కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని భాత్పురలో శనివారం మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. గురువారం ఉత్తర 24 పరగణలో జరగిన అల్లర్లలో ఇద్దరు మరణించగా 11 మంది గాయపడిన సంగతి తెలిసిందే. బాధితులను పరామర్శించడానికి కేంద్ర మాజీ మంత్రి, బర్ధామన్–దుర్గాపూర్ ఎంపీ ఎస్‌ఎస్ అహ్లువాలియాతో పాటు ఎంపీలు, మాజీ పోలీసు అధికారులు సత్యపాల్ సింగ్, బీడీ రామ్ కూడా వచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మరణించిన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలని తెలిపారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌షాకు నివేదిక అందిస్తామన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పోలీసులు, తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేశాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి జరపాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment