రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జిల్లా కేంద్ర కారాగారాలు ఉన్నాయి. అవిగాక రెవెన్యూ డివిజన్ పరిధిలో సబ్ జై ళ్లు కూడా ఉన్నాయి. కానీ పెరుగుతున్న జనాభా కంటే వేగంగా నేరాల సంఖ్య పెరుగుతోంది. భూతగాదాలు, గొడవలు, పోలీసు కేసులు, రిమాండ్లు బాగా పెరి గాయి. కానీ సబ్ జైళ్లలో ఖైదీల వసతికి సదుపాయాలు చాలా తక్కు వ. దీంతో రిమాండు ఖైదీలను జిల్లా కారాగారాలకు పంపాల్సివస్తోంది. వరంగల్ జిల్లా కేంద్రం నుండి ఏటూరునాగారం ఏజెన్సీ కనీసం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆప్రాంతంలో ఏ చిన్న కేసులో ఉన్నాగానీ ఖైదీలను కేంద్ర కారాగారానికి పోలీసు బందోబస్తుతో తరలించాల్సి వస్తోంది. అంతేకాదు ఖైదీలను కోర్టు విచారణకు తీసుకెళ్లి, తీసుకురావడానికి కూడా అంత దూరం బందోబస్తు తప్పడంలేదు. అది ఖైదీలకే కాదు, పరిమిత వనరు లున్న పోలీసు శాఖకూ ఇబ్బందిగానే ఉంటోంది. కుటుంబ సభ్యు లు లేదా బంధుమిత్రులు ఖైదీలను చూసి రావడం కూడా అత్యంత వ్యయప్రయాసలతో కూడినదిగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం తక్షణమే స్పందించి ప్రతి జిల్లాలో ఉన్న సబ్‌జైళ్ల సంఖ్య ఇతో ధికంగా పెరిగేలా తగు చర్యలను చేపట్టాల్సి ఉంది.
- కామిడి సతీష్‌రెడ్డి పరకాల, వరంగల్ జిల్లా
కొత్త సబ్ జైళ్లను నిర్మించాలి
Published Tue, Jan 13 2015 1:27 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM
Advertisement