
‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపు 80 శాతంకు పైగా పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాను మొదట జులై 30, 2020న విడుదల చేస్తామని ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్‌కు చాలానే సమయం పడుతుడటంతో.. చెప్పిన సమయానికి రిలీజ్ చేయడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనికి తోడు కొన్ని వారాల ముందు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో జులై 30న విడురల అని లేకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తాయి
తాజాగా ఆ అనుమానాలు నిజమనేలా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రిలీజ్ డేట్ 2021కి మారిపోయింది. చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని జనవరి 8, 2021గా పేర్కొంటూ ఒక పోస్ట్‌ను ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది. అంతేగాక అప్పటి వరకు వేచి ఉండటం కష్టమని భావించిన మూవీ బృందం.. సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను అందిస్తామని పేర్కొంది. కాగా ఆర్ఆర్ఆర్ మొత్తం 10 భాషల్లో విడుదలవుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. సినిమాలో జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న తెలిసిందే. అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రేయ శరణ్ కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
#RRR will hit the screens on January 8th, 2021! We know the wait is long but we promise to keep giving you updates in the meanwhile. #RRROnJan8th pic.twitter.com/yObn0Axl9J
— RRR Movie (@RRRMovie) February 5, 2020
Comments
Please login to add a commentAdd a comment