సిన్ ఉన్న సిరంజిని తీసుకొని మహిళకు వ్యాక్సిన్ వేశారు. ఇదంతా ఒక వ్యక్తి తన ఫోన్ కెమెరాలో బందించాడు. ఇక తబస్సుం తన వీడియో వ్యవహారం బయటికి రావడంతో స్పందించారు. '' నేను ఆ మహిళకు వ్యాక్సిన్ వేయలేదు. కేవలం ఖాళీ సిరంజీని నా చేతిలో పట్టుకొని ఆమెకు ఇచ్చినట్లు చేశాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకొని నాపై విమర్శలు చేస్తున్నారు.అయినా నేను నర్సింగ్ కోర్సు నేర్చుకున్నా.. దీనిలో నాకు అనుభవం ఉందని'' చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కౌన్సిలర్ వ్యాక్సిన్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Seems like TMC govt has no control over its administrators.TMC's Tabassum Ara, a member of the administrative body of AMC, has vaccinated people herself and risked hundreds of lives…Will her political colour shield her from stern punishment?@MamataOfficial pic.twitter.com/EaF3EsK9Bw — Babul Supriyo (@SuPriyoBabul) July 3, 2021 -
నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రుల అరెస్ట్
కోల్‌కతా: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో పశ్చిమ బెంగాల్లో అరెస్టుల పర్వం సోమవారం మొదలైంది. ఈ కేసులో టీఎంసీ నేతృత్వంలోని బెంగాల్ సర్కార్‌లో మంత్రులుగా ఉన్న ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టుచేశారు. మరో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, రాష్ట్ర మాజీ మంత్రి సోవన్ ఛటర్జీలనూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. రోజంతా హైడ్రామా నడిచింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అరెస్టుల విషయం తెల్సి మమత వెంటనే సీబీఐ ఆఫీస్‌కు వచ్చి దాదాపు ఆరుగంటలపాటు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. మరోవైపు, ఈ నలుగురికీ బెయిల్ మంజూరుచేస్తూ స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం సోమవారం రాత్రి హైకోర్టు వీరి బెయిల్‌పై స్టే ఇచ్చింది. అరెస్టులను నిరసిస్తూ టీఎంసీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలను గాలికొదిలేసి నిరసన చేపట్టారు. అరెస్టులు చట్టవిరుద్ధం: స్పీకర్ ‘ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలంటే ప్రొటోకాల్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌గా నాకు ముందే సమాచారమివ్వాలి. అలాంటి లేఖలు ఏవీ నాకు సీబీఐ నుంచి రాలేదు. ఇలా స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యేల అరెస్ట్ చట్టవిరుద్ధం’ అని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే, ఈ నలుగురు నేతల అరెస్టుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ గతంలో అనుమతులు ఇవ్వడం గమనార్హం. నన్నూ అరెస్ట్ చేయండి: మమతా బెనర్జీ అరెస్టుల విషయం తెల్సుకున్న టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వెంటనే కోల్‌కతాలో సీబీఐ కార్యాలయం ఉన్న ‘నిజాం ప్యాలెస్’ భవంతికి వచ్చి ధర్నా చేపట్టారు. అరెస్టులపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘సీబీఐ ఆఫీస్ నుంచి వెళ్లేదేలేదు. కావాలంటే నన్నూ అరెస్టు చేయండి’ అని అక్కడ ఉన్న సీబీఐ సిబ్బందితో మమత ఆగ్రహంగా అన్నారు. అరెస్టు చేశాక ఆ నలుగురు నేతలను సీబీఐ అధికారులు బిల్డింగ్‌లోని 15వ అంతస్తులోని ఒక రూమ్‌కు తీసుకెళ్లారు. మమత ఆ రూమ్ బయటే నిరసన తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు ఆమె సీబీఐ కార్యాలయంలోనే ఉండి నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని అడ్డుపెట్టుకొని వేధింపులకు దిగుతోందని తృణమూల్ ఆరోపించింది. -
మమతా బెనర్జీ ఇంటిముందు టీఎంసీ కార్యకర్తల సంబరాలు
-
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: సువేందు అధికారి గెలుపు
లైవ్ అప్డేట్స్: ♦ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో చివరకు సువేందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువేందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది. ♦ నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం మమతా బెనర్జీ ఓడిపోయిందంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ఈసీ స్పష్టత ఇచ్చింది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లున్నాయని, నందిగ్రాం ఫలితం ప్రకటించలేదని తేల్చి చెప్పింది. ♦16వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి సువేందు, దీదీపై 6 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ♦నంనదిగ్రామ్లో దీదీ మళ్లీ ముందంజలో కొనసాగుతున్నారు. సువేందుపై 2 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు దీదీ. ♦ టీఎంసీ 209 స్థానాల్లో ఆధ్యికంలో కొనసాగుతూ.. హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతుంది. బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతుంది. ♦ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలిపారు. విచ్చినకర,విభజించే శక్తులను ప్రజలుతిప్పికొట్టారన్నారు. ♦ టీఎంసీకి అభినందనలు తెలిపిన శివసేన, ఎన్సీపీ ♦ క్రికెటర్ టర్న్డ్ పొలిటీసియన్ మనోజ్ తివారీ బీజేపీకి చెందిన రతిన్ చక్రవర్తిపై ఆధిక్యం ♦ స్పష్టమైన ఆధిక్యంతో పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంటిముందు టీఎంసీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ♦ బెంగాల్లో ఒక్క స్థానానికే కాంగ్రెస్, లెఫ్ట్ పరిమితం (మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్) ♦ బెంగాల్లో కమ్యూనిస్టులకు భారీ గండి ♦ నందిగ్రామ్‌లో దూసుకొచ్చిన మమత. సువేదు అధికారిపై ఇప్పటిదాకా దాదాపు 8వేలకుపైగా ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 6వ రౌండ్లో 1427ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ♦ లీడింగ్లోడబుల్ సెంచరీ మార్క్‌ను దాటేసిన టీఎంసీ. 201 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ జోరు ♦ ఐదో రౌండ్లో పుంజుకున్న మమత 8,201 నుంచి 3వేలకు పడిపోయిన సువేందు ఆధిక్యం ♦ ఒకవైపు టీఎంసీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా,వరుసగా నాలుగో రౌండ్లోనూ సీఎం మమతకు భంగపాటు తప్పడం లేదు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందుకంటే 8106 ఓట్లు వెనుకబడి ఉన్నారు ♦లీడ్‌లో టీఎంసీ ప్రముఖులు: దమ్ దమ్ నార్త్‌లో చంద్రీమా భట్టాచార్య, మదన్ మిత్రా కమర్హతిలో బ్రాత్యా బసు దమ్ దమ్‌లో, సింగూర్‌లో బెచరం మన్నా, హబ్రాలో జ్యోతిప్రియో ముల్లిక్ లీడింగ్ ♦ ఉత్కంఠ భరితంగా సాగుతున్న పోరులో లీడింగ్‌లో టీఎంసీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 159 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, 90 సీట్లలో బీజేపీ లీడ్‌లో ఉంది ♦ మూడో రౌండ్లోనూ మమత వెనుకబడి ఉన్నారు. సుమారు 7287 ఓట్లతో సువేందు అధికారి లీడింగ్ ♦ రెండో రౌండ్లోనూ మమత వెనుకబాటులో ఉన్నారు. సుమారు 4500 ఓట్లతో సువేందు అధికారి లీడింగ్ ♦ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత మొలాయ్ ఘటక్ అసన్సోల్లో ఆధిక్యం. ♦ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత తారకేశ్వర్ నియోజకవర్గంలోబీజీపీ స్వాపన్ దాస్‌గుప్తా ముందంజ. ♦ కృష్ణానగర్ బీజేపీ ముకుల్ రాయ్ లీడింగ్‌లో ఉన్నారు. ♦ టోలీగంజ్‌లో బీజేపీకి చెందిన బాబుల్ సుప్రియో లీడింగ్‌లో ఉన్నారు. ♦ పోస్టల్ బ్యాలెట్లో దీదీ ముందంజలోఉన్నారు. ♦ నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజ : టీఎంసీకి రాజీనామాచేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని, బీజేపీ తరపున బరిలోఉన్న సువేందు అధికారి ఇక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ♦ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ♦ ఈ హోరాహోరీపోరులో టీఎంసీ 55, బీజేపీ 51 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ♦ మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ♦ ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్‌లోఅధికార పీఠం ఎవరికి దక్కనుందనే ఉత్కంఠకు ఈ రోజు తెరపడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బెంగాల్లో మొత్తం 292 సీట్లకు గాను పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. బెంగాల్లో అధికారం దక్కించుకోవాలంటే 148 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) సాధించాల్సి ఉంటుంది. (చదవండి: దీదీనా? మోదీనా?) కౌంటింగ్‌లో భాగంగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 1,113 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇక మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయనున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
బెంగాల్లో ‘దీదీ’నే!
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాంల్లో అధికార కూటమే విజయం సాధిస్తుందని టైమ్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, అయితే, 2016 కన్నా మెజారిటీ తగ్గుతుందని పేర్కొంది. అక్కడ బీజేపీ బలం పుంజుకున్నప్పటికీ.. అధికారం చేపట్టే స్థాయికి చేరుకోలేదని అంచనా వేసింది. పశ్చిమబెంగాల్లో..: వరుసగా మూడోసారి పశ్చిమబెంగాల్ పీఠంపై ‘దీదీ’మమత బెనర్జీనే కూర్చోనుందని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. అయితే, గతంలో కన్నా మెజారిటీ తగ్గుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 146 నుంచి 162 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 211 స్థానాలతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్లో మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2016 ఎన్నికల్లో మూడే స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 99 నుంచి 115 స్థానాలను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ– సీ ఓటర్ తేల్చింది. కాగా, కాంగ్రెస్–వామపక్షం–ఐఎస్ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపబోదని, ఆ కూటమికి 29 నుంచి 37 సీట్లు రావచ్చని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే తేల్చింది. ఓట్ల శాతం విషయానికి వస్తే టీఎంసీకి 42.2%, బీజేపీకి 37.5%, కాంగ్రెస్ కూటమికి 14.8% ఓట్లు వస్తాయంది. 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం 10.2% ఓట్లు సాధించిన విషయం గమనార్హం. తమిళనాడులో..: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని యూపీఏ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. ఈ కూటమి 158 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. మరోవైపు, అన్నాడీఎంకే – బీజేపీల ఎన్డీఏ 65 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని వెల్లడించింది. యూపీఏ 43.2%, ఎన్డీఏ 32.1% ఓట్లు సాధిస్తాయని తెలిపింది. గత ఎన్నికల్లో యూపీఏ 98 సీట్లలో, ఎన్డీఏ 136 సీట్లలో గెలుపొందాయి. తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రిగా స్టాలిన్‌కు మెజారిటీ ప్రజలు ఓటేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో స్టాలిన్‌ను 38.4%, పళనిసామిని 31%, కమల్‌హాసన్‌ను 7.4%, రజనీకాంత్‌ను 4.3%, పన్నీరుసెల్వంను 2.6%, శశికళను 3.9% మంది ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగాలేదని 53.26% ప్రజలు అభిప్రాయపడగా, 34.35% సంతృప్తి వ్యక్తం చేశారు. అస్సాంలో..: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్వల్ప మెజారిటీతో అధికారం నిలుపుకుంటుందని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)ల కారణంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగినప్పటికీ కొద్ది మెజారిటీతో ఎన్డీఏ గట్టెక్కుతుందని అంచనావేసింది. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీఏకు ఈ ఎన్నికల్లో 67 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 57 స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. 2016 ఎన్నికల్లో ఎన్డీఏ 74, యూపీఏ 39 సీట్లు గెలుచుకున్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 42.29% ఎన్డీఏకు, 40.7% యూపీఏకు ఓటేస్తామన్నారని వెల్లడించింది. సీఏఏ, ఎన్ఆర్సీల కారణంగా యూపీఏ గణనీయంగా లాభపడిందని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్‌కు 45.2% మద్దతు పలికారు. రెండో స్థానంలో కాంగ్రెస్ నేత సౌరవ్ గొగోయి ఉన్నారు. కాగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పనితీరుపై దాదాపు 70% సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కేరళలో..: కేరళలో వామపక్ష కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. మొత్తం 140 సీట్లకు గానూ అధికార ఎల్డీఎఫ్ 82 సీట్లను, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ 56 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఎల్డీఎఫ్ 42.9%, యూడీఎఫ్ 37.6% ఓట్లను సాధిస్తాయని వెల్లడించింది. గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 91, యూడీఎఫ్ 47 సీట్లను గెలుచుకున్నాయి. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌పై 42.34% పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సర్వేలో పాల్గొన్నవారిలో 55.84% కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నామని తెలపడం విశేషం. ప్రధానిగా మోదీకి వారిలో 31.95% మాత్రమే మద్దతిచ్చారు. పుదుచ్చేరిలో..: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రానుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే వెల్లడించింది. మొత్తం 30 స్థానాలకు గానూ 18 స్థానాలను ఎన్డీఏ గెల్చుకుంటుందని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి 12 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 45.8%, యూపీఏకు 37.6% ఓట్లు వస్తాయని తెలిపింది. 2016లో కాంగ్రెస్ – డీఎంకేల కూటమి 17 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 12 సీట్లు గెలుచుకుంది. -
మమత పాలనలో నిర్మమత
హల్దియా: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో అమలు చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి రాష్ట్ర ప్రజలు మమత(ఆప్యాయత)ను కోరుకుంటే గత పదేళ్లలో నిర్మమత(క్రూరత్వం) దక్కిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అధికార దుర్వినియోగానికి పర్యాయపదంగా మారిపోయిందని దుయ్యబట్టారు. గత పదేళ్లలో ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందన్నారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ‘‘భారత్ మాతాకీ జై అని నినదిస్తే సీఎం మమతా బెనర్జీ కోపగించుకుంటున్నారు. హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న ప్రజలపై ఆగ్రహిస్తున్నారు. దేశాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి కుట్రలు జరుగుతుంటే మమతా బెనర్జీ నోరు విప్పడం లేదు’’ అని మోదీ విమర్శించారు. వన్ నేషన్.. వన్ గ్యాస్గ్రిడ్ ప్రధాని మోదీ హల్దియాలో చమురు, సహజ వాయువు రంగాలకు సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆదివారం జాతికి అంకితం చేశారు. ఇందులో 348 కిలోమీటర్ల డోభీ–దుర్గాపూర్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ కూడా ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘గెయిల్’ నిర్మించింది. ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. భారతీయ తేనీరుపై అంతర్జాతీయ కుట్ర భారతీయ తేనీరును అప్రతిష్టపాలు చేయడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ కుట్రకు అస్సాంలోని టీ కార్మికులు ధీటైన జవాబు ఇస్తారని అన్నారు. తేయాకు ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అస్సాంలో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే రెండోసారి. రాష్ట్రంలో రూ.8,210 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘అసోంమాలా’ పథకాన్ని ప్రారంభించారు. రెండు వైద్య కళాశాలల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన.. తేయాకు రంగానికి కేంద్ర బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. అస్సాంలో ప్రతి టీ కార్మికుడికి రూ.3,000 చొప్పున సాయం అందిస్తున్నామని వెల్లడించారు. గత ఐదేళ్లలో అస్సాం గణనీయంగా అభివృద్ధి సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు మెరుగయ్యాయని అన్నారు. ఐదేళ్లలో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. అధునాతన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. -
సీఎం మమతా.. నా బిడ్డకు పేరు పెడతారు
హుగ్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజుకోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిసెంబర్ నుంచి మొదలుకొని 5 నెలలుగా ప్రపంచంలో కరోనా, లాక్డౌన్, ఐసోలేషన్, క్వారంటైన్ వంటి పదాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ 5 నెలల్లో ఎంతోమంది తల్లిదండ్రులు తమకు పుట్టిన బిడ్డలకు కరోనా , కోవిడ్ లాంటి పేర్లు పెట్టడం చూస్తున్నాం. మొన్నటికి మొన్న టెస్లా కార్ల సంస్థ సీఈవో ఎలన్ మస్క్ తన కొడుక్కి అర్థం కాని పేరు పెట్టి నెటిజన్లను కన్ప్యూజన్లోకి నెట్టేశారు.(కరోనా.. ఒక్క రోజులోనే 103 మంది మృతి) తాజాగా ఈ జాబితాలోకి తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అపరూప పొద్దార్ చేరారు. గురువారం రాత్రి హుగ్లీ జిల్లాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అపరూప పొద్దార్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ' కరోనా సమయంలో నాకు బిడ్డ పుట్టింది కాబట్టే దానికి కరోనా అనే పేరు పెడుతున్నా. అయితే ఇది కేవలం నిక్‌నేమ్ మాత్రమే. నా బిడ్డకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామకరణం చేస్తారు. నాకు బిడ్డ పుట్టడం నా భర్త షాకిర్ అలీకి సంతోషం కలిగించింది. ప్రస్తుతానికి నేను, నా బిడ్డ క్షమంగా ఉన్నాం' అంటూ అపరూప పొద్దార్ పేర్కొన్నారు. సాధారణంగా బెంగాల్లో అప్పుడే పుట్టిన బిడ్డలకు రెండు పేర్లు పెట్టే సంప్రదాయం కొనసాగుతుంది. తల్లిదండ్రులు తమకి నచ్చిన పేరును పెట్టుకోవచ్చు. అయితే ప్రధాన నామకరణం మాత్రం ఇంటిపెద్ద నిర్ణయించాలన్నది వారి సంప్రదాయంగా వస్తుంది. -
సీబీఐ వేధింపులతోనే ఆ నేత మరణం..
కోల్‌కతా : కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులతోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ నటుడు తపస్ పాల్ గుండెపోటుతో మరణించారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ఒత్తిళ్లతో ఇటీవల ముగ్గురు మరణించారని ఆమె అన్నారు. తృణమూల్ మాజీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ తొలుత మరణించగా, పార్టీ ఎంపీ ప్రసూన్ బెనర్జీ తర్వాత కన్నుమూయగా తాజాగా తపస్ పాల్‌ను కేంద్రం బలిగొందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వేధింపులు, రాజకీయ కక్షసాధింపు చర్యలతోనే వీరు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా తపస్ పాల్ (61) గుండెపోటుతో ముంబై ఆస్పత్రిలో మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. తపస్ పాల్ హఠాన్మరణంపై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం పతాకస్ధాయికి చేరింది. తపస్ పాల్ తృణమూల్ కాంగ్రెస్ చేసిన పాపాలకు బలిపశువు అయ్యారని బీజేపీ తృణమూల్ ఆరోపణలను తిప్పికొట్టింది. గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన తపస్ పాల్ దీర్ఘకాలంగా గుండె, నరాల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా పలుసార్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. డిసెంబర్ 2016 రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కేసుకు సంబంధించి సీబీఐ గతంలో ఆయనను అరెస్ట్ చేసింది. చదవండి : ఢిల్లీ ఫలితాలు : ‘2021లో ఏం జరుగుతుందో చూడండి’ -
టీచర్‌ను తాళ్లతో కట్టి.. రోడ్డుపై ఈడ్చి..
బలుర్ఘాట్: రోడ్డు వేసేందుకు స్థలం ఇవ్వడం లేదన్న కారణంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని కాళ్లు, చేతులు కట్టేసి, రోడ్డుపై ఈడ్చిన దారుణ దుర్ఘటన పశ్చిమబెంగాల్లోని దీనజ్‌పూర్‌లో జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టడంతో రాజకీయ సెగ అలుముకుంది. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాంపూర్ బ్లాక్‌కు చెందిన ప్రభుత్వ టీచర్, బీజేపీ మద్దతుదారు స్మృతికానా దాస్ స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టేలా పంచాయతీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఆమె అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఉప ప్రధాన్ (డిప్యూటీ చీఫ్) అమల్ సర్కార్.. స్మృతికానా దాస్ కుటుంబాన్ని హింసించారు. టీచర్ కాళ్లను, చేతులను కట్టేయడంతో ఆమె కిందపడిపోవడం, ఆమెను కొందరు దుండగులు దాదాపు 30 అడుగులు ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకెళ్లి బంధించడం వీడియోలో రికార్డయ్యింది. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో గూండాయిజం సాగుతున్నదనడానికి ఇది ఉదాహరణ అంటూ విమర్శించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ చెప్పారు. -
'మీ ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి'
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు ఓటు వేసి గెలిపించాలని తృణముల్ కాంగ్రెస్ ఢిల్లీ ప్రజలను కోరింది. తాజాగా తృణముల్ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ బుధవారం ఢిల్లీలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి రాఘవ్ చాదాకు ఓటు వేసి గెలిపించాలని ట్విటర్ ద్వారా ప్రజలను కోరారు. అంతేగాక ఈ ఎన్నికల్లో ఒక్క కేజ్రీవాల్‌నే కాకుండా ఆప్ అభ్యర్థులందరికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ' ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేయండి.. ఆప్ అభ్యర్థి రాఘవ్ చాదానను గెలిపించండి.. అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ అభ్యర్థులందరిని గెలిపించండి' అంటూ డెరెక్ ఒబ్రెయిన్ వీడియా ద్వారా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్న సంగతి తెలిసిందే.(‘సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారు’) Vote for @AamAadmiParty Vote for the candidate from Rajendra Nagar constituency @raghav_chadha Vote for @ArvindKejriwal and all AAP candidates in Delhi WATCH pic.twitter.com/KcgHbPpkB7 — Citizen Derek | নাগরিক ডেরেক (@derekobrienmp) January 30, 2020 -
ఆస్పత్రిలో చేరిన ఎంపీ నుస్రత్ జహాన్!
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతూ.. కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నుస్రత్ అస్తమాతో బాధ పడుతోందని.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైన కారణంగా.. ఆమెను ఆదివారం ఉదయం ఆస్పత్రితో చేరారని ఈ మేరకు నుస్రత్ జహాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం నుస్రత్ ఐసీయూలో ఉన్నారని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని సోమవారం ఆమె కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. బసిర్హాట్ నియోజకవర్గానికి తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరపున పోటీచేసిన నుస్రత్ జహాన్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహమాడి సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా నిలిచారు. -
బెంగాల్లో తృణమూల్ నేత హత్య
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నపూర్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. మృతుడిని బాక్చా గ్రామ సర్పంచ్ వాస్దేవ్ మొండల్‌గా గుర్తించారు. మొండల్ సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన కుమార్తె ఇంటిని వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బాధితుడిని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి చంపారని పోలీసులు తెలిపారు. హతుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెంగాల్లో గత వారం రోజులుగా పలు హత్యలు చోటుచేసుకున్నాయి. ఆదివారం నదియా జిల్లాలో 55 సంవత్సరాల స్ధానిక బీజేపీ నేత హరాల దేవ్‌నాధ్‌ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. గత వారం ముర్షిదాబాద్‌లో ఆరెస్సెస్ కార్యకర్త ప్రకాష్ పాల్ గర్భవతి అయిన ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడిని దుండగులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. -
బీజేపీ ఎంపీ వాహనంపై దాడి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌పై దాడి ఘటన మరువకముందే మరో బెంగాల్ నేతపై తృణమూల్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. బరక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనంపై ఆదివారం మధ్యాహ్నం కొందరు తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా శ్యామ్‌నగర్‌లోని ఫీడర్ రోడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు జరిపిన లాఠీచార్జిలో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌కు తలపై గాయాలయ్యాయి. పలువురు బీజేపీ కార్యకర్తలపైనా పోలీసులు లాఠీలు ఝళిపించారు. కాగా బరక్‌పూర్ పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ తన తలపై లాఠీతో బలంగా కొట్టారని, బీజేపీ కార్యకర్తలనూ ఆయన చితకబాదారని ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఎంపీ కారును తృణమూల్ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
2 కోట్లు.. ఓ పెట్రోల్ బంకు
కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తమ పార్టీలో చేరాలని, లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి చిట్‌ఫండ్ కుంభకోణంలో జైలుకు పంపిస్తామని టీఎంసీ ప్రజాప్రతినిధులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినాన్ని పురస్కరించుకొని టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారీగా హాజరైన ఈ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. కర్ణాటకలో అనుసరిస్తున్న వైఖరినే రాష్ట్రంలోనూ ప్రయోగించాలని బీజేపీ చూస్తోందని ఆమె విమర్శించారు. దీనికోసం తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.2 కోట్లతోపాటు పెట్రోల్ బంక్ ఇస్తామని ప్రలోభపెడుతోందని ఆరోపించారు. తమ పార్టీ గ్రామ నేతలకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపుతోందన్నారు. డబ్బుతో ఎవరినైనా కొనేయగలమనే అహంకారంలో బీజేపీ ఉందని మండిపడ్డారు. ఇలాగైతే మరో రెండేళ్లే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలిచిందని మమత ఆరోపించారు. ప్రస్తుత తీరుగానే వారి వ్యవహారం ఉంటే మరో రెండేళ్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని హెచ్చరించారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి టీఎంసీ నాయకులు వసూలు సొమ్మును తిరిగిచ్చేయాలని తాను అన్నట్లుగా తన గత ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల అమలుపై ఓ కన్నేసి ఉంచాలని తమ పార్టీ నాయకులకి తాను చెప్పానని, అయితే తన మాటలని వక్రీకరించి తమ నాయకులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ముందు బీజేపీ తరలించిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని, అలాగే ఆ పార్టీ నాయకులు ఉజ్వల పథకంలో వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇవ్వాలన్నారు. ఇదే డిమాండ్‌తో 26వ తేదీన నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఉచిత ఎల్పీజీ పేరుతో బీజేపీ నేతలు డబ్బు వసూలు చేయడంపై దర్యాప్తు జరుపుతామన్నారు. 18 లోక్‌సభ స్థానాలు గెలిచి.. మొత్తం రాష్ట్రాన్ని గెలిచేసినట్లుగా బీజేపీ భావిస్తోందని ఎద్దేవా చేశారు. గంటపాటు ర్యాలీలో ఆమె.. ఏ ఒక్క బీజేపీ నాయకుడి పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. -
బెంగాల్లో మళ్లీ అల్లర్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని భాత్పురలో శనివారం మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. గురువారం ఉత్తర 24 పరగణలో జరగిన అల్లర్లలో ఇద్దరు మరణించగా 11 మంది గాయపడిన సంగతి తెలిసిందే. బాధితులను పరామర్శించడానికి కేంద్ర మాజీ మంత్రి, బర్ధామన్–దుర్గాపూర్ ఎంపీ ఎస్ఎస్ అహ్లువాలియాతో పాటు ఎంపీలు, మాజీ పోలీసు అధికారులు సత్యపాల్ సింగ్, బీడీ రామ్ కూడా వచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మరణించిన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలని తెలిపారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌షాకు నివేదిక అందిస్తామన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పోలీసులు, తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేశాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి జరపాల్సి వచ్చింది. -
‘జమిలి’పై భేటీకి మమత డుమ్మా
న్యూఢిల్లీ/కోల్‌కతా: జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై జరిగే 19వ తేదీన జరిగే సమావేశానికి పంపిన ఆహ్వానాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరస్కరించగా కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఏక కాలంలో ఎన్నికలతోపాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.హడావుడిగా ఇలా సమావేశం జరపడం కంటే ఏకకాలంలో ఎన్నికలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేసి, పార్టీలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం మమత లేఖ రాశారు. అలా చేసినప్పుడే చాలా కీలకమైన ఈ అంశంపై తాము నిర్దిష్టమైన సలహాలు ఇవ్వగలుగుతామన్నారు. సాధారణ ఎన్నికల అనంతరం అధికార టీఎంసీని వీడి బీజేపీలో చేరిన నేతలపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. పార్టీ మారిన వారంతా అత్యాశపరులు, అవినీతిపరులని, ఆ చెత్తను బీజేపీ ఏరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇంకా ఎవరైనా వెళ్లాలనే ఆలోచనలో ఉంటే అలాంటి వారు తొందరగా వెళ్లిపోవాలని కోరారు.. కాగా, ఈ సమావేశంలో పాల్గొనే అంశంపై చర్చించేందుకు బుధవారం ఉదయం సమావేశం కావాలని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రజాధనం ఆదా చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి జరపడం మేలంటూ గత ఆగస్టులో లా కమిషన్ సిఫారసు చేసింది. కాగా, ఎన్నికల్లో బీజేపీ 303 ఎంపీలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా వరుసగా కాంగ్రెస్ (52), డీఎంకే (23), వైఎస్ఆర్ కాంగ్రెస్(22), టీఎంసీ(22) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
బెంగాల్లో వేడెక్కిన రాజకీయం
కోల్‌కతా/బశీర్హట్/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేది, వ్యతిరేక గళం విన్పించేది ఒక్క తానేనని, ఈ నేపథ్యంలో తన గొంతు నొక్కాలని ఆ పార్టీ భావిస్తోందని అన్నారు. తన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర విజయవంతం కాదని చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బెంగాల్లో హింసను ప్రేరేపించేందుకు కేంద్రం, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వివిధ సామాజిక మాధ్యమ వెబ్సైట్ల ద్వారా తప్పుడు వార్తలు వ్యాపింపజేసేందుకు కోట్లకు కోట్ల డబ్బును వ్యయం చేస్తున్నారని చెప్పారు. ఏ రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లినా, దాడులు జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉంటుందో కేంద్రానికి కూడా అంతే సమాన బాధ్యత ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కేంద్ర హోం శాఖ సలహా ఇవ్వడం.. అప్రజాస్వామిక, అనైతిక, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల్లో బీజేపీ చేస్తున్న పకడ్బందీ కుట్రగా టీఎంసీ సెక్రటరీ జనరల్, బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ అభివర్ణించారు. ఈ మేరకు మంత్రి అమిత్ షాకు సోమవారం లేఖ రాశారు. నిజానిజాలేమిటో పరిశీలించకుండానే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదిక తీసుకోకుండానే కేంద్ర హోంశాఖ ఓ నిర్ధారణకు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, హోం శాఖ తన సలహాను తక్షణం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా టీఎంసీ ఆరోపణలు ఆధార రహితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. బీజేపీ నిరసన ర్యాలీలు శనివారం ఘర్షణలు జరిగిన బశీర్హట్ (సందేశ్‌ఖలి) ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ కార్యకర్తల హత్యను, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితికి నిరసనగా బీజేపీ 24 పరగణాల జిల్లాల బశీర్హట్ సబ్ డివిజన్లో బ్లాక్ డేతో పాటు 12 గంటల షట్‌డౌన్ పాటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మోదీతో గవర్నర్ భేటీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వివరించినట్లు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి తెలిపారు. భేటీ వివరాలు వెల్లడించలేనని ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై తన సమావేశాల్లో చర్చించలేదని స్పష్టం చేశారు. -
‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. తమ పార్టీతో పెట్టుకుంటే ఎవరికైనా పతనంతప్పదని హెచ్చరించారు. ఈద్ సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బెంగాల్లో బీజేపీ ఎదుగుదల సూర్యోదయం వంటిదని, మళ్లీ ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమని అన్నారు. ఈవీఎంల అక్రమాలకు పాల్పడి గెలిచిన బీజేపీ త్వరలోనే ప్రజల ఆదరణను కోల్పోక తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు బెంగాల్లో బీజేపీ జై మహాకాళి నినాదాన్ని అందిపుచ్చుకోవడం పట్ల తృణమూల్ స్పందించింది. జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించిన బీజేపీ శ్రేణులు ఇప్పుడు అది ఫలితాలు ఇవ్వదని గ్రహించి నినాదం మార్చేశారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు. మతాన్ని బీజేపీ రాజకీయాలతో ముడిపెడుతున్నదని ఆక్షేపించారు. -
మమతకు అసెంబ్లీ గండం
పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దీదీ కోటలో బీజేపీ బలం పుంజుకోవడమే కాక క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుంటోందని, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటోందని వెల్లడిస్తున్నాయి. తాజా ఫలితాలను విశ్లేషిస్తే 18 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సాధించిందని తేలింది. 22 సీట్లు దక్కించుకున్న తృణమూల్ 164 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీన్ని బట్టి 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అగ్ని పరీక్షేనని, రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయని వారు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 39.7 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ 34 సీట్లు గెలిచింది. ఈ సారి ఓట్ల శాతం 43.3కు పెరిగినా సీట్లు తగ్గడం గమనార్హం. అలాగే, గత ఎన్నికల్లో17 శాతం ఓట్లతో 2 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి 40.2శాతం ఓట్లతో 18 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ మెజారిటీ సాధించడంతో ఓట్లతో పాటు సీట్లు కూడా పెరిగాయి. రాజధాని ,చుట్టుపక్కల ఉన్న ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో( కోల్‌కతా సౌత్, నార్త్, జాదవ్‌పూర్, బరసాత్, డమ్‌డమ్) తృణమూల్ ఎంపీలే ఉన్నారు. వీటి పరిధిలో 35 శాసన సభ స్థానాలున్నాయి. తాజా ఎన్నికల్లో వీటిలో ఐదు చోట్ల బీజేపీ అభ్యర్ధులు పై చేయి సాధించారు. రాష్ట్ర మంత్రులు సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ,సుజిత్‌బోస్, జ్యోతిప్రియలు తమ సొంత నియోజకవర్గాల్లోనే తృణమూల్‌కు మెజారిటీ తీసుకురాలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మమత 2020లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. చాలా చోట్ల ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉందని పలువురు తృణమూల్ నాయకులు లోపాయికారీగా అంగీకరిస్తున్నారు.దాంతో బూత్ స్థాయి నుంచి ప్రక్షాళనకు పార్టీ నాయకత్వం శ్రీకారం చుడుతోంది.నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే జిల్లాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.డజనుకు పైగా సీనియర్ మంత్రులు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో తృణమూల్ బాగా వెనకబడి ఉందని తాజా ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ తృణమూల్ ఓటు బ్యాంకు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ ఒకవైపు బలపడుతోంటే, అంతర్గత కలహాలు, నేతల విభేదాలు తృణమూల్‌కు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. కొందరు బహిరంగంగానే మమతపై ధ్వజమెత్తుతోంటే, మరికొందరు లోపాయికారీగా ప్రత్యర్థులకు సహకరించడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనబడిందని పార్టీ నేతలు చెబుతున్నారు. -
మమతా బెనర్జీ రాజీనామా..!
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఇరుకునపడ్డారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన మమతా పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే టీఎంసీ మమతా బెనర్జీ రాజీనామాను తిరస్కరించింది. ఈ సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందనీ, ఈ ఫలితాల వెనుక విదేశీ శక్తుల హస్తముందని ఆరోపించారు. అందుకే రాజీనామా చేశా.. ‘లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పాలనను ఈసీ 5 నెలల పాటు ఆధీనంలోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను సీఎంగా ఎలా ఉండగలను? అందుకే ముఖ్యమంత్రిగా తప్పుకుంటానని చెప్పాను. కానీ పార్టీ నా రాజీనామాను తిరస్కరించింది. ఈ సీఎం కుర్చీ నాకవసరం లేదు. ఆ కుర్చీకే నా అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాం. ఇప్పటివరకూ ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడంపై కూడా దృష్టి సారిస్తా. లోక్‌సభ సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లక్ష మెజారిటీ దాటేలా వాటిని రీప్రోగ్రామింగ్ చేశారు. దీనివెనుక విదేశీ శక్తులు కూడా ఉండొచ్చు. బీఎస్ఎఫ్ బలగాలు ప్రజలపై ఒత్తిడి తెచ్చి బీజేపీకి ఓట్లేసేలా చేశాయి’ అని మమత ఆరోపించారు. -
‘మోదీ గుంజిళ్లు తీయాలి’
మందిర్ బజార్/డైమండ్ హార్బర్: సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ దుశ్చర్యకు బీజేపీ నేతలు తగిన ఫలితం అనుభవిస్తారనీ, బెంగాలీలు వారిని క్షమించబోరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని మమత ఫాసిస్టుగా, ప్రజలను హింసించే వ్యక్తిగా అభివర్ణించారు. పంచలోహాలతో చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాత విగ్రహం ఉన్నచోటే ప్రతిష్టిస్తామన్న మోదీ ప్రతిపాదనను మమత తిరస్కరించారు. మందిర్ బజార్, డైమండ్ హర్బర్‌ల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు. మోదీ గుంజిళ్లు తీయాలి.. బంగారం లాంటి పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో దివాళా తీసిందని బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పడంపై మమత మండిపడ్డారు. ‘బెంగాల్ దివాలా తీసిన రాష్ట్రంగా మారిందని చెప్పడానికి మీకు (బీజేపీ నేతలకు) సిగ్గుగా అనిపించడం లేదా? బెంగాల్‌కు బీజేపీ భిక్ష అక్కర్లేదు. కొత్తగా విద్యాసాగర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి మా దగ్గర నిధులున్నాయి. ప్రధాని మోదీ ఓ అబద్ధాల కోరు. అలాంటి వ్యక్తిని దేశం ఇప్పటివరకూ చూడలేదు. విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ గూండాలు ఎలా ధ్వంసం చేశారో మీడియా స్పష్టంగా చూపింది. బెంగాల్ వారసత్వ సంపదను ధ్వంసం చేసినందుకు మోదీ గుంజిళ్లు తీయాలి’ అని మమత వ్యాఖ్యానించారు. ఈసీ అమ్ముడుపోయింది.. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ నకిలీ వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుపోయిందని మమత విమర్శించారు. ఈ మాట అన్నందుకు తాను జైలుకు వెళ్లాల్సివచ్చినా అందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. -
‘దీదీ చేతికి ప్రధాని నివాసం తాళాలు’
కోల్‌కతా : ఈనెల 23 తర్వాత ప్రధాని అధికారిక నివాసం తాళాలు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేతికి వస్తాయని ఆమె మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. కాగా తన కార్యాలయం ఉన్న భవనాన్ని తాను ఆక్రమించుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై ఆయనకు లీగల్ నోటీసు పంపుతానని హెచ్చరించారు. ఎంపీ అభిషేక్ తన నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ఉన్న భవనాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆరోపించారు. అభిషేక్ ప్రాతినిథ్యం వహించే డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన ప్రధాని మోదీ సిటింగ్ ఎంపీపై ఈ ఆరోపణలు గుప్పించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన ప్రధాని 48 గంటల్లోగా క్షమాపణ చెప్పకపోతే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అభిషేక్ హెచ్చరించారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పకుంటే తాను ఆయనకు లీగల్ నోటీసు పంపుతానని అభిషేక్ స్పష్టం చేశారు. -
బెంగాలీ సెంటిమెంట్‌పై ‘ఎన్నికల దాడి’
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశ వేడెక్కింది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ర్యాలీలో జరిగిన విధ్వంసంతో దేశం దృష్టి యావత్తు బెంగాల్‌పైకి మళ్లింది. అమిత్ షా ర్యాలీకి మమత సర్కారు అడ్డంకులు కల్పించడం, ర్యాలీని తృణమూల్, సీపీఎం శ్రేణులు అడ్డుకోవడం, ప్రతిగా బీజేపీ కార్యకర్తలు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మాటల యుద్దం నుంచి దాడుల వరకు... సాధారణంగా బిహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాలు కొన్నింటిలో ఎన్నికలప్పుడు అల్లర్లు, హింస జరగడం గత ఎన్నికల్లో చూశాం. అయితే, ఈ సారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు చెప్పుకోతగ్గ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగ్గా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హింస, అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇంత వరకు జరిగిన వివిధ దశల పోలింగులో హింస జరగడం ఒక ఎత్తయితే, తాజాగా అమిత్‌షా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఇరు పక్షాలు విధ్వంసానికి పాల్పడటంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈశ్వర్ చంద్ర విగ్రహ విధ్వంసానికి కారకులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీలు ఆరోపణలు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ఎన్నికల నియమావళిని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేత అమిత్ షా మండి పడ్డారు. తృణమూల్ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ అంటూ ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అమిత్‌షా పొరుగు రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ దాడి చేసిందంటూ మండి పడ్డారు. ఘటనపై ఇరు పక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. బుధవారం పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల సంఘం తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిషేధించింది. తృణమూల్ బలప్రయోగం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీల మధ్య పోరుగా మారాయి. వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంటే, కమలనాథులకు అవకాశం దక్కకుండా చేసేందుకు దీదీ అన్ని మార్గాలు అవలంబిస్తోంది. అధికారాన్ని ఉపయోగించుకుని విపక్ష నేతల పర్యటనలకు, ఎన్నికల ప్రచారాలకు, ర్యాలీలకు మోకాలడ్డుతోంది. అంతే కాకుంగా, విపక్ష నేతలకు పట్టున్న జిల్లాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లను అనుమతించడం లేదు. తృణమూల్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంగా తరచు హింస,అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ తీవ్ర పోరుకి కారణం... తృణమూల్, బీజేపీలు రెండూ ఇంతటి తీవ్ర స్థాయి పోరుకు దిగడానికి కారణం బెంగాల్లో విజయం ఇద్దరికీ తప్పనిసరి కావడమే. దేశంలో తృణమూల్ అధికారంలో ఉన్నది ఒక్క బెంగాల్లోనే. ఇక్కడ అధికారం కోల్పోతే దాని మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో తృణమూల్ శ్రేణుల పెత్తనం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. మరోవైపు 34 ఏళ్ల తమ అధికారాన్ని కొల్లగొట్టిన తృణమూల్‌పై సీపీఎం కన్నెర్రగా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మమతాని మట్టి కరిపించాలని సీపీఎం శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం అవసరమైతే బీజేపీకి సహకరించడానికి కూడా కమ్యూనిస్టులు సిద్దపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గెలుపు కోసం ప్రత్యర్థులను బల ప్రయోగంతో అణచివేయడానికి తృణమూల్ వెనుకాడటం లేదు. మమత మేనల్లుడు పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో తృణమూల్, బీజేపీల మధ్య వరసగా కొన్ని రోజుల పాటు ఘర్షణలు జరగడం దీనికి నిదర్శనం. మరోవైపు బీజేపీకి కూడా బెంగాల్లో మెజారిటీ సీట్లు సాధించడం జాతీయ రాజకీయాల దృష్ట్యా అవసరం. రెండో సారి కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న కమలనాధులకు హిందీ బెల్ట్‌లో గతంలోలా ఈ సారి మెజారీటీ స్థానాలు రావని తేలిపోయింది. అక్కడి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అత్యధిక లోక్‌సభ స్థానాలున్న బెంగాల్లో పట్టు సాధించడం బీజేపీకి అనివార్యం. అందుకే బెంగాల్లో వీలైనన్ని సీట్లు సాధించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. తృణమూల్‌పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం, తృణమూల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్న కమ్యూనిస్టుల సహాయం తీసుకోవడం ద్వారా దీదీకి చెక్ చెప్పేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా ఇరు పక్షాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. సత్తా చాటుకునేందుకే... తమ సత్తా చాటేందుకు మమత, మోదీలు పరోక్షంగా ప్రయత్నించడం రెండు పార్టీల మధ్య రాజకీయ పోరాటానికి దారి తీసింది. చివరిదశ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఇరు పక్షాలు ఎన్నికల నిబంధనలను, సంప్రదాయాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. తాజా అల్లర్లు, విధ్వంసాలు రెండు పార్టీల్లో నైరాశ్యం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తృణమూల్–బీజేపీల మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహం విధ్వంసం బెంగాల్ ప్రజల భావోద్వేగాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇది బెంగాలీ సంస్కృతిపై దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.ఈ ఘటనను సీపీఎం సహా అనేక పార్టీలు తీవ్రంగా ఖండించడం, తృణమూల్ నేతలు తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ను మార్చడం ఈ ఘటన ప్రాధాన్యతను వెల్లడిస్తున్నాయి. విగ్రహ ధ్వంసానికి కారణమెవరైనా మరో 4 రోజుల్లో జరగనున్న పోలింగ్‌పై దీని ప్రభావాన్ని తోసి పుచ్చలేమని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. హద్దులు దాటిన ప్రచార యుద్ధం యూపీ మాదిరిగానే బెంగాల్‌లోని 42 సీట్లకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. చివరి దశలో మిగిలిన 9 లోక్‌సభ స్థానాలకు మే 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు, ఐదు, ఆరు దశల పోలింగ్ సరళిని బట్టి చూస్తే బీజేపీ బలపడుతోందని, ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. తృణమూల్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వారు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుందని రాష్ట్ర సీపీఎం నేత ఒకరు అన్నారు. బెంగాల్‌ను 34 ఏళ్లు పాలించిన సీపీఎం బాగా బలహీనం కావడం, కాంగ్రెస్ బలం ఊహించని స్థాయిలో కుంచించుకుపోవడంతో బీజేపీకి మమతా బెనర్జీ పెద్ద సవాలుగా మారారు. ఇద్దరూ ఇద్దరే... మోదీ ఆరెసెస్‌లో, తర్వాత బీజేపీలో సంస్థాగత పదవులు సమర్థంగా నిర్వహించి నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి ప్రధాని పదవి చేపట్టారు. వామపక్ష పాలనలో మమత వీధి పోరాటాలతో రాటుదేలారు. సీపీఎం భౌతిక దాడులను సైతం తట్టుకుని హింసకు హింసతోనే ఆమె జవాబిచ్చారు. 1998లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి తృణమూల్ కాంగ్రెస్ స్థాపించాక బీజేపీతో చేతులు కలిపారు. వరుసగా 1998, 99, 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మమత రాష్ట్రంలో తృణమూల్‌కు గట్టి పునాదులు వేయగలిగారు. చివరికి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకున్నారు. ఆమె తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే క్రమంలో సీపీఎం, కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరై బలం కోల్పోయాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మలచుకున్న బీజేపీ రాష్ట్రంలో తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఆరో దశ పోలింగ్‌కు ముందు మేదినీపూర్ ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగిస్తూ, ‘‘1942లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నడిచిన క్విట్ ఇండియా ఉద్యమం లాంటివే 2019 లోక్‌సభ ఎన్నికలు. ఫాసిస్టు మోదీ సర్కారును అధికారం నుంచి కూలదోయడానికే మా పార్టీ పోరాడుతోంది,’’ అని ప్రకటించారు. మోదీ ఇటీవల బెంగాల్లో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ‘‘ మమత అనగానే ‘టీ’ అక్షరంతో మొదలయ్యే మూడు పదాలు గుర్తుకొస్తాయి. అవి తణమూల్, టోల్‌బాజీ(బలవంతపు వసూళ్లు) టాక్స్. అన్నారు. బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టిన తృణమూల్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో మౌన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మల, ఇతర సీనియర్ బీజేపీ నేతలు -
‘యూపీలో బీజేపీకి దక్కే స్ధానాలు ఇవే’
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే కొలువుతీరుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రపక్షాల తో కలిసి బీజేపీకి 150 స్ధానాలు వస్తాయని, బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా విస్పష్ట మెజారిటీ రాదని స్పష్టం చేశారు. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. 2014లో యూపీలో 80 స్ధానాలకు గాను బీజేపీకి 73 స్ధానాలు దక్కడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. యూపీలో ఈసారి బీజేపీకి 13 నుంచి 17 స్ధానాలు మాత్రమే లభిస్తాయని, ఎస్పీ-బీఎస్పీకి 55 స్ధానాలు వస్తే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రధాని రేసులో ఎవరుంటారనేది ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలు నిర్ణయిస్తాయని చెప్పారు. మమతా బెనర్జీ మంగళవారం ఓ వార్తాచానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. మోదీ భయభ్రాంతులకు గురిచేసి విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ సర్కార్‌పై గళమెత్తిన వారిపై సీబీఐతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను సీబీఐ దాడులకు భయపడనని, బీజేపీని అధికారం నుంచి సాగనంపి దేశాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 125-150 స్ధానాలతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, కాంగ్రెస్‌కు సైగం 125-130 స్ధానాలు లభిస్తాయని, ప్రాంతీయ పార్టీలు జతకడితే బీజేపీ కంటే ఎక్కువ స్ధానాలు కూటమి వైపు ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
దమ్ముంటే అరెస్ట్ చేయండి
బరసత్/కన్నింగ్: పశ్చిమబెంగాల్లో బీజేపీ జైత్రయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బంగారు బెంగా ల్ను దివాళా బెంగాల్‌గా సీఎం మమత మార్చేశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పడకేసిందని విమర్శించారు. తాను బెంగాల్ గడ్డపై జైశ్రీరామ్ నినాదం ఇస్తున్నాననీ, దమ్ముంటే మమత తనను అరెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. బెంగాల్‌లోని కన్నింగ్‌లో ప్రచారంలో అమిత్ పాల్గొన్నారు. మమతకు కోపం వచ్చేస్తుంది ఇటీవల పశ్చిమ మిడ్నాపూర్‌లో ఓ సభ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చిన బీజేపీ కార్యకర్తలపై మమతా బెనర్జీ దూసుకుపోవడాన్ని షా ప్రస్తావించారు. ‘ఎవరైనా జై శ్రీరామ్ అని నినాదం ఇస్తే మమతా దీదీకి కోపం వచ్చేస్తుంది. ఈరోజు నేను జై శ్రీరామ్ నినాదం ఇస్తున్నాను. మీకు(మమత) నిజంగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. మంగళవారం కూడా నేను కోల్‌కతాలోనే ఉంటాను’ అని సవాల్ విసిరారు. జాదవ్పూర్లోని బరుయిపూర్‌లో తన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడకపోవడంతో బీజేపీ సభ రద్దు కావడంపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. కాగా బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యక్తిగత సహాయకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి నుంచి పోలీసులు రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. అసన్‌స్టోల్ రైల్వే స్టేషన్లో ఉన్న ఘోష్ సహాయకుడు గౌతమ్ చటోపాధ్యాయతోపాటు లక్ష్మీకాంత్ షా అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ–టీఎంసీ మాటలయుద్ధం బరుయిపూర్‌లో అమిత్ షా సభ రద్దుకావడంపై బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బెంగాల్లో ప్రజాస్వామ్యానికి బదులు నియంత పాలన నడుస్తోందనీ, అందుకే షా హెలికాప్టర్ ల్యాండింగ్‌తో పాటు సభకు కూడా అనుమతి ఇవ్వలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఈసీ మౌనప్రేక్షకుడిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఈ నెల 15న యూపీ సీఎం యోగి పాల్గొనే సభకు అధికారులు అనుమతి రద్దుచేశారు. -
దీదీ చెంపదెబ్బ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్
-
‘దీదీ దుర్బాషలు మాకు దీవెనలు’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. తనను దేశ ప్రధానిగా అంగీకరించనని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ప్రదాని మోదీ గురువారం బెంగాల్‌లోని బంకూరలో జరిగిన ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ దీదీ తనను దేశ ప్రధానిగా అంగీకరించనని బాహాటంగా చెబుతున్నారని అయితే ఆమె పాకిస్తాన్ ప్రధానిని మాత్రం గుర్తిస్తారని చురకలు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళనతో ఆమె రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫొని తుపాన్ ప్రభావంపై తాను బెంగాల్ సీఎంతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె నుంచి సమాధానం లేదని చెప్పుకొచ్చారు. బెంగాల్‌కు మేలు చేయడం పట్ల ఆమెకు ఆసక్తి లేదని ఆరోపించారు. దీదీ దుర్బాషలే తనకు దీవెనలుగా పనిచేస్తాయని అన్నారు. కాగా, ప్రధాని మోదీపై లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
మోదీ x దీదీ
బెంగాల్ అంటే ఎన్నికల్లో హింస, బెంగాల్ అంటే నాటు బాంబుల పేలుళ్లు, బెంగాల్ అంటే తుపాకుల రాజ్యం. ఇన్నాళ్లూ ఇదే మాట. ఈ సారి లోక్‌సభ ఎన్నికల వేళ బెంగాల్ అంటే మోదీ వర్సెస్ దీదీ అనే మాటే వినిపిస్తోంది. ఒకరు కొదమ సింహమైతే, మరొకరు రాయల్ బెంగాల్ టైగర్. వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తృణమూల్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన కామెంట్స్ బెంగాల్ రాజకీయాల్ని కుదిపేశాయి. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య జరుగుతున్న సమరం రసకందాయంలో పడింది. ఇప్పుడు ఇదే ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించే అంశంగా మారింది. ఈ నెల 6న జరిగే అయిదో దశ పోలింగ్‌లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో రెండింట్లో మాత్రమే బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు అంచనా. స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే బెంగాల్ రాష్ట్రం గురించి చెప్పిన మాట ఒకటుంది. ‘‘ఇవాళ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో, రేపు భారత్ కూడా అదే ఆలోచిస్తుంది‘‘ అంటే ఆ రాష్ట్ర ప్రజలు ఆలోచనల్లో ఎంత ముందు ఉంటారో అన్న అర్థంలో గోఖలే బెంగాల్‌ను ప్రశంసించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 42 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో చక్రం తిప్పగలిగే ఈ రాష్ట్రంలో రాజకీయపరమైన హింస, ఎన్నికల వేళ హింస, వ్యక్తిగత దూషణలు, ధనబలం, కండబలం ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడడం మొదలు పెట్టాక మతపరమైన విభజన కూడా మొదలైంది. కనీసం 22 లోక్‌సభ సీట్లలోనైనా నెగ్గాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న మోదీ, షా ద్వయం వ్యూహాలు అంత తేలిగ్గా అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తనకు తిరుగులేదని, తన మాటే శాసనమన్న నియంతృత్వ ధోరణిలో పాలిస్తున్న మమతా బెనర్జీ(దీదీ)లో ఒక కలవరమైతే తెప్పించారు. ఈ సారి ఎన్నికల పోరు టీఎంసీ, బీజేపీ మధ్యే సాగుతోంది, సీపీఎం, కాంగ్రెస్ సైడ్ ప్లేయర్లుగా మారి బిత్తర చూపులు చూస్తున్నాయి. బన్‌గావ్‌లో మార్పు కోరుతున్నారా ? భారత్, బంగ్లాదేశ్‌లకు సరిహద్దుగా ఉన్న బన్గావ్ నియోజకవర్గం (ఎస్సీ నియోజకవర్గం)లో ఎస్సీల్లో విష్ణువుని పూజించే మతువా వర్గం ఓట్లు అత్యంత కీలకం. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నట్టు స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులు, దిగుమతులు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పారిశ్రామిక పురోగతి జరగలేదు. అందుకే ఇక్కడ యువత మోదీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ‘ఎప్పుడైనా మార్పు మంచికే జరుగుతుంది. కొత్త తరం మోదీపైనే ఆశలు పెట్టుకున్నారు’ అని స్థానిక వ్యాపారులు అంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వలసలు, వారిని అక్కున చేర్చుకోవడానికి తృణమూల్ అనుసరించే బుజ్జగింపు విధానాలు ఎంత మేర ప్రభావితం చూపిస్తాయో చూడాల్సిందే. తృణమూల్ తరపు నుంచి సిట్టింగ్ ఎంపీ మమతా బాల్ ఠాకూర్ పోటీ పడుతుంటే, అదే కుటుంబానికి చెందిన శాంతను ఠాకూర్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. బ్యారక్‌పూర్‌లో కమల వికాసం ? బ్యారక్‌పూర్‌లో ఇతర రాష్ట్రాలైన యూపీ, బీహార్ నుంచి వలస వచ్చిన ఓటర్లే ఎక్కువ. ఈ సారి ఎన్నికల్లో తృణమూల్ నుంచి పార్టీ ఫిరాయించి బీజేపీ గూటికి చేరిన అర్జున్ సింగ్ బరిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఒకప్పుడు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన దినేశ్ త్రివేది పోటీ పడుతున్నారు. రాష్ట్రేతరులు ఎక్కువగా ఉండడం, పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక మిగిలిన నియోజకవర్గాలైన హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లో మోదీపై దీదీ పైచేయి సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓట్ల శాతం పెరుగుతుంది కానీ... 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17శాతం ఓటు షేరుతో 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ సారి ఓటింగ్ శాతం పెరగడం ఖాయం అన్న అంచనాలున్నాయి. అయిదు నుంచి ఏడు సీట్లు బీజేపీ గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో 15 సీట్లలో తృణమూల్‌కి గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఉత్తర బెంగాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఇక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పశ్చిమ ప్రాంతాలు, బెంగాల్‌కు సరిహద్దు ప్రాంతాల్లో బీజేపీ తన పట్టు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 42 నియోజకవర్గాలకు గాను 40 శాతం ఓటుషేర్‌తో 34 సీట్లలో నెగ్గి తన పవరేంటో చూపించిన మమతపై బెంగాల్ ప్రజలు ఎంత మమత కురిపిస్తారో చూడాల్సిందే మరి. బెంగాలీలు త్వరగా మార్పుని ఆహ్వానించలేరు బెంగాల్ ఓటర్లు మార్పుని త్వరితగతిన కోరుకోరు. వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం జెండాలు, ఎజెండాలు మారుస్తారేమో కానీ, ఓటరు రాత్రికి రాత్రి పార్టీలను మార్చడు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలవడానికే మూడు దశాబ్దాలకుపైగానే పట్టింది. ఇందుకు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ రేయింబగళ్లు కష్టపడాల్సి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కమ్యూనిజంతోనే సమాజంలో మార్పు వస్తుందన్న నమ్మకం బెంగాల్ మధ్యతరగతి ప్రజల్లో బలంగా ఉండేది. 1977లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక రాజకీయ, ఆర్థిక, ఎన్నికల ప్రణాళికకు సంబంధించి ఒక మోడల్ని సృష్టించారు. బెంగాల్ గ్రామాల్లో దున్నేవాడికే భూమిపై హక్కుల్ని కట్టబెట్టడంతో వ్యవసాయ రంగం పరుగులు పెట్టింది. అయితే పారిశ్రామిక రంగంపై మాత్రం నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అసంఘటిత రంగాలనే సీపీఎం ప్రోత్సహించింది. చిల్లర వ్యాపారులు, వీధి వ్యాపారులు, దుకాణదారులు, వారి సహాయకులు ఇలా కార్మిక శక్తినే కామ్రేడ్లు నమ్ముకున్నారు. 1990ల్లో అసంఘటిత రంగాల్లో ఉద్యోగాల రేటు ఏడాదికి 12 శాతం వరకు వెళ్లింది. కర్షక, కార్మిక శక్తులు బలపడినా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆ రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది ఏమీ లేదు. పారిశ్రామిక రంగ పురోగతి సాధించకపోవడం, చిన్న కమతాలు కలిగిన రైతుల సంఖ్య పెరిగిపోవడం వల్ల పశ్చిమ బెంగాల్ మోడల్ ఒక విఫలప్రయోగంగానే మిగిలిపోయింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా భారత్ జాతీయ సగటుకి చేరుకోలేకపోయింది. దీంతో సీపీఎం తన దారి మార్చుకొని పారిశ్రామికీకరణను బలవంతంగా అమలు చేయడం మొదలు పెట్టింది. అదే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత దీదీ ఒక అస్త్రంలా మార్చుకొని పోరు బాట పట్టారు. సింగూర్ ఆందోళనలు జనంలో ఆమె ఇమేజ్ను పెంచాయి. ఫలితం బెంగాల్లో ఎర్రకోట బీటలు వారింది. 2011లో తొలిసారిగా అధికారం చేపట్టిన దీదీ తనపైనున్న సింగూర్ ఇమేజ్‌ని చెరిపేసుకోలేక, కొత్త విధానాలు అమలు చెయ్యలేక కొంతకాలం సతమతమయ్యారు. ఆ తర్వాత మార్క్సిస్టుల బాటలో నడవక తప్పలేదు. బడా బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారు. ముఖేశ్ అంబానీ వంటి వారు ఆ రాష్ట్రాన్ని ‘వెస్ట్ బెంగాల్ ఈజ్ బెస్ట్ బెంగాల్’ అనేలా పారిశ్రామిక విధానాలు సరళతరం చేశారు. ఎన్నికల మోడల్ సూపర్ హిట్ పరిపాలనలో చతికిలపడినా ఎన్నికల ప్రణాళికలో సీపీఎం అనుసరించిన విధానాలు సక్సెస్ అయ్యాయి. 1990లలో సీపీఎంకి కార్యకర్తల బలం ఎంత ఉందంటే, అప్పట్లో బెంగాల్లో ఓటర్ల సంఖ్య 4 కోట్లు ఉంటే, దాదాపుగా 20 లక్షల మంది సీపీఎం కార్యకర్తలే ఎన్నికల్లో పనిచేసేవారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అంతకు అంత కార్యకర్తల అండదండ సంపాదించింది. అయితే ఇదంతా అధికార దర్పంతో, నియంతృత్వ విధానాలతోనే సాధించారు. రాష్ట్రంలో ఆరెస్సెస్ చాలా కాలంగా పనిచేస్తున్నప్పటికీ కమలనాథులు తృణమూల్ పార్టీ స్థాయిలో బలపడలేదు. కానీ మతపరమైన విభజన రేఖ గీయడంలో విజయం సాధించారు. అదే ఇప్పుడు ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతోంది. ముస్లిం ఓటర్లే కీలకం పశ్చిమ బెంగాల్ ఓటర్లలో 27శాతం ముస్లింలే. 28 లోక్‌సభ స్థానాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. సీపీఎం ఓటు బ్యాంకు అటూ ఇటూ మళ్లిందేమో కానీ, ముస్లింలు మాత్రం దీదీ వైపే ఉన్నారు. ఆమె పాలనలోనే వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారు ‘‘ముస్లింలు ఇప్పుడు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. టీఎంసీలో కూడా స్థానికంగా నాయకత్వం వహిస్తున్నారు’’ అని ప్రశాంత చటోపాధ్యాయ అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు. నదీ తీరంలో రాజకీయాలు ఏ మలుపు తిప్పుతాయి? ఈ నెల 6న జరగనున్న అయిదో దశ పోలింగ్‌లో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అయిదు హుగ్లీ నదికి చెరోవైపున విస్తరించి ఉన్నాయి. బన్గావ్, బ్యారక్‌పూర్, హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లలో పోలింగ్ జరగనుంది. వీటిలో ఉత్తర 24 పరగణా జిల్లాలకు సరిహద్దుగా ఉన్న బన్గావ్, బ్యారక్పూర్లలో మతపరమైన హింస చెలరేగిన చోట బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టుగా అంచనా. మమతఠాకూర్, శాంతను ఠాకూర్, అర్జున్ సింగ్, దినేశ్ త్రివేది -
టచ్‌లో 40 ఎమ్మెల్యేలు
శ్రీరామ్‌పూర్/కొదెర్మా: బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాని మోదీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాగానే టీఎంసీ నుంచి వీరంతా బయటకొస్తారన్నారు.బెంగాల్,జార్ఖండ్‌లో ప్రచారంలో పాల్గొన్న మోదీ, విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయొద్దు.. పశ్చిమబెంగాల్లో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పునాదులు కదలిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధాని పీఠంపై మమత కన్నేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘దీదీ.. కేవలం కొన్ని సీట్లతో మీరు ఢిల్లీని చేరుకోలేరు. ఢిల్లీ చాలాదూరంలో ఉంది. ఢిల్లీ పీఠంపై మమత దృష్టి పెట్టారన్నది ఎంతమాత్రం నిజం కాదు. వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో తన మేనల్లుడు అభిషేక్‌ను సుస్థిరం చేసేందుకు మమత ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని మమతకు అర్థమైంది. అందుకే ఆమె తరచూ సహనాన్ని కోల్పోతున్నారు’ అని మోదీ తెలిపారు. అభిషేక్ ప్రస్తుతం డైమండ్ హార్బర్ లోక్ సభ సీటు నుంచి పోటీచేస్తున్నారు. అలాగే బెంగాల్లో ఎన్నికల హింసపై మోదీ స్పందిస్తూ.. ‘మమతా దీదీ.. మీ గూండాలు ప్రజలను ఓటేయకుండా అడ్డుకుంటున్నారు. మీరు ఇప్పుడు కూర్చుంటున్న సీఎం కుర్చీని ప్రజాస్వామ్యమే ఇచ్చింది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయవద్దు. ఎవరికి ఓటేయాలో బెంగాల్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజలు మోదీకి ఓటేయరనీ, అవసరమైతే రాళ్లు, మట్టితో చేసిన రసగుల్లాలు విసిరి పళ్లు విరగ్గొడతారని మమత విమర్శలపై మోదీ స్పందించారు. ‘అది(మట్టి–రాళ్లు) నాకు ప్రసాదం లాంటివి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఠాకూర్ వంటి మహనీయులు పుట్టిన పవిత్రమైన బెంగాల్ నేల నుంచి వచ్చిన రాళ్లు, మట్టిని వినమ్రంగా స్వీకరిస్తా. మమత చెప్పిన మట్టి రసగుల్లాల్లో రాళ్లను కూడా నేను స్వాగతిస్తున్నా. నాపైకి ఎన్ని రాళ్లున్న రసగుల్లాలు వస్తాయో, టీఎంసీ గూండాల చేతిలో బెంగాల్ ప్రజలకు అన్ని దెబ్బలు తప్పుతాయి’ అని అన్నారు. కౌన్సిలర్ కూడా వెళ్లడు: టీఎంసీ 40 మంది తమ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలపై టీఎంసీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ‘పదవీకాలం ముగిసిపోతున్న ప్రధాని బాబూ.. ఓ విషయం అర్థం చేసుకోండి. మీతో ఎవ్వరూ రావట్లేదు. ఎమ్మెల్యేలు తర్వాత సంగతి.. మా పార్టీ నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా మీతో రాడు. మీ సమయం ముగిసిపోయింది. మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? లేక మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారా? ఈ విషయంలో మేం ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’ అని తెలిపారు. -
అధికార యంత్రాంగంతో విపక్షాల అణచివేత
జల్పాయిగురి/ఫలాకటా: ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం సంస్థలను, అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తమ కేబినెట్ కార్యదర్శిని గానీ, హోం శాఖ కార్యదర్శిని గానీ ఎందుకు తొలగించడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం(ఈసీ) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆమె ‘రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది? ఏపీ చీఫ్ సెక్రటరీని ఎందుకు తొలగించారు? అని నిలదీశారు. ‘మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కుటుంబంపై దాడులు చేయించారు. ఏపీ సీఎంపైనా దాడి చేయించారు. ఆదాయపన్ను శాఖ, సీబీఐ అధికారులను, సంస్థలను బీజేపీ ప్రభుత్వం స్వార్థం కోసం వాడుకుంటోంది’ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో అధికారుల తొలగింపుపై ఆమె స్పందిస్తూ.. ‘ఓటమి భయంతోనే వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారు ఎంతగా అధికారులను మారిస్తే, అంతగా మాకు విజయావకాశాలు మెరుగవుతాయి’ అని అన్నారు. తనను చూసి మమతా భయపడుతున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘నిజానికి నన్ను చూసి మోదీ భయపడుతున్నారు. నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టాలని చూస్తే, అంతగా ఎదురు తిరిగి గర్జిస్తాం. ఈ దీదీ ఎవరికీ, దేనికీ భయపడేది కాదు’ అని తీవ్ర స్వరంతో అన్నారు. ప్రధాని మోదీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదనీ, కనీసం రాష్ట్రం పేరును కూడా మార్చేందుకు అనుమతివ్వలేదని ఆరోపించారు. మాకు పూర్తి అధికారాలున్నాయి: ఈసీ మమతా విమర్శలపై ఈసీ స్పందించింది. స్పెషల్ పోలీస్ పరిశీలకులు, ఇతర ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం మేరకే అధికారులను మార్చినట్లు తెలిపింది. ఎన్నికల నిబంధనావళి మేరకు ఈ విషయంలో తమకు పూర్తి అధికారాలున్నాయని స్పష్టం చేసింది. తొలగించిన స్థానాల్లోనూ సమర్థులైన అధికారులను నియమిస్తున్నట్లు పేర్కొంది. -
విడగొట్టేవారితో దీదీ దోస్తీ
కూచ్‌బెహర్/ఉదయ్‌పూర్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భారత్‌ను విడగొట్టాలనీ, దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండాలని చెప్పేవారితో మమత చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను స్పీడ్ బ్రేకర్లా మమతా బెనర్జీ ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనీ, అందువల్లే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ విపక్షాల వ్యవహారశైలిని తప్పుపట్టారు. బెంగాల్ ప్రతిష్టను దిగజార్చారు.. బెంగాల్‌లోని కూచ్ బెహర్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రాజెక్టులను ఈ ప్రాంతానికి మంజూరు చేసినప్పటికీ మమత అడ్డుకున్నారని ఆరోపించారు. ‘శారదా, రోజ్ వ్యాలీ, నారదా చిట్‌ఫండ్ కుంభకోణాలతో దీదీ(మమత) బెంగాల్ ప్రతిష్టను దిగజార్చారు. దోపిడీ చేసిన ప్రతీ పైసాకు ఈ చౌకీదార్(కాపలాదారు) లెక్కలు అడుగుతాడు. మోదీ.. మోదీ అనే నినాదాలతో ఈ బెంగాల్ స్పీడ్ బ్రేకర్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎన్నికల సంఘంపై మమత కోప్పడటం పశ్చిమబెంగాల్లో ఆమె రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయని చెప్పేందుకు నిదర్శనం’ అని మోదీ తెలిపారు. భారత్, కశ్మీర్‌కు వేర్వేరుగా ప్రధానులు ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇటీవల చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. దేశాన్ని ముక్కలుముక్కలు చేయాలనుకునే ఇలాంటి వ్యక్తులతో మమత చేతులు కలుపుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యల ద్వారా మమత భారత్‌లో కశ్మీర్ విలీనానికి పాటుపడ్డ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి దిగ్గజ నేతల త్యాగాలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొరబాటుదారులకు ఆశ్రయం.. విదేశీ చొరబాటుదారులకు ఆశ్రయమివ్వడం ద్వారా మమత కేంద్రాన్ని మోసం చేశారని మండిపడ్డారు. ‘ఇలాంటి అక్రమ చొరబాటుదారుల్ని దేశం నుంచి తరిమివేయడానికి ఈ చౌకీదార్ జాతీయ పౌర, పౌరసత్వ రిజిస్టర్ బిల్లును తీసుకొచ్చాడు. కానీ మమత తన మహాకల్తీకూటమి మిత్రపక్షాలతో కలిసి కేంద్రాన్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్తా–అల్లుడి ప్రభుత్వం(మమతా బెనర్జీ–అభిషేక్ బెనర్జీ) ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని చొరబాటుదారులకు స్వర్గంగా మార్చేసింది’ అని విమర్శించారు. 7వ వేతన సంఘం సిఫార్స్‌లను బెంగాల్లో ఎందుకు అమలు చేయడం లేదో మమత చెప్పారా? అని ప్రజలను మోదీ ప్రశ్నించారు ఏపీ నుంచి రాహుల్ పోటీచేయొచ్చు కదా! కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. త్రిపురలోని ఉదయ్‌పూర్ సభలో మాట్లాడుతూ..‘25 ఏళ్ల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి త్రిపుర దేశానికి ఆదర్శంగా నిలిచింది. బీజేపీని నమ్మి గెలిపించినందుకు నేను త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నా. విపక్షాలు నన్ను అధికారం నుంచి తప్పించేందుకు ఎంతకైనా తెగిస్తాయి. అవసరమైతే పాకిస్తాన్‌కు భజన చేసేందుకు కూడా వెనుకాడవు. త్రిపురలో అధికారం కోసం పోరాడుతున్న కాంగ్రెస్, వామపక్షాలు కేంద్రంలో మాత్రం ఏకమవుతున్నారు. వామపక్షాల సహకారం లేకుంటే రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? దక్షిణాది నుంచే పోటీచేయాలనుకుంటే పాండిచ్చేరి, కర్ణాటకలు కూడా ఉన్నాయి కదా. మరీ అంతగా కావాలనుకుంటే ఏపీకి కూడా రాహుల్ వెళ్లొచ్చు. అక్కడ కాంగ్రెస్ ఇటీవల యూటర్న్ బాబు(చంద్రబాబు)తో చేతులు కలిపింది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2014 నుంచి ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగిన టీడీపీ గతేడాది మార్చిలో కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే త్రిపురలో ఏడాది కాలంలోనే బిప్లవ్ దేబ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి పనులు చేపట్టిందనీ, మౌలిక సదుపాయాలు కల్పించిందని మోదీ కితాబిచ్చారు. త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11, 18 తేదీల్లో పోలింగ్ జరగనుంది. -
నటులే బాగా చక్కబెట్టగలరట!
సినీ గ్లామర్ ఓట్లు సాధిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఆ నమ్మకంతోనే ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన 42 మంది అభ్యర్థుల్లో ఐదుగురు సినీ నటులను బరిలోకి దించారు. ఈ ఐదుగురిలో నలుగురు హీరోయిన్లు. ♦ జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను హీరోయిన్ మిమి చక్రవర్తికి ఇచ్చారు. క్రిస్‌కాస్, విలన్, టోటల్ దాదాగిరి వంటి హిట్ సినిమాల్లో మిమి నటించారు. ♦ జుల్ఫికర్, లవ్ ఎక్స్‌ప్రెస్, కెలార్ కీర్తి వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న నస్రత్ జహాన్‌ను బసిర్హాత్ నియోజకవర్గం అభ్యర్థిగా ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దున ఉన్న ఈ నియోజకవర్గం మతపరంగా సున్నితమైనది. ♦ గత ఎన్నికల్లో తృణమూల్ తరఫున పోటీ చేసిన దేవ్, మూన్‌మూన్ సేన్‌కు ఈసారీ టికెట్లు ఇచ్చారు. నటులే బాగా చక్కబెట్టగలరట! ఎందుకింత మంది సినిమా వాళ్లకి అందులోనూ హీరోయిన్లకి టికెట్లిచ్చారని అడిగితే ఎందుకివ్వకూడదని ఎదురు ప్రశ్నిస్తున్నారు మమత. వాళ్లు ఇంటా బయటా బాగా చక్కబెట్టగలరని సమర్థించారు. నస్రత్ జహాన్ కూడా ఇదే అంటున్నారు. ‘ఈ రోజుల్లో మహిళలు శక్తిమంతులయ్యారు. వారు సాధించలేనిదంటూ ఏమీ లేదు. మా వృత్తిలో మేం ఎంత జాగ్రత్తగా ఉంటామో, ప్రజల విషయంలోనూ అలాగే ఉంటాం’ అన్నారామె. ఇదంతా మమత ఎన్నికల రాజకీయ వ్యూహమని విపక్షాలు, ప్రత్యర్థులే కాకుండా సొంత పార్టీ నేతలూ అంటున్నారు. సినిమా స్టార్లంటే అందరికీ ఆకర్షణే. ఓట్లు రాబట్టడంతో వారి గ్లామర్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. సినీ స్టార్లకు టికెట్ ఇస్తే పార్టీలో ఎవరూ వ్యతిరేకించరు. టికెట్ల కోసం పార్టీలో జరిగే కుమ్ములాటలకు ఇలా తెరవేయవచ్చు అని వారంటున్నారు. వాళ్లు నెగ్గితే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని, ఒకవేళ ఓడిపోయినా ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు ఓటర్లను బాగా ఆకట్టుకోగలరని తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. పార్టీకి ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారిని కాదని ఇలా సినిమా వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ శ్రేణులు బాధపడవా అంటే పడవని సమాధానం చెప్పారు. సినిమా వాళ్లకు టికెట్లిచ్చినందుకు ఇప్పటి దాకా పార్టీలో ఎక్కడా అసంతృప్తి వ్యక్తం కాలేదని తృణమూల్ ఎంపీ స్పష్టం చేశారు. -
‘రైళ్లలో డబ్బు తరలిస్తున్నారు’
కోల్‌కతా : బీజేపీ నేతలు తమ పార్టీ నేతలను కొనుగోలు చేసేందుకు రైళ్లలో డబ్బు తీసుకొస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ నేతలతో బీజేపీ నేరుగా బేరసారాలు జరుపుతోందని, డబ్బు ఎంత కావాలో తీసుకుని బీజేపీలో చేరిపోవాలని ప్రలోభాలకు గురిచేస్తోందని మండిపడ్డారు. తృణమూల్ కోర్ కమిటీ భేటీలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రైళ్లలో పెద్ద ఎత్తున నగదును బెంగాల్‌కు తరలిస్తూ ఓటర్లకు పంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనిపై తన వద్ద పక్కాగా ఆధారాలున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇవే చివరిరోజులని, లోక్‌సభ ఎన్నికల అనంతరం తిరిగి మోదీ సర్కార్ ఏర్పాటయ్యే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. పుల్వామా ఘటనను బూచిగా చూపుతూ పాకిస్తాన్‌తో యుద్ధం పేరుతో ప్రదాని మోదీ ప్రజల జీవితాలతో చెలగాటమాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
‘అవినీతిపరులకు దీదీ వత్తాసు’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవినీతిపరుల కొమ్ము కాస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పేదల సొమ్మును లూటీ చేసిన వారిని సమర్దిస్తూ ఆమె ధర్నా చేపట్టారని ధ్వజమెత్తారు. అవినీతిపరులను కాపాడేందుకు తొలిసారిగా ఓ సీఎం ధర్నా చేశారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. దీదీ ప్రభుత్వం కమ్యూనిస్టుల బాటలో పయనిస్తోందన్నారు. కమ్యూనిస్టులకు బీ టీమ్‌గా తృణమూల్ కాంగ్రెస్ తయారైందన్నారు. బెంగాల్ ప్రజలను, ఇక్కడి మధ్యతరగతి, పేదలను దళారీలకు వదిలేసిన ఆమె ప్రధాని పదవిపై కన్నేశారని విమర్శించారు. జల్పాయిగురి జిల్లాలో శుక్రవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ మమతా సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. కోల్‌కతా పోలీస్ కమీషనర్ నివాసంపై సీబీఐ దాడులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ధర్నాతో రాజకీయ దుమారం నెలకొన్న అనంతరం ప్రధాని బెంగాల్లో పాల్గొన్న తొలి ర్యాలీ ఇదే కావడం గమనార్హం. మమతా సారథ్యంలోని తృణమూల్ ప్రభుత్వం చొరబాటుదారులను స్వాగతిస్తూ బీజేపీ నేతలను రాష్ట్రంలో పర్యటించకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీ అంటే తృణమూల్ ఉలికిపాటుకు ఇదే సంకేతమన్నారు. స్కామ్స్టర్లను కాపాడే వారెవరినీ తాను విడిచిపెట్టనని హెచ్చరించారు. సిద్ధాంత వైరుధ్యాలు కలిగిన పార్టీలు మహాకూటమి అంటూ ప్రజల ముందుకొచ్చాయన్నారు. త్రిపురలో ఎర్రజెండాను నామరూపాల్లేకుండా చేసిన బీజేపీ పశ్చిమ బెంగాల్లోనూ అదే జోరును పునరావృతం చేస్తుందన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్‌తో బెంగాల్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. వారికి పేదల ప్రజల సంక్షేమంపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. ఉత్తర బెంగాల్లో నానాటికీ శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా జల్పాయిగురిలో హైకోర్టు సర్క్యూట్ బెంచ్‌ను ప్రధాని ప్రారంభించారు. 31వ జాతీయ రహదారిపై నాలుగు వరసల రహదారి పనులకు శంకుస్దాపన చేశారు. -
ధర్నా విరమించిన దీదీ
-
ధర్నా విరమించిన మమతా బెనర్జీ
కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని సీబీఐ తీరును వ్యతిరేకిస్తూ మూడు రోజుల పాటు తాను చేపట్టిన దీక్ష రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ అధికారుల దాడులను నిరసిస్తూ ఆమె చేపట్టిన దీక్షను మంగళవారం సాయంత్రం విరమించారు. సీబీఐ ఉదంతంలో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించిందని, వచ్చే వారం ఈ అంశాన్ని తాము ఢిల్లీలో జాతీయ స్ధాయిలో లేవనెత్తుతామని చెప్పారు. ఓ పోలీస్ అధికారి అంటే కేంద్రం ఎందుకు భయపడుతోందని ఆమె ప్రశ్నించారు. సుప్రీం కోర్టు నేడు సానుకూల తీర్పు ఇచ్చిందన్నారు. కాగా సీబీఐ విచారణకు హాజరు కావాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. శారదా చిట్‌ఫండ్ స్కాం, రోజ్‌వ్యాలీ కుంభకోణం కేసులకు సంబంధించి ప్రశ్నించేందుకు ఆదివారం సాయంత్రం కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులను ఆయన నివాసం ఎదుటే కోల్‌కతా పోలీసులు అడ్డగించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
తృణమూల్‌తో దోస్తీపై నవీన్ పట్నాయక్ వివరణ
భువనేశ్వర్ : గత ఏడాదిగా బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి సంప్రదింపులూ లేవని ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో రాజకీయంగా కలిసి నడవాలని తాను భావించడం లేదన్నారు. సీబీఐ వ్యవహారశైలిపై తాము ఒడిషాలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగానే వ్యాఖ్యలు చేశామని, సీబీఐ వృత్తిపరమైన విధులు నిర్వహించాలని, రాజకీయేతంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించామని ఆయన చెప్పుకొచ్చారు. సీబీఐ తీరుపై తమ వైఖరిని తృణమూల్‌తో, మరో ఇతర రాజకీయ పార్టీతో ముడిపెట్టరాదని బీజేడీ పేర్కొంది. కాగా బీజేడీ ప్రకటనను ఒడిషాలో సీబీఐ పాత్ర పరిధిలో చూడాలని బీజేపీ వ్యాఖ్యానించడం గమనార్హం. సీబీఐ వ్యవహారంపై బీజేడీ చేసిన ప్రకటన నేపథ్యంలో తమ పార్టీని తృణమూల్ సహా ఇతర పార్టీలకు వత్తాసు పలికినట్టుగా చూడటం వాస్తవవిరుద్ధమని, తప్పుదారిపట్టించడమేనని బీజేడీ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. -
కోల్‌కతా బీజేపీ కార్యాలయంపై దాడి
కోల్‌కతా : మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం తీవ్రమైంది. బీజేపీ, తృణమూల్ నేతలు పరస్పర ఆరోపణలతో తలపడుతుంటే సోమవారం కోల్‌కతాలో బీజేపీ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. పాలక తృణమూల్ కార్యకర్తలే తమ కార్యాలయంపై దాడికి తెగబడ్డారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం తమపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడులను వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ ఢిల్లీలో దీక్షకు దిగడంతో పరిస్ధితి వేడెక్కింది. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీని కలిసింది. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేసింది. సీబీఐ వివాదం నేపథ్యంలో విపక్షాలు మమతా బెనర్జీకి బాసటగా నిలవగా అవినీతిని ప్రతిపక్షాలు సమర్ధిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు అవినీతి ఆరోపణలున్న వారిని విచారించడం నేరమా అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. -
పార్లమెంట్లో సీబీఐ ప్రకంపనలు.. సభ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీఎంసీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు. దీంతో సభా సమావేశాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం రాజకీయ కక్షసారింపు చర్యలు సరికావని కేంద్రానికి వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీలు నినాదాలు చేశారు. తృణమూల్‌కు మద్దతుగా విపక్షాలు కూడా ఆందోళన బాటపట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభను మధ్యాహ్నాం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. కాగా బెంగాల్లో సీబీఐ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వార్ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. -
తృణమూల్ ఎంపీ ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
సాక్షి, కోల్‌కతా : పోంజి స్కామ్‌కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కేడీ సింగ్‌కు చెందిన రూ 238 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సోమవారం సీజ్ చేసింది. కుఫ్రిలోని రిసార్ట్, చండీగఢ్‌లో ఓ షోరూమ్‌తో పాటు హర్యానాలో ఎంపీకి చెందిన పలు ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఎంపీ సింగ్‌కు చెందిన పలు బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపచేశారు. రూ 1900 కోట్ల ఈ కుంభకోణంలో సింగ్ పాత్రపై గత కొంత కాలంగా ఈడీ దృష్టి సారించింది. 2016 సెప్టెంబర్ నుంచి సింగ్‌తో పాటు ఆయనకు చెందిన అల్కెమిస్ట్ ఇన్ఫ్రా రియల్టీ లిమిటెడ్‌పై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా పెట్టుబడులను సమీకరించే స్కీమ్‌ను ప్రారంభించిందని 2015 నుంచి రూ 1916 కోట్లను చట్టవిరుద్ధంగా సేకరించిందని సెబీ, ఈడీ ఆరోపిస్తున్నాయి. సెబీ అనుమతి లేకుండానే ఈ సంస్ధ పెట్టుబడులను సేకరించే స్కీమ్‌ను ప్రారంభించిందని, మదుపుదారులను మోసగించిందని దర్యాప్తు ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. 2016లోనే ఈ కంపెనీపై సెబీ పటియాలా హౌస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటినుంచి కంపెనీ అధికారులను ప్రశ్నిస్తున్న ఈడీ తన విచారణలో భాగంగా ఈ కార్యకలాపాల వెనుక తృణమూల్ ఎంపీ సింగ్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారని తేల్చింది. -
ఆ ర్యాలీకి నిధులెక్కడివి..?
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ శనివారం విపక్షాలతో కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ర్యాలీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ ఘాటుగా స్పందించింది. ఈ భారీ ర్యాలీకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్టు పేర్కొంది. ఈ మెగా ర్యాలీకి రూ కోట్లలో వెచ్చించారని, అడుగడుగునా కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, వందలాది వాహనాలు సమకూర్చారని వీటన్నింటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు తృణమూల్ కాంగ్రెస్ బదులివ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ తాము ఈసీకి లేఖ రాస్తామని చెప్పారు. ప్రజలు తిరస్కరించిన నేతలతో తృణమూల్ చేతులు కలిపిందని విపక్షాల ర్యాలీని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీలకు బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని వ్యాఖ్యానించారు. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన మాయావతి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం విడ్డూరమని పేర్కొన్నారు. -
బీజేపీకి గుడ్‌బై చెప్పేసి... తృణమూల్ గూటికి
కోల్‌కతా : సీనియర్ జర్నలిస్ట్, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన చందన్ మిత్రా బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈనెల 21న మిత్రా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిత్రా బీజేపీ చీఫ్ అమిత్ షాకు తన రాజీనామా లేఖను అందచేశారని, ఈనెల 21న ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని మిత్రా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. జులై 21న తృణమూల్ భారీఎత్తున షాహిద్ దివస్‌ను నిర్వహించనున్న క్రమంలో బెంగాల్ సీఎం, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో మిత్రా ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి సన్నిహిత సహచరుడిగా పేరొందిన మిత్రా నరేంద్ర మోదీ- అమిత్ షా ద్వయం తనను పక్కనపెట్టడం పట్ల తీవ్ర అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పయనీర్ పత్రిక ఎడిటర్ అయిన చందన్ మిత్రా 2003 నుంచి 2009 వరకూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2010లో మరోసారి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీతో పలు అంశాల్లో ఇటీవల మిత్రా విభేదించడంతో సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు ఆయనను ట్రోల్ చేశాయి. -
జమిలీ ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాలు
-
జమిలి ఎన్నికలు.. వివిధ పార్టీల అభిప్రాయం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రంలోని లోక్‌సభకు, రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రాతిపదనపై లా కమిషన్ శనివారం వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. జమిలీ ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మెజారిటీ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యపడబోవని అభిప్రాయపడ్డాయి. లా కమిషన్‌తో సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, గోవా ఫార్వర్డ్ పార్టీల నేతలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి విఘాతమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు సాధ్యం కావు అని, రాజ్యాంగపరంగా ఇది వీలు కాదని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బేనర్జీ అభిప్రాయపడ్డారు. జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని గోవా ఫార్వర్డ్ పార్టీ నేత విజయ్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఇక, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే జమిలి ఎన్నికలపై ఒకింత భిన్నంగా స్పందించింది. జమిలి ఎన్నికలు 2019లో సాధ్యం కావని, అదే 2024లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. అందుకు తాము సిద్ధమని పేర్కొంది. -
ఎన్నికలకు ముందే మమత విజయం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ సీఎం మమత బెనర్జీ మరోసారి తన సత్తా చూపించారు. మే 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల నామినేషన్ గడువు శనివారంతో ముగియడంతో ఎన్నికల కమిషన్ నామినేషన్లకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. మొత్తం 58,692 పంచాయతీ స్థానాలకుగాను 20,000 పంచాయతీల్లో విపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించినట్లయింది. రాష్ట్ర చరిత్రలో ఇంత మొత్తంలో సీట్లు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. గతంలో వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 11 శాతం సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాష్ట్రంలో టీఎంసీ కార్యకర్తలు విపక్ష అభ్యర్థులను నామినేషన్ వేయకుండా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని బీజేపీ, లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. టీఎంసీ కార్యకర్తల చర్యలకు భయపడి అభ్యర్థులు నామినేషన్ వేయడానికి భయపడ్డారని, తృణమూల్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ ఆధీర్ రాజన్ చౌదరీ విమర్శించారు. టీఎంసీ నేతలు సామాన్యుల రాజకీయ హక్కును హరిస్తున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల బీర్బూమ్‌లో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయలైన విషయం తెలిసిందే. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మొత్తం 58,693 స్థానాలకుగాను అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి 72,000, బీజేపీ నుంచి 35,000, వామపక్ష పార్టీల నుంచి 22,000, కాంగ్రెస్ నుంచి 10,000 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికలు మొదటి నుంచి వివాదాస్పదంగానే మారాయి. నామినేషన్ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును కూడా ఆశ్రయించాయి. దీనితో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఎన్నికల కమిషన్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, హైకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఉల్లంఘించిందని లోకసభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ విమర్శించారు. -
మమతా బెనర్జీపై బీజేపీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
అగర్తల: బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మతి చెడిందని.. పిచ్చాసుపత్రిలో చేరాలంటూ విప్లవ్ వ్యాఖ్యానించారు. ‘మమతా బెనర్జీకి మతి చెడినట్లుంది. ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటే మంచిది. ఆమె మాటలు తెలివితక్కువగా ఉన్నాయి’అని విప్లవ్ పేర్కొన్నారు. అంతేకాదు గుళ్లూ, గోపురాలు సందర్శిస్తే ఆమె మానసిక స్థితి బాగుపడొచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ ఇంటర్యూలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘బీజేపీవంటి జాతీయ పార్టీ త్రిపుర లాంటి చిన్న రాష్ట్రంలో విజయం సాధించడంలో గొప్పేముందని.. అవి మున్సిపల్ ఎన్నికలు’ అని పేర్కొన్నారు. దీంతో విప్లవ్ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. కాగా, త్రిపురలో రెండున్నర దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం బీజేపీ 35 సీట్లను కైవసం చేసుకుంది. -
స్టాలిన్‌తో మమత మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకం చేసే పనిలో నిమగ్నమైన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో ఫోన్లో చర్చలు జరిపారు. ఎన్డీఏపై పార్లమెంట్ లోపల, వెలుపల సమిష్టి కార్యాచరణతో పోరాడటంపై ఇరువురు నేతలు చర్చించారు. భావసారూప్య పార్టీలతో సంప్రదింపులు జరిపి బీజేపీ ఓటమి లక్ష్యంగా వాటిని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఫోన్లో సంప్రదించిన మీదట మమతా బెనర్జీ..స్టాలిన్‌తోనూ మాట్లాడారన్నారు. పార్లమెంట్లో సోమవారం పలు అంశాలపై టీఆర్ఎస్, టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, డీఎంకే సభ్యుల మధ్య మెరుగైన సమన్వయం నెలకొందని చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ముకుల్ రాయ్‌తో మోదీకి ఒరిగేదేమిటీ?
సాక్షి, కోల్‌కతా : దుర్గా మాతా ఉత్సవాలు శనివారం నాడు ముగియగానే తాను తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ ప్రకటించగానే ఆయనపై పార్టీ అధిష్టానం చర్య తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆయన్ని ఆరేళ్ల పాటు బహిష్కరించింది. ఇవన్నీ కూడా ముందుగానే ఊహించిన పరిణామాలే. గత కొంతకాలంగా బీజేపీ అధినాయత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్న ముకుల్ రాయ్ త్వరలోనే ఆ పార్టీలో చేరుతారన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. శారదా చిట్‌ఫండ్ కంపెనీ స్కామ్‌లో ఇరుక్కుని సీబీఐ చేతిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముకుల్ రాయ్‌కి గాలంవేస్తే ఇట్టే పడిపోతారన్న విషయాన్ని గ్రహించిన బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ వస్తోంది. బెంగాల్ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలను మోసం చేసిన చిట్‌ఫండ్ కేసులో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ముకుల్ రాయ్, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బీజేపీ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీ వెన్నంటి ఉన్న ఆయన ఎప్పటికప్పుడు తణమూల్ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని బీజేపీకి చేరవేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే తాను రాజ్యసభకు రాజీనామా చేయబోతున్నానని ప్రకటించారు. ఎలాగు ఆయన బీజేపీలో చేరేందుకే పార్టీ వీడుతున్నారన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన తణమూల్ ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయన నిర్వహిస్తున్న పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఈ నెల 20వ తేదీనే తెలివిగా రద్దు చేసింది. 1998లో తణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ముకుల్ రాయ్ మమతా బెనర్జీతోనే ఉన్నారు. 2007లో సింగూరు, నందిగ్రామ్ పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం రైతుల భూములను స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పార్టీ ఆందోళనను నడిపించడంలో మమతతోపాటు ముందున్నారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల వామపక్షాల ప్రభుత్వాన్ని కూలదోయడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బలంగా వీచిన పవనాలను అడ్డుకొని 42 సీట్లకుగాను 34 పార్లమెంట్ సీట్లను పార్టీ కైవసం చేసుకోవడంలో కీలక భూమికను పోషించారు. 2006లో ఎగువ సభకు ఎన్నికైన ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో షిప్పింగ్, రైల్వే శాఖల్లో సహాయ మంత్రిగా పనిచేశారు. 2016లో జరిగిన ఎన్నికల్లో కూడా ముకుల్ రాయ్ పార్టీ విజయానికి తీవ్రంగా కషి చేశారు. అదే ఎన్నికల్లో మున్నెన్నడు లేనివిధంగా బీజేపీకి కూడా 10.2 శాతం ఓట్లు రావడంతో ఆ పార్టీకి కూడా కొత్త ఆశలు చిగురించాయి. ముకుల్ రాయ్ లాంటి నాయకులను పార్టీలోకి లాక్కుంటే పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని భావించిన బీజేపీ అందుకు అనుగుణంగా పార్టీలోకి తణమూల్ నేతలకు ఆహ్వానం పలికింది. అయితే ఎవరూ ముందుకు రాలేదు. కేసులో ఇరుక్కోవడం వల్ల ముకుల్ రాయ్ ముందుకు వచ్చారు. మమత వెన్నంటి ఉండి పార్టీని విజయపథాన నడిపించడంలో ఎంత కీలక పాత్ర వహించినప్పటికీ ప్రజల్లో మమతా బెనర్జీకున్న పలుకుబడి ముకుల్ రాయ్‌కు లేదు. పైగా ఆయన మాస్ లీడర్ కారు. పైగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ముకుల్ రాయ్ బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండదు. బీజేపీ ఇలాంటి నేతలపై ఆధారపడడం కన్నా పార్టీని పునాదుల స్థాయి నుంచి బలోపేతం చేయడం పట్ల దష్టిని కేంద్రీకరించడం మంచిది. -
స్థానిక ఎన్నికల్లో తృణమూల్ హవా
కోల్‌కతాః స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. ఈనెల 13న పశ్చిమ బెంగాల్లో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ప్రతిపక్షాలు దరిదాపుల్లో లేకుండాపోయాయి. మొత్తం 148 వార్డులకు 140 వార్డులను తృణమూల్ గెలుచుకోగా బీజేపీ ఆరింటిని, వామపక్షాలు, ఇండిపెండెంట్లు చెరొకటి గెలుచుకున్నాయి. కాగా గూర్ఖా జన్ముక్తి మోర్చాకు గట్టి పట్టున్న ఉత్తర బెంగాల్లో ప్రాబల్యం కోసం పాలక తృణమూల్ సాగించిన ప్రయత్నాలు కొంతమేర ఫలించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరో వైపు కాంగ్రెస్, వామపక్షాలకు దీటుగా బీజేపీ ఆరు వార్డుల్లో గెలుపొంది, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంతో కమలనాథులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో బెంగాల్లో పార్టీ విస్తరణకు పూనుకునేందుకు బీజేపీకి స్ధానిక ఫలితాలు టానిక్‌లా పని చేస్తాయని చెబుతున్నారు. -
వాళ్లను పోలింగ్ బూత్ నుంచి తరిమికొట్టండి!
పశ్చిమ బెంగాల్: ప్రత్యర్ధి పార్టీ నాయకులను పోలింగ్ బూతుల నుంచి బయటకు లాగి చితక్కొట్టాలని కార్యకర్తలకు ఫోన్ ద్వారా చెప్తూ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధి సోనాలి గుహా చిక్కుల్లో పడ్డారు. సత్గాచియా ప్రాంతంలోని పోలింగ్ బూతులో ఈవీఎం సరిగా పనిచేయడం లేదంటూ ఆమె ఈసీకి చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో పోలింగ్ బూతులోకి ఆమె వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డగించడంతో ఇరువురి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. మమత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన సోనాలీ.. సీపీఎం వాళ్ల వల్లే ఈవీఎం పగిలిపోయిందని, వాళ్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు ఈడ్చి తరిమికొట్టాలని ఫోన్ లో కార్యకర్తలకు చెప్పారు. ఓటర్లందరూ తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనాలి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసింది. సోనాలిపై కేసు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు
కోల్‌కతా: కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్ నటుడు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. కుంభకోణానికి సంబంధించి.. పత్రాలను అందజేయడంలో విఫలమైన కారణంగా ఈ సమన్లు జారీ చేయాల్సి వచ్చిందని ఈడీ పేర్కొంది. మనీ లాండరింగ్ చట్టం కింద సమన్లు జారీ చేసినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. విచారణకు సంబంధించి సరైన పత్రాలను సమర్పించడంలో చక్రవర్తి విఫలమయ్యారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, చక్రవర్తి లాయర్ బిమన్ సర్కార్ మాత్రం.. ఈడీ నుంచి తమకు ఎలాంటి సమన్లు అందలేదన్నారు.