Latest Update
-
ఐఫోన్, ఐప్యాడ్ వాడుతున్నారా ..? హై రిస్క్ వార్నింగ్..!
-
వీళ్ళు పిల్లలు కాదు చిచ్చర పిడుగులు
-
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అగంతకుల నుంచి వచ్చే కాల్స్ నుంచి యూజర్లను కాపాడేలా ఐపీ అడ్రస్‌ను ఈ ఫీచర్ సురక్షితంగా ఉంచనుంది. వాట్సాప్‌కు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందించే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను గుర్తించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సప్‌లో ఎబుల్, డిసేబుల్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవడం ద్వారా యూజర్ల ఐపీ అడ్రస్‌లకు రక్షణ కవచంలా ఉంటుంది. నివేదిక ప్రకారం.. యూజర్లు వాట్సప్‌లో వాయిస్స్ కాల్స్, వీడియో కాల్స్ చేసే సమయంలో సురక్షితంగా ఉండేలా ప్రైవసీ సెట్టింగ్ స్క్రీన్‌లో అడ్వాన్డ్స్ అనే సెక్షన్లో ‘ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్’ ఎనేబుల్ చేసుకోవాలి. తద్వారా, ఇతరులు మీరు కాల్స్ మాట్లాడే సమయంలో మీరు ఎక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతున్నారు. ఐపీ అడ్రస్ ఏంటనేది తెలుసుకునే అవకాశం ఉండదు. ఫిల్టరింగ్ ఫర్ చానెల్ ఛానెల్ అప్డేట్ల కోసం రియాక్షన్లను ఫిల్టర్ చేసేలా వాట్సప్ మరో ఫీచర్‌ను విడుదల చేయనుంది. కాంటాక్ట్‌లలో ఎవరైనా ఎమోజీని ఉపయోగించి కంటెంట్‌కి ప్రతిస్పందించినట్లయితే వెంటనే గుర్తించడానికి ఛానెల్ యజమానులకు ఇది సహాయపడుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని వాబీటా నివేదించింది. -
పాన్ - ఆధార్ లింక్‌లో కొత్త అప్డేట్
పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని, ఈ ప్రక్రియ 2023 జూన్ 30 చివరి నాటికి పూర్తి చేసుకోవాలని గతంలోనే చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పాన్ కార్డు - ఆధార్ లింకింగ్‌లో కొత్త అప్డేట్ వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పాన్ కార్డు లింక్ చేసేందుకు రూ.1000 పెనాల్టీ చెల్లించి కూడా చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించడానికి ముందు ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్ ఇయర్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవానికి మార్చి 31 చివరి గడువుగా ప్రకటించారు. అయితే ఈ గడువు ప్రస్తుతం పొడిగించారు. కావున అసెస్మెంట్ ఏడాదిని 2023 - 24గా కాకుండా, అసెస్మెంట్ ఇయర్‌ను 2024-25గా ఎంచుకోవాలి. పేమెంట్ చేయడానికి అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఈ మార్పుని డబ్బు చెల్లించడానికి ముందే గమనించాలి. ఆలా కాకుండా దావుబ్బు చెల్లిస్తే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది లింక్ చేసుకుని ఉంటారు. అలాంటి వారు ఓసారి స్టేటస్ చెక్ చేసుకుని పాన్-ఆధార్ లింక్ అయిదో లేదో చూసుకోవడం మంచింది. ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూడవచ్చు: మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పోజీలో క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పేమెంట్ కోసం ఆప్షన్ ఎంచుకున్న తరువాత ఈ-పే ట్యాక్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అసెస్మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి ఆ తర్వాత చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4 లేదా 5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి. -
నాగార్జున, అల్లరి నరేష్ మల్టీస్టారర్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్
-
అనుష్కతో నవీన్ పొలిశెట్టి ప్రేమాయణం..?
-
ఇలా చేస్తే మీ వాట్సాప్ మెసేజ్ ఎవరూ చదవలేరు
-
వాట్సాప్‌లో మరో లేటెస్ట్ అప్డేట్
-
హరిహర వీరమల్లు క్రేజీ అప్డేట్.. నవరాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ..!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. నవరాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో పవర్ స్టార్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో పవన్ మొదటిసారి ఓ వారియర్‌గా కనిపించనున్నారు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోటోతో షూటింగ్‌కు సంబంధించిన వర్క్‌షాప్ ప్రారంభమైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. (చదవండి: Pawan Kalyan: 'ఫ్యాన్స్‌కు పండగే..'హరిహర వీరమల్లు' నుంచి పవర్ గ్లాన్స్ వచ్చేసింది) With HHVM himself 😊 నవరాత్రులలో నవ- ఉత్తేజం ! pic.twitter.com/4VNoPdpJ2G — mmkeeravaani (@mmkeeravaani) September 30, 2022 -
WhatsApp Latest Update: వాట్సాప్ లో మరో కిక్కిచ్చే ఫీచర్
-
బోయగూడ ఘటన జరగటానికి గల కారణాలు ఇవే..!
-
కరోనా: లక్షకు పడిపోయిన కొత్త కేసులు.. 865 మరణాలు
న్యూఢిల్లీ: మూడో వేవ్ భారత్‌లో కరోనా కేసుల తగ్గుముఖం మొదలైంది. తాజాగా ఒక్కరోజులో కొత్త కేసుల సంఖ్య లక్ష దాకా పడిపోయింది. ఆదివారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 1, 07, 474 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో మొత్తం 14, 48, 513 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1, 07, 474 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. కరోనా మరణాల సంఖ్య 865గా రికార్డు అయ్యింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య.. 5,01,979 పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12, 25, 011గా ఉంది. ఇక రికవరీల సంఖ్య 1, 13, 246 కాగా.. మొత్తం రికవరీల సంఖ్య 4, 04, 61, 148కి చేరింది. రికవరీ రేటు గణీయంగా పెరిగిందని ప్రకటించుకుంది కేంద్రం. రోజూవారీ పాటిజివిటీ రేటు 7.42 శాతానికి పడిపోగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 10.20శాతం ఉంది. మొత్తం 1,69,46,26,697 వ్యాక్సిన్ డోసుల్ని ప్రజలకు అందించింది కేంద్రం. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు; ఆసక్తికర పరిణామాలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. అయా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి. ‘కెప్టెన్’ ఆరోపణలను ఖండించిన అల్కా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మంత్రి పదవి కోసం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాబీయింగ్ చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఖండించారు. ‘కెప్టెన్’ తన మిత్రపక్షమైన బీజేపీ మాటలు వల్లెవేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 27న పంజాబ్‌కు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. 117 మంది పార్టీ అభ్యర్థులతో కలిసి స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని చెప్పారు. తర్వాత వర్చువల్ ర్యాలీని నిర్వహిస్తారని చెప్పారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనను పార్టీ కండువాతో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ స్వాగతించారు. 32 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనను ఇప్పుడు పక్కన పెట్టారని ఈ సందర్భంగా ఆర్పీఎన్ సింగ్ అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభమైందని, ప్రధాని మోది ఆశయ సాధనకు కార్యకర్తలా పనిచేస్తానని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ హామీ ఉత్తరాఖండ్‌లో తాము అధికారంలోని వస్తే ఎల్పీజీ సిలిండర్ ధర రూ.500 కంటే తక్కువకు పరిమితం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు. తాము పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. 2న ఆగ్రాలో మాయావతి సభ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 2న ఆగ్రాలో జరిగే బహిరంగ సభలో మాయావతి ప్రసంగిస్తారని బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా తెలిపారు. అప్నా దళ్ స్టార్ కాంపెయినర్లు వీరే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి, రెండవ దశ ఎన్నికల స్టార్ ప్రచారకుల జాబితాను అప్నా దళ్ (సోనీలాల్) పార్టీ విడుదల చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్.. ఆమె భర్త, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిష్ పటేల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేడీ(యూ) తొలి జాబితా ఇదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 20 మంది అభ్యర్థుల పేర్లతో జనతాదల్ యునైటెడ్ పార్టీ మొదటి జాబితాను మంగళవారం విడుదల చేసింది. ‘ఆప్’ నాలుగో జాబితా విడుదల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 10 మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విడుదల చేసింది. -
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్
-
Google: గూగుల్ వాడుతున్నారా? అయితే అర్జెంటుగా..
గూగుల్ తన యూజర్లకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అర్జెంట్‌గా గూగుల్ క్రోమ్‌ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. గత కొంతకాలంగా గూగుల్ క్రోమ్ -94 అప్డేట్ గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హఠాత్తుగా బుధవారం ఈ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయి, ఐవోఎస్, విండోస్‌తో పాటు మాక్‌ఓస్ వెర్షన్లను సైతం కొత్త ఫీచర్స్‌తో ఒకేసారి అప్డేట్ అందించింది. ప్రైవసీ, కొత్తగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తూనే క్రోమ్-94.. బగ్స్‌ను(దాదాపు 32) సైతం ఫిక్స్ చేసేసింది గూగుల్. ఇక 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త వెర్షన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. అంతేకాదు కాపీ లింక్స్, క్యూఆర్ కోడ్లను వెబ్సైట్లతో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌గా క్రోమ్ కొత్త వెర్షన్‌ను ప్రకటించుకుంది. హాట్‌న్యూస్: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..! మరో విశేషం ఏంటంటే.. ఇది HTTPS-First modeకి సంబంధించిన వెర్షన్. అంటే.. సురక్షితంకానీ వెబ్సైట్లను ఓపెన్ చేసినప్పుడు ఫుల్ పేజీ అలర్ట్‌ను చూపించే వెర్షన్‌గా లేటెస్ట్ అప్డేట్ ఘనత సాధించింది. తద్వారా యూజర్లను మరింత అప్రమత్తం చేస్తామని గూగుల్ ప్రకటించుకుంది. వెబ్సైట్ ఆరంభంలో ఉండే హెచ్‌టీటీపీఎస్ అనే లెటర్ష్.. సంబంధిత వెబ్సైట్ అసలా? నకిలీనా? అనే విషయం తెలియజేస్తుందని తెలుసు కదా!. ఒక్కోసారి సురక్షితంకానీ వెబ్సైట్లను సైతం ఓపెన్ కావడానికి క్రోమ్ అనుమతిస్తుంది. అలాంటప్పుడు గతంలో గూగుల్ అలర్ట్ ఏదో నామమాత్రంగానే.. చిన్నగా వచ్చేది. కానీ, ఒక్కోసారి అది గమనించకుండా యూజర్లు ముందుకెళ్లేవాళ్లు. కానీ, ఇప్పుడు కొత్త అప్డేట్ ద్వారా ఫుల్‌పేజీ అలర్ట్ ఇస్తారు. తద్వారా యూజర్ మరింత జాగ్రత్త పడొచ్చు. అలాంటి సైట్ల నుంచి వెనక్కి వచ్చేయొచ్చు. ఓవైపు సేఫ్ బ్రౌజింగ్. మరోవైపు వెబ్కోడెక్స్ ద్వారా గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లకు అందించనుంది క్రోమ్ 94. అంటే.. మానిటర్, ఇతర స్క్రీన్ల మీద వీడియోను సురక్షితంగా ప్లే చేయడంతో పాటు హార్డ్‌వేర్ డీకొడింగ్ను సురక్షితంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. చదవండి: గూగుల్‌పై సంచలన ఆరోపణలు నిజమే! ఇదీ చదవండి: ఫోన్ స్టోరేజ్ నిండిందా? డోంట్ వర్రీ.. వీటిలో ట్రై చేయండి -
దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తర్వాత కరోనా కేసులు 70 వేలకు దిగొచ్చాయి. తాజాగా గత 24 గంటల్లో భారత్‌లో 70,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 3,921 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. ఇక 1,19,501 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు దేశంలో 2,81,62,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 9,73,158 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 14,92,152 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య 37,96,24,626కు చేరింది. ఇక ఇప్పటి వరకు 25.48 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: నెగిటివ్ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్! -
దేశంలో లక్షకు దిగొచ్చిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు రెండు నెలల తరువాత కోవిడ్ కేసులు లక్షకు దిగొచ్చాయి. గత 24గంటల్లో భారత్‌లో 1,00,636 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్ పాజిటివ్ తేలగా.. 3,49,186 మంది కోవిడ్ బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు 23.27 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. (చదవండి: పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి) -
పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్‌రేప్ నిందితుడు
కృష్ణరాజపురం: బంగ్లాదేశ్ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సోబజ్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులపై దాడికి పాల్పడగా... అత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో అతని కాలికి తూటా గాయమైంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తినగర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల బెంగళూరులో బంగ్లాదేశ్‌కు చెందిన వలస కూలీలు విందు చేసుకుని, అందులో ఒక యువతిపై దుండగులు లైంగిక దాడికి పాల్పడడం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళల్ని అరెస్టు చేశారు. 10వ నిందితుడు సోబజ్... రామ్మూర్తి నగర పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపుర చెరువు సమీపంలోని ఒక గుడిసెలో ఉన్నాడని తెలిసి బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో మూత్ర విసర్జన కోసం వాహనాన్ని నిలపాలని కోరాడు. వాహనం దిగి వెళ్తూ తన వెనుకే వస్తున్న హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర నాయక్‌పై చాకుతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న ఎస్ఐ శివరాజ్పైనా దాడి చేశాడు. దీంతో ఎస్ఐ శివరాజ్ పిస్టల్‌తో కాల్చడంతో నిందితుని ఎడమ కాలికి గాయమైంది. నిందితునితో పాటు హెడ్‌కానిస్టేబుల్, ఎస్ఐకి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: బంగ్లాదేశ్‌లో నిర్భయ తరహా ఘటన) -
బంగ్లాదేశ్ యువతిపై గ్యాంగ్ రేప్.. కీలక సమాచారం వెలుగులోకి
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో బంగ్లాదేశ్‌కు చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో విచారణలో కీలక సమాచారం వెలుగు చూసింది. నిందితులు బెంగళూరులో ఉపాధి చూపిస్తామని పిలిపించడంతో ఢాకా నుంచి వచ్చానని తెలిపింది. బాధిత యువతిని బెంగళూరు ఇందిరానగర పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. తనపై చిత్రహింసలు జరిగిన మరుసటి రోజే కేరళకు వెళ్లిపోయానని యువతి చెప్పింది. అక్కడే తన ప్రియుడు ఉన్నాడని, దుండగుల భయంతో కేరళలో తలదాచుకున్నట్లు పేర్కొంది. ఇటీవల బెంగళూరులో కొందరు బంగ్లాదేశీ కూలీలు విందు చేసుకోగా... అందులో యువతిపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడగా, ఇద్దరు మహిళలు సహకరించారు. ఆ వీడియోలు బయటకు రావడంతో గుట్టు రట్టయింది. నిందితులు సాగర్, రిదాయ్‌బాబు, మహమ్మద్ బాబాషేక్, హకీల్లను ఇదివరకే అరెస్టు చేశారు. తనకు తల్లిదండ్రులు లేరని, కుటుంబ బంధువులు కూడా ఎవరూ లేరని బాధితురాలు పోలీసులకు తెలిపింది. గతంలో తాను దుబాయ్‌లో డ్యాన్సర్‌గా పని చేసి ఢాకాకు వెళ్లిపోయినట్లు చెప్పింది. నిందితుల సూచనతో బెంగళూరుకు వచ్చానని తెలిపింది. డబ్బుల విషయంలో నిందితులతో గొడవ జరిగిందని, అత్యాచార సమయంలో మరో యువతి కూడా ఉన్నట్లు తెలిపింది. వీడియోలో రికార్డు అయిన దృశ్యాలకూ పోలీసులకు అందిన ఫిర్యాదులకు, యువతి చెప్పిన సమాధానాలకు పొంతన లేదని తెలుస్తోంది. మరో యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: (బెంగళూరులో బంగ్లాదేశ్ యువతిపై గ్యాంగ్ రేప్.. వీడియో వైరల్) -
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుంది: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా బలహీన పడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 20 రోజులుగా నమోదవుతున్న రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంది. గత రెండు వారాలుగా రోజువారీ రికవరీల సంఖ్య తాజా ఇన్ఫెక్షన్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉందని, అలాగే దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసులు కూడా స్థిరంగా తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. దేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. మే 7న గరిష్ట స్థాయి(4,14,188 పాజిటివ్ కేసులు) తరువాత, దేశంలో రోజువారీ కేసులు మే 12న 3,48,421 కు తగ్గాయని, ఆ సంఖ్య మే 17 నాటికి మూడు లక్షల లోపుకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత నేటి వరకు కేసుల సంఖ్య 3,00,000 మార్కును దాటలేదని, ఇది శుభపరిణామంగా పరిగణించవచ్చని తెలిపారు. ఇక దేశవ్యాప్త రికవరీ రేటు విషయానికొస్తే.. మే 3న 81.8 శాతంగాఉన్న రికవరీ రేటు, మే 18న 85.6 శాతానికి పెరిగిందని, ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 90 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా సుమారు 2, 11,000 కొత్త కేసులు నమోదైనట్లు ప్రకటించారు. చదవండి: లక్షద్వీప్ భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుంది.. -
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..‘పుష్ప’ నుంచి క్రేజీ అప్డేట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా 'పుష్ప'. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాలో స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అల్లుఅర్జున్ కనిపించనున్నారు. అయితే ఫస్ట్‌లుక్, రిలీజ్ డేట్ పోస్టర్లను మినహాయించి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ను మూవీ టీం రివీల్ చేయలేదు. దీంతో పుష్ప అప్డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫ్యాన్స్‌కు శుభవార్త అందించింది. పుష్ప సినిమా నుంచి ఓ మాస్ అప్డేట్ని మూవీ టీం షేర్ చేసింది. బన్నీ బర్త్‌డేకు ఒకరోజు ముందుగా, అనగా ఈనెల 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌ను విజువల్‌గా పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఈ వారం 'పుష్ప' చిత్రం నుంచి మరిన్ని అప్ డేట్స్ వస్తున్నాయని, అభిమానులు సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. "లోడు దింపతాండాం" అంటూ చిత్తూరు యాసలో ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్లో పంచుకోడంతో బన్నీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన బన్నీ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. షరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి : పుష్పరాజ్‌ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు Get Ready for #Pushpa Updates 🔥@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/i9iKsxcuRE — Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2021 -
కొత్త సినిమాలపై ఓ లుక్కేద్దాం!
పండగ అంటే చాలు.. సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు సినీ లవర్స్. మహాశివరాత్రి సినీ అభిమానులను సంతోషపెట్టింది. వెంకటేశ్‌ని యంగ్ లుక్‌లో చూపెట్టింది. ప్రేయసితో కలసి ప్రత్యక్షమయ్యారు ప్రభాస్. గోపీచంద్‌తో కలిసి తమన్నా సీటీ కొట్టారు. ‘హరిహర వీరమల్లు’ అన్నారు పవన్ కల్యాణ్. ఇంకా కొత్త పోస్టర్లు పండగకి విడుదలయ్యాయి. కొత్త లుక్స్‌పై లుక్కేద్దాం. వెంకటేశ్ యువకుడిగాను, వృద్ధుడిగానూ కనిపించనున్న చిత్రం ‘నారప్ప’. తమిళ ‘అసురన్’కి రీమేక్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వృద్ధ లుక్ విడుదల కాగా పండగకు యంగ్ లుక్‌ని విడుదల చేశారు. డి. సురేష్‌బాబు, కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ సోలోగా వస్తే ప్రభాస్ తన ప్రేయసి పూజా హెగ్డేతో వచ్చారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధేశ్యామ్’లో ప్రభాస్, పూజా జంటగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. ఇక శివరాత్రి సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌తో వచ్చారు పవన్ కల్యాణ్. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్ ఖరారు చేసి, లుక్‌ని విడుదల చేశారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. గోపీచంద్, తమన్నా సీటీ కొడుతూ సందడి చేశారు. ఈ ఇద్దరూ జంటగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ‘సీటీమార్’లోని తాజా ఫొటో విడుదలైంది. ‘అన్నం’.. పరబ్రహ్మ స్వరూపం అంటున్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. అరిటాకులో ‘అన్నం’ అనే అక్షరాలు, పక్కనే వేట కొడవలితో పోస్టర్ని విడుదల చేశారు. శివరాత్రి శివుడి పండగ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేరునే టైటిల్‌గా చేసుకుని ‘శివుడు’ అంటూ వచ్చారు ఆది పినిశెట్టి. సుశీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లుక్ విడుదలైంది. దర్శకుడు రవిరాజా పినిశెట్టి సమర్పణలో ఈ చిత్రాన్ని సత్యప్రభాస్ నిర్మిస్తున్నారు. భారీ చిత్రాలు నిర్మించే యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మాణంలో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. పవన్ తేజ, సూర్య శ్రీనివాస్, రూపిక ముఖ్య తారలుగా కుంచమ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఛిల్ బ్రో’ లుక్ వచ్చింది. ఇంకా పలు చిత్రాల లుక్స్ రిలీజయ్యాయి. -
సంక్రాంతికి సర్ప్రైజ్
హీరో ప్రభాస్ సంక్రాంతి పండక్కి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నారట. రెండు సినిమాల అప్డేట్స్తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారని టాక్. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే కథానాయిక. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా విడుదల తేదీని సంక్రాంతికి ప్రకటిస్తారని సమాచారం. అదేవిధంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ప్రభాస్. ఇది సైన్స్ ఫిక్షన్ తరహా చిత్రం. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు నాగ్ అశ్విన్. ఇంతకీ ఆ సర్ప్రైజ్లేంటో తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచిచూడాల్సిందే. -
తలైవి పాత్రలో ఒదిగిపోయిన కంగనా
హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి' షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. కరోనా లాక్డౌన్ కారణంగా గత ఆరునెలల నుంచి షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న 'తలైవి' చిత్రం ఆదివారం తిరిగి షూటింగ్‌ను ప్రారంభించినట్లు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఫైర్ బ్రాండ్ కంగనా.. 'జయ మా ఆశీస్సులతో 'తలైవి' మరో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. కరోనా తర్వాత చాలా విషయాలు మారాయి. కానీ యాక్షన్, కట్ చెప్పే విధానం ఏ మాత్రం మారలేదు' అంటూ పేర్కొంది. తలైవి షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక ఫొటోలు వైరల్ అవుతూ వచ్చాయి. అయితే తాజాగా.. కంగనా జయలలిత పాత్రలో అసెంబ్లీకి వస్తున్న ఫొటోలు, అసెంబ్లీలో కూర్చున్న ఫొటోలను షేర్ చేసింది. ఇందులో కంగనా జయలలిత పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తలైవి విడుదల తేదీని మూవీ యాజమాన్యం త్వరలో ప్రకటించనుంది. కాగా కంగనా జయలలిత బయోపిక్ కాకుండా, ఎయిర్ ఫోర్స్ మూవీ తేజస్‌లో కూడా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానుంది. (వివాదాస్పద ట్వీట్ : కంగనాకు కోర్టు ఝలక్) With the blessings of Jaya Ma we completed one more schedule of Thalaivi- the revolutionary leader. After corona many things are different but between action and before cut nothing changes. Thank you team @vishinduri @ShaaileshRSingh #ALVijay pic.twitter.com/CghmfK0JQf — Kangana Ranaut (@KanganaTeam) October 11, 2020 -
నవీన్ తల తెస్తే రూ.50 లక్షలు
సాక్షి బెంగళూరు: సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టు చేసి బెంగళూరులోని డీజే హళ్లి – కేజీ హళ్లి అల్లర్లకు పరోక్షంగా కారణమైన పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ తల తెస్తే రూ.50 లక్షలు నజరానాగా ఇస్తానని మీరట్‌కు చెందిన షహజీబ్ రిజ్వి అనే వ్యక్తి శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు సహజమని నవీన్ తండ్రి పవన్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు, శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయన్నారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్ భర్త సహా 60 మందిని అరెస్టు చేశారు. (బెంగళూరు హింస: ఉద్వేగానికి లోనైన ఎమ్మెల్యే)