జిగర్‌తండా విడుదల వాయిదా | Jigarthanda release postponed | Sakshi
Sakshi News home page

జిగర్‌తండా విడుదల వాయిదా

Published Tue, Jul 22 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

జిగర్‌తండా విడుదల వాయిదా

జిగర్‌తండా విడుదల వాయిదా

జిగర్‌తండా చిత్రం విడుదల వాయిదా పడింది. సిద్దార్థ్ లక్ష్మీ మీనన్ జంటగా నటించిన చిత్రం జిగర్‌తండా. పిజ్జా వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. గుప్తా కంపెనీ పతాకంపై ఎస్.కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసింది. దర్శక నిర్మాతల వివాదం కారణంగా చిత్రం విడుదలలో జాప్యం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. చిత్రం సెన్సార్ కట్స్ విషయంలో దర్శక నిర్మాతల మధ్య వివాదం ఏర్పడినట్లు సమాచారం. జిగర్‌తండా చిత్రానికి సెన్సార్ బృందం కొన్ని కట్స్‌తో యు సర్టిఫికేట్ ఇచ్చారు.
 
 ఎట్టకేలకు జిగరతండా చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడీ చిత్రం మరోవారం వెనక్కుపోతోంది. ఆగస్టు ఒకటిన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఎస్.కదిరేశన్ వెల్లడించారు. అందుకు కారణాన్ని ఆయన తెలుపుతూ ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం వేలై ఇల్లా పట్టదారి విజయవంతంగా ప్రదర్శితమవుతోందన్నారు. ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు, పంపిణీదారులు జిగర్‌తండా చిత్రం కూడా చాలా బాగా వచ్చిందని, కొంచెం గ్యాప్ ఇచ్చి విడుదలచేస్తే అధిక థియేటర్లలో ప్రదర్శించవచ్చునని సూచించడంతో వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జిగర్‌తండా చిత్రాన్ని ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement