పోరీ.. చిన్నచిన్న చోరీ! | Rashmika to play a shoplifter in Telugu remake of Jigarthanda | Sakshi
Sakshi News home page

పోరీ.. చిన్నచిన్న చోరీ!

Published Sun, Dec 2 2018 2:35 AM | Last Updated on Sat, Aug 3 2019 12:30 PM

Rashmika to play a shoplifter in Telugu remake of Jigarthanda - Sakshi

వరుణ్‌ తేజ్‌, రష్మికా మండన్నా

అదొక పెద్ద స్ట్రీట్‌. అక్కడున్న షాప్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. చేతి వాటం చూపించాలనుకునేవాళ్లకు బెస్ట్‌ ప్లేస్‌. ఓ అందమైన అమ్మాయి ఆ స్ట్రీట్‌లోకి ఎంటరైంది. కూల్‌గా నడుచుకుంటూ ఓ షాప్‌లోకి ఎంటరైంది. కంటికి ఓ ఐటమ్‌ నచ్చింది. అంతే.. సునాయాసంగా చేజిక్కించుకుని, బ్యాగ్‌లో వేసేసుకుంది. మరి.. బిల్‌? బాసూ.. అలాంటివన్నీ ఇక్కడ కుదరదు. ఏదైనా ఫ్రీగా కొట్టేయడమే. తమిళ చిత్రం ‘జిగర్‌దండా’లో కథానాయిక లక్ష్మీ మీనన్‌ చేసిన సరదా క్యారెక్టర్‌ ఇది. ఇప్పుడు ఈ పాత్రను ‘ఛలో’ ఫేమ్‌ రష్మికా మండన్నా చేయనున్నారు.

వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ ‘జిగర్‌దండా’ని తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. తెలుగు చిత్రంలో రష్మికను కథానాయికగా తీసుకున్నారని సమాచారం. సినిమాలో ఈ పోరి చేసే చిన్న చిన్న చోరీలు భలే కామెడీగా ఉంటాయట. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుంది. అన్నట్లు.. ‘ఛలో’ తర్వాత రష్మిక బిజీ అయ్యారు. ‘గీత గోవిందం’ సక్సెస్‌తో మరింత ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ‘డియర్‌ కామ్రేడ్‌’, నితిన్‌తో ఓ సినిమా, కన్నడంలో ఓ సినిమా చేస్తూ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement