Akshay Kumar Bachchhan Paandey Movie Gets April 2022 OTT Release - Sakshi
Sakshi News home page

Bachchan Pandey Movie: ఓటీటీలోకి 'బచ్చన్‌ పాండే' చిత్రం.. ఎప్పుడు ? ఎక్కడంటే ?

Published Mon, Apr 11 2022 7:30 PM | Last Updated on Mon, Apr 11 2022 8:13 PM

Akshay Kumar Bachchan Pandey OTT Release Date Confirmed - Sakshi

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం 'బచ్చన్ పాండే'. ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా అలరించారు.  ఈ చిత్రం తమిళ హిట్ 'జిగర్తాండ'కు హిందీ రీమేక్‌గా వచ్చింది. అలాగే తెలుగులో వరుణ్‌ తేజ్‌ హీరోగా 'గద్దల కొండ గణేష్' పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. మార్చి 18న విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. 'బచ్చన్‌ పాండే' మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఏప్రిల్‌ 15 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. 

'బచ్చన్‌ పాండే మూవీ ఒక అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌. ఈ వినోదాన్ని మిస్‌ అయిన ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి తీసుకువస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ గదిలో కూర్చొని మొత్తం యాక్షన్‌, డ్రామా, కామెడీతో నిండి ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌ 15న ప్రైమ్‌ వీడియోలో ఆస్వాదించవచ్చు. మేము ఈ సినిమాను ఎంత ఎంజాయ్‌ చేశామో మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.' అని అక్షయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

చదవండి: షూటింగ్‌లో ఏం కనిపించేది కాదు.. ప్రాణం పోయినంత పనైంది: అక్షయ్‌ కుమార్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement