ఒక్క చూపు చాలు! | Akshay Kumar Bachchan Pandey to release on 26 january 2022 | Sakshi
Sakshi News home page

ఒక్క చూపు చాలు!

Published Sun, Jan 24 2021 5:04 AM | Last Updated on Sun, Jan 24 2021 5:04 AM

Akshay Kumar Bachchan Pandey to release on 26 january 2022 - Sakshi

‘బచ్చన్‌ పాండే’ చూపు చాలు... ఏ పనైనా అయిపోవాల్సిందే అంటున్నారు అక్షయ్‌ కుమార్‌. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బచ్చన్‌ పాండే’. ఫర్హాద్‌ సంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీని ప్రకటించి, ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ స్టిల్‌ను విడుదల చేశారు. ‘‘ఒక్క చూపు చాలు’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్‌ చేశారు అక్షయ్‌ కుమార్‌. ఈ సినిమాలో కృతీ సనన్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నాయికలు. తమిళ చిత్రం ‘జిగర్తండా’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement