Controversial Allegations
-
రాముడిపై తమిళనాడు మంత్రి వ్యాఖ్యల దుమారం
చెన్నై: శ్రీరాముడిపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రాముని ఉనికిని చాటే ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని డీఎంకే మంత్రి ఎస్ఎస్ శివశంకర్ వ్యాఖ్యానించారు. అరియలూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో శివశంకర్ మాట్లాడుతూ.. రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.చోళ రాజ వంశానికి చెందిన రాజేంద్ర-I వారసత్వాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. రాజేంద్ర చోళన్ జీవించాడని చూపించడానికి ఆయన నిర్మించిన చెరువులు, ఆలయాలు ఉన్నాయి. అతని పేరు స్క్రిప్ట్‌లలో ప్రస్తావించారు. అతని శిల్పాలు ఉన్నాయి. కానీ రాముడు ఉన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు, చరిత్ర లేదు. రామడిని అవతార్ అని పిలుస్తారు. అవతార్ పుట్టదు. మనల్ని మభ్యపెట్టేందుకు ఇలా చేస్తారు. మన చరిత్రను దాచి మరో చరిత్రను పెద్దగా చూపించే ప్రయత్నమిది.అయితే డీఎంకే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. ఈ మేరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై డిఎంకేపై మండిపడ్డారు.భగవంతుడు శ్రీరాముడిపై డీఎంకేకు ఉన్న ఆస్మిక అభిమానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. డీఎంకే నేతల జ్ఞాపకాలు ఇంత త్వరగా మసకబారుతున్నాయని ఎవరనుకుంటారు. వీరే కదా కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్‌లో చోళ రాజవంశం సెంగోల్‌ను ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీని వ్యతిరేకించిన వారు? తమిళనాడు చరిత్ర 1967లో ప్రారంభమైందని భావించే డీఎంకే పార్టీ అకస్మాత్తుగా దేశ గొప్ప సంస్కృతి చరిత్రపై ప్రేమను చూపడం హాస్యాస్పదంగా ఉంది.రాముడిని ద్రావిడ మోడల్‌కు ఆద్యుడుగా పేర్కొన్న మరో మంత్రి రేగుపతిని ప్రస్తావిస్తూ.. తన సహోద్యోగితో (శివశంకర్) చర్చించి రాముడిపై ఏకాభిప్రాయానికి రావాలని అన్నామలై కోరారు. భగవంతుడైన రాముడి గురించి కొన్ని విషయాలు తన సహచర మంత్రి నుంచి శివశంకర్ నేర్చుకోగలరనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు. -
పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో?
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు నచ్చిన విధంగా ఏదో ఒక రకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆధారాలు లేకుండా కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ, జనసేనపై ప్రజల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. 1) పెడన సభలో నాపై దాడికి 2 వేల మంది క్రిమినల్స్‌ను రాళ్ల దాడి కి దింపారనే సమాచారం ఉంది: (2023-10-03) 2) హైదరాబాద్ ఇంటి దగ్గర నాపై దాడికి కుట్ర పన్ని ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు: (నవంబర్ 4, 2022) 3) కోనసీమ జిల్లాల్లో వారాహి యాత్రపై దాడి చేసేందుకు 2 వేల మంది నేరగాళ్లను దించారు, 50 మందిని చంపేయాలని ప్లాన్ వేశారు, నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఈ సమాచారం వచ్చింది: (10-09-2023) 4) చింతమనేని నన్ను చంపటానికి ప్లాన్ చేసారు, అది వీడియో తీసి కొందరు నాకు పంపించారు, నేను భయపడును, చిన్నప్పుడే రౌడీలను కొట్టాను: (సెప్టెంబర్ 28, 2018 ) 5) వైఎస్ రాజశేఖర రెడ్డి నాపై దాడి చేయమని 2వేల మందిని పంపాడు నేను భయపడలేదు 2009లో కామెంట్స్. ఇలా ఏదో విధంగా పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ రుజువు కాలేదు. దీనికి సంబంధించిన వివరాలను కూడా పవన్ ఎక్కడా చూపించలేదు. ఇక, హైదరాబాద్‌లో దాడికి ప్లాన్ చేశారని ఊదరగొట్టినా తెలంగాణ పోలీసులు.. అక్కడ ఏం జరిగిందో క్లియర్‌గా చెప్పేశారు. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఎల్లో బ్యాచ్ సహా పవన్‌కు షాక్ తగిలినట్టు అయ్యింది. -
జీవితం చాలా చిన్నది.. తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి: రాజీవ్ సేన్
బుల్లితెర సీరియల్ నటి చారు అసోపా చారు- నటి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ రాజీవ్ సేన్ల విడాకుల వ్యవహారం కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసింది నువ్వంటే నువ్వని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సహ నటుడితో రొమాంటిక్ రీల్ చేయలేదా అని భార్యను నిలదీసే వచ్చాక వీరిద్దరి వ్యవహారం. ఆ వివాదం కాస్తా నెట్టింట తీవ్రమైన చర్చకు దారి తీసింది. భర్త ఆరోపణలపై చారు ఆవేదన వ్యక్తం చేసింది. అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారని భర్త రాజీవ్ సేన్‌ను ఉద్దేశించి మాట్లాడింది. (చదవండి: అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారు? భర్త ఆరోపణలపై నటి ఆవేదన) అయితే ఈ వ్యవహారంలో తన భార్య చారు అసోపా ఆరోపణలపై రాజీవ్ సేన్ ప్రతిస్పందించారు. ఆమె నా కుమార్తెతో సహా బయటకు వెళ్లడం ద్వారా తనకు తానే ప్రతీది కోల్పోయేలా చేసుకుందన్నారు. ఆమె కోసం ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని రాజీవ్ వ్యాఖ్యానించారు. చారు-కరణ్ మెహ్రాల ‘వ్యవహారం, చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లడం నుంచి.. ముద్దుల కూతురు జియానా పుట్టినరోజు వేడుకపై గురించి మాట్లాడారు. ఒక వ్యక్తిగా చారు మీడియాతో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తప్పు అని అన్నారు. ఈ విషయంలో ఆమె కూడా బాధపడి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా ప్రజలకు ఒక జోక్‌లా అనిపిస్తుందని రాజీవ్ వెల్లడించారు. విడాకులు కావాలంటే గౌరవప్రదంగా తీసుకోవాలి కానీ.. ఇలా పరువు తీసుకునేలా చేయకూడదని రాజీవ్ అన్నారు. నేను చారు, మా కుటుంబంతో కలిసి చాలా వ్లాగ్స్ చేశాం.. కానీ జరిగినదంతా చూసి చాలా బాధపడినట్లు తెలిపారు. నా గురించి ఇంత దారుణంగా ఎవరూ మాట్లాడలేదని రాజీవ్ సేన్ అన్నారు. చారుది చిన్న పిల్ల మనస్తత్వమని.. తాను ఎక్కువ ఎమోషనలవుతుందని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ సేన్ మాట్లాడుతూ.. 'ఈ వ్యవహరంలో నేనే స్పష్టంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈ వివాదం వల్ల నా బిడ్డ ప్రభావితం కావడం నాకు ఇష్టం లేదు.. అందుకే చారు తిరిగి వచ్చేందుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి. చారు మా కుటుంబానికి తిరిగి రావాలనుకుంటున్నాం. ఇది జియానా ఇల్లు. మన జీవితం చాలా చిన్నది.' అని అన్నారు. -
వివాదం లో ఆదిపురుష్ టీజర్
-
నవీన్ తల తెస్తే రూ.50 లక్షలు
సాక్షి బెంగళూరు: సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టు చేసి బెంగళూరులోని డీజే హళ్లి – కేజీ హళ్లి అల్లర్లకు పరోక్షంగా కారణమైన పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ తల తెస్తే రూ.50 లక్షలు నజరానాగా ఇస్తానని మీరట్‌కు చెందిన షహజీబ్ రిజ్వి అనే వ్యక్తి శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు సహజమని నవీన్ తండ్రి పవన్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు, శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయన్నారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్ భర్త సహా 60 మందిని అరెస్టు చేశారు. (బెంగళూరు హింస: ఉద్వేగానికి లోనైన ఎమ్మెల్యే) -
జిగర్తండా విడుదల వాయిదా
జిగర్తండా చిత్రం విడుదల వాయిదా పడింది. సిద్దార్థ్ లక్ష్మీ మీనన్ జంటగా నటించిన చిత్రం జిగర్తండా. పిజ్జా వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. గుప్తా కంపెనీ పతాకంపై ఎస్.కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసింది. దర్శక నిర్మాతల వివాదం కారణంగా చిత్రం విడుదలలో జాప్యం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. చిత్రం సెన్సార్ కట్స్ విషయంలో దర్శక నిర్మాతల మధ్య వివాదం ఏర్పడినట్లు సమాచారం. జిగర్తండా చిత్రానికి సెన్సార్ బృందం కొన్ని కట్స్‌తో యు సర్టిఫికేట్ ఇచ్చారు. ఎట్టకేలకు జిగరతండా చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడీ చిత్రం మరోవారం వెనక్కుపోతోంది. ఆగస్టు ఒకటిన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఎస్.కదిరేశన్ వెల్లడించారు. అందుకు కారణాన్ని ఆయన తెలుపుతూ ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం వేలై ఇల్లా పట్టదారి విజయవంతంగా ప్రదర్శితమవుతోందన్నారు. ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు, పంపిణీదారులు జిగర్తండా చిత్రం కూడా చాలా బాగా వచ్చిందని, కొంచెం గ్యాప్ ఇచ్చి విడుదలచేస్తే అధిక థియేటర్లలో ప్రదర్శించవచ్చునని సూచించడంతో వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జిగర్తండా చిత్రాన్ని ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత వివరించారు.