ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ టెన్షన్ పెడుతోంది. దేశవ్యాప్తంగా మళ్లీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఊహించని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య 6వేలు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిపై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
ఇదిలా ఉండగా.. దేశంలో కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీని ఫలితంగానే దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక, ఈ వేరియంట్‌పై పరిశోధనలు కూడా చేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.
మరోవైపు.. ఈ వేరియంట్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వేరియంట్ సోకిన పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. తాజాగా కోవిడ్ బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. గతంలో కరోనా బారిపడినవారిలో ఇలాంటి లక్షణాలు లేవని తెలిపారు. ఈ కొత్త లక్షణాలతో పాటుగానే గతంలో మాదిరిగానే కోవిడ్ బాధితులకు హైఫీవర్, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
XBB.1.16 #Arcturus
For the last 2 days, have started getting pediatric Covid cases once again after a gap of 6 mo! An infantile phenotype seems emerging—treated infants w/ high fever, cold & cough, & non-purulent, itchy conjunctivitis w/ sticky eyes, not seen in earlier waves pic.twitter.com/UTVgrCCLWU— Vipin M. Vashishtha (@vipintukur) April 6, 2023
Comments
Please login to add a commentAdd a comment