న్యూఢిల్లీ: మూడో వేవ్ భారత్‌లో కరోనా కేసుల తగ్గుముఖం మొదలైంది. తాజాగా ఒక్కరోజులో కొత్త కేసుల సంఖ్య లక్ష దాకా పడిపోయింది. ఆదివారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 1, 07, 474 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య మాత్రం తగ్గట్లేదు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో మొత్తం 14, 48, 513 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1, 07, 474 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. కరోనా మరణాల సంఖ్య 865గా రికార్డు అయ్యింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య.. 5,01,979 పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12, 25, 011గా ఉంది.
ఇక రికవరీల సంఖ్య 1, 13, 246 కాగా.. మొత్తం రికవరీల సంఖ్య 4, 04, 61, 148కి చేరింది. రికవరీ రేటు గణీయంగా పెరిగిందని ప్రకటించుకుంది కేంద్రం. రోజూవారీ పాటిజివిటీ రేటు 7.42 శాతానికి పడిపోగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 10.20శాతం ఉంది. మొత్తం 1,69,46,26,697 వ్యాక్సిన్ డోసుల్ని ప్రజలకు అందించింది కేంద్రం.
Comments
Please login to add a commentAdd a comment