jigarthanda
-
'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జిగర్ తండ(డబుల్ ఎక్స్) నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య, నిమిషా, నవీన్ చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, కతిరేశన్ దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: తిరు ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ విడుదల తేది: నవంబర్ 10, 2023 రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరెకెక్కించిన చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్. కథిరేసన్ నిర్మించగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్ తండ(ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సీజర్(రాఘవ లారెన్స్) రాయలసీమలోని కర్నూలులో గ్యాంగ్‌స్టార్. ఆ ప్రాంతంలోని మరో గ్యాంగ్ స్టార్ లారెన్స్‌తో గొడవ పడుతుంటారు. అప్పుడే తన గురువు లాంటి అతన్ని సీజర్ చంపేస్తాడు. కానీ సీజర్కు స్థానిక రాజకీయ నాయకుడైన కారుమంచి(ఇళవరసు) సపోర్ట్ ఉంటుంది. మరో రాజకీయ నాయకుడైన టామ్ చాకో(జయకృష్ణ) మనిషిని సీజర్ చంపడంతో అతనిపై పగ పెంచుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే సీజర్‌ను చంపేయాలని జయకృష్ణ.. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నవీన్ చంద్రకు చెప్తాడు. అయితే సీజర్‌ను చంపే ప్రయత్నంలో ఎస్సై కావాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్) మధ్యలో ఎందుకు ఎంటరయ్యాడు? అసలు జయకృష్ణకు సీజర్‌ను చంపాల్సిన అవసరమేంటి? చివరికీ జయకృష్ణ సీజర్‌ను చంపాడా? లేదా? అసలు సీజర్(లారెన్స్)ను, రే దాసన్(ఎస్జే) ఎందుకు చంపాలనుకున్నాడు? వీరిద్దరి మధ్య గల వైరానికి కారణమేంటి? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరోవైపు అడవిలో ఉండే ఆదివాసీలకు, అసలు సీజర్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఫారెస్ట్ అధికారుల వేధింపుల నుంచి ఆదివాసీలను సీజర్ ఎందుకు రక్షించాలనుకుంటాడు? చివరికీ వారికి అండగా నిలిచాడా? లేదా? ప్రభుత్వం, అటవీ అధికారులకు దొరకకుండా.. అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్న స్మగ్లర్లను సీజర్ ఎందుకు పట్టుకున్నాడు? వాళ్లను పట్టుకున్నాక సీజర్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వచ్చింది? చివరికీ తాను అనుకున్న లక్ష్యం నేరవేరిందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. ఎలా సాగిందంటే.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే కథను పరిచయం చేశాడు డైరెక్టర్. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ ముందుకొచ్చిన కార్తీక్ సుబ్బరాజు సీక్వెల్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 1970 ప్రాంతంలో రాయలసీమలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే ఏనుగుల దంతాల స్మగ్లింగ్ నేపథ్యంలో కథను తీసుకొచ్చారు. ఫస్టాఫ్‌లో రాయలసీమ జిల్లాల్లోని స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, అడవిలో నివసించే ఆదివాసీల చుట్టే తిరుగుతుంది. అయితే ఎస్సైగా జాబ్‌లో చేరాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్), మరో వైపు హీరో కావాలనుకున్నా రాఘవ(సీజర్) మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాప్‌లో మరీ ముఖ్యంగా సీరియస్‌గా సాగుతున్న స్టోరీలో సత్యన్, ఎస్జే సూర్యతో కామెడీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సుబ్బరాజు. ఇంటర్వెల్‌కు ముందు చిన్న ట్విస్ట్ ఇచ్చి సింపుల్‌గా ముగించారు. సెకండాఫ్ మొదలవగానే కథలో కాస్తా వేగం పెరిగింది. అడవితల్లితో వారికున్న బంధాన్ని చాలా చక్కగా చూపించారు. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల జీవన విధానాన్ని సైతం ప్రేక్షకులకు పరిచయం చేశారు కార్తీక్. ముఖ్యంగా అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్నషెటానీ ముఠా.. రాఘవ లారెన్స్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు కాస్తా ఉత్కంఠకు గురి చేస్తాయి. ఒకవైపు రాజకీయ నాయకులు, అధికారుల కుట్రలను ప్రేక్షకులకు చూపిస్తూనే.. మరోవైపు ఆదివాసీ బిడ్డల అమాయకత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అడవి బిడ్డలైన ఆదివాసీలకు, జంతువులకు మధ్య ఉండే ప్రేమానురాగాలను కాస్తా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఏనుగులను చంపే షెటానీ ముఠా, సీజర్(రాఘవ లారెన్స్) మధ్య జరిగే ఫైట్ సీన్స్ సెకండాఫ్‌లో హైలెట్. ఒకవైపు రాజకీయ నాయకుల కుట్రలు, మరోవైపు అడవిలో స్మగ్లింగ్, వీరి మధ్యన నలిగిపోతున్న ఆదివాసీ బిడ్డలతో కథను ముందుకు తీసుకెళ్లారు. అక్కడక్కడ వచ్చే ప్రేకకుల ఊహకందే ట్విస్టులతో థియేటర్లో కూర్చోబెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్‌ను కంటతడి పెట్టించారు డైరెక్టర్. సినిమా చివరి 20 నిమిషాలు ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా ఆడియన్స్‌లో మాత్రం ఉత్కంఠ పెంచుతాయి. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కించడంలో ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడనిపిస్తోంది. జగర్ తండకు సీక్వెల్ అయినా రెండు కథలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే రెండింటిలోనూ సెటప్ అంతా దాదాపుగా ఒకే తరహాలో సాగుతుంది. అయితే మరో సీక్వెల్‌గా త్రిబుల్ ఎక్స్ తీసుకురానున్నట్లు చివర్లో హింట్ మాత్రం ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే... రాఘవ లారెన్స్ ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టేశారు. తనలోని ఫుల్ మాస్ యాక్షన్‌తో మరోసారి తనదైన నటనతో మెప్పించారు. ఎస్జే సూర్య సైతం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. నవీన్ చంద్ర అటవీశాఖ అధికారి పాత్రలో ఒదిగిపోయారు. నిమిశా, ఇళవరసు, టామ్ చాకో, సత్యన్, బావ చెల్లాదురై, అరవింద్ ఆకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. సంతోష్ నారాయణన్ సంగీతం పర్వాలేదు. ఈ చిత్రంలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా సందర్భాన్ని తగినట్లుగానే ఉన్నాయి. బీజీఎం ఫరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్తా పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - మధుసూదన్, సాక్షి వెబ్ డెస్క్ -
నన్ను కొత్తగా చూస్తారు
రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన ΄ాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు. లారెన్స్ మాట్లాడుతూ – ‘‘జిగర్ తండ’ సినిమాలోని గ్యాంగ్‌స్టర్ ΄ాత్రలో నటించే తొలి అవకాశం నాకే వచ్చింది. కానీ అప్పుడు ఇతర ్ర΄ాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల చేయడం కుదర్లేదు. ఆ తర్వాత ‘జిగర్ తండ’కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దీంతో ‘జిగర్ తండ’ కు సీక్వెల్ ఉన్నట్లయితే అందులో నేను నటిస్తానని కార్తీక్ సుబ్బరాజుకి చె΄్పాను. ఈ సీక్వెల్ ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ కథ సిద్ధమైన ఏడాది తర్వాత కార్తీక్ సుబ్బరాజు ఫోన్ చేసి చె΄్పారు. కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించాను. ∙ఈ సినిమా విషయంలో దర్శకుడు కార్తీక్ చెప్పినట్లు చేశాను. ప్రేక్షకులు కొత్త రాఘవా లారెన్స్‌ని చూస్తారు. సినిమా ఫస్టాప్‌లో యాక్షన్, సెకండాఫ్‌లో భావోద్వేగాల సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల హృదయం కూడా బరువెక్కుతుంది. ∙త్వరలో ‘కాంచన 4’ స్టార్ట్ చేస్తాను. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్‌గారి కోసమే కాదు.. సూపర్‌స్టార్, మెగాస్టార్ (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) కలిసి యాక్ట్ చేసే ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. కానీ వారు యాక్ట్ చేయాలి కదా’’ అన్నారు. నటుడు– దర్శకుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘దర్శకత్వం–నటన..ఈ రెండింటిలో నాకు నటన అంటేనే ఇష్టం. అయితే నా కెరీర్ ్ర΄ారంభంలో యాక్టింగ్ అవకాశాల కోసం డైరెక్షన్‌ని వారధిగా వినియోగించుకున్నాను. ఇక ‘జిగర్ తండ: డబుల్ఎక్స్’లో లారెన్స్గారిది గ్యాంగ్‌స్టర్ రోల్. నాదేమో దర్శకుడు కావాలనుకునే ΄ాత్ర. నా ΄ాత్రలో సత్యజిత్ రేగారి సినిమాల రిఫరెన్స్ ఉండటంతో ఇదొక బహుమతిగా భావించి ఈ మూవీ చేశాను. మంచి మాస్ కమర్షియల్ అంశాలు ఉన్న సందేశాత్మక చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ కోసం ఓ విలేజ్ సెట్ వేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఓ రోడ్, బ్రిడ్జ్ వేశాం. అప్పటికే రోడ్, బ్రిడ్జ్ సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్న ఆ గ్రామస్తులకు ఇవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. నేను నటిస్తూ, నా దర్శకత్వంలో ఓ సినిమా రానుంది’’ అని చెప్పుకొచ్చారు. -
జిగర్ తండా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నాపై నాకు నమ్మకం వచ్చింది
‘‘జిగర్తాండ డబుల్ ఎక్స్’లో నాకు మేకప్ వాడలేదు. మేకప్ లేకుంటే బాగుండనేమో? అనుకున్నాను. కానీ, స్క్రీన్‌పై చూసుకున్నాక నా మీద నాకు నమ్మకం ఏర్పడింది’’ అన్నారు రాఘవా లారెన్స్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమాలోని ‘కోరమీసం..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’లో నేను చేయాల్సింది.. కానీ, కుదర్లేదు. ఆ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ కోసం ఓ ఊర్లో రోడ్డు, బ్రిడ్జి నిర్మించారు మా నిర్మాత. ఆయన మంచి మనసు కోసమైనా ఈ చిత్రం బాగా ఆడాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పండగలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయన్. ‘‘జిగర్తాండ’ కంటే డబుల్ ఎక్స్ రేంజ్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం’’ అన్నారు ఎస్జే సూర్య. -
ఆ మూవీ రిలీజ్ తర్వాత చాలా బాధపడ్డా: రాఘవ లారెన్స్
నటుడు రాఘవ లారెన్స్ హీరోగా, ఎస్జే సూర్య విలన్‌గా నటించిన తాజా చిత్రం 'జిగర్తండ డబుల్ ఎక్స్'. నటి నిమిషా సజయన్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరునావుక్కరుసు చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో రాఘవ లారెనన్స్ మాట్లాడుతూ జగర్తండా చిత్రంలో తానే నటించాల్సి ఉందని.. ఆ సమయంలో తాను తెలుగులో చిత్రం చేయడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. అయితే చిత్రం విడుదలైన తరువాత చూసి ఇంటికి వచ్చి చాలా బాధపడ్డానని ఒక రోజంతా నిద్ర కూడా పోలేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని చేయకపోవడమే మంచిదిగా భావిస్తున్నానని అన్నారు. కారణం అప్పుడు రూ. 20 కోట్ల బడ్జెట్లో రూపొందిన జిగర్తండా చిత్రాన్ని వదులుకోవడం వల్లే ఇప్పుడు రూ. 100 కోట్ల బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ జిగర్తండా డబుల్ ఎక్స్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్జే సూర్యతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. తాను సూర్య నటించే ముందు అలా చేద్దాం.. ఇలా చేద్దాం అని డిస్కస్ చేసుకునే వాళ్లమని, అయితే స్పాట్‌లోకి వచ్చిన తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చెప్పినట్లే చేయాల్సి వచ్చేదని అన్నారు. ఆయనకు అంత కమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇది తనకు చాలా ముఖ్యమైన చిత్రమని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. జిగర్తండ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయని.. ఈ చిత్రానికి కూడా రెండు, మూడు జాతీయ అవార్డులు వస్తాయనే నమ్మకాన్ని నిర్మాత కార్తికేయన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తమ సంస్థలో రూ. 100 కోట్ల బడ్జెట్లో నిర్మించిన తొలి చిత్రం అని చెప్పారు. -
ఎన్నో అవార్డులు తెచ్చిన జిగర్తాండ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే
తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ సినిమాను ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తమిళ హీరో సిద్ధార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేశ్ పేరుతో తెరకెక్కింది. హరీశ్ శంకర్ దీనిని రీమెక్ చేయగా.. టాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) తాజాగా దీనికి సిక్వెల్ రెడీ చేశారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా జిగర్తాండ డబుల్ ఎక్స్ రూపొందుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తూ తన స్టోన్ బెంచ్ ఫిలింస్‌పై అలంకార్ పాండియన్‌కు చెందిన ఇన్వలియో ఆరిజిన్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి కార్తికేయన్ సంతానం సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరు చాయాగ్రహణ అందిస్తున్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. (ఇదీ చదవండి:విజయ్ను డైరెక్ట్ చేసే లాస్ట్ ఛాన్స్ ఆ దర్శకుడికే..) ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్రం సంతృప్తికరమైన అనుభవాన్ని కలిగించిందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. చిత్రాన్ని పలు ప్రాంతాల్లో భారీ వ్యయంతో రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాన్ని దీపావళికి థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగులో కూడా ఈ సినిమా రానుంది. -
ఒక్క చూపు చాలు!
‘బచ్చన్ పాండే’ చూపు చాలు... ఏ పనైనా అయిపోవాల్సిందే అంటున్నారు అక్షయ్ కుమార్. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బచ్చన్ పాండే’. ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీని ప్రకటించి, ఈ సినిమాలో అక్షయ్ కుమార్ స్టిల్‌ను విడుదల చేశారు. ‘‘ఒక్క చూపు చాలు’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ చేశారు అక్షయ్ కుమార్. ఈ సినిమాలో కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయికలు. తమిళ చిత్రం ‘జిగర్తండా’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. -
నాతోటి పందాలు వేస్తే సస్తరు
‘నాపైన పందాలు ఏస్తే గెలుస్తరు.. నాతోటి పందాలు వేస్తే సస్తరు, మనం బతుకుతున్నామని పదిమందికి తెల్వకపోతే ఇక బతుకుడెందుకురా, గవాస్కర్ సిక్సు కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడు.. నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేం టు సేం, గద్దలకొండ గణేశ్ అంటే గజ గజ వణకాలి’ అంటూ ‘వాల్మీకి’ ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్‌లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కి ఇది తెలుగు రీమేక్. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘వాల్మీకి’ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’ సినిమాని నేను ఏ దృష్టితో చూశానో వరుణ్ కూడా అదే కోణంలో చూసి నటించేందుకు ఒప్పుకున్నాడు. ‘ఫిదా, తొలిప్రేమ’ వంటి సాఫ్ట్ పాత్రలు చేసిన వరుణ్ ‘వాల్మీకి’ లో పక్కా మాస్ పాత్ర చేశారు. ఇలాంటి పాత్ర చేయాలంటే ధైర్యం ఉండాలి. హిందీ ‘దబాంగ్’ సినిమాని ‘గబ్బర్‌సింగ్’గా రీమేక్ చేసినప్పుడు చాలా మార్పులు చేశాను.. ‘వాల్మీకి’లో మాత్రం మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మాత్రమే మార్పులు చేశాం. మిక్కీ జె. మేయర్ మంచి సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. ‘వాల్మీకి’ టైటిల్‌పై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చూసి బోయ సంఘంవారు, వాల్మీకి అభిమానులు గర్వపడతారు’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో గద్దలకొండ గణేశ్ పాత్ర చేశా. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఈ టైమ్‌లో ఇలాంటి పాత్ర అవసరమా? అని చాలామంది అన్నారు. కానీ హరీష్‌గారు నాకు నమ్మకం ఇచ్చారు. కొన్ని సినిమాలు రీమేక్ చేయాలనే స్ఫూర్తినిస్తాయి.. ‘జిగర్తాండ’ అలాంటి చిత్రమే. చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్... వంటి వారు గతంలో చేసిన సినిమాలు చూస్తే రాముడు మంచి బాలుడు అనేలా హీరోలా పాత్రలు ఉండేవి. ఈ మధ్య హీరోలు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. నేను కూడా హీరోలాంటి పాత్రలు చేశా. కానీ, వైవిధ్యంగా ఉండేలా ప్రయోగాత్మకంగా ఏదైనా ఓ పాత్ర చేయాలనుకున్నా. అలాంటి పాత్రే ఇది. ఈ పాత్ర నాకే కొత్తగా అనిపించింది. సినిమాలో మంచోడి కంటే చెడ్డోడి పాత్ర బాగుంటుంది (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంటగార్లకు థ్యాంక్స్. ఈ సినిమాలో ‘జర జర...’ పాటకి చాలా మంచి స్పందన వస్తోంది’’ అని సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ అన్నారు. నిర్మాత రామ్ ఆచంట పాల్గొన్నారు. -
రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె
‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అథర్వ డైలాగ్‌తో మొదలవుతుంది ‘వాల్మీకి’ టీజర్. ‘అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు... నాలుగు బుల్లెట్లు సంపాయిస్తే రెండు కాల్చుకోవాలె.. రెండు దాచుకోవాలె’ అని వరుణ్ తేజ్ చెప్పిన మాస్ డైలాగ్‌తో ముగుస్తుంది. వరుణ్ తేజ్, అథర్వ ముఖ్య తారాగణంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తండా’కు ‘వాల్మీకి’ తెలుగు రీమేక్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వాల్మీకి’ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
గ్యాంగ్‌స్టర్ గానా బజానా!
సెటిల్మెంట్స్ చేయాల్సిన గ్యాంగ్‌స్టర్ సెట్లో స్టెప్పులేశాడు. ఇదంతా ‘వాల్మీకి’ సెట్లో జరిగిందని తెలిసింది. వరుణ్ తేజ్, అధర్వ ముఖ్యతారాగణంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు వరుణ్. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించారని తెలిసింది. ఈ పాటకు వరుణ్ వేసిన స్టెప్స్ అదుర్స్ అని సమాచారం. అలాగే ఈ సినిమా చిత్రీకరణలో తొలిసారి పాల్గొన్నారు పూజా హెగ్డే. గురువారం పూజ వాల్మీకి సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ చిత్రం ‘జిగర్తండా’కు ఇది రీమేక్. ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం ఆధారంగా సినిమా తీయాలని రియల్ గ్యాంగ్‌స్టర్ జీవితంతో ట్రావెల్ అయ్యే ఓ ఫిల్మ్ మేకర్ కథ ఆధారంగా ‘జిగర్తండా’ తెరకెక్కింది. ∙అధర్వ, వరుణ్ తేజ్ -
రీమేక్ క్వీన్
రెగ్యులర్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాలను అదే సంఖ్యలో చేస్తున్నట్టున్నారు తమన్నా. లేటెస్ట్గా ఓ తమిళ సినిమా హిందీ రీమేక్‌లో తమన్నా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తండా’ హిందీలో రీమేక్ కాబోతోంది. తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రలో ఆర్యన్ కార్తీక్, బాబీ సింహా చేసిన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని అజయ్ దేవగణ్ నిర్మించనున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ ఏడాది తమన్నా ఎక్కువ రీమేక్స్‌లో కనిపించనున్నారు. ఇటీవలే హిందీ ‘క్వీన్’ను తెలుగులో ‘దటీజ్ మహాలక్షి’గా రీమేక్ చేశారు. ఆ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది . ఆల్రెడీ తెలుగు సూపర్ హిట్ ‘ఆనందో బ్రహ్మా’ను ‘పెట్రోమాక్స్’ టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేశారు. అందులో తమన్నా లీడ్ రోల్ చేశారు. ఇప్పుడు తమిళ ‘జిగర్తండా’ హిందీ రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి తెలుగు టు తమిళం టు హిందీ సినిమాల రీమేక్స్‌తో ప్రస్తుతానికి ‘రీమేక్ క్వీన్’ అయ్యారు తమన్నా. -
పోరీ.. చిన్నచిన్న చోరీ!
అదొక పెద్ద స్ట్రీట్. అక్కడున్న షాప్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. చేతి వాటం చూపించాలనుకునేవాళ్లకు బెస్ట్ ప్లేస్. ఓ అందమైన అమ్మాయి ఆ స్ట్రీట్‌లోకి ఎంటరైంది. కూల్‌గా నడుచుకుంటూ ఓ షాప్‌లోకి ఎంటరైంది. కంటికి ఓ ఐటమ్ నచ్చింది. అంతే.. సునాయాసంగా చేజిక్కించుకుని, బ్యాగ్‌లో వేసేసుకుంది. మరి.. బిల్? బాసూ.. అలాంటివన్నీ ఇక్కడ కుదరదు. ఏదైనా ఫ్రీగా కొట్టేయడమే. తమిళ చిత్రం ‘జిగర్‌దండా’లో కథానాయిక లక్ష్మీ మీనన్ చేసిన సరదా క్యారెక్టర్ ఇది. ఇప్పుడు ఈ పాత్రను ‘ఛలో’ ఫేమ్ రష్మికా మండన్నా చేయనున్నారు. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ ‘జిగర్‌దండా’ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. తెలుగు చిత్రంలో రష్మికను కథానాయికగా తీసుకున్నారని సమాచారం. సినిమాలో ఈ పోరి చేసే చిన్న చిన్న చోరీలు భలే కామెడీగా ఉంటాయట. 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. అన్నట్లు.. ‘ఛలో’ తర్వాత రష్మిక బిజీ అయ్యారు. ‘గీత గోవిందం’ సక్సెస్‌తో మరింత ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’, నితిన్‌తో ఓ సినిమా, కన్నడంలో ఓ సినిమా చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. -
జనవరి నుంచి జిగర్తండా!
‘డిజే’ సినిమా రిలీజ్ అయిపోయి ఏడాదిన్నర కావస్తున్నా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో తెలియజేయలేదు దర్శకుడు హరీశ్ శంకర్. ‘దాగుడుమూతలు’ అనే మల్టీస్టారర్ చిత్రం కోసం కొన్ని రోజులు వర్క్ చేశారు. ఇప్పుడు తమిళ హిట్ చిత్రం ‘జిగర్తండా’ (కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరో)ని రీమేక్ చేసే పనిలో పడ్డారు హరీశ్. ‘‘ఈ సినిమా జనవరిలో స్టార్ట్ కానుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తారు. హీరో ఇంకా ఫైనలైజ్ కాలేదు’’ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘దబాంగ్’ రీమేక్ ‘గబ్బర్‌సింగ్’తో దర్శకుడిగా పెద్ద సక్సెస్ అందుకున్నారు హరీశ్. మరి ఈ రీమేక్ ఏ రేంజ్ సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా వరుణ్ తేజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. -
మళ్లీ విలన్‌గా బాబీ?
కోలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నటుల్లో బాబీసింహా ఒకరని చెప్పవచ్చు. లఘు చిత్రాలతో నట జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తరువాత వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో ప్రతి నాయకుడిగా నటించి గుర్తింపు పొందారు. జిగర్తండా చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకుగానూ జాతీయ అవార్డును గెలుచుకున్న బాబీసింహా ఆ తరువాత కథానాయకుడిగా అవతారమెత్తారు. అయితే హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి. ప్రస్తుతం బాబీసింహా తిరుట్టుప్పయలే 2, వల్లవనుక్కు వల్లవన్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటిలో వల్లవనుక్కు వల్లవన్ చిత్రానికి ఆయనే నిర్మాత. ఈ యువ నటుడు మళ్లీ విలన్ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న కరుప్పన్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. అదే విధంగా హరి దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న సామి-2లో ప్రతినాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఇందులో విలన్‌గా నటించడానికి బాబీసింహా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు, అంత పారితోషికం ఇవ్వడానికి దర్శకుడు సుముఖంగా లేరని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అన్నది త్వరలోనే తెలుస్తుందనుకోండి. మొత్తం మీద బాబీ విలన్‌గా మరోసారి తన సత్తా చాటనున్నారన్న మాట. -
సినిమాని తలపించే రియల్స్ట్రగుల్
-
ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తాం!
చెన్నై: గ్యాంగ్ స్టర్ల కథాంశంగా సిద్దార్ధ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'జిగర్థాందా' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తామని ఆ చిత్ర నిర్మాత కథిర్ సేన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడిన సేన్.. ఆ చిత్రాన్ని హిందీలో చేయాలని అనుకోవడానికి బాలీవుడ్ లోని పలువురు ప్రముఖ నిర్మాతలు ఆసక్తి చూపడమే ప్రధాన కారణమన్నారు. ' ఆ చిత్ర రీమేక్ కు సంబంధించి హిందీ చిత్ర సీమ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. చాలా మంది ఈ చిత్రాన్ని హిందీలో చేయమని అడుగుతున్నారు. ఇంకా అందుకు సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోలేదు'అని కథిర్ సేన్ తెలిపారు. ఇంకా ఎటువంటి పేపర్ వర్క్ కూడా జరగలేదన్నాడు. ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ అనే వాడు ఎలా ఉంటాడో అనేది వాస్తవానికి దగ్గరగా ఉంటుదన్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన ఈ సినిమా కొన్ని నెలలు వాయిదా అనంతరం ఆగస్టు 1 వ తేదీన తమిళంలో విడుదల చేశామన్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.10 కోట్లను వసూలు చేసి తమిళనాడు బాక్సాఫీస్ ను తిరగరాసిందన్నాడు. -
హిట్టు అందుకున్న సిద్దు
-
జిగర్తండా విడుదల వాయిదా
జిగర్తండా చిత్రం విడుదల వాయిదా పడింది. సిద్దార్థ్ లక్ష్మీ మీనన్ జంటగా నటించిన చిత్రం జిగర్తండా. పిజ్జా వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. గుప్తా కంపెనీ పతాకంపై ఎస్.కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసింది. దర్శక నిర్మాతల వివాదం కారణంగా చిత్రం విడుదలలో జాప్యం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. చిత్రం సెన్సార్ కట్స్ విషయంలో దర్శక నిర్మాతల మధ్య వివాదం ఏర్పడినట్లు సమాచారం. జిగర్తండా చిత్రానికి సెన్సార్ బృందం కొన్ని కట్స్‌తో యు సర్టిఫికేట్ ఇచ్చారు. ఎట్టకేలకు జిగరతండా చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడీ చిత్రం మరోవారం వెనక్కుపోతోంది. ఆగస్టు ఒకటిన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఎస్.కదిరేశన్ వెల్లడించారు. అందుకు కారణాన్ని ఆయన తెలుపుతూ ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం వేలై ఇల్లా పట్టదారి విజయవంతంగా ప్రదర్శితమవుతోందన్నారు. ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు, పంపిణీదారులు జిగర్తండా చిత్రం కూడా చాలా బాగా వచ్చిందని, కొంచెం గ్యాప్ ఇచ్చి విడుదలచేస్తే అధిక థియేటర్లలో ప్రదర్శించవచ్చునని సూచించడంతో వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జిగర్తండా చిత్రాన్ని ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత వివరించారు. -
నిర్మాతపై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం!
జిగర్థాండ (తెలుగు డబ్బింగ్: చిక్కడు దొరకడు) చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదలను తమకు చెప్పకుండా వాయిదా వేశారనే కారణంతో జిగర్థాండ నిర్మాత కదిరేశన్ పై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిగర్థాండ చిత్రం వాస్తవానికి జూలై 25 తేదిన శుక్రవారం తమిళనాడులో విడుదల కావాల్సి ఉంది. అయితే చెప్పపెట్టకుండా విడుదలను నిర్మాత వాయిదా వేశారని సిద్దార్థ్ అన్నారు. మీరెవరైనా కానివ్వండి.. ఇలాంటి డర్టీ గేమ్ ఆడకండి. సినిమాను విడుదల చేయడంలో ఆలస్యం కావొచ్చు. కాని మమ్మల్ని ఆపలేవు అని ట్వీట్ చేశారు. ఓ మంచి చిత్రాన్ని విడుదల కాకుండా ఆపడం మంచిది కాదని సిద్దార్థ్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పలు సందేశాలు పోస్ట్ చేయడం తాజా ఓ వివాదానికి దారి తీసింది. జిగర్థాండ చిత్రం కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఇతర సభ్యులు చాలా కష్టించి పనిచేశారని.. తమతో సంప్రదించకుండా.. కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా.. చిత్ర విడుదలను వాయిదా వేశారు అని ట్విటర్ లో తెలిపారు. జిగర్థాండ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నానని సిద్దార్థ్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. Whoever you are who aided in this dirty game, you can delay us you cannot stop us. A good film cannot be killed. #JIGARTHANDA — Siddharth (@Actor_Siddharth) July 21, 2014 Karthik, our whole team and I worked really hard for Jigarthanda.With no respect for us, without even discussing it with us...postponed. — Siddharth (@Actor_Siddharth) July 21, 2014 -
సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా
'పిజ్జా'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'జిగర్తండా'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్నారు. ఎస్.కె. పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నితెలుగులో అందిస్తున్నాయి. ఒక షెడ్యూల్ మినహా ఈ చిత్రం పూర్తయ్యింది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సిద్ధార్ధ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి చెప్పారు. 'తొలి చిత్రం 'పిజ్జా'తో కార్తీక్ సుబ్బరాజ్ మంచి దర్శకునిగా నిరూపించుకున్నారని, మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సురేష్ కొండేటి తెలిపారు. వేసవి కానుకగా విడుదల చేయబోతున్న ఈ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. బాబీ సింహా, కరుణ, గురు సోమసుందరం, ప్రతాప్ పోతన్, సౌందర రాజా, వినోధిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్.