Hari Hara Veera Mallu: MM Keeravani Shares Pic With Pawan Kalyan Goes Viral - Sakshi
Sakshi News home page

Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు.. కీరవాణి పోస్ట్ వైరల్..!

Published Fri, Sep 30 2022 3:21 PM | Last Updated on Fri, Sep 30 2022 4:13 PM

MM Keeravani Shares  A Pic From Pawan Kalyan Hari Hara Veera Mallu - Sakshi

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. నవరాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో పవర్ ‍స్టార్ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో పవన్ మొదటిసారి ఓ వారియర్‌గా  కనిపించనున్నారు.

భీమ్లా నాయక్‌ తర్వాత పవన్‌ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోటోతో షూటింగ్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌ ప్రారంభమైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

(చదవండి: Pawan Kalyan: 'ఫ్యాన్స్‌కు పండగే..'హరిహర వీరమల్లు' నుంచి పవర్‌ గ్లాన్స్‌ వచ్చేసింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement