రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె | valmiki movie teaser launch | Sakshi

రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె

Aug 16 2019 12:09 AM | Updated on Aug 22 2019 9:35 AM

valmiki movie teaser launch - Sakshi

వరుణ్‌ తేజ్‌

‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అథర్వ డైలాగ్‌తో మొదలవుతుంది ‘వాల్మీకి’ టీజర్‌. ‘అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు... నాలుగు బుల్లెట్లు సంపాయిస్తే రెండు కాల్చుకోవాలె.. రెండు దాచుకోవాలె’ అని వరుణ్‌ తేజ్‌ చెప్పిన మాస్‌ డైలాగ్‌తో ముగుస్తుంది. వరుణ్‌ తేజ్, అథర్వ ముఖ్య తారాగణంగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’.

ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమిళ హిట్‌ చిత్రం ‘జిగర్తండా’కు ‘వాల్మీకి’ తెలుగు రీమేక్‌. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వాల్మీకి’ సినిమా సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement