riots
-
మొజాంబిక్‌లో జైల్ బ్రేక్
మపుటో: మొజాంబిక్‌లో ఎన్నికల అనంతర హింస చల్లారడం లేదు. రాజధాని మపుటో శివార్లలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన సెంట్రల్ జైల్లో బుధవారం అల్లర్లు చెలరేగాయి. పోలీసు సిబ్బంది నుంచి కొందరు ఖైదీలు ఆయుధాలు లాక్కుని తోటివారిని విడిపించడం మొదలు పెట్టారు. అల్లర్లు, తిరుగుబాటును అణిచేందుకు భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో 33 మంది మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారం. ఆ క్రమంలో జైలు గోడ కూలిపోవడంతో ఏకంగా 6,000 మందికి పైగా జైలు నుంచి తప్పించుకున్నట్టు దేశ పోలీసు జనరల్ కమాండర్ బెర్నార్డినో రఫెల్ తెలిపారు. వారిలో 150 మందిని పట్టుకున్నామన్నారు. ‘‘నేరారోపణలు రుజువైన 29 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను కూడా ఖైదీలు విడిపించుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు జైళ్లలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి’’అని వివరించారు. ఖైదీలు జైలు నుంచి పారిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఫ్రెలిమో పార్టీ విజయం సాధించింది. ఫలితాలను నిరసిస్తూ అప్పట్నుంచే దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. అధికార పార్టీ విజయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ధ్రువీకరించింది. దాంతో ఒక్కసారిగా అల్లర్లు తీవ్రతరమయ్యాయి. వాటిలో ఒక్క రోజే కనీసం 21 మంది మరణించినట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. -
London: ముగ్గురు చిన్నారుల హత్య.. ఆందోళనలు.. హై అలర్ట్
బ్రిటన్‌లో ఇటీవలి కాలంలో తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లో ముగ్గురు చిన్నారుల హత్య ఆందోళనలకు దారితీసింది. అది హింసాయుతంగా మారి తీవ్ర రూపం దాల్చింది.సౌత్ పోర్ట్‌కు చెందిన ఒక వ్యక్తి తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ చిన్నారుల హత్యకు ఒక వర్గానికి చెందిన వలసదారుడే కారణమంటూ ఆరోపించాడు. ఈ నేపధ్యంలో ఆ వర్గానికి చెందిన వలసదారులు ఆందోళనకు దిగారు. పోలీసులకు, ఆందోళనకారులకు వాగ్వాదం తీవ్రమైంది. కాగా ఈ కేసులో పోలీసు అధికారులు 17 ఏళ్ల ఆక్సెల్ రుడాకుబానా అనే కుర్రాడిని అరెస్టు చేశారు. ఇతను వేల్స్‌లోని కార్డిఫ్‌లో జన్మించాడు. ఈ కుర్రాడు తొమ్మిదేళ్ల ఆలిస్ డిసిల్వా అగ్యియర్, ఏడేళ్ల ఎల్సీ డాట్ స్టాన్‌కాంబ్, ఆరేళ్ల బేబ్ కింగ్ హత్యలకు కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.ఈ హత్యల నేపధ్యంలో బ్రిటన్‌లోని లివర్‌పూల్, మాంచెస్టర్, సుందర్‌ల్యాండ్, హల్, బెల్ఫాస్ట్, లీడ్స్‌తో సహా పలు ప్రాంతాల్లో హింసాయూత ఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. లివర్‌పూల్‌లో నిరసనకారులు పోలీసులపైకి సీసాలు, ఇటుకలు విసిరారు. అలాగే వలసదారులకు చెందిన ఒక హోటల్ కిటికీలను పగులగొట్టారు. ఆందోళనకారుల దాడుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసు వ్యాన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపధ్యంలో బ్రిటన్ అంతటా హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. -
UK: లీడ్స్‌లో అల్లర్లు.. వాహనాలు ధ్వంసం
లండన్: బ్రిటన్ లీడ్స్ నగరంలోని హారేహిల్స్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. అల్లర్లలో భాగంగా ఆందోళనకారులు ఒక డబుల్ డెక్కర్ బస్సుకు నిప్పు పెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు కారుపై దాడికి దిగి అద్దాలను ధ్వంసం చేశారు. కారును బోల్తా పడేశారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు అల్లర్లకు దిగడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. దీంతో అదనపు బలగాలను రప్పించారు. లక్సర్ వీధిలోని ఒక ఇంటి నుంచి నలుగురు పిల్లలను గురువారం(జులై 18) సోషల్ సర్వీసెస్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కొందరు స్థానికులు ఒక్కసారిగా రోడ్లపై ఆందోళనకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. ప్రజలు సంయమనం పాటించాలని వెస్ట్ యార్క్‌షైర్ ఎంపీ, హోం సెక్రటరీ కూపర్ ఎక్స్(ట్విటర్) వేదికగా కోరారు. వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్‌గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్‌చైర్‌లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని. గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజచంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు. -
తాడిపత్రిలో సిట్.. అల్లర్లపై కొనసాగుతున్న దర్యాప్తు
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం తాడిపత్రి అల్లర్ల ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు.. అరెస్టులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతే నివేదికను సిద్ధం చేయాలని సిట్ భావిస్తోంది.పల్నాడు జిల్లాలో పోలింగ్ డే ఘటనల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తిస్తున్నారు. నిన్న(గురువారం) పల్నాడులో 60 మందికిపైగా అరెస్టులు జరిగాయి. 33 మంది పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుల్ని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి.. నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.పల్నాడుపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా పోలింగ్ నాటి హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. పిన్నెల్లి వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించగా, వీడియో బయటకు ఎలా వచ్చిందనేదానిపై సిట్ విచారణ చేపట్టనుంది. కుట్ర కోణాలు ఉన్నాయా? అనే అంశంపై సిట్ పరిశీలించనుంది. మాచర్ల, పల్నాడు ఈవీఎం ఘటనలపై సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. -
కౌంటింగ్ సమయంలో అల్లర్లకు కుట్ర!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయం అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ అభ్యర్థులే రోడ్లపైకొచ్చి దాడులకు తెగబడుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు. కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ అల్లర్లను సృష్టించే అవకాశముందని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలను 175 నియోజకవర్గాల్లోనూ తూచా తప్పకుండా పాటించేలా చొరవ తీసుకోవాలని కోరామన్నారు. పోలింగ్ రోజు దెందులూరు నియోజకవర్గం కొప్పులవారిపాలెంలో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసులపైన దౌర్జన్యం చేశారని, తక్షణమే ఆయనను అరెస్ట్ చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైందన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన తోట మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమయ్యారని చెప్పారు. దాడులను ప్రోత్సహించిన అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని కోరినట్టు తెలిపారు. గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ నాయకులని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ సిట్‌ను తప్పుదోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులపైనే ఫిర్యాదులు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని, ఈ నేపథ్యంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సిట్ అధికారులను కోరినట్టు వివరించారు.ఉయ్యూరు లోకేశ్ వంటి ఉన్మాదులనుచంద్రబాబు రెచ్చగొడుతున్నారు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనను ఉన్మాది ఆలోచనలతో అడ్డుకునే కుట్ర చేసినందుకే ఉయ్యూరు లోకేశ్‌ను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు నీచ మనస్తత్వంతో లోకేశ్ వంటి వారిని రెచ్చగొడుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. అత్యంత భద్రత మధ్య ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలనే లోకేశ్ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ డాక్టర్ అయినప్పటికీ ఉన్మాద మనస్తత్వంతో టీవీ డిబేట్లలో వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతుంటారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలేనికి చెందిన ఉయ్యూరు లోకేశ్ 38 ఏళ్లుగా అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్నారని, ఆయనకు అమెరికా పౌరసత్వం కూడా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చారని, ఆ తర్వాత నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని సీఎం జగన్ విదేశీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ సానుభూతిç³రులకు మెసేజ్‌లు పెట్టినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయని వెల్లడించారు. -
పపువా న్యూగినీలో అల్లర్లు..
పోర్ట్ మోర్స్బీ: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినీ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెకు దిగడంతో జనం దుకాణాలు, కార్లకు నిప్పుపెట్టారు. సూపర్మార్కెట్లను దోచుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలు ఆకాశాన్నంటడంతో అసంతృప్తితో జనం రగిలిపోతున్నారు. బుధవారం పోలీ సులు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాల్లో 50 శాతం వరకు కోతపెట్టడాన్ని నిరసించారు. అయితే, కంప్యూటర్లో పొర పాటు కారణంగానే వేతనంలో కోత పడిన ట్లు ప్రధాని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు పార్లమెంట్ భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆవరణలోని కారుకు నిప్పుపెట్టారు. గేటును విరగ్గొట్టారు. అనంతరం సాధారణ ప్రజానీకం వారికి తోడైంది. అందరూ కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో రాజధానిలో 8 మంది, దేశంలోని రెండో అతిపెద్ద లే నగరంలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్ మోర్స్బీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదనంగా బలగాలను రప్పించారు. 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి జేమ్స్ మరపీ ప్రకటించారు. బుధవారం సాయంత్రానికే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రధాని చెప్పారు. సోషల్ మీడియా లో అసత్యాల ప్రచారమే పరిస్థితికి కారణ మని నిందించారు. పోలీసులు లేకపో వడంతో అవకాశవాదులు రెచ్చిపోయారన్నారు. -
ఐర్లాండ్ రాజధానిలో చెలరేగిన హింస: ప్రధాని దిగ్భ్రాంతి,కొత్త చట్టాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ సిటీ సెంటర్లో గత రాత్రి (గురువారం, నవంబరు 23) కత్తి పోట్ల ఘటన తీవ్ర అల్లర్లు , భారీ విధ్వంసానికి దారి తీసింది. పాఠశాల వద్ద ఓ వ్యక్తి పొడవాటి కత్తితో విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, మహిళ (స్కూల్ కేర్ అసిస్టెంట్) తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన అనంతరం సెంట్రల్ డబ్లిన్ అంతటా హింసాత్మక నిరసన చెలరేగింది. ఈ ఘటన తరువాత దేశంలో మరింత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఐర్లాండ్ పోలీసు చీఫ్ హెచ్చరించారు. శుక్రవారం నాటికి రాజధాని ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలతో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు బీభత్సం సృష్టించారు. 11 పోలీసు వాహనాలను ధ్వంసం చేయగా, 13 దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో మరిన్నిదుకాణాలను దుండగులు లూటీ చేశారు. మూడు గంటలకు పైగా జరిగిన అల్లర్లలో మూడు బస్సులు, ఒక రైలు(ట్రామ్‌ను) తగుల బెట్టారు. అనేక మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇలాంటి హింస గతంలో ఎన్నడూ చూడలేదని ఐరిష్ పోలీసు కమీషనర్ డ్రూ హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డబ్లిన్ తగులబడిపోతున్నట్టుగా అనిపించిందంటూ స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రధాని దిగ్భ్రాంతి, కొత్త చట్టాలు కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది అల్లర్లలో పాల్గొన్నారని , వీరంతా జాతికే అవమానం తెచ్చారని మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే కొత్తచట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. We are all shocked by the incident which has taken place in Parnell Square. A number of people have been injured, some of them children. Our thoughts and our prayers go out to them and their families. — Leo Varadkar (@LeoVaradkar) November 23, 2023 50 ఏళ్ల ఐరిష్ పౌరుడిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. నిరాయుధులను చేసి, పోలీసులు వచ్చే వరకు అతన్ని నేలపై పిన్ చేశారు. అతను ఆసుపత్రిలో మరియు కాపలాగా చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి కారణం ఏంటి అనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. JUST IN: Another hotel on fire in Dublin, Ireland… Citizens set fire to the Holiday Inn that is used to house immigrants following the violent stabbing of three children..pic.twitter.com/51Y7Gj4dXC — Chuck Callesto (@ChuckCallesto) November 24, 2023 -
Rajasthan Assembly elections 2023: అల్లర్లు, అవినీతిలో రాజస్తాన్ టాప్
జైపూర్: నేరాలు, అవినీతి, అల్లర్లలో రాజస్తాన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలోకి తీసుకెళ్లిందని ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. శనివారం రాజస్తాన్‌లోని భరత్పూర్, నాగౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గెహ్లాత్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ ఓవైపు విశ్వవిజేతగా భారత్ ప్రభవిస్తోంది. మరోవైపు రాజస్తాన్‌లో ఏం జరుగుతోందో మీకందరికీ తెల్సిందే. అల్లర్లు, నేరాల నమోదులో రాజస్తాన్ అగ్రపథంలో దూసుకుపోతోంది. బుజ్జగింపు రాజకీయాల కారణంగా సంఘ విద్రోహ శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే ఈసారి మీకు ఓట్లు వేయబోము అని మెజీషియన్‌కు ఓటర్లు చెప్పేశారు. ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అదృశ్యమవుతుంది. డిసెంబర్ మూడున కాంగ్రెస్ మాయమవడం ఖాయం’’ అని గెహ్లోత్‌నుద్దేశిస్తూ మోదీ విమర్శించారు. చిన్నతనంలో తండ్రికి సాయపడుతూ గెహ్లోత్ మెజీషియన్‌గా దేశపర్యటన చేసిన సంగతి తెల్సిందే. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. వారెక్కడుంటే నేరాలు అక్కడ ‘ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుతీరాయో అక్కడ నేరగాళ్లు, ఉగ్రవాదులు, అల్లర్లు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పెట్టిందిపేరు. ప్రజల జీవితాలను పణంగా పెట్టేందుకు ఎంతగా దిగజారేందుకైనా కాంగ్రెస్ సిద్ధం. అవినీతి పరాకాష్టకు చేరింది. ఈ ఐదేళ్ల కాంగ్రెస్ హయాంలో మహిళలు, దళితులపై నేరాలు ఎక్కువయ్యాయి. హోలీ, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి.. ఏ పర్వదినమైనా సరే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకున్నదే లేదు. ఎప్పుడూ అల్లరిమూకల దాడులు, ఘర్షణలు, వివాదాలు, కర్ఫ్యూ.. ఇవే రాజస్తాన్‌లో దర్శనిమిచ్చాయి. మహిళలు అబద్ధపు రేప్ కేసులు పెడుతున్నారని స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి మహిళలను రక్షిస్తారా?. ఈయనకు ఒక్క నిమిషమైనా సీఎం కుర్చీలో కూర్చొనే హక్కు ఉందా?’’ అని మోదీ మండిపడ్డారు. ‘మగాళ్లు ఉన్న రాష్ట్రం కాబట్టే రాజస్తాన్‌లో రేప్‌లు ఎక్కువ అంటూ మంత్రి శాంతికుమార్ ధరివాల్ మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతలు ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. అసెంబ్లీలో ఇంత దారుణంగా మాట్లాడినా ఈ మంత్రిపై ఎలాంటి శిక్షలు లేవు. ఎందుకంటే సీఎం రహస్యాలు ఈయనకు తెలుసు మరి. పైగా ఈయనకు రివార్డ్‌గా టికెట్ దక్కింది’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. దళితుడు ఉన్నతాధికారి కావడం ఇష్టం లేదు ‘‘ దళితులపై కాంగ్రెస్ వివక్ష చూపుతోంది. డీగ్ జిల్లాకు చెందిన హీరాలాల్ సమరియా ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవి స్వీకరించిన తొలి దళితుడు ఆయన. ఈయన ఎంపిక సమావేశాన్ని కాంగ్రెస్ బాయ్‌కాట్ చేసింది. దళిత అధికారి అంతటి ఉన్నతస్థాయికి చేరుకోవడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. రాష్ట్రంలో నిత్యావసర సరకులు, ఇంధన ధరల పెరుగుదలకు గెహ్లోత్ సర్కారే కారణం. పొరుగు ఉన్న రాష్ట్రాల్లో కంటే రాజస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.12 ఎక్కువ ధర. మేం అధికారంలోకి రాగానే ధరలను సమీక్షించి, సవరిస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు. -
5 దారుణ అల్లర్లు.. దేశాన్ని వణికించి, రక్తపాతాన్ని సృష్టించి..
దేశ రాజధాని ఢిల్లీ లేదా ఇటువంటి మెట్రో నగరాల్లో ఏదో విషయమై అప్పుడప్పుడు అల్లర్లు చోటుచేసుకుంటాయి. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఈశాన్య జిల్లా హింసాత్మకంగా మారింది. పలు ఘటనల్లో 34 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ఐదు అతిపెద్ద అల్లర్లలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనలు ఏమిటో తెలుసుకుందాం. 1. సిక్కు అల్లర్లు(1984) దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అల్లర్లలో 1984లో జరిగిన సిక్కుల అల్లర్లు ప్రధానమైనవి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత ఇవి చోటుచేసుకున్నాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది ఆమె అంగరక్షకులే. వారు సిక్కు మతానికి చెందినవారు. అందుకే ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలోని ప్రజలు సిక్కులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సిక్కులను ఊచకోతకు గురిచేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో ఐదు వేల మంది మరణించారని చెబుతుంటారు. ఒక్క ఢిల్లీలోనే రెండు వేల మందికి పైగా చనిపోయారు. ఇందిరా గాంధీ హత్యకు కారణం 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం అని చెబుతుంటారు. నాడు స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆమె భారత సైన్యాన్ని ఆదేశించారు. ఈ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. ఆలయంలోకి ప్రవేశించిన జర్నైల్ సింగ్, భింద్రన్‌వాలే అతని సహచరులు ఆలయం లోపల ఉన్న సైనికులపై దాడి చేశారు. దీంతో ఇందిర ప్రభుత్వం తుపాకులతో దాడి చేయాలని సైనికులను ఆదేశించింది. ఈ ఘటనలో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే, అతని సహచరులు మరణించారు. 2. భాగల్పూర్ అల్లర్లు(1989) 1947లో చోటుచేసుకున్న భాగల్పూర్ అల్లర్లు భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన అల్లర్ల జాబితాలో ఉంటాయి. ఈ అల్లర్లు 1989 అక్టోబర్‌లో భాగల్పూర్లో జరిగాయి. హిందూ- ముస్లిం వర్గాల మధ్య ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా 1000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 3. ముంబై అల్లర్లు (1992) ఈ అల్లర్లకు ప్రధాన కారణం బాబ్రీ మసీదు కూల్చివేత. ఈ హింస డిసెంబర్ 1992లో ప్రారంభమై జనవరి 1993 వరకు కొనసాగింది. శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం ఈ అల్లర్లలో 900 మంది చనిపోయారు. వీరిలో 575 మంది ముస్లింలు, 275 మంది హిందువులు, 45 మంది గుర్తుతెలియని వారు, మరో ఐదుగురు ఉన్నారు. సుధాకర్ నాయక్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అల్లర్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యిందని నిరూపితమయ్యింది. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలవవలసి వచ్చింది. 4. గుజరాత్ అల్లర్లు(2002) గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్లు దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన అల్లర్లు. గోద్రా ఘటన 2002లో జరిగింది. 27 ఫిబ్రవరి 2002న రైల్వే స్టేషన్లో ఒక గుంపు సబర్మతి రైలులోని ఎస్-6 కోచ్‌కు నిప్పు పెట్టడంతో 59 మంది కరసేవకులు మరణించారు. ఫలితంగా గుజరాత్ అంతటా మతకల్లోలాలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారు. ఆ సమయంలో ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. 5. ముజఫర్‌నగర్ (2013) ఈ అల్లర్లు ముజఫర్‌నగర్ జిల్లాలోని కవాల్ గ్రామంలో జరిగాయి. దీని కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 ఆగస్టు 27న కవాల్ గ్రామంలో జాట్ సామాజికవర్గ బాలికపై ముస్లిం యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులకు గురైన బాలిక బంధువు.. ఆ ముస్లిం యువకుడిని హత్య చేశాడు. తరువాత దీనికి ప్రతిగా పలువురు ముస్లింలు.. ఆ బాలిక సోదరులను హత్యచేశారు. ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి? -
విధ్వంసానికి టీడీపీ భారీ కుట్ర
సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా బరితెగిస్తామని టీడీపీ మరోసారి రుజువు చేసింది. విద్యార్థులు, యువతను పావులుగా వాడుకుని రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు పథకం రూపొందించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ప్రజాధనం లూటీకి పాల్పడ్డ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టయ్యి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తమ అవినీతి బండారం బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ విధ్వంస కాండకు సిద్ధపడుతోంది. ఆ కుట్రను పక్కాగా అమలు చేసేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో అతి పెద్ద హింసాత్మక సంఘటన ఏదైనా జరగాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని పన్నాగం పన్నింది. జాతీయ రహదారులు వేదికగా.. ప్రధానంగా జాతీయ రహదారులపై విధ్వంసం సృష్టించాలని టీడీపీ తమ పార్టీ నేతలకు ఆదేశాలు పంపింది. జాతీయ రహదారులను దిగ్బంధించి వాహనాలపై దాడులకు తెగబడటంతోపాటు దుకాణాలు, హోటళ్లు, దాబాల్లో విధ్వంసం సృష్టించాలన్నది పన్నాగం. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై విధ్వంసం సృష్టించాలని పేర్కొంటూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ శ్రేణులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. చెన్నై–బెంగళూరు జాతీయ రహదారితోపాటు కడప, అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారి, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారులపై దాడులకు తెగబడాలని అల్లరి మూకలను పురిగొల్పింది. సామాన్యులపై దాడులు చేసి అల్లకల్లోలం సృష్టించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తద్వారా పోలీసులు అనివార్యంగా లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి సృష్టించి వీలైతే పోలీసు కాల్పుల వరకు పరిస్థితిని తీసుకెళ్లాలని పథకం వేసింది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోతే దేశవ్యాప్తంగా మీడియాలో చర్చకు తెరతీసి రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని పన్నాగం పన్నింది. సోషల్ మీడియా సాధనం.. ప్రధానంగా సోషల్ మీడియా వేదికల ద్వారా రెండు రోజులుగా యువత, విద్యార్థులను టీడీపీ రెచ్చగొడుతోంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు స్వయంగా ఇంజనీరింగ్, ఇతర కాలేజీలకు వెళ్లి విద్యార్థులను రెచ్చగొడుతుండటం గమనార్హం. చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీకి తరలి రావాలని విద్యార్థులను కోరారు. ర్యాలీ, ఫ్లాష్ మాబ్... అంటూ విద్యార్థులు, యువతను సమీకరించేందుకు సోషల్ మీడియాను సాధనంగా చేసుకున్నారు. అందరూ జాతీయ రహదారులపైకి రావాలని అందులో నిర్దేశించడం గమనార్హం. ఒకసారి జాతీయ రహదారులపైకి చేరుకున్నాక టీడీపీ రౌడీలు, గూండాలు, అల్లరి మూకలంతా విద్యార్థుల్లో కలసిపోయి విధ్వంసానికి పాల్పడాలన్నది పన్నాగం. విజయవాడ, విశాఖతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులను భారీగా తరలించేందుకు యత్నించారు. అందుకోసం వివిధ జిల్లా కేంద్రాలకు శుక్రవారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు వేర్వేరు సమయాలను కేటాయించడం గమనార్హం. అంటే ఒకచోట విధ్వంసానికి పాల్పడిన కొద్దిసేపటికే మరో జిల్లా కేంద్రానికి చేరుకుని రాష్ట్రం అంతా అల్లకల్లోలం సృష్టించాలన్నది టీడీపీ కుయుక్తి. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం.. టీడీపీ పన్నాగాన్ని గుర్తించిన నిఘా వర్గాలు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అన్ని జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీలను సందర్శించి ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లతో చర్చించారు. అల్లర్ల కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్ దెబ్బతింటుందని విద్యార్థులకు కౌన్సెలింగ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కపోవడంతోపాటు పాస్‌పోర్ట్, వీసా జారీకి అడ్డంకులు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ నంబర్లు తీసుకుని వాట్సాప్ సందేశాలు కూడా పంపారు. తాము విధ్వంసకర కార్యక్రమాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు చెప్పడంతో మధ్యాహ్నం నుంచి వారిని ఇళ్లకు పంపించారు. కుట్రకు నేతృత్వం వహిస్తున్న టీడీపీ నేతలనుæ నిర్బంధంలో ఉంచారు. పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్రంలో శుక్రవారం ఎలాంటి అవాంఛనీయ çఘటనలు జరగకుండా కట్టడి చేయగలిగారు. -
పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు కుట్ర బయటపడింది. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు అనుచరుల వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఎదుట చల్లా బాబు అనుచరులు నరీన్‌కుమార్, దూవల అమర్నాథ్, పెద్దన్న సుబ్రహ్మణ్యం నేరం ఒప్పుకున్నారు ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు. చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్ -
'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్..
ఢిల్లీ: మణిపూర్ అంశంపై చర్చకు కేంద్రం ఎప్పుడైనా సిద్ధంగానే ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ అంశంలో దాచడానికి ఏమీ లేదని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం మౌన వ్రతం పాటించడంలేదని చెప్పారు. మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన సమయంలో కేంద్ర సహాయ మంత్రి 23 రోజులు అక్కడే గడిపారని పేర్కొన్నారు. తాను కూడా స్వయంగా మూడు రోజులు పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దినట్లు వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు గంటలపాటు మాట్లాడారు. సరికాదు.. ప్రస్తుతం అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని అమిత్ షా చెప్పారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల వీడియోపై కూడా ఆయన మాట్లాడారు. ఈ ఘటన సిగ్గుచేటని కేంద్రం అంగీకరించిందని చెప్పారు. ఆ వీడియోను పోలీసులకు ఇవ్వాల్సిందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు రిలిజ్ చేయడం సరికాదని అన్నారు. అగ్నికి ఆజ్యం ప్రతిపక్షాలు చేసే చర్యలు అగ్నికి ఆజ్యం పోసే దిశగా ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు. మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటనలను కేంద్రం కూడా సమర్థించడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. #WATCH | This is a very unfortunate incident and it is a shame for society. But why did this video (Manipur viral video) come before the start of this Parliament session? If someone was having this video they should have given it to the DGP, and action would have been taken on… pic.twitter.com/CEd8vTWnPN — ANI (@ANI) August 9, 2023 శాంతి నెలకొంటోంది.. మణిపూర్ ఘటనపై అక్కడి సీఎంను మార్చాల్సిన పనిలేదని అమిత్ షా అన్నారు. బీరేన్ సింగ్ చక్కగా స్పందిస్తున్నారని.. మాట వినకపోతే తొలగిస్తారని చెప్పారు. ఈ ఘటనలో సరిగా వ్యవహరించని అధికారులను మార్చినట్లు చెప్పారు. మణిపూర్‌లో శాంతి పరిస్థితులు నెలకొనడానికి అన్ని ప్రయత్నాలను కేంద్రం చేస్తోందని అన్నారు. మే3 నాడు అల్లర్లు ప్రారంభమయ్యాయని అమిత్ షా చెప్పారు. నేటికి అవి కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ 152 మరణించగా.. ఒక్క మే నెలలోనే 107 మంది మృతి చెందినట్లు లోక్‌సభలో పేర్కొన్నారు. రెండు తెగలు మైతీ, కుకీల మధ్య గొడవ ప్రారంభమైనట్లు చెప్పారు. రెండు వర్గాలతో చర్చలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించిన కారణంగానే ఘర్షణలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ! -
ఆగని మణిపూర్ అల్లర్లు
ఆగని మణిపూర్ అల్లర్లు -
Manipur Violence: ఆగని మణిపూర్ అల్లర్లు
ఇంఫాల్: మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం చెలరేగిన హింసాకాండలో పదిహేను ఇళ్లు తగలబడ్డాయి. లంగోల్ గేమ్స్ విలేజ్‌లో అల్లరిమూక దాడులకు తెగబడి ఇళ్లను తగులబెట్టారు. దీంతో భద్రతా సిబ్బంది బాష్పవాయువుని ప్రయోగించి పరిస్థితుల్ని అదుపులోనికి తీసుకువచ్చారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకోన్ ప్రాంతంలో దుండగులు వాణిజ్య సముదాయాలను తగులబెట్టారు. మరోవైపు రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీయేలో ఇన్నాళ్లూ భాగస్వామ్యపక్షంగా ఉన్న కుకీ పీపుల్స్ అలయెన్స్ బైరన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. లూటీ చేసిన ఆయుధాలు వెనక్కి మణిపూర్‌లో అల్లరిమూకలు భారీగా లూటీ చేసిన ఆయుధాల్ని తిరిగి స్వా«దీనం చేసుకునే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లూటీ అయిన ఆయుధాల్లో 1,195 తిరిగి స్వా«దీనం చేసుకున్నట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతం జిల్లాల నుంచి 1,057 ఆయుధాలు , కొండ ప్రాంతం జిల్లాల నుంచి 138 ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఐజీ ర్యాంకు అధికారి ఒకరు ఆయుధాగారాల లూటీకి సంబంధించి విచారణ జరుపుతున్నారు. అయిదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనలో అయిదురుగు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ప్రాంతం పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ సహా అయిదుగురు సిబ్బందిని దీనికి సంబంధించిన వీడియో బయటకి వచి్చన వెంటనే సస్పెండ్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఒక వర్గం ప్రజలు వారి సస్పెన్షన్‌ని వెనక్కి తీసుకోవాలని ప్రతీరోజూ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా వెనక్కి తగ్గలేదని చెప్పారు. జంకుతున్న ఎమ్మెల్యేలు ఈ నెల 21 నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి కుకీ వర్గానికి చెందిన అత్యధిక ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరుకావడానికి విముఖతతో ఉన్నారు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూ ఉండడంతో తమకి భద్రత లేదని వారు భయపడుతున్నారు. శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం వల్ల తాము అసెంబ్లీకి హాజరు కావడం లేదని కుకి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎల్.ఎమ్ ఖాటే చెప్పారు. ఎమ్మెల్యేల ఇంఫాల్ ప్రయాణం సురక్షితం కాదని అన్నారు. -
ఒక్కరి మరణం తెచ్చిన కార్చిచ్చు..ఏకంగా 700 మందికి జైలు శిక్ష!
ఫ్రాన్స్‌లో గత నెలలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై ఒక యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఫ్రాన్స్‌ను ఒక్క కుదుపు కదుపేసింది. ఒక్కరాత్రిలో ఫ్రాన్స్ రణరంగంలా మారిపోయింది. మైనార్టిలపై పోలీసులు అకృత్యాలు కొత్తేమి కాదంటూ ప్రజాగ్రహం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంది. ఆ యువకుడిని చంపడాన్ని నిరశిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టించారు. పోలీసులు కావలనే ఇలా చేశారంటూ ప్రజలు మండిపడ్డారు. ఒక్కసారిగా ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో దేశం ఒక్కసారిగా అగ్ని గుండలా మారిపోయింది. నాటి ఘటనలో పరిస్థితిని అదుపు చేసేందకు పోలీసులు వేలాదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు ఆరోపణలు మోపి అరెస్టు చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్ కోర్టుల వారిపై మోపిన అభియోగాలను విచారించి నాటి ఘటనలో అల్లర్లకు పాల్పడిని సుమారు 700 మందికి జైలు శిక్ష విధించింది. వారంతా పోలీసు అధికారులపై దాడిచేయడం, ప్రభుత్వా ఆస్తులను పాడుచేయడం తదిత వాటిల్లో దోషులుగా నిర్థారించి ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ..న్యాయస్థానం నాటి ఘటనపై సీరియస్‌గానే స్పందించింది. దేశ శాంతి భద్రతలకే కోర్టు ప్రాముఖ్యతనిస్తుంది. ఇలాంటి విషయంలో కోర్టు కఠినంగానే వ్యవహరిస్తుందని అన్నారు. కాగా, ఫ్రాన్స్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమి గాదు గతంలో కూడా ఇలాంటి పలు ఉదంతాలు చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో..) -
ఫ్రాన్స్ అల్లర్లు - అభివృద్ధి చెందిన దేశానికి ఎందుకీ గతి పట్టింది?
పారిస్: జూన్ 27న ఒక ముస్లిం యువకుడిని స్థానిక ట్రాఫిక్ పోలీసులు కాల్చి చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. అభివృద్ధికి చెందిన ఫ్రాన్స్ లాంటి దేశం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు కుదేలైపోవడమే ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తుంది. అసలు ఫ్రాన్స్‌లో ఈ పరిస్థితులు ఏర్పడటానికి కారణమేంటి? అసలేం జరిగిందంటే.. జూన్ 27న 17 ఏళ్ల నాహేల్ మెరెజోక్ ను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడన్న కారణంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని కాల్చి చంపడంతో వివాదానికి తెరలేచింది. పోలీసుల విచారణలో అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని పైగా నేర చరిత్ర కూడా ఉందని తేలింది. ఆ ప్రకారం చూస్తే నేరస్తులు ఎవరైనా తమ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వారిని కాల్చవచ్చని 2017లో అమల్లోకి వచ్చిన ఒక ఫ్రాన్స్ చట్టం చెబుతోంది. టెర్రరిస్టులపై వారు ఇదే చట్టాన్ని అమలు చేస్తుంటారు. అదే చట్టాన్ని నాహేల్ పై కూడా ప్రయోగించినట్లు సమర్ధించుకుంటున్నారు పోలీసులు. వలసదారుల విషయంలో వారు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటారు.. కాబట్టి అన్నీ తెలిసే వారు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ప్రధాన కారణమిదే.. ఫ్రాన్స్ దేశ జనాభా మొత్తం 67 మిలియన్లయితే అందులో వలసదారుల జనాభా సుమారు 4.5 మిలియన్లు ఉంటుంది. ఆతిధ్య దేశం కనికరిస్తే స్థానికంగా జీవనం కొనసాగించడానికి మాత్రమే అన్నట్టుగా మొదలైన వలసదారుల ప్రయాణం హక్కులు, సమానత్వం అంటూ రెక్కలు విచ్చుకుంటూ సాగింది. France Bizarre forms of Riot, cars flying out of the car park This hasn't even been filmed in the movies. pic.twitter.com/XGkliojCOf — Dialogue works (@Dialogue_NRA) July 2, 2023 ఫ్రెంచి విప్లవం ప్రభావం.. 1789లో ఉవ్వెత్తున ఎగిసిన ఫ్రెంచి విప్లవం వలసదారుల్లో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం పేరిట జరిగిన ఆ ఉద్యమం వలసదారులపై పెను ప్రభావం చూపింది. హక్కుల కోసం పోరాడాలన్న సంకల్పాన్ని వారిలో పుట్టించింది. వారెందుకలా.. వీరెందుకిలా.. ప్రపంచంలో ఎక్కడైనా వలదారులు దేశాలు బయలు వెళ్ళడానికి మూడే ప్రధాన కారణాలను చూడవచ్చు. యుద్ధం, రాజకీయ సంక్షోభం, కటిక దారిద్య్రం. ఈ నేపథ్యంతో వచ్చిన వారిని ఆతిధ్య దేశాలు మొదటిగా సానుభూతితో స్వాగతిస్తుంటాయి. అలాగే చౌకగా పనివారు దొరుకుతారన్న ఆర్ధిక ప్రయోజనంతో కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. #French nationalists in the streets of Lyon are ready to fight protesters “Blue, white, red, the France to the French! they chant#FranceRiots pic.twitter.com/88V2O7JCXu — CtrlAltDelete (@TakingoutTrash7) July 3, 2023 అక్కడ మొదలైంది.. ఇక్కడే ఒకటి కొంటే ఒకటి ఉచితమన్న ఫార్ములా అమల్లోకి వస్తుంటుంది. మొదట్లో మెతకగా ఎంట్రీ ఇచ్చిన వలసదారులు కొన్నాళ్ళకో.. కొన్నేళ్ళకో.. మాక్కూడా పౌరసత్వం కావాలని, సమాన హక్కులు కల్పించమని కోరుతూ ఉంటారు. అందుకు ఆయా దేశాలు అంగీకరిస్తే ఎటువంటి సమస్యలూ ఉండవు. కానీ వారు అలా అంగీకరిస్తే స్థానికంగా ఉంటున్నవారికి కొత్త సమస్యలు తీసుకొచ్చినట్టేనని వెనకడుగు వేస్తూ ఉంటారు. పెరిగిన మైనారిటీ జనాభా.. మత విభేదాలు సృష్టించినంతగా జాతి విభేదాలు హింసను ప్రేరేపించకపోవచ్చని నమ్మే ఫ్రాన్స్ దేశం వలసదారులు అక్కడి నియమాలను పాటించాలని, చట్టాలను గౌరవించి ఆచార వ్యవహారాలను పాటించి జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుతూ వచ్చింది. అందుకు అంగీకరించిన నేపథ్యంలోనే ఫ్రాన్స్‌లో కేథలిక్ జనాభా తర్వాత ముస్లిం జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. అత్యుత్తమ పౌరులు.. 1960ల్లో ఉత్తర ఆఫ్రికా నుండి వలస వచ్చిన ముస్లిం జనాభా ఆనాడు ఫ్రాన్స్ కట్టుబాట్లకు లోబడి చక్కగా ఒదిగిపోయారు. కానీ తర్వాతి తరం వలసదారుల్లో ఈ క్రమశిక్షణ తగ్గుతూ వచ్చింది. ఇది మా సొంత దేశం కాదన్న ధోరణి మొదటి తరంలో ఉన్నంతగా తర్వాతి తరాల్లో లేదు. వలసదారులమన్న భావన కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడైతే మేము వలసదారులమన్న ఆలోచన కూడా అత్యధికులు మర్చిపోయారు. 👉It’s getting so much more obvious that these riots are all orcheststrsted WATCH: Rioters have burned down the largest library in France. The Alcazar library in Marseille included an archive of one million historically significant archives.#FranceRiots #France #FranceOnFire pic.twitter.com/hko8no7yuC — Censored American NO MORE (@NotADirtyDem) July 5, 2023 పెరుగుతోన్న విపరీతవాదం.. ఇక ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న మరో పెనుభూతం ఇస్లాం రాజకీయవాదం.. తాజాగా ఫ్రాన్స్ దేశాన్ని ఇబ్బంది పెట్టిన ఈ సమస్యతో ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. హింసాత్మక సంఘటనలను ప్రేరేపిస్తూ దొరికిందే అవకాశంగా విపరీతవాదం పేట్రేగిపోతోంది. పెరుగుపోతున్న ఈ హింస కారణంగానే ఫ్రాన్స్ దేశం కొన్ని కఠిన నియమాలను, చట్టాలను అమలు చేస్తూ వచ్చింది. తలపాగా నిషేధం, చార్లీ హెబ్డో కార్టూన్లు నిషేధం ఈ కోవలో చేసినవే. ఫ్రాన్స్ దేశం వారు తమ చట్టాలను కఠినంగా అమలు చేయబట్టే జూన్ 27న నాంటెర్రే సంఘటన కూడా చోటు చేసుకుంది. దానిని అనుసరిస్తూనే దేశవ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. This is France, July 2023, slowly becoming a third world country #France #FranceHasFallen #FranceRiots pic.twitter.com/ouxGzttxRY — FRANCE RIOTS (@FranceRiots) July 7, 2023 ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ.. -
రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్..
పారిస్: ఫ్రాన్స్ దేశంలో నహేల్ అనే ఒక 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో ఫ్రాన్స్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. వారం రోజులవుతున్నా ఇప్పటికింకా అక్కడ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతూ, దుకాణాలను లూటీ చేస్తున్నారు. తాజాగా కొన్ని అల్లరి మూకలు ఒక కార్ షోరూంని కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు నుండి నేటివరకు ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తూ భగ్గుమంటూనే ఉంది. ఇంతవరకు ఈ అల్లర్లలో సుమారు 1000 మందిని పోలీసులు అరెస్టు చేయగా పోలీసు బలగాల్లో 200 మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోకుండా అడ్డుకునేందుకు 45000 మంది పోలీసులు పహారా కాస్తూ అల్లరిమూకలను చెదరగొడుతున్నా ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉండగా ఆందోళనకారులు పారిస్ నగరంలో ఎక్కడికక్కడ దుకాణాల్లోకి చొరబడి చేతికి దొరికిన వస్తువును తీసుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా కొంతమంది నిరసనకారులు అక్కడి వోక్స్ వ్యాగన్ కార్ షోరూంని కొల్లగొట్టి అందులోని ఖరీదైన కార్లను దొంగిలించారు. ఎంత కష్టపడితే మాత్రం ఇలాంటి లగ్జరీ కార్లను కొనడానికి జీవితకాలం సరిపోదని భావించారో ఏమో. షోరూంలోనో కార్లన్నిటినీ లూటీ చేశారు. దుండగులు కార్లను ఎత్తుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనికి కామెంట్ల రూపంలో ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తోన్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు వీక్షకులు. Car dealership looted in #FranceRiots. pic.twitter.com/fkKHil7H8J — Paul Golding (@GoldingBF) July 2, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
ఫ్రాన్స్‌లో ఐదో రోజూ అల్లర్లు
పారిస్: ఫ్రాన్స్‌లో అల్లర్లు ఐదో రోజూ కొనసాగాయి. ఆందోళనకారులు మేయర్ నివాసంపైకి మండుతున్న కారుతో దూసుకువచి్చ దాడికి యతి్నంచారు. పోలీసులతో ఆందోళనకారులు పలు చోట్ల బాహాబాహీకి దిగారు. అయితే, గత నాలుగు రోజులతో పోలిస్తే అల్లర్ల తీవ్రత తగ్గింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు శనివారం రాత్రి మరో 719 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. మంగళవారం పారిస్ శివారులోని నాంటెర్రెలో ట్రాఫిక్ పోలీసులు నేహల్ అనే యువకుడిని కాల్చి చంపడంతో ఆగ్రహజ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. నేహల్ అంత్యక్రియలు శనివారం ముస్లిం సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. శనివారం రాత్రి పారిస్‌లో చాంప్స్ ఎలిసీస్ వద్ద గుమికూడిన యువకుల గుంపును పోలీసులు లాఠీచార్జితో చెదరగొట్టారు. ఫ్రెంచి గుయానాలో తుపాకీ బుల్లెట్ తగిలి 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. పారిస్ ఉత్తర ప్రాంతంలో నిరసనకారులు బాణసంచా కాల్చుతూ, రోడ్లపై అడ్డంకులు పెట్టారు. టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించి వారిని పోలీసులు చెదరగొట్టారు. -
ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు
17 ఏళ్ల యువకుడి చావు ఫ్రాన్స్ దేశాన్ని తగలబెడుతోంది. జూన్ 27న జరిగిన ఓ ఘటన దేశాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. పోలీసుల కాల్పుల్లో యువకుడు నాహేల్ చినపోయిన తర్వాత ఆదోళలు, నిరసలతో అట్టుడుకుతోంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి బీభత్సం అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పారిస్ శివారు ప్రాంతాల్లో మొదలైన ఈ అల్లర్లు.. ఇప్పుడు దేశమంతటికీ పాకాయి. గత నాలుగో రోజులుగా హింసా కొనసాగుతూనే ఉంది. ఏ వీధిని చూసినా.. రణరంగంగానే కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి 1,311 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే అల్లరిమూకల కారణంగా 200 మందికిపైగా పోలీసులు అధికారులు గాయపడ్డారని పేరేంది. నిరసనలు ప్రారంభమైన మంగళవారం నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు ఈ స్థాయిలో అరెస్ట్‌లు జరగడం ఇదే అత్యధికం. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం బయడపడింది. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు కనిపిస్తున్నాయి. దేనికైనా తెగిస్తామన్నట్టుగా ఊరేగింపుగా సాగుతున్నారు. ఎంతగా నచ్చజెప్పినా ఆందోళనలు తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. నహేల్ మృతితో చెలరేగిన అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. How are French protesters getting their hands on heavy firearms? pic.twitter.com/k9nqO6bFfy — Ian Miles Cheong (@stillgray) July 1, 2023 ప్రస్తుతం హింస కాస్త తగ్గిందని ఫ్రెంచ్ ప్రభుత్వం వెల్లడించింది. ఆందోళనకారుల నిరసనల్లో 1,350 వహానాలు, 234 భవనాలు తగలబడిపోయాయని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో 2,560 అగ్ని ప్రమాదాలు జరిగాయని చెప్పింది. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా 45, 000 మంది పోలీసులు సాయుధ వాహనాలతో మోహరించారు. క్రాక్ పోలీస్, ఇతర భద్రతా దళాలను సైతం రప్పించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మార్సెయిల్ మేయర్ బెనాయిట్ పాయన్, వెంటనే అదనపు దళాలను పంపాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరారు.. ఫ్రాన్స్‌లోని మూడవ అతిపెద్ద నగరమైన లియోన్‌లో హెలికాప్టర్, సాయుధ సిబ్బంది క్యారియర్లు మోహరించాయి. ఉద్రిక్తతల కారణంగా పారిస్ శివారులోని క్లామర్ట్ టౌన్లో కర్ఫ్యూ విధించారు. ఇదిలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం తనిఖీల సమయంలో 17 ఏళ్ల యువకుడు నాహేల్‌ను ఓ పోలీస్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్సెయిల్, లియోన్లలో హింస, దాడులు అత్యంత దారుణ స్థాయికి చేరాయి. పారిస్ శివారు, గ్రెనోబుల్, సెయింట్-ఎటియెన్లోని కొన్ని ప్రాంతాల్లో హుడ్ ధరించిన నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచే బస్సు, ట్రామ్ సేవలను నిలిపివేశారు. బాణసంచా అమ్మకాలను కూడ నిషేధించారు. కాగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒమ్మాన్యుయేల్ మాక్రాన్ టీనెజ్ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియానే ఈ హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. వీడియోలు వైరల్ యాప్‌లు స్నాప్ చాట్, టిక్‌టాక్ లలో వాటిని తొలగించాలని కోరారు. మరోవైపు ఉద్రిక్త వాతావరణంలో నాన్టెర్రిలోని స్మశానవాటికలో నాహెల్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు
ఫ్రాన్స్: గడిచిన మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. పోలీసు కాల్పుల్లో మరణించిన నల్ల జాతీయుడు నాహేల్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు పోలీసులపై దాడులకు తెగబడ్డారు. పాఠశాలలు, టౌన్ హాళ్లు, పోలీస్ స్టేషన్లు, కార్లు, దుకాణాలను తగలబెడుతూ ఆందోళనకారులు దేశాన్ని నిద్రపోనీయడం లేదు. అసలేం జరిగింది.. మంగళవారం ఉదయం అల్జీరియాకు చెందిన 17 ఏళ్ల ముస్లిం యువకుడు నాహేల్ నాంటెర్రే ట్రాఫిక్ స్టాప్ వద్ద పోలీసుల ఆజ్ఞను అతిక్రమిస్తూ కొంచెం ముందుకు వెళ్ళాడు. దీంతో పోలీసులు పోలాండ్ నెంబరు ప్లేటు ఉన్న నాహేల్ కారును బ్లాక్ చేసి నాహేల్ ను ప్రమాదకరంగా పరిగణించి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు. దీంతో నాహేల్ అక్కడికక్కడే మరణించాడు. వీడియో లీక్.. ఈ హత్యోదంతం తాలూకు వీడియో బయటకు రావడంతో ఫ్రాన్స్ లోని ముస్లింలు పెద్ద ఎత్తున అల్లర్లకు తెరతీశారు. నాహేల్ కు న్యాయం చేయండంటూ మొదలైన నిరసన కాస్తా మెల్లిగా హింసాత్మకంగా మారింది. నినాదాలు చేస్తూ ముస్లింలు కార్లు, దుకాణాలు ప్రజా ఆస్తులను దగ్ధం చేశారు. ఇదే క్రమంలో మార్సెల్లీ లోని అతి పెద్ద గ్రంథాలయానికి కూడా నిప్పు పెట్టారు ఆందోళనకారులు. They r chanting Allah hu akbar and burning shops, cars, public property looting shops France has a 9% muslim population that is highest in Europe and most of them are African immigrants whom France gave shelter pic.twitter.com/jjkcTM5KIu — STAR Boy (@Starboy2079) June 30, 2023 అక్కడ సర్వసాధారణం.. ఫ్రాన్స్ దేశ జనాభాలో 9% ఉండే ముస్లింలలో అత్యధికులు శరణార్థులు.. వలసదారులే.. వీరికి ఫ్రాన్స్ ఆశ్రయమిచ్చింది. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ సమయంలో ఫ్రాన్స్ జట్టు మొరాకోపై గెలిచినప్పుడు కూడా ముస్లింలు ఇలాగే విధ్వంసాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో కొందరు దీన్ని జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ఎగిసిన ఉద్యమ జ్వాలాగా అభివర్ణస్తుంటే మరికొంతమంది మాత్రం వారు అల్లర్లు చేయడానికి ఏదో ఒక కారణం కావాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అరెస్టులు.. ఆందోళనకారులు చేసిన దాడుల్లో ఇంతవరకు 249 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ అల్లర్లు చేస్తున్న సుమారు 875 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు 14 నుండి 18 సంవత్సరాల వయసువారే కావడం విశేషం. ఉక్కుపాదం.. ఉద్రిక్త ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా నియంత్రించే క్రమంలో దాదాపుగా 40 వేల మంది రక్షణ బలగాలను మోహరించినట్టు తెలిపారు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డార్మానిన్. Amidst slogans of Allah hu Akbar, Rioters are destroying The France pic.twitter.com/JOBY2bVSDL — STAR Boy (@Starboy2079) June 30, 2023 ఆ తల్లి కడుపు కోత.. నేను పోలీసు వ్యవస్థపై నింద వేయడం లేదు. నా కుమారుడిని పొట్టనబెట్టుకున్న ఆ ఒక్క అధికారిపైనే నా కోపమంతా. నా బిడ్డను అతనే చంపాడు. నా కుమారుడు అరబ్ అని తెలిసే, అతని కాల్పులు జరిపాడు.. అని నాహెల్ తల్లి మౌనియా ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడి సందేశం.. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. ఆందోళనాకరుల పధ్ధతి సరైనది కాదని, కుర్రాడిని కాల్చి చంపిన ఘటనలో పోలీసు అధికారిపై విచారణ జరుగుతోందని ఆందోళనకారులు శాంతించాలని కోరారు. Riots in France (Explained) Tuesday morning, A 17 year old Algirian muslim Nahel was driving a car with Polland number in Bus lane at Nanterre (Suburb of Paris) Police tried to stop him but he didn't stop. Police found him potential threat and shot (Video in last tweet) 1/5 pic.twitter.com/iIXPvEoraM — STAR Boy (@Starboy2079) June 30, 2023 ఇది కూడా చదవండి : యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ..
ఫ్రాన్స్: చాలాకాలం క్రితం రోమ్ నగరం తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి మాత్రం ఫిడేలు వాయించాడని చరిత్ర చెబుతోంది. తాజాగా అదే కథనాన్ని గుర్తు చేస్తూ ఒకపక్క ఫ్రాన్స్ దేశంలో అల్లర్లు చెలరేగుతుంటే మధ్యలో కూర్చుని ఒక యువకుడు మాత్రం ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ కనిపించాడు. పారిస్ లోని నాంటెర్రేలో ట్రాఫిక్ స్టాప్ వద్ద నల్ల జాతీయుడైన 17 ఏళ్ల యువకుడు నాహేల్ ను పోలీసులు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడంతో మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. నాహేల్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఘర్షణలు పెచ్చుమీరేలా చేశారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య పరస్పర దాడులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నగరమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మూకలను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. పారిస్ పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలతో ఒకపక్క అంతటి విధ్వంసం చెలరేగుతుంటే మరోపక్క ఒక యువకుడు మాత్రం ఇదేమీ పట్టనట్టుగా చాలా ప్రశాంతంగా కూర్చుని సాండ్ విచ్ తింటూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. 🚨🇫🇷INSOLITE - Un homme continue de manger son sandwich alors qu'il est au milieu de violents affrontements entre émeutiers et policiers à #Nanterre. (témoins) pic.twitter.com/VzLtpfRmty — AlertesInfos (@AlertesInfos) June 29, 2023 ఇది కూడా చదవండి: మోదీ చేసి చూపించారు.. పుతిన్ ప్రశంసలు -
మణిపూర్ లో అగ్గిరాజేసిన రిజర్వేషన్ల వ్యవహారం
-
రెండు వర్గాల మధ్య ఘర్షణ..జంషెడ్‌పూర్‌లో ఉద్రిక్తత..
జార్ఘండ్‌లోని జంషెడ్‌పూర్‌లో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. శనివారం శ్రీరామ నవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఇరు గ్రూప్‌లు ఘర్షణకు దిగాయి. నిందితులను పట్టుకోవాని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్లు అదికారులు తెలిపారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను నియంత్రించేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు శాస్త్రి నగర్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. గుమిగూడి ఉన్నవారిని అక్కడ నుంచి పంపించి.. ఆ ప్రాంతం మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. ఈ మేరకు సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. అల్లర్లుకు సంబంధించిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితికి తీసుకురావడానికి శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరూ సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పౌరులు అప్రమత్తమై సహకరించాలని విజయ్ అన్నారు. అలాగే శాంతి భ్రదతల రక్షణ కోసం తగినంత పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం, ఒక మేజిస్ట్రేట్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు సిబ్బందిని నియమించామని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు. పుకార్లను నమ్మవద్దదని ఎమ్మెల్యే జాదవ్ ప్రజలను కోరారు. పుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా సందేశాలు వస్తే పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. #WATCH | Security forces conduct flag march in Jamshedpur's Kadma police station area following an incident of stone pelting and arson, in Jharkhand Section 144 CrPc is enforced in the area and mobile internet is temporarily banned. pic.twitter.com/NhPnWtkQhR — ANI (@ANI) April 10, 2023 (చదవండి: కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అప్రమత్తంగా ఉండాల్సిందే!) -
బ్రెజిల్ రణరంగం: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత
ఫ్లోరిడా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు రాజధాని నగరం బ్రసీలియాలో అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు భవనాల వద్ద అల్లర్లు సృష్టించిన మరుసటి రోజునే బోల్సోనారో అస్వస్థతకు గురవటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెజిల్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేందుకు రెండు రోజుల ముందే డిసెంబర్ 31, 2022 రోజున అమెరికా వెళ్లారు బోల్సోనారో. 67 ఏళ్ల బోల్సోనారో ఫ్లోరిడా ఓర్లాండోలోని అడ్వెంట్‌హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్లో చేరినట్లు బ్రెజిల్‌కు చెంది ఓ గ్లోబో న్యూస్‌పేపర్ తెలిపింది. ‘ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బోల్సోనారో చికిత్స తీసుకుంటున్నారు. 2018 విజయోత్సవ ర్యాలీలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు.’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు ఆయన భార్య మిచెల్ బోల్సోనారో. మరోవైపు.. ఓర్లాండో ఆసుపత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. - Após facada sofrida em Juiz de Fora/MG, fui submetido à 5 cirurgias. Desde a última, por por 2x tive aderências que me levaram à outros procedimentos médicos. - Ontem nova aderência e baixa hospitalar em Orlando/USA. - Grato pelas orações e mensagens de pronto restabelecimento. pic.twitter.com/u5JwG7UZnc — Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 10, 2023 మద్దతుదారుల దురాక్రమణ.. బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన -
బ్రెజిల్ అల్లర్లు.. గవర్నర్‌ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు..
బ్రెజీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు ఆదివారం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 3,000 మంది పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ప్యాలెస్‌పై దాడి చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అయితే భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. దీంతో బ్రెజీలియా గవర్నర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మూడు నెలల పాటు అతన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. రాజధానిలో విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు లూలా స్పష్టం చేశారు. బోల్సోనారోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రెజిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అల్లరిమూకలు దేశ రాజధానిలో హింసకు పాల్పడ్డాయని విమర్శించారు. రాజధానిలో భద్రతా వైఫల్యానికి బోల్సోనారోనే కారణమని లూలా ఆరోపించారు. ఫెడరల్ సెక్యూరిటీ జోక్యం చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. విధ్వంసకారులను మతోన్మాద నాజీలు, మతోన్మాద స్టాలిన్లు, ఫాసిస్టులుగా అభివర్ణించారు. దాడులకు పాల్పడ్డవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో పార్టీపై స్వల్ప సీట్ల తేడాతో గెలిచారు లూలా. అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే బోల్సోనారో ఈయన విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి రాజధానిలో బ్రెజీలియాలో ఆదివారం విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించారు. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
బ్రెజిల్ అల్లర్లపై ప్రధాని మోదీ ఆందోళన
న్యూఢిల్లీ: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు వందల సంఖ్యలో రాజధాని బ్రెసిలియాలో బీభత్సం సృష్టించారు. పార్లమెంట్, సుప్రీం కోర్టుపై మెరుపుదాడికి దిగారు. ఈ క్రమంలో బ్రెసిలియాలోని ప్రభుత్వ ఆస్తులపై దాడులు, అల్లర్ల వార్తల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పిస్తూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘బ్రెసిలియాలోని ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేయడం, అల్లర్లు సృష్టించిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిలియన్ అధికారులకు మా పూర్తి మద్దతు ఉంటుంది.’అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. Deeply concerned about the news of rioting and vandalism against the State institutions in Brasilia. Democratic traditions must be respected by everyone. We extend our full support to the Brazilian authorities. @LulaOficial — Narendra Modi (@narendramodi) January 9, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్లో రణరంగం.. ఫాసిస్ట్ ఎటాక్‌గా అధ్యక్షుడి అభివర్ణన.. సంబంధం లేదన్న బోల్సోనారో -
మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం
మాచర్ల: కండీషన్ బెయిల్ పేరుతో టీడీపీ నేతలు మాచర్లలో అలజడి సృష్టించేందుకు మరోమారు విఫలయత్నం చేశారు. గత నెల 16వ తేదీన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం పేరుతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి 12వ వార్డులో ర్యాలీగా వెళ్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి ముగ్గురిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డి మరో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న నిందితులందరూ కండీషన్ బెయిల్‌కు సంబంధించి పట్టణ పోలీసు స్టేషన్లో సంతకాలు చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆదివారం సంతకాలు చేసేందుకు బ్రహ్మారెడ్డి, టీడీపీ నాయకులు వస్తున్న నేపథ్యంలో అలజడి సృష్టించాలని వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా మాచర్లకు తరలి రావాలంటూ వారి అనుచర వర్గానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీసు 30 యాక్టు, 144 సెక్షన్ అమలు చేస్తూ నెహ్రూనగర్ నుంచి పట్టణ పోలీసు స్టేషన్ వరకు గురజాల డీఎస్పీ మెహర్ జయరాం ప్రసాద్, సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దీంతో ఇతరులు అక్కడికి వచ్చి అలజడి సృష్టించే అవకాశం లేకపోయింది. కేవలం బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులు మాత్రమే 12.30 గంటలకు బస్సులోంచి చేతులూపుతూ వచ్చి సంతకాలు చేసి వెళ్లారు. ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. -
ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఫ్రాన్స్‌లో ఘర్షణలు..
పారిస్: ఆద్యంతం ఉత్కంఠసాగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఓడిపోడవడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి ఘర్షణలు చెలరేగాయి. పలుచోట్ల అభిమానులు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే హింసకు పాల్పడిన వందల మంది అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే ప్రఖ్యాత ఛాంప్స్-ఎలిసీస్ అవెన్యూకు వేల మంది అభిమానులు తరలివెళ్లారు. దీంతో ఆ ప్రాంతం కిక్కిరిసి ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించారు. అయితే మ్యాచ్ జరిగినంతసేపు ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం.. పెనాల్డీ షూటౌట్ ఫ్రాన్స్ ఓడిపోవడంతో ఉద్రిక్తంగా మారింది. వేల మంది అభిమానులు ఆగ్రహంతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పోలీసులపైకి బాణసంచా విసిరారు. ఘర్షణకు కూడా దిగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. #Lyon : les affrontements après la défaite de la #France en finale de la #FIFAWorldCup se poursuivent, les projectiles pleuvent sur les policiers déployés dans le centre-ville (🎥@JDANDOU @lyonmag) pic.twitter.com/wU40hfENZH — Lyon Mag (@lyonmag) December 18, 2022 ఆదివారం రాత్రి జరిగిన ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అదనపు సమయం ముగిసే సరికి ఫ్రాన్స్- అర్జెంటీనా చెరో మూడు గోల్స్ చేసి సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో 4-2 తేడాతో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. ఫలితంగా 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే తమ జట్టు ఓడినప్పటికీ గర్వపడే ప్రదర్శన చేసిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం తమ టీం సభ్యులను ఓదార్చారు. చదవండి: ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 19 మంది దుర్మరణం.. -
ఢిల్లీ అల్లర్ల కేసులో నిర్దోషిగా ఉమర్ ఖలిద్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన రాళ్ల దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ లీడర్ ఉమర్ ఖలిద్‌ను నిర్దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. అతడితో పాటు మరో విద్యార్థి నాయకుడు ఖలిద్ సైఫీపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది కర్కార్దూమా కోర్టు. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో బెయిల్ రానందున వారు జుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లపై ఉమర్ ఖలిద్పై ఖాజురి ఖాస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఛాంద్బాగ్ ప్రాంతంలో అల్లరి మూకలు చేరిన సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ సమయంలో తనను తాను రక్షించుకునేందుకు ఓ షెల్టర్‌లో తలదాచుకున్నట్లు తెలిపాడు కానిస్టేబుల్. స్థానికులపై దాడి చేయటం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో 2020, సెప్టెంబర్‌లో ఉమర్ ఖలిద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు జడ్జీ పులస్త్యా ప్రమాచల్.. ఈ మేరకు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పారు. అల్లర్లు జరిగినప్పుడు వారు అందులో పాల్గొన్నట్లు సరైన ఆధారాలు లేనందున వారిపై కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ వివరాలను ఖలిద్ సైఫీ తరఫు న్యాయవాది రెబ్బెకా జాన్ వెల్లడించారు. కోర్టు తీర్పు పూర్తి స్థాయి ఆదేశాలు అందాల్సి ఉందన్నారు. ఇదీ చదవండి: బెంగాల్లో ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన బీజేపీ! -
FIFA WC 2022: మొరాకో చేతిలో పరాభవం.. బెల్జియంలో చెలరేగిన అల్లర్లు
ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో జట్టు బెల్జియంపై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఖతర్‌లో అల్ థుమమ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 2-0 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన బెల్జియంను మొరాకో మట్టికరిపించింది. ఈ విజయంతో మొరాకో గ్రూప్-ఎఫ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. బెల్జియం రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది. బ్రెజిల్ పరాజయాన్ని జీర్జించుకోలేని పలువురు ఫుట్‌బాల్ అభిమానులు మొరాకో జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించారు. కొందరు కర్రలతో దాడి చేస్తూ వాహనాలపై రాళ్లు రువ్వారు. కారుతో సహా పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకోగా ఒకరిని అరెస్ట్ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బెల్జియం రాజధాని అంతటా అనేక చోట్ల ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని, సాయంత్రం 7 గంటల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని బెల్జియం పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పబ్లిక్ హైవేపై అల్లరి మూకలు పైరోటెక్నిక్ మెటీరియల్, కర్రలతో దాడి చేశారని, వాహనాలకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. బాణా సంచా పేల్చడంతో ఓ జర్నలిస్టు ముఖానికి గాయమైనట్లు పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల తాము జోక్యం చేసుకొని జల ఫిరంగులను, టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు తెలిపారు. చదవండి: Ju Ae: కిమ్ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే! 🚨BREAKING NEWS🚨 Brussels, home of the EU parliament, ERUPTS in street riots as Moroccans 'celebrate' their victory over their now home country. Are we feeling enriched? pic.twitter.com/YI0h6nXSxt — UNN (@UnityNewsNet) November 27, 2022 Meanwhile, in Brussels, Moroccans celebrate their win over Belgium. The cultural enrichment is paying dividends, right? pic.twitter.com/yakNCjTSSN — David Vance (@DVATW) November 27, 2022 -
అమరావతిలో కర్ఫ్యూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
సాక్షి, ముంబై: త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి. అమరావతి నగరంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు చేపట్టిన బంద్ సందర్భంగా హింస చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా మూడు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. త్రిపురలో మైనార్టీలపై దాడిచేసి, ఓ ప్రార్థనా మందిరాన్ని దుండగులు «ధ్వంసం చేశారన్న వార్తలతో అమరావతిలో శుక్రవారం ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా దుకాణాలపై కొందరు రాళ్లు రువ్వి, ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. శుక్రవారం జరిగిన హింసను వ్యతిరేకిస్తూ శనివారం అమరావతి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్వాయి. ఉదయాన్నే వందలాది మంది కాషాయం జెండాలు చేతబూని వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌కమల్ చౌక్‌తోపాటు పలు ప్రాంతాల్లో దుకాణాలపై రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అమరావతి నగర పరిధిలో కర్ఫ్యూ విధించారు. నాందేడ్, నాసిక్, యావత్మల్ తదితర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజేపీ నేతలు బలవంతంగా దుకాణాలు మూసివేయించారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, హోంశాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో బీజేపీ కార్యకర్తల బంద్ దృశ్యం -
అమ్మా... నాన్నా... కొట్టొద్దు ప్లీజ్
అమ్మా నాన్నా ఒకరితో ఒకరు బాగుంటే మంచిదే. ఒకరితో ఒకరు బాగోకపోయినా పిల్లలతో బాగుండాల్సిన బాధ్యత ఉంది. కాని ఇద్దరి మధ్య గొడవలు పిల్లలపై ప్రతీకారంగా మారితేనే సమస్య. నాన్న మీద కోపం అమ్మ పిల్లల మీద చూపినా అమ్మ మీద ఆగ్రహం నాన్న పిల్లల మీద చూపినా నలిగిపోయేది ఆ పసి మనసులే. తమిళనాడులో తులసి అనే తల్లి తన రెండేళ్ల కుమారుణ్ణి భర్త మీద కోపంతో కొట్టడం వైరల్ అయ్యింది. ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కలతల కాపురాలలో పిల్లలపై హింస గురించిన కథనం... రెండు రోజుల క్రితం తమిళనాడులో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఒక తల్లి తన రెండేళ్ల బాబును పదే పదే కొడుతూ ఆ వీడియోను రికార్డు చేసింది. ఆ పసివాడు తల్లి దెబ్బలకు తాళలేక ఏడుస్తూ తల్లి సముదాయింపు కోరుతూ ఉంటే ఆ తల్లి ఆ చిన్నారిని మళ్లీ మళ్లీ హింసించింది. ఇది బయటకు రావడంతోటే తమిళనాడు అంతా ఉలిక్కిపడింది. ఆ తల్లిని అరెస్టు చేయాలని నెటిజన్లు కోరారు. వెంటనే పోలీసులు రంగంలో దిగారు. ఆమెని అరెస్టు చేశారు. మూడు సెక్షన్లు– సెక్షన్ 323, 355, 75 కింద ఆమె ఇప్పుడు విచారణ ఎదుర్కొనాలి. ఏం జరిగింది? తమిళనాడు విల్లిపురం జిల్లాలోని గింజిలో వడివేలన్ (37), తులసి (22) భార్యాభర్తలు. వీరికి 2015లో వివాహం జరిగింది. ఇద్దరు అబ్బాయిలు. వడివేలన్ గింజిలో కాపురం పెట్టి చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. అయితే అతడు భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోందని గ్రహించి ఆమెని వారించాడు. మానకపోయేసరికి ఫిబ్రవరిలో చిత్తూరులోని ఆమె పుట్టింటికి పంపాడు. పిల్లల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఆమెను పుట్టింటికి పంపే ముందు ఆమె ఫోన్లో బాబును కొడుతూ రికార్డు చేసిన వీడియోలు చూశాడని ఒక కథనం. లేదా అప్పుడు రికార్డయిన వీడియోలు ఇప్పుడు బయట పడ్డాయని (అతడే బయటపెట్టాడని) ఒక కథనం. ఏమైనా కన్నతల్లి దారుణంగా తన పసిబిడ్డను కొట్టడం అందరినీ కలచి వేసింది. ఆదివారం తులసిని అరెస్టు చేసిన పోలీసులు విల్లిపురం తీసుకొచ్చారు. సైకియాట్రిస్టులు పరీక్షించి ఆమెకు ఏ మానసిక రుగ్మత లేదని నిర్థారించారు. కేవలం భర్త పట్ల కోపం, లేదా ఏదో ఒక నిస్పృహతోనే ఆమె పిల్లవాణ్ణి హింసించిందని ఒక అభిప్రాయం. ఎందుకు కొడతారు? ‘తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడతారంటే వాళ్లు తిరిగి కొట్టలేరని’ అని రాశాడు ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకట చలం. తల్లిదండ్రుల కోపతాపాలకు పిల్లలు నలిగిపోవడం ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉంది. భర్త మీద కోపంతో పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకున్న తల్లులు ఎందరో ఉన్నారు. భార్య మీద కోపంతో పిల్లల్నీ, తల్లిని హత్య చేసేంత వరకూ వెళ్లిన తండ్రులు ఉన్నారు. ఇవి తీవ్రమైన కేసులు అయితే బయటకు రానివి ఇంట్లోనే ఉండేవి పిల్లలకు మాత్రమే తెలుస్తాయి. కలతల కాపురం చేస్తున్న భార్యాభర్తలు తమ కోప తాపాలను పిల్లల మీద చూపడం, పిల్లలతో ‘నువ్వు పుట్టకపోయినా బాగుండేది ఏ నుయ్యో గొయ్యో చూసుకునే దానిని’ అని తల్లి అనడమో ‘నీ వల్లే మీ అమ్మతో వేగాల్సి వస్తోంది’ అని తండ్రి అనో పసి మనసులను గాయపరుస్తారు. అది చాలక భార్యను కొట్టలేక పిల్లల్ని కొట్టడం, భర్తను తిట్టలేక పిల్లల్ని బాదడం చేస్తుంటారు. ఇంకా దారుణంగా పిల్లలతో మాట్లాడటమే మానేసి తమ తమ పంతాలలో ఉండిపోతారు. ఇలా పిల్లల్ని బాధించడం శిక్షార్హమైన నేరం. ఒక వైపు అయితే... తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల్ని బాధిస్తూ ఉంటే తల్లి/తండ్రి కాని వెంటనే దాని నివారణకు సీరియస్‌గా ఆలోచించాల్సి ఉంటుంది. చట్ట సహాయం లేదా కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్ని ఆ బాధ నుంచి రక్షించాల్సి ఉంటుంది. కాని తల్లిదండ్రులు ఇద్దరూ బాధిస్తూ ఉంటే వారికి విముక్తి కలిగించాల్సిన బాధ్యత ఇరుగుపొరుగు వారిది, బంధువులది, స్నేహితులది అవుతుంది. కలహాల కాపురం దాచేస్తే దాగేది కాదు. కచ్చితంగా అయినవారికి తెలుస్తుంది. అలా తెలిశాక వారు చేయాల్సిన పని పిల్లల మీద ఏదైనా హింస జరుగుతున్నదా అని ఆరా తీయడమే. ఈ పని తప్పక చేయాలి. ఇది అంత సులువు కాకపోయినా పిల్లల మెల్లగా బుజ్జగించి ఆ విషయాన్ని రాబట్టాల్సి ఉంటుంది. లేదా అమ్మమ్మలు, తాతయ్య లు అయితే హక్కుగా కూడా నిలదీసి తెలుసుకోవచ్చు. అలా జరుగుతున్న పక్షంలో ఆ తల్లిదండ్రులను హెచ్చరించాలి లేదా పిల్లల్ని ఆ వాతావరణం నుంచి తప్పించాల్సి ఉంటుంది. బ్లాక్‌మెయిలింగ్ సాధనం భార్యాభర్తల కొట్లాటలలో పిల్లలు ఒక బ్లాక్‌మెయిలింగ్ సాధనంగా మారటం చాలా విషాదం. సమస్య చేయి దాటేశాక భర్తను/భార్యను తిరిగి అదుపులోకి తెచ్చుకోవడానికి ‘నా మాట వినకపోతే పిల్లల్ని చంపేస్తా’ అనే వరకూ వెళ్లిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అందుకు శాంపిల్‌గా పిల్లలకు వాతలు పెట్టి జీవిత భాగస్వామిని భయభ్రాంతం చేయాలనుకునే తల్లి/తండ్రి ఉన్నారు. ఈ సమస్య నుంచి పిల్లలు తమను తాము కాపాడుకోలేరు. దగ్గరి బంధువులే ఒక కన్నేసి పెట్టి ఈ పిల్లల గురించి పట్టించుకోవాలి. ‘మాకెందుకులే’ అనే భయం ఉంటే కనీసం చైల్డ్ కేర్ సెంటర్లకు ఫోన్ చేసి చెప్పడమో, పోలీసులకు ఇన్ఫామ్ చేయడమో చేయాలి. తల్లిదండ్రులు ఒక విషయం ఆలోచించాలి. కుదరని సంసారం నుంచి బయటపడటం లేదా సర్దుబాటు చేసుకోవడం ఈ ప్రాసెస్‌లో భార్య/భర్త ఒకరినొకరు ఎంత ఇబ్బంది పెట్టుకున్నా ఆ వ్యవహారంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ఏ మాత్రం సంస్కారం కాదని గ్రహించాలి. ఇటీవల బడులలో ‘గుడ్ టచ్’ ‘బ్యాడ్ టచ్’ గురించి అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు ‘కొట్టే తల్లిదండ్రులు’ గురించి కూడా పిల్లలు టీచర్లకు చెప్పే అవగాహన కల్పించడం అవసరం. అప్పుడే పిల్లల్ని కొట్టే తల్లిదండ్రుల ఆగడాలు ఆగుతాయి. -
బెంగాల్ అల్లర్లపై 9 సీబీఐ కేసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస, అల్లర్లకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తొమ్మిది కేసులను నమోదుచేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను సీబీఐ ఆయా చోట్లకు పంపినట్లు గురువారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ ప్రభుత్వం తమకు అప్పజెప్పిన కేసులతోపాటు మరికొన్ని కేసుల నమోదు ప్రక్రియను సీబీఐ కొనసాగిస్తోంది. పలు హత్యలు, అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలపై ఐదుగురు జడ్జిల కలకత్తా హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు కేసుల విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది. మే 2న ఎన్నికల ఫలితాలొచ్చాక జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని హైకోర్టు గతంలో ఈ ఆదేశాలిచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. పలు వినతుల నేపథ్యంలో కేసుల దర్యాప్తునకు బెంగాల్ పోలీసుల నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు హైకోర్టు గతంలో ఆదేశించింది. సీబీఐ, సిట్ వేర్వేరుగా 6 వారాల్లోగా దర్యాప్తు నివేదికలను సమర్పించాలని హైకోర్టు సూచించింది. కేసులు ఉపసంహరించుకోండంటూ బెదిరించారని, చాలా హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించి కనీసం ఎఫ్ఐఆర్లు నమోదు చేయించలేదని హైకోర్టుకు బాధితులు గతంలో విన్నవించుకున్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించనందునే స్వతంత్ర దర్యాప్తు అవసరమనే నిర్ణయానికొచ్చామని కోర్టు వ్యాఖ్యానించింది. -
భైంసా అల్లర్లు: అనుమతి ఇవ్వకపోతే చస్తా!
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లలో అరెస్టు అయిన తన కొడుకును కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని భైంసా పట్టణానికి చెందిన సురేఖ ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకును చూసేందుకు గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితో కలిసి జిల్లా ఆదిలాబాద్ జైలుకు రాగా సిబ్బంది అనుమతి నిరాకరించారు. తన కొడుకుతో మాట్లాడించకపోతే జైలు ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. 15 రోజుల కింద తన కొడుకు గోకుల్‌ను అరెస్టు చేసి ఇక్కడికి తీసుకువచ్చారని, అప్పటి నుంచి కనీసం ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదని కన్నీరుపెట్టుకుంది. తన కొడుకును చూసేంత వరకూ వెళ్లేంది లేదని జైలు ఎదుట బైటాయించింది. అనంతరం జిల్లా జైలర్ శోభన్‌బాబు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జడ్జి ఆదేశాల మేరకు గోకుల్‌ను పోలీస్ కస్టడీలో ఉంచారని, అతడిని కలవడానికి అనుమతి లేదని వివరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మిలాకత్ ప్రారంభిస్తామని, అప్పుడు వచ్చి కలువచ్చని తెలిపారు. చదవండి: భైంసా అల్లర్లు: కీలక విషయాలు వెల్లడించిన ఐజీ -
భైంసా అల్లర్లు: కీలక విషయాలు వెల్లడించిన ఐజీ
సాక్షి, హైదరాబాద్: భైంసాలో జరిగిన అల్లర్లలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. అల్లరకు ప్రధాన కారణం హిందూవాహిని కార్యకర్తలే అని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ‘ఈనెల 7వ తేదీన రాత్రి 8.20 గంటలకు గొడవ మొదలైంది.. అందులో ప్రధానంగా హిందూవాహినికి చెందిన తోట మహేశ్, దత్తు పటేల్ అనే ఇద్దరు బైకుపై వెళ్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రిజ్వాన్ అతని మిత్రులు సమీర్, మిరాజ్‌లను వెనక నుంచి తలపై కొట్టారు. కోపంతో ఈ ముగ్గురు మహేశ్‌ను వెంబడిస్తూ బట్టీ గల్లీలోకి వెళ్లి వెదకడం ప్రారంభించారు’’ అన్నారు. ‘‘ఈ క్రమంలోనే ఆ ముగ్గురిపై దత్తు, మహేశ్.. రాకేశ్, గోకుల్‌తో కలసి దాడి చేశారు. అనంతరం ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత మద్యం కొనేందుకు దత్తు బైక్‌పై జుల్ఫికర్ మసీద్ ప్రాంతం నుంచి వెళ్లే క్రమంలో మరో వర్గం ఎదురుపడటంతో మళ్లీ ఘర్షణ మొదలైంది. ఆ సందర్భంగా రమణా యాదవ్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌పై ఇటుకతో దాడి చేసి తల పగులగొట్టాడు. అక్కడ ఓ నిర్మాణం కోసం వచ్చిన ట్రక్కులో తెచ్చిన ఇటుకలున్నాయి. వీటిని ఆయుధాలుగా చేసుకుని రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ, సీఐ కేవలం గంటన్నర నుంచి రెండు గంటల్లోగా అల్లర్లను అదుపుచేశారు’’ అని తెలిపారు. ‘‘వీరితో పాటు ఎస్పీ విష్ణు వారియర్ అతని బలగాలు, ఇతర జిల్లాల నుంచి రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ, అడిషనల్ ఎస్పీలు తమ బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ అల్లర్లలో 15వ వార్డు కౌన్సిలర్ ఎంఐఎం పార్టీకి చెందిన అబ్దుల్ కరీం అతని అనుచరులు, హిందూవాహినికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ తోట విజయ్ వర్గీయులు పాల్గొన్నారు. ఏడో తేదీ తర్వాత 8, 9, 10వ తేదీల్లో పార్థి, మహాగావ్ భైంసా శివార్లలో జరిగిన అల్లర్లలో హిందూవాహినికి చెందిన సంతోష్, క్రాంతి, లింగోజీ, బాలాజీ, జగదీశ్ పాత్ర ఉన్నట్లు గుర్తించాం. సంతోష్‌కు హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు చెప్పడంతోనే హింసకు దిగారు. లింగోజీ అల్లర్లలో స్పెషలిస్ట్.. గత అల్లర్లలోనూ ఇతని పాత్ర ఉంది. ఇవీ.. ఈ మొత్తం వ్యవహారానికి దారితీసిన పరిస్థితులు. భైంసాలో 500 మంది పోలీసులతో ఎస్పీ వారియర్ ఆధ్వర్యంలో నిరంతర గస్తీతోపాటు 27 పికెట్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ భైంసాలో శాంతిని పునఃస్థాపించాం. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదు. సంతోష్ అతని అనుచరులను అరెస్టు చేయగానే.. అల్లర్లు మొత్తం ఆగిపోయాయి..’ అని వివరించారు. 26 కేసులు..42 మంది అరెస్టు ఇక ఇద్దరు విలేకరులతో కలిపి మొత్తం 12 మంది పౌరులకు అల్లర్లలో గాయాలయ్యాయని నాగిరెడ్డి తెలిపారు. ‘13 షాపులు, 4 ఇళ్లు, 4 ఆటోలు, 6 ఫోర్‌వీలర్లు, 5 టూవీలర్లను దహనం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో భైంసాలోని సీసీ కెమెరా ఫుటేజీలు, ఫోన్ కాల్స్ వివరాలు తదితర సాంకేతిక ఆధారాలతోపాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఘటనకు సంబంధించి 26 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 38 మందితోపాటు నలుగురు మైనర్లను కలిపి మొత్తం 42 మందిని అరెస్టు చేశాం. అల్లర్ల సమయంలో రోడ్లపైకి వచ్చిన 70 మందిని గుర్తించాం. మరో 66 మందిని బైండోవర్ చేశాం. ఈ విషయాన్ని పోలీసు శాఖ చాలా తీవ్రంగా తీసుకుంది. అందుకే, శాంతి భద్రతల విషయాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ పర్యవేక్షిస్తుండగా, కేసుల దర్యాప్తు పర్యవేక్షణకు కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డికి అప్పగించాం. ఇలాంటి ఘటనలు పునరావృతం చేయాలని చూసేవారిపై పీడీ కేసులు నమోదు చేస్తాం. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి. అల్లర్లలో పాల్గొన్న నిందితులు శిక్షలు పడేలా చూస్తాం. ఘటనతో సంబంధమున్న వారు ఏ పార్టీ, సంస్థకు చెందిన వారైనా సరే అరెస్టు చేస్తాం. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసుకుంటున్నాం.. అందుకే సీనియర్లను కూడా అక్కడ పరిస్థితులను పర్యవేక్షించేలా ఏర్పాటు చేశాం. అల్లర్లు చెలరేగిన 5 నుంచి 10 నిమిషాల్లోపే అదనపు బలగాలు చేరుకుని అదుపు చేశాయి. భైంసాలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి విషయంలోనూ పోలీసు దర్యాప్తు సజావుగా సాగుతోంది. అయితే బాధితులు చిన్నారిని భైంసా ఆసు పత్రికి తీసుకెళ్తే.. వారిని వెనక్కి పంపారు. ఈ ఒక్క పొరపాటు తప్ప కేసు దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగలేదు..’అని వెల్లడించారు. ఆ ఐపీఎస్‌లపై హత్యాయత్నం కేసు పెట్టాలి: బండి సంజయ్ భైంసా అల్లర్లపై న్యాయ విచారణ చేపట్టాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ కైలాస్‌నగర్(ఆదిలాబాద్): భైంసా అల్లర్ల విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి హిందూవాహిని కార్యకర్తలు, అమాయక హిందూ యువకులను అమానుషంగా హింసించిన ఐపీఎస్ అధికారులపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న హిందూవాహిని కార్యకర్తలను పరామర్శించేందుకు మంగళవారం అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి.. హిందూ పరిరక్షణ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేసి దారుణంగా హింసించారని దుయ్యబట్టారు. హిందూవాహిని నేతలు సంతోష్, లింగోజి, క్రాంతి (18) అనే యువకుడిని ప్రొహిబిషన్‌లో ఉన్న పోలీసులతో కొట్టించారని ఆరోపించారు. దీన్ని వదిలిపెట్టే ప్ర సక్తే లేదని, న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హిందూ వ్యతిరేకులను పెంచి పోషిస్తున్నారని, బాలికపై అత్యాచారం జరిగినా çస్పందించని ఏకైక సీఎం ఆయనేనని విమర్శించా రు. భైంసా పట్టణాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కబంధహస్తల నుంచి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అల్లర్ల ఘటనపై ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో హిందూవాహిని రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తదితరులున్నారు. చదవండి: భైంసాలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల అవస్థలు -
భైంసాలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల అవస్థలు
సాక్షి, రాయికల్(జగిత్యాల): నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను ఆ జిల్లావ్యాప్తంగా నిలిపివేశారు. దీంతో కరోనా కారణంగా వర్క్‌ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన చౌడారపు మహేశ్వరి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది. మద్దిపడగలో ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో జగిత్యాల జిల్లా రాయికల్‌లోని బంధువుల ఇంటికి వచ్చి విధులు నిర్వర్తిస్తోంది. తండ్రితో కలిసి మోటార్‌సైకిల్‌పై సుమారు 40 కిలోమీటర్లు రోజూ వచ్చి వెళ్తోంది. శనివారం కూడా వచ్చి విధులు నిర్వర్తించి వెళ్లింది. ఇదేవిధంగా అనేకమంది ఇంటర్నెట్ సదుపాయం కోసం ఇతర జిల్లాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. -
భైంసా ఘటనలు దురదృష్టకరం
భైంసా/ భైంసా టౌన్/ భైంసా రూరల్: నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, రాజకీయ లబ్ధి కోసమే కొందరు టీఆర్ఎస్పై బురద జల్లుతున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకీతో కలసి శనివారం ఆయన భైంసా మండలం మహాగాంలో పర్యటించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనలో ఆస్తులు నష్టపోయిన బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి భైంసాకు చేరుకుని స్థానిక బస్టాండ్ వద్ద దహనమైన దుకాణ సముదాయాలను పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అల్లర్ల వెనుక ఏ రాజకీయ పార్టీకి చెందినవారు ఉన్నా ఉపేక్షించేది లేదని అన్నారు. తరచూ జరుగుతున్న ఘర్షణలు ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో భైంసా పట్టణంపై దృష్టి సారించిందని తెలిపారు. ఇలాంటి సమయంలో భైంసా ప్రజలకు అండగా నిలిచేది పోయి రాజకీయం చేయడం పద్ధతి కాదన్నారు. -
భైంసాలో ఉద్రిక్తత.. ఇంటెర్నెట్ సేవలు బంద్
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన గొడవల ప్రభావంతో మంగళవారం కూడా హైఅలర్ట్ కనిపించింది. పట్టణమంతా పోలీసు పికెటింగ్‌లు, పెట్రోలింగ్ వాహనాలు తప్ప జనాలెవరూ రోడ్లపైకి రాలేదు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, మెడికల్ షాపులు, కూరగాయలు, కిరాణా, ప్రైవేట్ ఆస్పత్రులు కూడా మూసే ఉన్నాయి. పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. దాదాపుగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. భారీగా బందోబస్తు కొనసాగినా, జనం రోడ్లపై కనిపించకపోయినా.. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో మంగళవారం ఉదయం మరో కారు దహనమైంది. ఇంటిముందు నిలిపి ఉంచిన కారుకు ఎవరో నిప్పంటించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఫైరింజన్‌ను రప్పించి మంటలు ఆర్పివేయించారు. దీంతో మళ్లీ ఏదో జరుగుతోందని ప్రజల్లో భయం కనిపించింది. కొనసాగుతున్న విచారణ భైంసాలోని జుల్ఫిగల్ గల్లీలో ఆదివారం రాత్రి బైకు సైలెన్సర్ విషయంగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. నిమిషాల్లోనే ఇరువర్గాల వారు గుమిగూడి పరస్పర రాళ్లదాడికి, హింసకు పాల్పడ్డారు. పోలీసులు త్వరగా స్పందించడంతో రాత్రి 10.30 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే జుల్ఫికర్ గల్లీ, సంజయ్ గాంధీ మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో ఆస్తి, వాహనాల విధ్వంసం జరిగింది. రెండు ఇళ్లు, రెండు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాలు, ఐదు కార్లు దహనమయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే సుమారు 14 మందిని అదుపులోకి తీసుకోగా.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ, ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఘటనలో వాహనాలు దహనమైన బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారినుంచి ఫిర్యాదులు తీసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన గొడవల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనేది ఆరా తీస్తున్నారు. నిఘా బృందాలు కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నాయి. ఇక రెవెన్యూ అధికారులు రెండోరోజు సైతం ఆస్తి నష్టం వివరాలను అంచనా వేస్తూ కనిపించారు. కొనసాగిన ఆంక్షలు.. ఇంటర్నెట్ బంద్ భైంసా పట్టణం, పరిసర ప్రాంతాల్లో పోలీసు ఆంక్షలు కొనసాగాయి. పట్టణానికి వచ్చే అన్నిమార్గాల్లో, పట్టణంలోని గల్లీల్లోకి వెళ్లే రహదారుల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గల్లీల్లో ఉన్నవారిని బయటికి అనుమతించలేదు. బయటివారిని లోనికి వెళ్లనీయలేదు. వేరే ఊర్ల నుంచి వచ్చేవారిని పట్టణంలోకి రానివ్వలేదు. మొత్తంగా భైంసాలో ఏం జరుగుతోందో బయటి జనానికి అంతుచిక్కని పరిస్థితి ఉంది. వరుసగా రెండోరోజు సైతం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పోలీసు ఆంక్షలతో మంగళవారం సైతం భైంసా డిపో నుంచి బస్సులు బయటికి రాలేదు. పట్టణం నుంచి బయటికి వెళ్లేవారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది. అత్యవసర సేవల్లో పాల్గొనే సిబ్బందికి సైతం ఎలాంటి పాసులు జారీ చేయక.. ఇబ్బంది పడ్డారు. భైంసా డివిజన్లో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకూ ఇబ్బందులు తప్పలేదు. వారంతా భైంసాలో ఉంటూ ఊర్లలో విధులకు వెళ్లొస్తుంటారు. తీవ్ర ఇబ్బందుల్లో జనం పట్టణంలో పోలీసు ఆంక్షలు, దుకాణాలు మూసి ఉండటంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ఏరియాల్లో పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందక అల్లాడుతున్నారు. ముఖ్యం గా పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక చాలా మంది వాటర్ ప్లాంట్ల నుంచి రక్షిత మంచినీటిని తెచ్చుకునేవి. ఇప్పుడు వాటర్ సరఫరా చేసే ఆటోలనూ అనుమతించకపోవడంతో నల్లా నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉంది. ఎంపీని అడ్డుకున్న పోలీసులు బాల్కొండ: చలో బైంసా నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఎంపీ సోయం బాపురావును నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ వైపు వెళ్లేందుకు అనుమతి లేదని.. హైదరాబాద్‌లోని నివాసానికి తిరిగి వెళ్లాలని సూచించారు. దీంతో పోలీసులపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీ.. కాసేపటికి వెనుదిరిగి వెళ్లిపోయారు. -
లవర్స్ డే బీభత్సం: మాజీ ఎమ్మెల్యే, 22మందిపై కేసు
భోపాల్: ప్రేమికుల దినోత్సవం రోజు వచ్చిందంటే ప్రేమికులతో పాటు మరికొందరు గుర్తొస్తారు. వారే పాశ్చాత్య సంస్కృతి అంటూ వాలంటైన్స్ డే నిర్వహించుకోవద్దని చెబుతూ హిందూ సంఘాలు విజ్ఞప్తి చేస్తాయి. అయితే దాన్ని పట్టించుకోకుండా ఫిబ్రవరి 14 రోజులు ప్రేమికులు ఎక్కడైనా కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని హెచ్చరించే విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా ప్రేమికుల రోజు బీభత్సం జరిగింది. పలు చోట్ల దాడులకు పాల్పడడంతో ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వాలంటైన్స్ డే రోజు శుక్రవారం భోపాల్‌లోని శ్యామల హిల్స్ ప్రాంతంలో బీజేపీ యూత్ వింగ్ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న హుక్కా బార్ లాంజ్ ఆస్తులపై కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌పై కేసు నమోదు చేశారు. భోపాల్‌లోని అరేరా కాలనీ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అయితే ఈ దాడిలో ముగ్గురు మహిళలు కూడా పాల్గొనడం విశేషం. శ్యామల హిల్స్ ప్రాంతంలో దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించిన వారిపై హబీబ్‌గంజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హుక్కా బార్లను, లాంజ్‌లపై మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ వ్యతిరేకతను ప్రదర్శించారు. భోపాల్‌లో వివిధ ప్రాంతాల్లో హుక్కా బార్లను, లాంజ్‌లను మూసివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ‘యువతులకు డ్రగ్స్ అందిస్తున్న, లవ్ జిహాద్‌కు ప్రోత్సహితస్తున్న హుక్కా బార్లకు ఇది ఒక ప్రారంభ హెచ్చరిక మాత్రమే’ అని బీజేవైఎం నాయకుడు అమిత్ రాథోడ్ చెప్పారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌తో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు జోన్-3 అదనపు ఎస్పీ రామ్ సనేహి మిశ్రా తెలిపారు. వాలెంటైన్స్ డే రోజు చోటుచేసుకున్న రెండు ఘటనలకు సంబంధించి హబీబ్‌గంజ్, శ్యామలహిల్స్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లో బీభత్సం సృష్టించిన ఘటనలో మొత్తం 23కేసులు నమోదయ్యాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. Saffron brigade on the rampage on Valentine Day in Bhopal. Shiv Sena and BJYM (BJP's youth wing) activists vandalized property at separate restaurants and hookah bar-lounge.17 persons, icluding ex BJP MLA Surendra Nath Singh 'Mamma' held. @NewIndianXpress pic.twitter.com/PloSOiXqvG — Anuraag Singh (@anuraag_niebpl) February 14, 2021 -
ఢిల్లీ అల్లర్లు : 15,000 పేజీల చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హింసపై ఢిల్లీ పోలీసులు బుధవారం 15,000 పేజీలతో కూడిన చార్జిషీట్ దాఖలు చేశారు. చార్జిషీట్లో 15 మంది పేర్లను పొందుపరిచారు. ఘర్షణలతో అట్టుడికిన ఢిల్లీలో 53 మంది మరణించారు. ఈ హింసాకాండపై కర్కదూమా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో 15 మంది నిందితుల పేర్లను చేర్చారు. వీరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం, ఐపీసీ, ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.మరోవైపు ఢిల్లీ ఘర్షణల కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో జేఎన్‌యూ నేత ఉమర్ ఖలీద్, సర్జీల్ ఇమాంల పేర్లను ప్రస్తావించలేదు. కాగా, కొద్దిరోజుల కిందట అరెస్ట్ అయిన ఉమర్, సర్జీల్ల పేర్లను అనుబంధ చార్జిషీట్లో చేర్చే అవకాశం ఉంది. ఢిల్లీలో చెలరేగిన సీఏఏ ఘర్షణలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. చదవండి : ‘ఉమర్ ఖలీద్‌ను ఉరి తీయడం ఖాయం’ -
‘న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చెలరేగిన అల్లర్ల (సీఏఏ)కు సంబంధించి అనుబంధ చార్జిషీట్లో సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్‌కు చెందిన యోగేంద్ర యాదవ్, ఇతర మేథావుల పేర్లను వెల్లడించిన ఢిల్లీ పోలీసులు నేర న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారని కాంగ్రెస్ నేత పీ చిదంబరం అన్నారు. సమాచారం, చార్జిషీట్ మధ్య విచారణ, ధృవీకరణ వంటి కీలక దశలుంటాయని ఢిల్లీ పోలీసులు మర్చిపోయారా అని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆదివారం ట్వీట్ చేశారు. చదవండి : ‘దేవుని చర్య’.. ఆగని విమర్శలు ఇంకా ఢిల్లీ పోలీసులు వెల్లడించిన డిస్క్లోజర్ స్టేట్మెంట్లో ఆర్థిక వేత్త జయతి ఘోష్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ రాహుల్ రాయ్‌ల పేర్లున్నాయి. కాగా వీరిని తాము నిందితులుగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు అనుబంధ చార్జిషీట్ దాఖలు కావడంతో దీనిపై రాజకీయ దుమారం రేగింది. తమ పార్టీ ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావిస్తుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించగా వందలాది మందికి గాయాలయ్యాయి. -
ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్లో పలువురు ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ కేసులో సహ కుట్రదారులుగా పలువురు ప్రముఖులును చేర్చడం తాజాగా సంచలనం రేపింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ , డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు చేర్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో (సెప్టెంబరు,14న) ప్రారంభం కానున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం జాఫ్రాబాద్ ఘర్షణలో జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. ఢిల్లీలో అల్లర్లు రేపేందుకు కొందరు కుట్ర పన్నారని ఫాతిమా తెలిపారనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని తనతో చెప్పారని ఫాతిమా అంగీకరించారని తెలిపింది. ఇందులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పాత్ర ఉందని, ఆయనే అల్లర్లకు పథకం రూపొందించారన్న ఫాతిమా మాటలను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ పొందుపర్చారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఫేస్బుక్ ఇండియా ఎండీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.ఈ ఏడాది ఆరంభంలో చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లలో ఫేస్‌బుక్‌కు పాత్ర ఉందంటూ, ఫేస్బుక్ ఇండియా అధికారులకు తాజా నోటీసులు జారీ అయ్యాయి. ద్వేషపూరిత కంటెంట్ పై చర్య తీసుకోవడంలో విఫలమైందంటూ ఆరోపించిన ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సెప్టెంబర్ 15 న ఢిల్లీ విధానసభ ముందు హాజరుకావాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. తమ వాదనను వినిపించేందుకు సెప్టెంబర్ 15 మంగళవారం హాజరు కావాలని ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య పూర్వక కమిటీ,, ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ కు సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజేంద్రనగర్ చెందిన ఎమ్మెల్యే రాఘవ చాదా నేతృత్వంలోని కమిటీ ఈ సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై కొంతమంది సాక్షులను, సాక్ష్యాలను పరిశీలించిన మీద ఈ సమన్లు జారీ చేశామని కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు తీవ్రతరం కావడానికి ఫేస్బుక్ కారణమైందని ఆగస్టు 31వ తేదీన జరిగిన రెండో విచారణలో కమిటీ నిర్ధారించింది. రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న ఫేస్ బుక్ మరోసారి వివాదంలో పడింది. ప్రధానంగా అధికార బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ సంస్థ వ్యవహరిస్తోందని, హింసను ప్రేరేపించే విద్వేషపూరిత కంటెంట్ విషయంలో పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఇటీవల వచ్చిన ఆరోపణల మధ్య తాజా నోటీసులు జారీ అయ్యాయి. -
నవీన్ తల తెస్తే రూ.50 లక్షలు
సాక్షి బెంగళూరు: సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టు చేసి బెంగళూరులోని డీజే హళ్లి – కేజీ హళ్లి అల్లర్లకు పరోక్షంగా కారణమైన పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ తల తెస్తే రూ.50 లక్షలు నజరానాగా ఇస్తానని మీరట్‌కు చెందిన షహజీబ్ రిజ్వి అనే వ్యక్తి శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు సహజమని నవీన్ తండ్రి పవన్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు, శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయన్నారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్ భర్త సహా 60 మందిని అరెస్టు చేశారు. (బెంగళూరు హింస: ఉద్వేగానికి లోనైన ఎమ్మెల్యే) -
భగ్గుమన్న బెంగళూరు!
సాక్షి, బెంగళూరు: ప్రశాంతతకు పెట్టింది పేరుగా ఉండే కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ వ్యక్తి ఫేస్బుక్లో షేర్ చేసిన పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసింది. పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడికి ప్రేరేపించింది. మంగళవారం సాయంత్రం చిన్నపాటి గొడవగా ఆరంభమై రాత్రికి అల్లర్లు ఉధృతమయ్యాయి. వేల సంఖ్యలో జనాలు వచ్చి పోలీస్‌స్టేషన్, ఎమ్మెల్యే ఇంటిపై దాడులకు తెగబడ్డారు. గంటలపాటు విధ్వంసకాండ కొనసాగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఫేస్బుక్లో పోస్టు చేసిన వ్యక్తి పులకేశినగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి సమీప బంధువు. ఎమ్మెల్యే అండతోనే అతడు ఇలా చేస్తున్నాడని భావించి మరో గుంపు కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేసింది. అక్కడి వాహనాలకు నిప్పు పెట్టగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఫైరింజన్లు వెళ్లకుండా అడ్డుపడ్డారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు బెంగళూరు నగర కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. కాల్పుల్లో వాజిద్ ఖాన్ (20), యాసిమ్ పాషా (22), వాసిం (40) అనే వారు చనిపోయారు. దాడుల్లో 60 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. వివాదాస్పద పోస్టు పెట్టిన నవీన్‌ను, అల్లర్లకు పాల్పడిన మరో 110 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే కుటుంబం క్షేమంగా బయటపడింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం యెడియూరప్ప ఆదేశించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి, సీఆర్పీఎఫ్ను మోహరించారు. ఏం జరిగిందంటే? శివాజీనగరకు చెందిన ఓ వర్గం వారు 15 మంది మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో డీజే హళ్లి పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. మతపరమైన అంశాల్లో నవీన్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కేశవమూర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేస్తామని చెప్పారు. అయితే తక్షణమే అరెస్టు చేయాలంటూ వాగ్వాదానికి దిగారు. అంతలోనే సుమారు 4 వేల మంది అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకుని, పలు వాహనాలకు నిప్పు పెట్టారు. స్టేషన్‌పై రాళ్లురువ్వారు. అర్థరాత్రి 2 గంటల తర్వాత కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అప్పటికే ఆ మార్గంలో 26 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 2 ఆటోలు, 3 కార్లు, 40 ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. ఆరంభంలోనే సీసీటీవీలు ధ్వంసం చేశారు. ఏటీఎం పగలగొట్టారు. -
ఆ పుకారు వల్లే ఢిల్లీ అల్లర్లు
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మద్దతుదారులు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే పుకారే ఢిల్లీలో పెద్ద ఎత్తున హింసకు దారి తీసిందని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. కాగా కపిల్ మిశ్రా తన మద్దతుదారులతో కలిసి మౌజ్‌పూర్‌లో ఫిబ్రవరి 23న సీఏఏ అనుకూల ర్యాలీ తీశారు. అయితే వీరు జఫరాబాద్‌లో సీఏఏ వ్యతిరేక నిరసన వేదికకు నిప్పంటించారనే వదంతులు వ్యాపించడంతో పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు. దీంతో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ క్రమంలో డయల్పూర్‌లో ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్‌పై దుండగులు మూక దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశారని ఛార్జిషీటులో ప్రస్తావించారు. (భావజాలం రగిలించిన ఘర్షణలు) అయితే ఉద్దేశపూర్వకంగా అల్లర్లను ప్రేరేపించడానికే ఈ వదంతులు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. మరోవైపు స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమ కారుడు యోగేంద్ర యాదవ్ పేరును ఛార్జిషీట్లో ప్రస్తావించినప్పటికీ నిందితుడిగా పేర్కొనలేదు. అయితే అతను ఛాంద్ బాగ్‌లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని పేర్కొన్నారు. ఇక సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగమే ఢిల్లీలో అల్లర్లకు నాంది అయిందని అంతర్జాతీయ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు కొనసాగిన ఢిల్లీ అల్లర్లలో సుమారు 50 మంది మరణించారు. (ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి) -
నీడనిచ్చి ఆదుకున్న మన హీరో!
వాషింగ్టన్: అపరిచితులకు ఆశ్రయమిచ్చి, పోలీసుల నుంచి సుమారు 70 మందిని రక్షించినందుకు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రాహుల్ దూబేను మీడియా హీరోగా కొనియాడుతోంది. అమెరికాలోని మినియాపోలిస్‌లో గత వారం ఒక పోలీస్ అధికారి చేతిలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి చెందగా.. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్లో రాహుల్ దూబే ఇంటికి సమీపంలో కొంతమంది ఆందోళనలు నిర్వహిస్తూండగా.. కర్ఫ్యూ సమయం సమీపిస్తున్న తరుణంలో పోలీసులు వారిని చుట్టుముట్టారు. ఆ సమయంలో రాహుల్ వారందరినీ తన ఇంట్లోకి రావాల్సిందిగా కోరారు. వాషింగ్టన్లో 17 ఏళ్లుగా ఉంటున్న రాహుల్ అల్వారేజ్ దూబే ట్రేడింగ్ కంపెనీని నడుపుతున్నారు. ఇంట్లోకి వచ్చిన అపరిచితులకు ఆహారం ఇవ్వడంతోపాటు రాత్రంతా ఉండేందుకు, తద్వారా వారు పోలీసుల చేత చిక్కకుండా కాపాడారని పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ‘దాదాపు 75 మంది ఉన్నారు. కొందరు సోఫాల్లో సర్దుకున్నారు. వచ్చిన వాళ్లలో తల్లీ బిడ్డలతో కూడిన కుటుంబం ఉంది. వాళ్లు నా కొడుకు గదిలో విశ్రాంతి తీసుకున్నారు’అని 44 ఏళ్ల దూబే చెప్పారు. చేసింది గొప్ప పనేమీ కాదు: రాహుల్ తాను కొంతమందికి ఆశ్రయం కల్పించడం గొప్ప పనేమీ కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘రాత్రి 8.30 గంటలపుడు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా వారందరూ మా ఇంటివైపు పరుగెత్తుతూ వచ్చారు. వచ్చినవాళ్లను వచ్చినట్లే లోపలకు లాగేసుకున్నాం’అని రాహుల్ చెప్పారు. -
‘కాళ్లావేళ్లా పడ్డా వదలిపెట్టలేదు’
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసాలో కత్తులు, గొడ్డళ్లతో ఓ వర్గం వారి ఇండ్లపై కొందరు వ్యక్తులు దాడి చేశారని, అక్కడ గొడవ జరగటానికి ప్రధాన కారణం ఏంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఇంట్లో భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలకు ఎవరు అనుమతి ఇచ్చారు. పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. కొంత మంది పోలీస్ అధికారుల వ్యవహారం వృత్తిని కించపర్చే విధంగా ఉంది. ( భైంసా బాధితులకు పరిహారం చెల్లించాలి ) సంతోష్ అనే వ్యక్తికి సంఘటనతో సంబంధం లేదు. అంతర్రాష్ట్ర ఉగ్రవాదన్న ఆరోపణలతో అతన్ని తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారు. పోలీసులకు మైనర్ బాలుడిని కొట్టే అధికారం ఎవరిచ్చారు. కాళ్లావేళ్లా పడ్డా వదలిపెట్టలేదు. దీనిపై ప్రభుత్వం, డీజీపీ స్పందించాలి. పోలీసులు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారు. కశ్మీర్ తరహలో భైంసాలో హిందువులను పంపించాలనే ఎంఐఎం కుట్రలకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది’’ అని అన్నారు. -
లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అల్లర్లు
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం శివారులో సోమవారం ఉదయం లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. యువకులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చి టపాకాయలు కాలుస్తూ పోలీసులపైకి, గాలిలోకి విసిరారు. పారిస్ పోలీసులు భాష్ప వాయువును ప్రయోగిస్తూ లాఠీ చార్జీ చేస్తూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నందుకు యువత తిరగబడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫ్రాన్స్‌లో విధించిన లాక్‌డౌన్‌ను మే 11వ తేదీ వరకు పొడిగిస్తూ దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఉత్తర్వులు జారీ చేయడంతోనే పారిస్ యువతలో అసహనం పెరిగిపోయింది. సోమవారం తెల్లవారు జామున ఓ పోలీసు వ్యాన్ ఢీకొని 30 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడడంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. రెచ్చిపోయిన యువకులు కొన్ని ప్రాంతాల్లో పోలీసులపైకి రాళ్లు రువ్వినట్లు కూడా తెలుస్తోంది. పారిస్‌లో ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది కరోనా బారిన పడగా వారిలో దాదాపు 400 మంది మరణించారు. వైరస్ ఉగ్రరూపాన్ని చూస్తారు: డబ్ల్యూహెచ్ఓ -
అంకిత్ శర్మ మృతదేహంపై 51 గాయాలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ మృతదేహంపై 51 గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో తేలింది. ఆయన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌కు సంబంధించిన మరికొన్ని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. కత్తులు రాడ్లతో దాడి చేయటంతో ఊపిరితిత్తులు, మెదడుకు బలమైన గాయాలై ఆయన మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. శరీరం వెనుక, తొడలు, కాళ్లపై పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు గుర్తించారు. అతడి శరీరంపై ఉన్న 33 గాయాలు పదునైన ఆయుధాలు, రాడ్లతో చేయబడ్డవేనని, ఆ గాయాల కారణంగానే అంకిత్ శర్మ మరణించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ( అంకిత్ శర్మ హత్య: తాహిర్పై ఆప్ వేటు ) కాగా, గత నెలలో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో గుర్తు తెలియని దుండగులు అంకిత్‌ను దారుణంగా హతమార్చి.. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో దాదాపు 50మంది మృత్యువాతపడగా.. వందల మంది గాయాలపాలయ్యారు. (ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్ మృతదేహం) చదవండి : సీఏఏ దారుణం: తలలోకి డ్రిల్లింగ్ మెషీన్ దింపేశారు! -
ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్ర ఉంది
-
కేంద్రానికి మానవత్వం ఉందా?
-
దోషులను వదలం!
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల దోషులెవరినీ వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడేవారికి ఒక గుణపాఠంలా తమ చర్యలుంటాయన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో అనుబంధం.. వీటినేమాత్రం పట్టించుకోమని, అల్లర్లలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీ అల్లర్లపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చకు షా సమాధానమిచ్చారు. ఆ అల్లర్లు ముందుగానే ప్లాన్ చేసుకున్న కుట్ర అని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందన్నారు. ఈ ఢిల్లీ హింసాకాండకు సంబంధించి పోలీసులు 2,647 మందిని అదుపులోకి తీసుకున్నారని, దాదాపు 700 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారని, ఈ హింసకు ఉపయోగించిన 152 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని, ఆయుధాల చట్టం కింద 49 కేసులు నమోదు చేశారని అమిత్ షా వివరించారు. ఫేస్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సీసీ టీవీ ఫుటేజ్‌ను నిపుణులు విశ్లేషిస్తున్నారన్నారు. ఈ సాఫ్ట్వేర్ మతం ఆధారంగానో, దుస్తుల ఆధారంగానో వివక్ష చూపదని విపక్షంపై విసుర్లు విసిరారు. హోళీ సమయంలో మత కలహాలు జరగకుండా చూసేందుకే.. ఆ పండుగ తరువాత ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావించిందన్నారు. ‘ఢిల్లీ హింసాకాండలో మొత్తం 52 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. విపక్షం తరహాలో నేను వారిలో హిందువులెందరు? ముస్లింలు ఎందరు? అనే వివరాలను ఇవ్వదలచుకోలేదు. 526 మంది గాయపడ్డారు. 371 మంది భారతీయుల దుకాణాలు, 142 మంది ఇండియన్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి’ అని వివరించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పేరును ప్రస్తావించకుండా.. ‘ఫిబ్రవరి 24న ఒక విపక్ష నేత ఇది అటో ఇటో తేల్చుకునే యుద్ధం అని రెచ్చగొట్టేలా ప్రసంగించారు. ఇది విద్వేష ప్రసంగం కాదా?’ అని షా ప్రశ్నించారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ఎంఐఎం నేత వారిస్ పఠాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీఏఏను సమర్ధిస్తూ.. మతం ప్రాతిపదికన 25కి పైగా చట్టాలను రూపొందించారని, సీఏఏ ఏ మతంపైనా వివక్ష చూపదని పునరుద్ఘాటించారు. అమిత్ మాట్లాడుతుండగానే.. నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు, చర్చలో పాల్గొన్న పలువురు విపక్ష సభ్యులు.. ఢిల్లీ అల్లర్లకు నైతిక బాధ్యత వహించి, మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చర్చను కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి ప్రారంభించారు. ఢిల్లీలో హింసాకాండ ప్రజ్వరిల్లుతున్న సమయంలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విందు ఇవ్వడంలో బిజీగా ఉన్నారని, ఇది రోమ్ నగరం తగలబడుతుంటే.. నీరో ఫిడేల్ వాయిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ‘ఈ హింసాకాండలో హిందువులు గెలిచారని కొందరు, ముస్లింలు గెలిచారని కొందరు చెబుతున్నారు. నిజానికి మానవత్వం ఓడిపోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ పోలీసుల తీరును విమర్శించినందువల్లనే ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేశారని చౌధురి ఆరోపించారు. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్, ఆరెస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ కూడా డిమాండ్ చేశారు. ఈ హింసాకాండను కూడా కొందరు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని బీజేపీ నేత మీనాక్షి లేఖి విమర్శించారు. ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యను గుర్తు చేస్తూ.. ఆయన మృతదేహంపై 400 గాయాలు ఉన్నాయన్నారు. ఆప్ కౌన్సిలర్ ఇంట్లో భారీగా రాళ్లు, ఆయుధాలు లభించడాన్ని ఆమె ప్రస్తావిం చారు. చాలా ఇళ్లల్లో వడిసెల వంటి ఆయుధాలు లభించాయన్నారు. లేఖి ప్రసంగంలోని పలు ప్రస్తావనలను రికార్డుల నుంచి తొలగించాలని బీఎస్పీ ఎంపీ డానిశ్ డిమాండ్ చేశారు. దాంతో, చర్చలో మత ప్రస్తావన తీసుకురావద్దని స్పీకర్ ఓం బిర్లా ఆదేశిస్తూ.. మీనాక్షి లేఖి ప్రసంగంలోని పలు ప్రస్తావనలను రికార్డుల నుంచి తొలగించారు. హిందూత్వ విద్వేష సునామీ: ఓవైసీ ఢిల్లీ హింసాకాండకు పాల్పడినవారిని చట్టం ముందు నిలిపేందుకు నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. హిందూత్వ విద్వేషమనే సునామీ వచ్చిందన్నారు. దేశ ఆత్మని కాపాడాలని ఓవైసీ హిందువులను కోరారు. దాదాపు 1,100 మంది ముస్లింలను అక్రమంగా నిర్బంధించారన్నారు. ఓవైసీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు తీవ్రంగా నిరసన తెలిపారు. కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, కిషన్ రెడ్డి కూడా తీవ్ర నిరసన తెలిపారు. ‘ఢిల్లీ అల్లర్లను మత కలహాలనడం హాస్యాస్పదం. ఇవి ముందే ప్లాన్ చేసుకున్న ఊచకోత’ అని ఓవైసీ వ్యాఖ్యానించారు. ‘ఫైజాన్ ముస్లిం అయినంత మాత్రాన ఆయన ప్రాణం విలువ అంకిత్ ప్రాణం విలువ కన్నా తక్కువ కాబోదు. మొత్తం హింసాకాండపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి’ అని ఆయన కోరారు. అల్లర్ల సమయంలో ముస్లింలకు సాయం చేసిన సిక్కులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో హిందువుల బస్తీలను ఎవరు ఖాళీ చేయిస్తున్నారు? సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో హిందువుల బస్తీలను ఎంఐఎం పార్టీ వారు ఖాళీ చేయిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓవైసీ ప్రసంగానికి కౌంటర్‌గా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాత బస్తీలో అనేక చోట్ల దళితుల బస్తీలను ఎంఐఎం వారు ఖాళీ చేయించారని ఆరోపించారు. అంతేకాకుండా, వారిపై దాడులు కూడా చేయిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఇవన్నీ చేస్తూ ఇక్కడ పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైన పద్దతి కాదని హితవు పలికారు. -
ఐదో రోజూ అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను విపక్షాలు వరుసగా ఐదో రోజూ అడ్డుకున్నాయి. ఢిల్లీ అల్లర్లపై, లోక్‌సభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడంపై శుక్రవారం విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దాంతో, పలు వాయిదాల అనంతరం లోక్‌సభ, సభ ప్రారంభమైన పావుగంటకే రాజ్యసభ మార్చి 11వ తేదీకి వాయిదా పడ్డాయి. లోక్‌సభ..: ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఢిల్లీ అల్లర్లపై తక్షణమే చర్చ జరపాలని కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్ తదితర పార్టీల సభ్యులు వెల్లోనికి వచ్చి నినాదాలు చేశారు. ఢిల్లీ అల్లర్లపై 11న చర్చ జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, స్పీకర్ స్థానాన్ని అవమానించారని పేర్కొంటూ గురువారం ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను లోక్‌సభ నుంచి ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సహా పలు విపక్షాలు సభలో నిరసన తెలిపాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా చాలామంది విపక్ష సభ్యులు తమ చేతులకు నల్లని బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. గందరగోళం కొనసాగుతుండటంతో సభను స్పీకర్ స్థానంలో ఉన్న కిరిట్ సోలంకీ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత కూడా విపక్షం శాంతించలేదు. నినాదాల మధ్యనే ఖనిజ చట్టాల(సవరణ) బిల్లు, దివాలా కోడ్(సవరణ) బిల్లు ఆమోదం పొందాయి. రాజ్యసభ..: సభ ప్రారంభం కాగానే తన శాఖకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచేందుకు హోంశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లేవగానే.. విపక్ష సభ్యులంతా గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను 11వ తేదీకి వాయిదా వేశారు. జేబుదొంగకు ఉరిశిక్షా? కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత ఆధిర్ రంజన్‌చౌధురి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశారన్న ఉద్దేశంతో.. ‘జేబు దొంగకు ఉరిశిక్ష వేయకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో కాంగ్రెస్ సభ్యులు ఇబ్బందిగా ముఖం పెట్టగా, కొందరు పెద్దగా నవ్వేశారు. కాంగ్రెస్ సభ్యుడు చెప్పిన పోలిక వింతగా ఉందని, ఆ ఎంపీలను జేబుదొంగలతో పోల్చడం దురదృష్టకరమని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. మరోవైపు, తమ ఎంపీల సస్పెన్షన్‌పై రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. -
నినాదాలు చేయడానికి ఇది బజార్ కాదు.. పార్లమెంట్!
-
ఢిల్లీ హింసపై చర్చ జరగాల్సిందే
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో గత వారం జరిగిన అల్లర్లపై పార్లమెంట్లో ప్రభుత్వం చర్చ చేపట్టే వరకు ఉభయసభల్లో కార్యకలాపాలు కొనసాగ నీయబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దేశ రాజధానిలో గొడవలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. లోక్‌సభ, రాజ్యసభల్లో మూడో రోజైన బుధవారం కూడా కార్యకలాపాలు స్తంభించాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీ హింసపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. హోలీ పండగ అనంతరం ఈ నెల 11వ తేదీన లోక్‌సభలో, 12న రాజ్యసభలో దీనిపై చర్చ చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. సంతృప్తి చెందని కాంగ్రెస్‌కు చెందిన 30 మంది సహా, ఇతర ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నిలబడి ‘హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి, ప్రధాని మోదీ బాధ్యత వహించాలి’అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా లేకపోవడంతో అధ్యక్షస్థానంలో ఉన్న కిరీట్ సోలంకి సభా కార్యక్రమాలను నడిపించారు. దీంతో సభ్యులు.. ‘స్పీకర్ ఎక్కడ?, మాకు న్యాయం కావాలి’అంటూ కేకలు చేశారు. ఈ ఆందోళనల నడుమనే ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ‘వివాద్ సే విశ్వాస్’బిల్లును, ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐటీలు)లకు జాతీయ ప్రాముఖ్య హోదా కల్పించే బిల్లులను ఆమోదించింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన రెండు ప్రశ్నలకు బొగ్గు శాఖ మంత్రి కూడా అయిన జోషి బదులిచ్చారు. చంద్రయాన్–3 ప్రాజెక్టును 2021 ప్రథమార్ధంలో చేపట్టనున్నట్లు లోక్‌సభకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అనుకున్న దానికంటే కొద్దిగా ఆలస్యమవుతుందన్నారు. మానవసహిత గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా మైక్రోగ్రావిటీపై ఆరు పరీక్షలు జరుగుతాయని ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గందరగోళం కొనసాగడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు, ఆతర్వాత రోజంతా వాయిదా పడింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. హింసకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇదే మా డిమాండ్. చర్చ జరిపేదాకా ఉభయసభల లోపల, వెలుపల నిరసనలు కొనసాగిస్తాం’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి సయ్యద్ నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ..‘అల్లర్లపై మాట్లాడేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఏమాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. చర్చ సాగితే సభా కార్యకలాపాలను కొనసాగనిస్తాం. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయి’ అని పేర్కొన్నారు. రాజ్యసభలోనూ అదే సీను ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరగాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ డిమాండ్ చేశాయి. హోలీ తర్వాత చర్చకు చేపట్టనున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనను తిరస్కరించాయి. ఎజెండాను పక్కనబెట్టి ఢిల్లీ అల్లర్లపైనే చర్చించాలంటూ నిబంధన–267 కింద ప్రతిపక్షాలిచ్చిన నోటీసును చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. అయితే, ఏ అంశంపై, ఏ విధానం ప్రకారం చర్చ జరగాలనే విషయమై రాజ్యసభలో అధికార, ప్రతిపక్ష నేతలతో మాట్లాడతానని తెలిపారు. ప్రతిపక్షం నిరసనలు ఆగకపోవడంతో ఆయన.. ‘దేశంలో కోవిడ్ వ్యాప్తి సహా 16 అంశాలపై జీరో అవర్‌లో జరగాల్సిన చర్చను అడ్డుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్టుంది’ అని వ్యాఖ్యానిస్తూ తర్వాతి రోజుకు సభను వాయిదా వేశారు. హోలీ సందర్భంగా 9, 10వ తేదీల్లో పార్లమెంట్‌కు సెలవులు. -
ఢిల్లీ అల్లర్లపై మూడొరోజూ దద్దరిల్లిన ఉభయసభలు
-
రెండో రోజూ.. ‘షేమ్’ సీన్
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై వరుసగా రెండో రోజు పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం చెలరేగింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో జరిగిన తీవ్ర స్థాయి అల్లర్లపై పార్లమెంట్లో చర్చ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ.. విపక్షం ఆందోళనను విరమించలేదు. లోక్‌సభలో.. ఢిల్లీ అల్లర్లపై తక్షణమే చర్చ జరగాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌సహా విపక్ష సభ్యులు మంగళవారం సభ కార్యకలాపాలను స్తంభింపజేశారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీల సభ్యులు ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇవ్వసాగారు. జీరో అవర్‌లో ఈ అంశాలను లేవనెత్తాలని, ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించనివ్వాలని స్పీకర్ కోరినా వారు పట్టించుకోలేదు. మార్చి 11న చర్చ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించినప్పటికీ.. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇవ్వసాగారు. కొందరు సభ్యులు స్పీకర్ పోడియంకు దిగువన ఉండే సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ ఎన్క్లోజర్ను గట్టిగా తట్టడం కనిపించింది. ‘దేశ ప్రయోజనాల కోసం మనం పనిచేస్తున్నాం. దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హోలీ పండుగను శాంతి, సౌభ్రాతృత్వాలతో జరుపుకుందాం. ఆ తరువాత మార్చి 11న ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయినా, గందరగోళం ఆగలేదు. రెండు పర్యాయాలు వాయిదా పడిన అనంతరం, మధ్యాహ్నం సభ మరోసారి సమావేశమైంది. కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి వెల్‌లో అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపు వెళ్లడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. చౌధురి తరహాలోనే అధికార పక్షంవైపు వెళ్లేందుకు ఇతర విపక్ష సభ్యులు చేసిన ప్రయత్నాలను బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆధిర్ రంజన్ చౌధురితో పశ్చిమబెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ గట్టిగా వాదించడం, వారికి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సర్దిచెప్పడం కనిపించింది. ఈ సమయంలోనే పలువురు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. గందరగోళం కొనసాగడంతో సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. ఈ గందరగోళం మధ్యనే ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సహకార బ్యాంకులను పటిష్టపరిచేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో.. ఢిల్లీ అల్లర్లపై నిరసనల నేపథ్యంలో రెండు పర్యాయాలు వాయిదా పడిన అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ సమావేశమైంది. అప్పుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ప్రపంచమంతా చర్చిస్తున్న, ఆందోళన వ్యక్తం చేస్తున్న ఢిల్లీ అల్లర్లపై వెంటనే సభలో చర్చ జరపకపోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అధికార పక్ష నేత తావర్ చంద్ గహ్లోత్ ప్రకటించారు. చైర్మన్ వెంకయ్యనాయుడుని సంప్రదించి చర్చ జరిగే తేదీని ప్రకటిస్తామని డెప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. గందరగోళం కొనసాగుతుండటంతో హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు, ఉదయం ఆర్థిక శాఖకు సంబంధించిన కొన్ని పత్రాలను సభ ముందుంచేందుకు ఆ శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ లేచి నిల్చున్న సమయంలోనూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సమావేశంలో నడ్డా, అమిత్ షాలతో మోదీ ‘భారత్ మాతా కీ జై’ అంటే నేరమా? భారత్ మాతా కీ జై అని నినదిస్తే నేరమని కొందరు అంటున్నారని∙మోదీ వ్యాఖ్యానించారు. ‘భారత్‌మాతా కీ జై’ నినాదంలోనూ మాజీ ప్రధాని మన్మోహన్‌కు తప్పు కనిపిస్తోందని, ఆ నినాదాన్ని కూడా ఆయన అనుమానంగా చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్లమెంటరీ భేటీని ఉద్దేశించి మంగళవారం మోదీ ప్రసంగించారు. ‘స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచాక కూడా.. భారత్ మాతా కీ జై అని నినదిస్తే నేరం అంటున్నారు. అదీ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి అలా అనడం మరీ దురదృష్టకరం. ప్రతీ దేశభక్తుడు బాధపడే విషయమిది’ అని మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సమాజంలో సామరస్యతను పెంపొందించే విషయంలో మార్గదర్శులుగా నిలవాలని ఆయన బీజేపీ ఎంపీలను కోరారు. ఢిల్లీ అల్లర్ల విషయంలో బీజేపీ విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఢిల్లీ అల్లర్లపై జావాద్ జరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ ఢిల్లీలోని ఆ దేశ రాయబారి అలీ చెగేనికి భారత ప్రభుత్వం మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ అల్లర్లపై జావెద్ జరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని కేంద్రం పేర్కొంది. ఇదే సమయంలో తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఇరాన్‌కు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ రాయబారి చెగేనికి తేల్చిచెప్పింది. చదవండి: ఈశాన్య ఢిల్లీ అల్లర్లు.. మృతులు 45 ఢిల్లీ అల్లర్లపై జరీఫ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. 'ఇలాంటి తెలివిలేని హింస జరగకుండా భారత అధికారులు జాగ్రత్తపడాలని అన్నారు. మరో అడుగు ముందుకేసి భారత ముస్లింలపై జరిగిన వ్యవస్థీకృత హింసను ఇరాన్ ఖండిస్తోంది' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ.. ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చింది. అయితే.. సున్నిత అంశంపై బాధ్యతా రహితమైన ప్రకటనలు చేయకండని అంతర్జాతీయ నాయకులు, సంస్థలను భారత విదేశాంగ శాఖ గతంలో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ అల్లర్లపై నకిలీ ఫొటోలు వైరల్! -
రెండో రోజు పార్లమెంట్లో అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. రెండో రోజు కూడా ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు బాహాబాహీకి దిగారు. లోక్‌సభ, రాజ్యసభల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరగడంతో రెండు సభలను వాయిదా పడ్డాయి. లోక్ సభను మధ్నాహం 12 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు. రెండో రోజు సమావేశాలు మొదలైన వెంటనే లోక్‌సభలో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష నాయకులు నిరసన తెలుపుతూ పోడియం వద్దకు దూసుకొచ్చారు.సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ ఇరు పక్షాలు పట్టించుకోలేదు. సభ్యులెవరూ పోడియం వద్దకు రావొద్దని స్పీకర్ పదే పదే సూచించినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఇక పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. సభ మొదలవగానే ఢిల్లీ అల్లర్లపై దుమారం రేగింది. అల్లర్లపై చర్చ పెట్టాలని విపక్షాలు కోరాయి. కానీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చర్చకు నిరాకరించారు. దీంతో విపక్షనేతలు నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ప్లకార్డులను పట్టుకొని నిరసన తెలిపారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. -
ఈశాన్య ఢిల్లీ అల్లర్లు.. మృతులు 45
న్యూఢిల్లీ: వారం క్రితం అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే, సోమవారం అల్లర్లు జరిగిన ప్రాంతంలో మరో నాలుగు మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 45కు చేరుకుందని అధికారులు తెలిపారు. అల్లర్ల కారణంగా వాయిదాపడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను సోమవారం పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించారు. 98 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింప జేస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి సాయం అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారంగా అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు. అల్లర్లపై రేపు సుప్రీం విచారణ ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన పిటిషన్లపై 4న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. రాజకీయ నాయకులు, ఇతరుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల అల్లర్లు జరిగాయని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దీనిపై పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘అల్లర్ల కారణంగా ప్రజలు చనిపోతుంటే వాయిదా ఎలా వేయగలరు ?’ అంటూ పిటిషన్‌దారుల తరఫున లాయర్ కోలిన్ గొంజాల్వెజ్ సుప్రీంకోర్టును అడిగారు. అయితే అల్లర్లను నియంత్రించడం తమ పని కాదని, దానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. బుధవారం విచారణ జరుపుతామని తెలిపింది. -
నెట్టుకున్నారు.. తోసేసుకున్నారు!
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల మలి దశ తొలి రోజే లోక్‌సభ దద్ధరిల్లింది. ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు ఆవేశంగా ఒకరినొకరు గట్టిగా తోసుకోవడంతో సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సభలో నెలకొన్న తోపులాటపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను నిర్వహించలేనంటూ అశక్తత వ్యక్తం చేశారు. సభలో తమ మహిళా సభ్యులపై అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మలి దశ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఫిబ్రవరి 28వ తేదీన మరణించిన జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్‌కు నివాళి అర్పించి, అనంతరం ఆయనకు గౌరవ సూచకంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే గందరగోళం మొదలైంది. ఇటీవలి ఢిల్లీ అల్లర్ల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపు కూడా వెళ్లి అమిత్‌షా రాజీనామా డిమాండ్ ఉన్న నల్లని బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘అల్లర్లకు కారణం వీరే. వీరే రెచ్చగొట్టారు. 1984లోనూ వీరు 3000 మందిని హతమార్చారు. వీరికి శాంతి నెలకొనడం ఇష్టం లేదు’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో విపక్ష సభ్యులు మరింత బిగ్గరగా.. ‘వి వాంట్ జస్టిస్’, ‘అమిత్ షా ముర్దాబాద్’ అని నినాదాలు చేయసాగారు. ఈ సమయంలో, కాంగ్రెస్ సభ్యులు నల్ల బ్యానర్‌తో అధికార పక్ష సభ్యుల వైపు వెళ్లారు. బీజేపీ సభ్యులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు చేతిలోని కాగితాలను చించి, విసిరేశారు. ఈ సమయంలో, ఇరు వర్గాల సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గట్టిగా నెట్టివేసుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. 3 గంటలకు సభ ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తమవైపు నుంచి వెల్‌లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ సభ్యులు విపక్ష సభ్యులను అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ మహిళా ఎంపీ ఒకరు తనపై దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. గందరగోళం మధ్య సభ పదేపదే వాయిదాపడింది.దీంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, బీజేపీ మహిళా సభ్యులతో కాంగ్రెస్ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని మంత్రి స్మృతి ఇరానీ సభ వెలుపల మీడియాకు తెలిపారు. వాయిదా పడిన రాజ్యసభ ఢిల్లీ అల్లర్లపై రాజ్యసభలో దుమారం రేగింది. ఢిల్లీ తగులబడుతుంటే కేంద్రం నిద్ర పోతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. హోం మంత్రి రాజీనామా చేయాలని కోరాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. వెల్‌లోకి వచ్చి నిలబడిన సభ్యులను సీట్లలో కూర్చోవాల్సిందిగా అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలు పర్యాయాలు కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆయన సభను మధ్యాçహ్నానికి వాయిదావేశారు. ఆ తర్వాతా అదే తీరు కొనసాగడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మంగళవారానికి వాయిదా వేశారు. గొడవ మధ్యనే తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ సహా మూడు సంస్కృత వర్సిటీలను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టారు. గౌరవంగా వ్యవహరిద్దాం సభ్యులను సముదాయించేందుకు స్పీకర్ ఓం బిర్లా పలు సందర్భాల్లో విఫల యత్నం చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారని, గౌరవ సభ్యులుగా హుందాగా వ్యవహరిద్దామని సభ్యులకు సూచించారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. గందరగోళం మధ్యనే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(అమెండ్మెంట్) బిల్లు, మినరల్ లాస్ అమెండ్మెంట్ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ‘వివాద్ సే విశ్వాస్’ బిల్లుపై చర్చ జరిగింది. -
ఢిల్లీ అల్లర్లపై మమత సంచలన వ్యాఖ్యలు
కోల్కత్తా : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్దకుట్ర దాగిఉందని, దీని వెనక కేంద్ర ప్రభుత్వం హస్తం కూడా ఉందని ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ హత్యాకాండ జరిగిందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. అలాగే ఢిల్లీ అల్లర్లపై పరిశీలనకు ఓ కమిటీని సైతం ఏర్పాటు చేస్తామని, ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో టీఎంసీ ప్రతినిధులు పర్యటిస్తారని మమత స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ క్షమాపణలు చెప్పకపోవడం బాధాకరమన్నారు. సోమవారం కోల్‌కత్తాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కేంద్ర హోమంత్రి అమిత్ షా ఆదివారం కోల్‌కత్తాలో పర్యటించిన విషయం తెలిసిందే. షా పర్యటనపై దీదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో అల్లర్లు సృష్టించడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని, ఇదేమీ ఢిల్లీ కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా బెంగాల్ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు గోలీమారో నినాదాలు చేయడంపై సీఎం స్పందించారు. హింసను ప్రేరేపించే విధంగా నినాదాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 46 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
పార్లమెంట్లో ‘ఢిల్లీ అల్లర్ల’ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్ మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం సభను మధ్యాహ్నం 2గంలకు వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలిపాయి. ఢీల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్లో ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ హింసకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర కళ్లకు గంతలు కట్టుకొని, నోటిపై వేల్లు వేసుకొని నిరసన తెలిపారు. మరోవైపు ఢిల్లీ అల్లర్లు రాజ్యసభను కూడా కుదిపేశాయి. సోమవారం సభ ప్రారంభమవగానే విపక్షాలు ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టాయి. దీనిపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఢిల్లీలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అంశం గంభీరమైందని, ఇప్పడే దీనిపై చర్చించడం సరికాదన్నారు. సామన్య స్థితి ఏర్పడిన తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని చెప్పారు. వెంటనే కాంగ్రెస్ నేత గూలంనబీ ఆజాద్ లేచి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో హింస చెలరేగి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినా ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. కాగా, ఆజాద్ వ్యాఖ్యలను అధికార పక్షం తప్పుబట్టింది. ఇరుపక్షాలు పోడియం వైపుకు దూసుకురావడంతో చైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మొత్తం 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
కుదుటపడుతున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: మత ఘర్షణలు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతత నెలకొంటోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ గడిచిన మూడు రోజులుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. వదంతులను పట్టించు కోవద్దని, అటువంటి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం అల్లర్ల ప్రభావిత బ్రహ్మపురిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 254 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించాలని హక్కుల కార్యకర్తలు పోలీసులను కోరారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనలకు కేంద్ర బిందువు షహీన్‌బాగ్‌లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా, ఖ్యాలా–రఘుబిర్ నగర్–తిలక్ నగర్ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగనున్నాయంటూ ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అయితే అవి కేవలం వదంతులేనని ఢిల్లీ పశ్చిమ డీసీపీ దీపక్ పురోహిత్ చెప్పారు. -
కలకలం.. డ్రైనేజీలో మరో రెండు శవాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని యమున నది కాల్వలో గుర్తుతెలియని రెండు మృతదేహాలు బయటపడం కలకలం రేపింది. గోకుల్‌పూరిలోని యమున తూర్పు కాల్వ డ్రైనేజీలో ఆదివారం.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రెండు శవాలను ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. మృతదేహాలు ఎవరివి అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ శవాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోవడంతో వాటిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రమాదశాత్తు కాల్వలో పడి మరణించారా..? లేక ఢిల్లీ అల్లర్లలో భాగంగానే వీరు కూడా మృతి చెందారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం జీటీబీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఘర్షణలు చోటుచుకున్న ప్రాంతంలోనే ఈ మృతదేహాలు లభ్యం కావడం గమనార్హం. (ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్ మృతదేహం) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో గుర్తు తెలియని దుండగులు ఇంటలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మను దారుణంగా హతమార్చి.. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసిన విషయం విదితమే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో డ్రైనేజీలో మరో రెండు మృతదేహాలు లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీ అల్లర్లో భాగంగానే వీరిని హత్యచేసి.. కెనాల్లో పడేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు తుది నివేదికను ఇవ్వాల్సి ఉంది. కాగా ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
రాజధర్మంపై ఆగని రగడ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో రాజధర్మాన్ని పాటించామని అన్ని వర్గాల ప్రజలను రక్షించామని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాజధర్మం వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ శనివారం కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ విషయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ మాటలనే మీరు పెడచెవిన పెట్టారు. ఇక.. మా మాటలను ఎందుకు వింటారు అంటూ కపిల్ సిబాల్ ఎద్దేవా చేశారు. వినడం, నేర్చుకోవడం, ఆచరించడం రాజధర్మంలో భాగమని.. ఇవేవీ కేంద్ర ప్రభుత్వం అనుసరించడం లేదని కపిల్ సిబాల్ విమర్శించారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు : కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ అయితే.. గురువారం రోజున ఈశాన్య ఢిల్లీలో మతపరమైన అల్లర్లను అదుపుచేయడంలోనూ, తన విధులను నిర్వర్తించడంలోనూ విఫలమైన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు ఓ వినతిపత్రం అందజేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాజధర్మాన్ని పాటించామని, దేశంలోని అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను గౌరవించి వారిని రక్షించామని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ స్పందిస్తూ.. సోనియా గాంధీ, దయచేసి రాజధర్మం గురించి మాకు బోధించొద్దు. మీ చరిత్ర అంతా తప్పులతడక అని అన్నారు. కాంగ్రెస్ ఏదైనా చేస్తే అది మంచిది. అదే మేంచేస్తే ప్రజలను రెచ్చగొడతారు.ఇది ఎలాంటి రాజధర్మం? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. Law Minister to Congress : “ Please don’t preach us Rajdharma “ How can we Mr. Minister ? When you did not listen to Vajpayeeji in Gujarat why would you listen to us ! Listening , learning and obeying Rajdharma not one of your Government’s strong points ! — Kapil Sibal (@KapilSibal) February 29, 2020 -
చావబాది.. జాతీయగీతం పాడాలంటూ..
-
ఢిల్లీ అల్లర్లు: అంతర్జాతీయ మీడియా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో చురుగ్గా పర్యటిస్తూ భారత దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తుండగా, ఢిల్లీలో జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వ పరువును, దేశ ప్రతిష్టను ఒక్కసారిగా దెబ్బతీశాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గత ఆదివారం నుంచి మూడు రోజులపాటు కొనసాగిన అల్లర్లలో 42 మంది మరణించిన విషయం తెల్సిందే. వీటిపై ప్రపంచ పత్రికలు తమదైన రీతిలో దాడి చేశాయి. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా చేసిన విద్వేష పూరిత వ్యాఖ్యలే అల్లర్లకు దారి తీశాయని పలు అంతర్జాతీయ పత్రికలు దూషించాయి. అల్లర్లను నిలువరించాల్సిన పోలీసులే ఓ వర్గానికి వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహించడం దారుణంగా ఉందని కొన్ని పత్రికలు ఆరోపించాయి. అల్లర్ల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడం వల్లనే ‘2002లో గుజరాత్’ తరహా అల్లర్లు పునరావృతం అయ్యాయని ఆ పత్రికలు వ్యాఖ్యానించాయి. (పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..) ‘మోదీ స్టోక్డ్ దిస్ ఫైర్’ అనే శీర్షికతో ‘ది గార్డియన్’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘పోలిటిషియన్స్ స్టోక్డ్ ఢిల్లీ రైట్స్’ అని ‘ది ఖలీజ్ టైమ్స్’ వార్తను ప్రచురించగా, ‘మోదీ సైలెన్స్ యాజ్ డెత్ టాల్ మౌంటెడ్’ అనే శీర్షికతో లండన్ నుంచి వెలువడుతున్న ‘ది టైమ్స్’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘శాంతి, సహనమే మన సంస్కృతి’ అంటూ అల్లర్లు చెలరేగిన మూడో రోజు ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా స్పందించిన విషయం తెల్సిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి మోదీ భుజం భుజం రాసుకుంటూ ఢిల్లీ రోడ్డుపై తిరుగుతుంటే అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అల్లర్లు చెలరేగాయంటూ జర్మనీ వార్తా పత్రిక ‘డర్ స్పీజల్’ వార్తను ప్రచురించింది. ఈ అల్లర్లు మోదీ ప్రభుత్వానికి అంతర్గతంగా ఉపయోగ పడవచ్చేమోగానీ అంతర్జాతీయంగా భారత్ పరువు తీస్తున్నాయంటూ ‘అవుట్‌సైడ్ షో ఆఫ్, ఇన్సైడ్ ప్రొటెస్ట్’ శీర్షికన ఆ పత్రిక వార్తను ప్రచురించింది. (చదవండి: ఢిల్లీ హైకోర్టు జస్టిస్ బదిలీ ఓ శేష ప్రశ్న!) మోదీ హిందూత్వ పాలనలో సెక్యులరిజమ్ చనిపోయిందంటూ ‘వై ఇండియా స్టూడెంట్స్ ఆర్ ఆంగ్రీ, ఇట్స్ ముస్లిం ఆర్ వర్రీడ్’ శీర్షికతో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈశాన్య ఢిల్లీలో అక్బారీ అనే 85 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా తగులబెట్టడం ఏ నాగరికతను సూచిస్తోందని ‘ఏ గల్ఫ్ న్యూస్ పీస్’ ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా విద్వేషపూరిత ఉపన్యాసమే అల్లర్లకు దారితీసిందని, ముస్లిం పౌరులను హిందూ శక్తులు చంపుతుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షక పాత్ర వహించాయంటూ ‘ది రూట్స్ ఆఫ్ ది ఢిల్లీ రైట్స్, ఏ ఫియరీ స్పీచ్ అండ్ యాన్ అల్టిమేటమ్’ పేరిట ‘న్యూయార్క్ టైమ్స్’ వార్తను ప్రచురించింది. ప్రభుత్వం చేసిన చట్టాన్ని ప్రశ్నించే మేధోవారసత్వంతోపాటు నైతిక, ప్రజాస్వామిక హక్కులు తమకున్నాయంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ముస్లింలపై దాడి చేయడం ఆశను ఆర్పేసిందంటూ ‘అల్ జజీరా’ వ్యాఖ్యానించింది. విభిన్న కుల, మతాల సమ్మేళనంతో సహజీవనం సాగించడం భారత్‌కున్న ఓ గొప్ప సంస్కృతి అన్న పేరు నేటి ఢిల్లీ అల్లర్లతో మసకబారిందంటూ ‘గల్ఫ్ న్యూస్’ సంపాదకీయం రాసింది. (చదవండి: ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ) -
మహాత్ముడి స్ఫూర్తి ఇప్పుడే అవసరం
ఐక్యరాజ్యసమితి: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొనాల్సిన పరిస్థతి ఏర్పడిన ప్రస్తుత తరుణంలోనే.. శాంతి, అహింస బోధించిన మహాత్మా గాంధీ స్ఫూర్తి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. సమాజంలో అంతా కలిసిమెలసి జీవించేందుకు గతంలో కన్నా ఇప్పుడే మహాత్ముడి స్ఫూర్తి అవసరం ఎంతో ఉందన్నారు. హింసను విడనాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘భారత్‌లో నెలకొన్న పరిస్థితిని ప్రధాన కార్యదర్శి నిశితంగా పరిశీలిస్తున్నారు. అల్లర్ల సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్న మరణాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి, సంయమనం పాటించాలని కోరుతున్నారు’ అని గ్యుటెరస్ ప్రతినిధి తెలిపారు. -
పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..
న్యూఢిల్లీ: వారం ప్రారంభంలో అల్లర్లతో అట్టుడికిన ఢిల్లీ క్రమంగా తేరుకుంటోంది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు శుక్రవారం ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి, నిత్యావసరాలను కొనుగోలు చేశారు. వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు విధులకు వెళ్లడం ప్రారంభించారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా భద్రతాదళాలు అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘాను పెట్టాయి. మసీదుల్లో మౌల్వీలు శాంతి సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వదంతులకు, తప్పుడు వార్తలకు స్పందించవద్దని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు ప్రకటించారు. అయితే, చెత్త, వ్యర్థ వస్తువులను ఏరుకునేందుకు శుక్రవారం ఉదయం బయటకు వెళ్లిన తన తండ్రి తలపై గాయాలతో చనిపోయారని సల్మాన్ అన్సారీ అనే వ్యక్తి తెలిపారు. ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్ గాయాలు ఈశాన్య ఢిల్లీలో లెఫ్ట్‌నెంట్ జనరల్ అనిల్ బైజాల్ సీనియర్ పోలీసు అధికారులతో కలిసి మౌజ్‌పూర్, జఫ్రాబాద్, గోకుల్పురిల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు 148 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. దాదాపు 630 మందిని అరెస్ట్ చేయడమో లేక అదుపులోకి తీసుకోవడమో చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు 7 వేల మంది పారా మిలటరీ దళాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య శుక్రవారానికి 42కి చేరింది. వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరికి బుల్లెట్ గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం నలుగురు చనిపోయారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 9 ప్రాంతాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 25 వేల చొప్పున అందజేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఐపీఎస్ శ్రీవాస్తవకు అదనపు బాధ్యతలు అల్లర్ల సమయంలో శాంతి భద్రతల విభాగం స్పెషల్ కమిషనర్‌గా నియమితుడైన ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవకు శుక్రవారం అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆదివారం నుంచి ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా విధులు చేపట్టనున్నారు. అల్లర్లను గుర్తించడంలో, అరికట్టడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొన్న ప్రస్తుత కమిషనర్ అమూల్య పట్నాయక్ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. ‘ప్రజల్లో భద్రతా భావాన్ని, మా కోసం పోలీసులున్నారనే ధైర్యాన్ని పాదుకొల్పడమే ప్రస్తుతం నా ప్రధాన బాధ్యత’ అని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తూ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. రెండు రోజుల్లో 331 శాంతి సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ కమిటీ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి, పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఐదుగురితో కూడిన కమిటీని శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ పైనుంచి దూకేశాం ‘బుధవారం రాత్రి ఇంట్లో ఉండగా, అకస్మాత్తుగా ఒక గుంపు మా ఇంట్లోకి జొరబడింది. నన్ను, నా ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించడం ప్రారంభించారు. భయంతో దుప్పట్లు చుట్టుకుని బిల్డింగ్ పై నుంచి దూకేశాం’ అని ఒక బాధిత మహిళ తెలిపింది. ఆమె ఒక ఎన్జీవోను నిర్వహిస్తున్నారు. ‘గాంధీ’లపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి! అల్లర్ల తర్వాత తండ్రి ఆచూకీ తెలీకపోవడంతో తల్లితో కలసి ఢిల్లీలో ఓ ఆస్పత్రి మార్చురీ బయట వేచి ఉన్న బాలిక విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక వాద్రాలపై కేసులను నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, అమానతుల్లా ఖాన్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌లపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ‘లాయర్స్ వాయిస్’ సంస్థ తమ పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారించింది. విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్లలో తాము భాగస్వాములమవుతామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది. సీబీఎస్సీ పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రత కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. ప్రతిపక్షాల వల్లే అల్లర్లు: అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన దుష్ప్రచారమే ఢిల్లీలో మత ఘర్షణలకు దారితీసిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. భువనేశ్వర్‌లో జరిగిన ర్యాలీలో శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ.. ‘సీఏఏ అమలుతో ముస్లింలు దేశ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం సాగించాయి. ప్రజలను రెచ్చగొట్టడం గొడవలకు దారితీసింది’ అని అన్నారు. సీఏఏతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు. పైపెచ్చు దీనితో మరికొందరికి పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం చారిత్రక నిర్ణయం. అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, మమతా దీదీ అబద్ధాలు ప్రచారం చేశారు’ అని ఆరోపించారు. రెచ్చగొట్టిన వారిపై చర్యలు తీసుకోండి: విపక్షాల లేఖ ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతవాతావరణం నెలకొనేలా యంత్రాంగాన్ని ఆదేశించాలని, విద్వేషాలను ప్రేరేపించేలా ప్రసంగించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసేతర ప్రతిపక్షాల నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన వారి కోసం సహాయ శిబిరాలను ప్రారంభించాలని, రక్షణ కల్పించడంతోపాటు నిత్యావసర సరుకులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పరిస్థితులపై చర్చించేందుకు తమకు సమయమివ్వాలని వారు రాష్ట్రపతిని కోరారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, లోక్తాంత్రిక్ జనతా దళ్‌కు చెందిన శరద్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రఫుల్ పటేల్, ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి టీఆర్ బాలు, సీపీఐ నేత డి.రాజా, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన మనోజ్ ఝా, ఆప్ నేత సంజయ్ సింగ్ ఆ లేఖపై సంతకాలు చేశారు. ఢిల్లీ అల్లర్లను ప్రస్తావించా: మమతా ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్(ఈజెడ్‌సీ) సమావేశంలో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని ప్రస్తావించినట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన ఈజెడ్‌సీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ సమావేశంలో సీఏఏ, ఎన్నార్సీల ప్రస్తావన రాలేదు. అవి సమావేశం ఎజెండాలో లేవు. ఢిల్లీలో ఘర్షణలను మాత్రం నేను ప్రస్తావించా. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు మరింత విషమించకుండా చర్యలు తీసుకోవాలని, బాధితులకు పరిహారం అందించాలని కోరా’ అని తెలిపారు. పేరు అడిగి.. కొట్టి చంపారు! ఉదయం చెత్త ఏరేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి తీవ్ర గాయాలతో తిరిగివచ్చి, అనంతరం చనిపోయిన ఘటన శుక్రవారం ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకుంది. అయూబ్ షబ్బీర్ ఢిల్లీ శివార్లలోని గజియాబాద్‌లోని నస్బంది కాలనీవాసి. రోజూ చెత్త, ఇతర వ్యర్థ వస్తువులు ఏరుకుని, వాటిని అమ్మి జీవనం సాగిస్తుంటారు. ఆయన శుక్రవారం ఉదయం చెత్త సేకరణకు ఈశాన్య ఢిల్లీకి వెళ్లాడని, సాయంత్రం కొందరు ఆయనను తలపై తీవ్ర గాయాలతో తీసుకువచ్చారని ఆయన కుమారుడు సల్మాన్ తెలిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మరణించాడన్నారు. ‘వెళ్లొద్దని చెప్పాను. అయినా వినలేదు. పరిస్థితులు బాగానే ఉన్నాయి. సంపాదన లేకుండా ఎంతకాలం ఉంటాం? అని చెప్పి ఉదయమే బయటకు వెళ్లాడు’ అని సల్మాన్ వివరించాడు. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో కొందరు పేరు, మతం అడిగి, ఆ తరువాత దారుణంగా కొట్టారని తన తండ్రి తనకు చెప్పాడని సల్మాన్ వివరించాడు. పోలీసులకు సమాచారమిచ్చానని, అయినా, వారు తన తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సహకరించలేదని చెప్పారు. తాను దివ్యాంగుడినని, తండ్రి తప్ప తనకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
అంకిత్ శర్మ హత్య కేసులో తాహీర్‌పై ఆరోపణలు
-
అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు
-
ఢిల్లీ అల్లర్లు : వివాహమైన 12 రోజులకే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 42కు చేరింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఈ ఘర్షణలో మృతి చెందిన వారి వివరాలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నాయి. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ జంటను.. ఢిల్లీ అల్లర్లను శోకసంద్రంలో ముంచాయి. ముస్తాఫాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే ఆష్వాక్ హుస్సేన్‌కు ఫిబ్రవరి 14నే వివాహమైంది. 21ఏళ్ల తస్లీన్ ఫాతిమా ప్రేమ జంట ఎంతో ఇష్టపడే వాలెంటైన్స్ డే రోజున 22 ఏళ్ల ఆష్వాక్ హుస్సేన్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ సీఏఏ అల్లర్లను వారి పాలిట శాపంగా మారాయి. ఫిబ్రవరి 25న భోజనం చేసి బయటకు వెళ్లిన ఆష్వాక్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి జరిగిన 12 రోజులకే అతను విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. (ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ) తాజాగా ఆష్వాక్ చిత్రాన్ని తస్లీన్ సోషల్ మీడియాలో తొలిసారి షేర్ చేశారు. అత్తారింటికి వచ్చిన తొలి రోజే భర్త చనిపోవడం.. అసలు భర్త గురించి కూడా పూర్తి వివరాలు తెలియకుండానే విడిచి వెళ్లిపోయాడంటూ ఫాతిమా కన్నీరుమున్నీరవుతున్నారు. పని ముగించుకుని ఇంటికి వస్తున్న అష్వాక్‌ను పొడిచి చంపారని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆష్వాక్ మృతి విషయం వారి కుటుంబ సభ్యులకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఘర్షణలో గాయపడ్డ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతను మృతి చెందడం, పోస్ట్‌మార్టం వంటి కార్యక్రమాలన్నీ వారి కుటుంబ సభ్యులకు తెలయకుండానే చకచకా జరిగిపోయాయి. ఫోన్ చేసి పోస్టు మార్టం పూర్తయిందని, శవాన్ని తీసుకెళ్లమంటూ పోలీసులు చెప్పేవరకూ వారికి సమాచారం లేకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఢిల్లీ హైకోర్టు జస్టిస్ బదిలీ ఓ శేష ప్రశ్న!) -
ఢిల్లీ అల్లర్లు: మిరాకిల్ బాబు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఆ బాబు జన్మ నిజంగా ఆ కుటుంబానికి అద్భుతమే. జీవితాలపై ఆశలు వదిలేసుకున్న క్షణాల నుంచి, పొత్తిళ్లలో పసిగుడ్డును ప్రాణాలతో చూసుకునే క్షణం వరకు.. ఆ కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపింది. షబానా పర్వీన్ నిండు గర్భిణి. సోమవారం రాత్రి ఆమె తన భర్త, అత్త, ఇద్దరు పిల్లలతో ఈశాన్య ఢిల్లీలో ఉన్న కరవాల్‌నగర్‌లోని తమ ఇంట్లో నిద్రపోతోంది. హఠాత్తుగా ఒక గుంపు ఆ ఇంట్లోకి చొరబడింది. బూతులు తిడుతూ ఆ కుటుంబంపై దాడికి దిగింది. పర్వీన్ భర్తను విచక్షణారహితంగా కొట్టింది. పర్వీన్ పైనా దాడి చేసింది. ఆమె పొత్తికడుపుపైనా కొట్టారు. ఇంటికి నిప్పంటించారు. ప్రాణాలు దక్కవనే ఆ కుటుంబం భావించింది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ కుటుంబం దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు అల్ హింద్ ఆసుపత్రికి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లారు. అక్కడ పర్వీన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. (ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ) ఈ సందర్భంగా పర్వీన్ అత్త నసీమా మాట్లాడుతూ.. గుంపుగా వచ్చిన కొందరు మమ్మల్ని దూషించారు. నా కొడుకును కొట్టారు. వారిలో కొందరు గర్భిణి అయిన నా కోడలును పొత్తి కడుపులో తన్నారు. వారి బారి నుంచి ఆమెను రక్షించడానికి వెళితే నాపై కూడా దాడి చేశారు. మాకు ఆ రాత్రి కాళరాత్రే అవుతుందని అనుకున్నాం. దేవుడి దయతో మేము ప్రాణాలతో బయటపడ్డాం. ఈ దాడిలో మేం సర్వం కోల్పోయినా ... బిడ్డ పుట్టడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు మా కుటుంబం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితి. మాకు ఏమీ మిగల్లేదు. మా స్వస్థలానికి వెళ్లి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే’ అని వాపోయింది. కాగా ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు. ఉన్మాద ముకలు ఇళ్ళు, షాపులపై దాడి చేసి, వాహనాలకు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. (అంకిత్ శర్మ హత్య: తాహిర్పై ఆప్ వేటు) -
ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసాకాండలో మృతి చెందిన వారి కుటుంబాలు శోకసంద్రంలో మునుగిపోయాయి. ఢిల్లీ ఘర్షణలలో మొదటి మృతుడు ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, గోకుల్ పురి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న అతడు బుల్లెట్ గాయాలతో మరణించాడు. ఆయనకు భార్య ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. 24 ఏళ్ల షాహిద్ అల్వీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. (అంకిత్ శర్మ హత్య: తాహిర్పై ఆప్ వేటు) సోమవారం మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా ముస్తాఫాబాద్‌లో తుపాకి కాల్పులకు గురై మరణించాడు. రక్తం మడుగులో పడి ఉన్న అల్వీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అల్వీకి ఆరు నెలల కిందటే వివాహమైంది. పాలు కొనుక్కువస్తానని ఇంటి నుంచి బయలుదేరిన మెహ్తాబ్ మళ్లీ ఇంటికి చేరుకోలేదు. మంగళవారం ఐదు గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన 21 సంవత్సరాల మెహ్తాబ్ బుధవారం ఉదయం 5 గంటలకు లోక్‌నాయక్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. అతను నిర్మాణ కూలిగా పనిచేస్తున్నాడు. (వాచ్మెన్ పారిపోయాడు.. నిప్పు పెట్టారు..) 26 సంవత్సరాల రాహుల్ సోలంకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. ఘర్షణలు జరుగుతండడంతో అతను సోమవారం ఆఫీస్‌కు సెలవు తీసుకుని ఇంట్లో ఉండిపోయాడు. టీకి పాలులేకపోవడంతో పాలు కొనుక్కొస్తానని ఇంటినుంచి బయటకెళ్లిన తన కొడుకును ఇంటికి వంద మీటర్ల దూరంలోనే కొందరు చుట్టుముట్టి పాయింట్ బ్లాంక్‌లో కాల్చిచంపారని అతని తండ్రి హరి సింగ్ సోలంకి చెప్పారు. ముస్తాఫాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే 22 సంవత్సరాల ఆష్వాక్ హుస్సేన్‌కు ఫిబ్రవరి 14నే వివాహమైంది. పెళ్లి జరిగిన 11 రోజులకే అతను విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పని ముగించుకుని ఇంటికి వస్తున్న అష్వాక్‌ను పొడిచి చంపారని అతని పినతల్లి తెలిపింది. మహ్మద్ ఫుర్ఖాన్ పెళ్లి కార్డుల వ్యాపారం చేస్తుంటాడు. జఫరాబాద్‌లో ఆదివారం నుంచి ఘర్షణలు జరుగుతండడంతో ఇంటికి కావలసిన సామాన్ల కోసం బయలుదేరిన అతను బుల్లెట్ తగిలి ఆసుపత్రిలో కన్నుమూశాడు. 32 సంవత్సరాల ఫుర్ఖాన్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. (ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తునకు సిట్ల ఏర్పాటు) ముబారక్ హుస్సేన్ రోజు కూలిగా పనిచేసేవాడు. బాబర్‌పుర్ విజయ్‌పార్క్ కాలనీలో బుల్లెట్ గాయమై అక్కడికక్కడే మరణించాడు. రక్తం మడుగులో పడి ఉన్న అతని మృతదేహాన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కరావల్ నగర్లో నివసించే వీర్బాన్ సింగ్ మౌజ్పుర్లో డ్రై క్లీనింగ్ దుకాణం నడిపేవాడు. ఇంటికి తిరిగివస్తుండగా తలకు బుల్లెట్ తగిలి 50 ఏళ్ల వీర్బాన్ చనిపోయాడని అతని సోదరుడు చెప్పాడు. 35 సంవత్సరాల నజీంఖాన్‌కు ఆరుగురు పిల్లలు. తుక్కు వ్యాపారం చేసే ఖాన్ ఇంటికి సామాన్లు కొనుక్కొస్తానని చెప్పి బయలుదేరి శవమై తిరిగివచ్చాడు. (ఢిల్లీ ఘర్షణలపై స్పందించిన ఆరెస్సెస్) ముదస్సిర్ ఖాన్ ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. కర్దమ్‌పుర్‌లో నివసించే ఇతనికి మూడేళ్ల కుమార్తె, ఏడాది కొడుకు ఉన్నారు. ఇంటికి కావలసిన సామాన్లు కొనుక్కొస్తానని బయలుదేరి తిరిగిరాలేదు. మంగళవారం నుంచి ఇంటికి రాని 24 ఏళ్ల మొహసీన్ అలీని వెతుకుతూ జీటీబీ ఆసుపత్రికి వచ్చిన అతని కుటుంబానికి మార్చురీలో మృతదేహం లభించింది. అలీకి రెండు నెలల కిందటే వివాహమైంది. 85 ఏళ్ల అక్బరీ ఇంటికి నిప్పంటించడంతో మరణించింది. ఆమె కొడుకు ఇంటి మొదటి రెండు అంతస్తులలో దుస్తుల దుకాణం నడిపేవాడు. కాగా ఢిల్లీని వణికించిన అల్లర్లలో 38మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చెదురు మదురు ఘటనలు మినహా పరిస్థితి అదుపులోనే ఉంది. (అంకిత్ శర్మ హత్య కేసులో కొత్త ట్విస్ట్) -
ఢిల్లీ ప్రశాంతం..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వణికించిన అల్లర్లు గురువారానికి కొంతవరకు సద్దుమణిగాయి. మౌజ్‌పూర్, భజన్‌పురల్లో చోటు చేసుకున్న చెదురు మదురు ఘటనలు మినహా అల్లర్లకు కేంద్ర స్థానమైన ఈశాన్య ఢిల్లీ ప్రశాంతంగానే ఉంది. అల్లర్లను కట్టడి చేసే ప్రత్యేక బాధ్యతల్లో ఉన్న జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ గురువారం కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాగా, అల్లర్ల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మరణించిన వారి సంఖ్య గురువారానికి 38కి చేరింది. బయట ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో అత్తగారింట్లోనే పెళ్లితంతు పూర్తిచేస్తున్న పెళ్లికొడుకు జోహ్రి ఎన్క్లేవ్ ప్రాంతంలోని ఓ మురుగు కాలువలో గురువారం ఉదయం ఒక మృతదేహాన్ని గుర్తించారు. మౌజ్‌పుర్, భజన్‌పురల్లో పలు చోట్ల వాహనాలను, దుకాణాలను తగలబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ అల్లర్ల కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అల్లర్ల కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా రెండు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. డీసీపీలు జోయ్ టిర్కే, రాజేశ్ డియోల నేతృత్వంలో ఆ ప్రత్యేక దర్యాప్తు బృందాలు పని చేయనున్నాయి. ఆప్ నుంచి అల్లర్ల నిందితుడి సస్పెన్షన్ అల్లర్లకు సంబంధించి 48 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని ఢిల్లీ హైకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే, ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కాగా, ఇంటలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ హత్యలో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సెలర్ తాహిర్ హుస్సేన్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, తాహిర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. ప్రశాంతమే కానీ.. ఉద్రిక్త వాతావరణం ఈశాన్య ఢిల్లీలో గురువారం సైతం చాలా ప్రాంతాల్లో దుకాణాలు మూతబడి ఉన్నాయి. పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న చోట్ల ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని కుటుంబాలు ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవడం కనిపించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం ముజఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, గోకుల్‌పురి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు. భద్రతాబలగాలు అండగా ఉంటాయని వారికి అజిత్ ధోవల్ భరోసా ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు కవాతు చేపట్టారు. భద్రతాబలగాలను భారీ స్థాయిలో మోహరించారు. మృతదేహాలను తీసుకువచ్చేందుకు వచ్చిన కుటుంబీకులతో, క్షతగాత్రుల బంధువులతో జీటీబీ ఆసుపత్రి వద్ద గురువారం విషాద వాతావరణం నెలకొంది. 10 రోజుల కిత్రమే పెళ్లి జరిగిన అష్ఫాక్ హుస్సేన్ మృతదేహం వద్ద కుటుంబీకుల రోదనలు అక్కడున్నవారికి కన్నీళ్లు తెప్పించాయి. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే అష్ఫాక్ ఇంటికి తిరిగివస్తుండగా మంగళవారం గోకుల్‌పురి వద్ద దుండగుల కాల్పులకు గురయ్యారు. ఐరాస ఆందోళన భారత ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఢిల్లీలో మత ఘర్షణల్లో పోలీసుల ప్రేక్షకపాత్రపై ఐరాస మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. హింసను నివారించేందుకు కృషి చేయాలని రాజకీయ పార్టీల నేతలను కోరింది. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులనూ ప్రస్తావించింది. జెనీవాలో జరుగుతున్న మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో ఐరాస మానవ హక్కుల కమిషనర్ మిచెల్ బాచ్లెట్ ఈ అంశాలను లేవనెత్తారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఈశాన్య ఢిల్లీలో కొనసాగుతున్న ఘర్షణల్లో్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందజేస్తామని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయ్యే వైద్య చికిత్స ఖర్చులను కూడా తమ ప్రభుత్వం భరిస్తుందన్నారు. గృహ దహనాల్లో కీలక పత్రాలను కోల్పోయిన ప్రజలకు తిరిగి వాటిని అందజేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం నిర్మానుష్యంగా మారిన ఈశాన్య ఢిల్లీలోని ఓ ప్రధాన రహదారి రాష్ట్రపతిని కలసిన కాంగ్రెస్ ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని నిందిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. ఢిల్లీ హింసకి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరారు. ఘర్షణల సమయంలో ఆయన తన విధి నిర్వహణలో పూర్తిగా విఫలం చెందారని , కేంద్రం తన రాజధర్మాన్ని పాటిస్తూ అమిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో మన్మోహన్, ఆజాద్, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, ఖర్గే తదితరులు ఉన్నారు. కేసులో కేంద్రం ఇంప్లీడ్ స్పందనకు కేంద్రానికి 4 వారాల గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కేసులు నమోదు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో గురువారం కేంద్రప్రభుత్వమూ ఇంప్లీడ్ అయింది. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రం పరిధిలోని అంశం కనుక, కేంద్ర హోం శాఖ కక్షిదారుగా చేరేందుకు అనుమతించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ విజ్ఞప్తిని ఢిల్లీహైకోర్టు సీజే డీఎన్ పటేల్, జస్టిస్ హరిశంకర్ల బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి 4 వారాల గడువిచ్చింది. అవి నెల క్రితం ప్రసంగాలు బీజేపీ నేతలు చేసినట్లుగా చెపుతున్న విద్వేష ప్రసంగాలు దాదాపు నెల రోజుల కిత్రం నాటివని సొలిసిటర్ జనరల్ తుషార్ కోర్టుకు తెలిపారు. అయినా, ఇది అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొంటూ పిటిషన్‌దారులు బుధవారం జస్టిస్ మురళీధర్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్‌ను తీసుకువచ్చారన్నారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ముందు ఈ పిటిషన్ గురువారం విచారణకు రానున్నప్పటికీ.. వారు అత్యవసరంగా జస్టిస్ మురళీధర్ ధర్మాసనాన్ని ఆశ్రయించారన్నారు. ఢిల్లీలో ప్రశాంత పరిస్థితిని నెలకొల్పేందుకు అంతా కృషి చేస్తున్నారని, ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. విద్వేష ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది రాహుల్ మెహ్రా.. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సరైన ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. జస్టిస్ మురళీధర్ బదిలీ బుధవారం బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించిన జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్ మురళీధర్ ఆదేశించడం తెల్సిందే. జస్టిస్ మురళీధర్‌తో పాటు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి రంజిత్ వసంత్‌రావు మోరె, కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ రావి విజయ్‌కుమార్ మాలిమత్‌లను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించాక రాష్ట్రపతి ఈ బదిలీలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టులో మూడో సీనియర్ జడ్జి. సీఏఏ నిరసనకారులపై విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మలపై కేసులను నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని జస్టిస్ మురళీధర్ తీవ్రంగా తప్పుబట్టారు. కొందరిని రక్షించేందుకే.. ఢిల్లీ అల్లర్ల కేసు నుంచి కొందరు బీజేపీ నేతలను రక్షించేందుకే జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. న్యాయవ్యవస్థపై కేంద్రం బెదిరింపు ధోరణికి పాల్పడుతోందని స్పష్టమైందని విమర్శించింది. ఈ బదిలీ న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని, న్యాయాన్ని అణచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. గతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జస్టిస్ లోయాను ఒక ట్వీట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు సిఫారసుల మేరకే.. జస్టిస్ మురళీధర్ బదిలీ సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 12న చేసిన సిఫారసుల మేరకే జరిగిందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు. సాధారణ పరిపాలనాపరమైన బదిలీని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సాధారణంగా, సంబంధిత న్యాయమూర్తి నుంచి అనుమతి తీసుకున్న తరువాతే బదిలీ చేస్తామన్నారు. ‘కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. అందుకే దేశ అత్యున్నత వ్యవస్థలను నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’ అన్నారు. జస్టిస్ లోయాను రాహుల్ గాంధీ ప్రస్తావించడంపై స్పందిస్తూ.. ‘రాహుల్ సుప్రీంకోర్టు కన్నా తానే ఎక్కువ అనుకుంటాడు’ అని ఎద్దేవాచేశారు. జడ్జి బదిలీకి సంబంధించి ఫిబ్రవరి 12న సుప్రీం కొలీజియం సిఫారసులు చేసిందని, ఈ నిర్ణయం ఇప్పుడు ఆకస్మికంగా తీసుకున్నది కాదని కేంద్రమంత్రి జవదేకర్ వివరించారు. -
అల్లర్లకు కాంగ్రెస్, ఆప్లే కారణం
న్యూఢిల్లీ: ఢిల్లీ నిరసనల జ్వాలల్లో చిక్కుకోవడానికి కాంగ్రెస్, ఆప్లే కారణమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ రెండు పార్టీలు పౌరసత్వ సవరణ చట్టంపై యువతను తప్పుదోవ పట్టించి రాజధానిలో అల్లర్లు రేకెత్తించిన పాపానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా నిరసనలకు కారణమైన వారి ఇళ్లకు వెళ్లి, వారికి న్యాయసహాయం అందిస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇతర దేశాలకు చెందిన మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చే వ్యవహారంపై తాము చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. అయితే రాహుల్, ప్రియాంక గాంధీలు దేశంలోని మైనారిటీలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. 2016లో జేఎన్‌యూలో భారత వ్యతిరేక నినాదాలు చేసిన వారిని ఆప్ ప్రభుత్వం కాపాడిందన్నారు. -
వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్ ఎస్పీ