సాక్షి బెంగళూరు: సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టు చేసి బెంగళూరులోని డీజే హళ్లి – కేజీ హళ్లి అల్లర్లకు పరోక్షంగా కారణమైన పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ తల తెస్తే రూ.50 లక్షలు నజరానాగా ఇస్తానని మీరట్‌కు చెందిన షహజీబ్ రిజ్వి అనే వ్యక్తి శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు సహజమని నవీన్ తండ్రి పవన్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు, శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయన్నారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్ భర్త సహా 60 మందిని అరెస్టు చేశారు. (బెంగళూరు హింస: ఉద్వేగానికి లోనైన ఎమ్మెల్యే)
Comments
Please login to add a commentAdd a comment