Mrunalini
-
‘లవ్ గురు’ ప్రేమించడం నేర్పిస్తుంది : విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని, మృణాళినీ రవి హీరో హీరోయిన్లుగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఈ 11న రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఈ కథలో తనంటే ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఓ అబ్బాయి. పెళ్లి తర్వాత తనను అర్థం చేసుకుంటుందని భావిస్తాడు. కానీ పెళ్లి తర్వాత కూడా ఆ అబ్బాయిపై ఆ అమ్మాయికి ఇష్టం ఏర్పడదు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకోవాలనుకుంటాడు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది. మా సినిమా ప్రేక్షకులకు ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుంది. ‘లవ్ గురు’ సినిమా కోసం మైత్రీతో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. ఇక మా ప్రొడక్షన్లో మూడు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. నా దర్శకత్వంలోనే ‘బిచ్చగాడు 3’ ఉంటుంది. 2026 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. -
ఐ హేట్ లవ్
‘‘దేవుడడిగాడంట.. నన్ను చేరడానికి ఏడు జన్మలు నాకు భక్తుల్లా బతుకుతారా...లేక మూడు జన్మలు రాక్షసుల్లా బతుకుతారా అని. ఏడు జన్మలు నీకు దూరంగా ఉండే కన్నా... మూడు జన్మల రాక్షస బతుకే మిన్న అని దేవతలే కోరుకున్నారట’, ‘ఐ హేట్ లవ్’ అనే డైలాగ్స్‌తో విడుదలైంది ‘మామా మశ్చీంద్ర’ టీజర్. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుçస్కూర్ రామ్మోహన్రావు నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. శనివారం ఈ సినిమా టీజర్‌ను హీరో మహేశ్‌బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంలో దుర్గ, డీజే, పరశురామ్ పాత్రలు చేశారు సుధీర్‌బాబు. -
సెప్టెంబరులో స్టార్ట్.. చిట్టిబాబు పాత్రని మించి రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్
హీరో రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరులో స్టార్ట్ కానుంది. ‘‘రంగస్థలం’ సినిమాలో నేను చేసిన చిట్టిబాబు పాత్రని మించి ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో స్టార్ట్ చేస్తాం’’ అంటూ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రామ్‌చరణ్ అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మృణాళ్ ఠాకూర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. -
' ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు ' మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
ఆయన నాకు దేవుడు ఇచ్చిన వరం: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘నన్ను నేను దర్శకుడిగా నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమించానో.. ఎంత తపనపడ్డానో ఇప్పుడూ అంతే తపనతో సినిమాలు చేస్తున్నాను. ఆడవారిని కించపరిచే విధంగా ఎప్పుడూ సినిమా తీయను. కొందరు నన్ను ఆ మార్గంలో సినిమా తీయమన్నారు. అచ్చిరెడ్డిగారు వద్దని చెప్పి, మన శైలిలో వెళితే ఎప్పుడో ఒకప్పుడు మార్గం దొరుకుతుందన్నారు. ఆయన నాకు దేవుడు ఇచ్చిన వరంలా భావిస్తున్నాను’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. (చదవండి: ‘మేజర్’ చూసి వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు :శశికిరణ్ తిక్క) బుధవారం (జూన్ 1) ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ సినిమా సెట్స్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అనంతరం ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’ కథ విని నిర్మాత కల్పనగారు నాన్‌స్టాప్‌గా నవ్వారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతూనే ఉంటాను. సోహైల్ మంచి కమర్షియల్ లక్షణాలున్న హీరో. మృణాళిని మంచి నటి’’ అన్నారు. ‘‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి కెరీర్‌కు ఈ సినిమా గొప్ప మలుపు కావాలి’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘ఈ సినిమా నా లైఫ్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సోహైల్. ‘‘మంచి ఎంటర్టైనింగ్ మూవీ చేస్తున్నందుకు హ్యాపీ’ అన్నారు కల్పన. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మృణాళినీ రవి, నటుడు కృష్ణభగవాన్, కెమెరామేన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దుల్కర్ సల్మాన్-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్డేట్..
Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released: హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సీతా రామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ట్యాగ్‌లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మృణాళిని ఠాకూర్, సుమంత కీలక పాత్రల్లో అలరించనున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ సీత.. హే రామ'ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను ఆదివారం (మే 8) విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ మెలోడీయస్ సంగీతం బాగుంది. ఈ సాంగ్ ప్రొమో చివర్లో 'వెళ్లి సీత దగ్గర డ్యాన్స్ నేర్చుకోండి' అని దుల్కర్ సల్మాన్ సీతాకోక చిలుకలతో చెప్పడం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రొమో నెట్టింట వైరల్ అవుతోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. చదవండి: నేను బ్యాడ్ బాయ్‌లానే కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్ Can’t wait to show you guys the full song! #OhSitaHeyRama (Telugu): https://t.co/Ii8whgyQui #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @IananthaSriram @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @kshreyaas @sidsriram pic.twitter.com/1T1kUwTU0V — Hanu Raghavapudi (@hanurpudi) May 8, 2022 -
త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతా : హీరోయిన్
‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మృణాళినీ రవి మరో తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపారట. ప్రస్తుతం తమిళ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారామె. విక్రమ్ సరసన ‘కోబ్రా’, విశాల్‌తో ‘ఎనిమి’ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రంలో నటించనున్నారని టాక్. ఈ సందర్భంగా మృణాళిని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల అభిమానం ఒక రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఆ అభిమానాన్ని రుచి చూసిన వాళ్లెవరైనా అంత తేలిగ్గా మర్చిపోలేరు. నటనతో పాటు గ్లామర్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ కరోనా లాక్డౌన్లో కొందరు తెలుగు దర్శకులు చెప్పిన కథలను ఆన్లైన్లో విన్నాను. త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతాను’’ అన్నారు. -
గోదారిలో పాట
గ్యాంగ్‌స్టర్ గోదావరికి వెళ్లి పాటలు పాడుతున్నాడు. వరుణ్‌తేజ్, అథర్వ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే, మృణాళిని కథానాయికలుగా నటిస్తున్నారు. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోందని తెలిసింది. ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వహిస్తున్నారు. ‘‘గోదావరి జిల్లాలో కాదు.. అచ్చంగా.. గోదారిలో షూటింగ్ నా ఎన్నో ఏళ్ల కల..’’ అని హరీశ్ శంకర్ పేర్కొన్నారు. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు ‘వాల్మీకి’ తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు. -
శ్రీదేవి సైకిల్ ఎక్కారు
వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఆదివారం పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో పూజా కనిపించనున్నారు. -
రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె
‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అథర్వ డైలాగ్‌తో మొదలవుతుంది ‘వాల్మీకి’ టీజర్. ‘అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు... నాలుగు బుల్లెట్లు సంపాయిస్తే రెండు కాల్చుకోవాలె.. రెండు దాచుకోవాలె’ అని వరుణ్ తేజ్ చెప్పిన మాస్ డైలాగ్‌తో ముగుస్తుంది. వరుణ్ తేజ్, అథర్వ ముఖ్య తారాగణంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తండా’కు ‘వాల్మీకి’ తెలుగు రీమేక్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వాల్మీకి’ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
గ్యాంగ్‌స్టర్ గానా బజానా!
సెటిల్మెంట్స్ చేయాల్సిన గ్యాంగ్‌స్టర్ సెట్లో స్టెప్పులేశాడు. ఇదంతా ‘వాల్మీకి’ సెట్లో జరిగిందని తెలిసింది. వరుణ్ తేజ్, అధర్వ ముఖ్యతారాగణంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు వరుణ్. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించారని తెలిసింది. ఈ పాటకు వరుణ్ వేసిన స్టెప్స్ అదుర్స్ అని సమాచారం. అలాగే ఈ సినిమా చిత్రీకరణలో తొలిసారి పాల్గొన్నారు పూజా హెగ్డే. గురువారం పూజ వాల్మీకి సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ చిత్రం ‘జిగర్తండా’కు ఇది రీమేక్. ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం ఆధారంగా సినిమా తీయాలని రియల్ గ్యాంగ్‌స్టర్ జీవితంతో ట్రావెల్ అయ్యే ఓ ఫిల్మ్ మేకర్ కథ ఆధారంగా ‘జిగర్తండా’ తెరకెక్కింది. ∙అధర్వ, వరుణ్ తేజ్ -
ప్రిన్సిపల్‌లో తేడా
కాలేజీకి కొత్త ప్రిన్సిపాల్ వస్తున్నట్టు ఉప్పందింది. అదీ ఒక ఆడ ప్రిన్సిపాల్ రాబోతున్నట్టు గుప్పుమంది. ఇది తెలిసి ఒక మగాడు ఉసూరుమంటే ఒక మగాడు హుషారు పడ్డాడు. ‘ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్టు ఒక ఆడ ప్రిన్సిపాల్ కింద పని చేయాలా?’ అన్నాడు ఒక మగ లెక్చరర్. ‘అయితే ఏమిటోయ్. మన పని ఈజీ కాలేదూ’ అన్నాడు మరో మగ లెక్చరర్. స్టాఫ్‌రూమ్‌లో అంతా సందడి సందడిగా ఉంది. ‘ఏం ఈజీ’ అన్నాడు మగ లెక్చరర్. ‘వచ్చినామె డ్యూటీ చేస్తుందనుకున్నావా? లీవులు పెట్టడమే సరిపోతుంది’ అన్నాడు ఈ లెక్చరర్. ‘ఎందుకు పెడుతుందండీ’ అన్నారెవరో. ‘మరి? చీటికిమాటికి లీవు పెట్టడమేగా ఆడవాళ్ల పని. పూజలనీ, వ్రతాలనీ, తద్దినాలనీ, పిల్లలకు జ్వరాలనీ, ఊర్నుంచి అత్తగారు వచ్చారనీ... సీటులో ఎప్పుడు ఉండి చస్తారు కనుక. సెలవు ముందుపుట్టి ఆడవాళ్లు ఆ వెంటనే పుట్టారు’ అన్నాడతడు. అంతటితో ఆగలేదు. థియరీ చెప్పాడు. ‘ఇక వీళ్లు టైమ్‌కు రావడం గగనం. పిల్లలను స్కూళ్లకు పంపి, మొగుళ్లను రెడీ చేసి, అద్దం ముందు నిలబడి గంటలు గంటలు సింగారించుకుని వచ్చేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఈలోపు మనదే రాజ్యం. మాహిష్మతి మనదే కట్టప్పా’ చాలా హుషారుగా ఉన్నాడతను. కారణం ఉంది. కాలేజీలో ఆల్రెడీ ఒక లేడీ లెక్చరర్ వైస్ ప్రిన్సిపాల్‌గా ఉంది. ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా ఇంకో లేడీ వస్తే అది కోఎడ్యుకేషన్ కాలేజీ కనుక ఇద్దరూ ఆడవాళ్లుండటం సమ్మతం కాదు కనుక వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్ తనకే వస్తుందని ఇతని ధీమా. ‘ఆవిడగారు లీవు పెట్టినప్పుడల్లా నేనే కదా బాసు. అప్పుడు చూపిస్తా తడాఖా’ అన్నాడు. ఈ మాట మగ లెక్చరర్లను ఆలోచనలో పడేసింది. ‘నువ్వే బాస్ అయితే గనక మమ్మల్ని కొంచెం చూసీ చూడనట్టుగా వదిలేస్తావుగా’ అన్నాడొకడు. ‘క్లాస్ సగంలో ఉండగా బయటికొచ్చి సిగరెట్లు కాల్చుకోవచ్చుగా?’ అని అడిగాడు ఇంకొకడు. ‘సంతకం పడేసి క్లబ్బుకు వెళ్లొచ్చు కదా’ అన్నాడు ఒకడు. ‘నేనసలు క్లాసులే తీసుకోను’ అన్నాడు వేరొకడు. ఈ పరిపరి విన్నపాలు విని చిద్విలాసంగా అభయం ఇచ్చాడు లెక్చరర్. శుభముహూర్తం వచ్చింది. మగ లెక్చరర్లకు మళ్లీ ఉప్పందింది. లేడీ ప్రిన్సిపాల్ ఉదయం ఎనిమిది గంటలకే వచ్చేసిందట. బాప్ రే వచ్చేసిందా. ఆ రోజంతా కాలేజీ హడావిడి హడావిడిగా ఉంది. లేడీ ప్రిన్సిపాల్ అసలు తన రూమ్‌లోనే కూచోలేదు. కాలేజ్ అంతా తిరుగుతూనే ఉంది. క్లాసులు మానిటర్ చేసింది. లెక్చరర్లు ఎంతసేపు క్లాసు చెపుతున్నారో గమనించింది. అసలు ఎలా చెబుతున్నారో గమనించింది. దొంగ పర్మిషన్లు బుట్టదాఖలు అయ్యాయి. సిక్ లీవ్‌లో ఉన్న లెక్చరర్ క్లాసును తనే తీసుకుని చెప్పినప్పుడు ఆ వాగ్ధాటికి పిల్లలు రెప్పవేయకుండా విన్నారన్న వార్త కూడా కారిడార్లలో పాకి అక్కడి నుంచి ఒకరిద్దరి వెన్నులో కూడా పాకింది. సాయంత్రం అయిదున్నరకి స్టాఫ్‌తో చిన్న మీటింగ్. ‘ఇన్ని రోజులు ఎలా గడిచాయో తెలియదు నాకు. ఇక మీదట ఇవాళ గడిచినట్టు గడుస్తాయి’ అంది. మగలెక్చరర్ల ముఖాలు మెల్లగా మాడిపోయాయి. వైస్ ప్రిన్స్‌పాల్ పోస్టు ఆశించిన లెక్చరర్ మనసులో ఆశ మినుకుమినుకుమంటోంది. ‘మరి వైస్‌ప్రిన్సిపాల్ సంగతి?’ నసిగాడు. ‘ఏంటి ప్రాబ్లమ్?’ అడిగిందామె. ‘ఇంకా పాత ముతక సామెతల్లోనే ఉన్నారా? రెండు కొప్పులకు పడదని భావిస్తున్నారా? ఇక్కడకు వచ్చేముందే వైస్ ప్రిన్స్‌పాల్ గురించి తెలుసుకున్నాను. ఆమె చాలా బాగా పని చేస్తున్నదని రిపోర్ట్ ఉన్నాయి. వైస్ ప్రిన్స్‌పాల్‌గా ఆమే కంటిన్యూ అవుతుంది. ప్రిన్స్‌పాల్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా మగాళ్లే ఉండి కాలేజీలు నడుపుతున్నప్పుడు మేమెందుకు నడపకూడదు. ఇంకా బాగా నడిపి చూపిస్తాం’ అంది. మగాళ్లు పూర్తిగా నేల కరుచుకుపోయారు. మెల్లగా లేచారు వెళ్లడానికి. ‘కూర్చోండి. ఎక్కడకు వెళతారు. చాయ్ తాగరా’ అందామె. ‘చాయ్ తాగడానికి ఇంతకుమించిన అకేషన్ ఏముంది?’ అని తిరిగి రెట్టించింది. ‘అవునవును ఏముంది’ అని చతికిలపడ్డారు మగలెక్చరర్లు. ఆనాటి పొగలు కక్కే చాయ్ వాళ్లకు చాలారోజుల పాటు గుర్తుండిపోయింది. కథ ముగిసింది. మృణాళిని రాసిన ‘లేడీ బాస్’ కథ ఇది.బాస్ అంటే ప్యాంటూ షర్టూ వేసుకుని ఉండాలన్న అభిప్రాయం మగాళ్లలో పాతుకుపోయింది. మీసం ఉండాలని, మగవాడు అయి ఉండాలని, మగవాడి కిందే పని చేయాలని.... ఇంట్లో నాన్న పెత్తనం అలవాటయ్యి ఆఫీసులో మగ పెత్తనం ఆశిస్తారు. సంతకం పెట్టే చేయికి, నిర్ణయం తీసుకునే బుర్రకి స్త్రీ, పురుష తేడా ఎందుకుంటుంది అనే ఆలోచన లేదు. డాబా మీద వడియాలు ఆరవేయడానికి వెళ్లినప్పుడు మాత్రమే స్త్రీలు ఆకాశం వైపు చూడాలనుకునే మగవారు అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన సునీతా విలియమ్స్ వంటివారిని మెడనొప్పి పుట్టినా సరే చూడక తప్పదు. రోజులు మారాయి. అదిగో సుఖోయ్ విమానంలో నిర్మలా సీతారామన్. - మృణాళిని -
మంత్రి మృణాళినికి చేదు అనుభవం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు విచ్చేసిన మంత్రి మృణాళినికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి దంపతులు అమ్మవారి దర్శనం కోసం గురువారం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నా ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులు గుర్తించలేదు. అంతరాలయంలోని వీఐపీలు వెళ్లే మార్గం వద్ద పోలీసులు ఉన్నా మంత్రిని గుర్తించకపోవడంతో ఆమె కొంత సేపు ఆరుబయటే ఉండిపోయారు. కొంత సేపటి తరువాత మంత్రిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆలయంలోకి తీసుకెళ్లారు. గతంలో ఇదే తరహా ప్రొటోకాల్ వ్యవహారంలో దుర్గగుడి ఈవోలతో పాటు అధికారులపై వేటు పడింది. అయినా అధికారుల తీరు మారలేదనేందుకు ఇదే చక్కటి ఉదాహరణ అని మంత్రి అనుచరులు బహిరంగంగానే విమర్శించారు. -
పంటను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు
– రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని – ముందే మేల్కొని ఉంటే బాగుండేదన్న వ్యవసాయాధికారులు మదనపల్లె రూరల్: వర్షాభావంతో ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. శుక్రవారం సీటీఎం పంచాయతీ మిట్టపల్లెలో రెయిన్ గన్స్ ద్వారా వేరుశెనగ పంటకు అందిస్తున్న నీటి తడులను ఇచ్చే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. పంట పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూలైలో వేసిన పంటకు ప్రస్తుతం ఎలాంటి డోకా లేదని, జూన్ నెల మొదటి వారంలో వేసిన పంటతోనే ఇబ్బందని అధికారులు మంత్రికి వివరించారు. సుమారు 50శాతం వరకు పంట నష్టం రావచ్చని తెలియజేశారు. పంటను కాపాడేందుకు చర్యలు తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందన్నారు. పదిహేనురోజుల క్రితం తడులు అందించి ఉంటే నష్టం పెద్దగా ఉండేది కాదంటూ వివరించారు. అనంతరం తిరుపతి వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం పంట పరిస్థితిపై విచారించారు. ప్రస్తుతం అందిస్తున్న తడులతో మొక్క, పైనున్న భూమి తడుస్తోందే తప్ప నీరు భూమిలోకి ఇంకి లోపలకు వెళ్లడం లేదని వివరించారు. ఎకరాకు 20 వేల లీటర్ల నీరు కాకుండా 30 వేల లీటర్లు అందిస్తే ప్రయోజనముంటుందన్నారు. మంత్రి కిమిడి మణాళిని మాట్లాడుతూ వేరుశనగ పంటను కాపాడేందుకు ముఖ్యమంత్రి వారంరోజులుగా రాయలసీమలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారుల సమన్వయంతో విపత్తును ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతో ఎలాంటి ఫలితాలు వస్తాయనే అంశాలను అనుభవంగా చేసుకుని రాబోయే రోజుల్లో విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కృతికాభాత్రా, ఎమ్మెల్సీ నరేష్కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటిరమేష్, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పేదలందరికీ రెండు పడకల ఇళ్లు
రాష్ట్ర వ్యాప్తంగా 1.24 లక్షల ఇళ్లు మంజూరు చేస్తాం గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఆమదాలవలస: రాష్ట్రంలోని పేదలందరికీ రెండు పడకల ఇళ్ల మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేశామని గృహ నిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ప్రభుత్వవిప్ కూన రవికుమార్ అధ్యక్షతన ఆమదాలవలస పట్టణ పరిధి తిమ్మాపురం గ్రామంవద్ద హుద్‌హుద్ తుపాను నిధులు 24.85 కోట్ల వ్యయంతో 512 గృహాల నిర్మాణానికి ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. ముందుగా పట్టణ శివార్లలో ఉన్న ఎన్.టీ.ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళు లర్పించారు. తరువాత మండలంలోని ఈసర్లపేట వద్ద ఉన్న అక్కుల పేట ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల చేశారు. తిమ్మాపురం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. హుద్‌హుద్ నిధులతో రాష్ట్రంలోని 2500 మంది పేదలకు రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. 2004 సంవత్సరానికి ముందర నిర్మించిన ఇళ్లకు మరమ్మతుల కోసం రూ.10వేలు మంజూరు చేస్తామన్నారు. ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.3.50 లక్షలు, బీసీలకు 2.25 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. బీసీలకు 1.24 లక్షల ఇళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 74వేల ఇళ్లు మంజూరు లక్ష్యమన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ప్రభుత్వ విప్ కూనరవికుమార్, ఆమదాలవలస మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత, వైస్ చైర్పర్సన్ కూన వెంకట రాజ్యలక్ష్మి, ఎంపీపీ తమ్మినేని భారతమ్మ, కలెక్టర్ లక్ష్మీ నృసింహం, జేసీ వివేక్‌యాదవ్, డీఆర్డీఏ పీడీ తనూజరాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భాస్కరరావు, వైస్ చైర్మన్ అన్నెపు భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్ బి.రాము తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ కనెక్షన్లు ఏవమ్మా? అక్కులపేట ఎత్తిపోతల పథకం ప్రారంభానికి వెళ్లిన మంత్రి మృణాళిని, విప్ రవికుమార్‌కు ఈసర్లపేట తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. రోడ్లు నిర్మించలేదని, గ్యాస్ కనెక్షన్లు కోసం టీడీపీ కార్యకర్తలు డబ్బులు వసూలు చేసి ఇంతవరకూ మంజూరు చేయలేదని గోడు వినిపించారు. అయితే, మహిళలకు సమాధానం చెప్పకుండా మంత్రి పర్యటన కొనసాగించారు. ఎత్తిపోతల పథకం ప్రారంభంలో అపశృతి జరిగింది. అక్కడ స్విచ్ ఆన్ చేయగానే రెండు మోటార్లలో ఒక మోటారు నుంచి మంటలు వచ్చి కాలిపోయింది. పట్టాలిస్తామని చెప్పి... ఇళ్ల పట్టాలు ఇస్తామని టీడీపీ నేతలు గ్రామాల్లో ప్రచారం చేశారు. దీంతో పట్టణంలోని పేదలందరూ ఉదయం 9.30 గంటలకే తిమ్మాపురం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. తీరా మంత్రి వచ్చే సరికి 12గంటలు కావడం, మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమావేశం కొనసాగించడంతో మహిళలు అవస్థలు పడ్డారు. తాగునీరు కూడా అందక నరకయాతన ఎదుర్కొన్నారు. తీరా సమావేశంలో ఒక్కరి పేరు కూడా చదవకపోవడం, పట్టాలు అందజేయకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. సభ వద్ద తతంగాన్ని చూసిన కొందరు పేదల గృహాలు కూడా టీడీపీ నాయకులే కాజేసేలా ఉన్నారని నిట్టూర్చారు. -
నరసింహస్వామి దర్శించుకున్న ఏపీ మంత్రి మృణాళిని
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని మంగళవారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి మృణాళిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు . -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నవారిలో ఏపీ మంత్రులు మృణాళిని, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీలు ప్రతిభా భారతి, రాజేంద్రప్రసాద్, ఎంపీ కొనకళ్ల, నారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బొండా ఉమ ఉన్నారు. అదేవిధంగా మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్వించుకున్నారు. అనంతరం ఆలయం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు -
నెగ్గిన మంత్రి పంతం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మంత్రి మృణాళిని పంతమే నెగ్గింది. ఆమె ఆనుకున్నట్టుగానే జరిగింది. ఆమే వైద్య ఆరోగ్యంపై సమీక్ష నిర్వహిం చారు. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆదేశాలతో జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి చేసిన ప్రయత్నం విఫలమైంది. తన ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిద్దామని యత్నించినా పరిస్థితులు అనుకూలించలేదు. ఆవేదన చెందారో, అక్కసుతో ఉన్నారో తెలియదుగాని సోమవారం జరిగిన వైద్య ఆరోగ్య సమీక్షకు చైర్పర్సన్ హాజరు కాలేదు. ఆమె వర్గంగా ముద్రపడిన ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, మీసాల గీత కూడా గైర్హాజరయ్యారు. మొన్నటి రహస్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సైతం మంత్రి సమీక్షకు దూరంగా ఉండిపోయారు. దీన్నిబట్టి టీడీపీలో ఎవరెటో తేలిపోయింది. గతనెల 28న వైద్యారోగ్య సమీక్ష నిర్వహించేందుకు జెడ్పీ చైర్‌పర్సర్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించి తీరుతామని బీష్మించినా ఆ సమయానికి జెడ్పీ సీఈఓ తప్ప మరెవ్వరూ హాజరు కాలేదు. జేసీ, డీఎంఅండ్‌హెచ్‌ఓ, వైద్యులు అటువైపే రాలేదు. దీనికంతటికీ మంత్రి ఆదేశాలే కారణమన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే, సమీక్షను రద్దు చేసుకోమని మంత్రి ఆదేశించినట్టు సాక్షాత్తు కలెక్టరే తనకు ఫోన్ చేసినట్టు చైర్పర్సన్ వెల్లడించారు. ఆ రాత్రే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మృతి చెందడంతో వైద్యారోగ్య సమీక్ష నిర్వహిద్దామనుకున్న సమావేశం సంతాపసభగా మారిపోయింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి సమావేశం నిర్వహించినట్టయితే అధికారుల్లేని సమీక్షగా మిగిలిపోయేది. ఇక, డోంట్ కేర్ అన్నట్టుగా మంత్రి మృణాళిని వ్యవహరిస్తున్నారు. తాను చెప్పినట్టే వైద్య ఆరోగ్య సమీక్ష జరగాలని అధికారుల్ని ఆదేశించారు. ఎవరొచ్చినా, రాకపోయినా పర్వాలేదన్నట్టుగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి, బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో పాటు నాలుగు మున్సిపాల్టీల చైర్మన్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షకు దూరమైనవారంతా చైర్పర్సన్ గ్రూపుగా భావిస్తున్న వారే. నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరిపోయిందని,మున్ముందు మరింత ఇబ్బందికరంగా అధికారులు లోలోపల ఆందోళన చెందుతున్నారు. -
యాంకర్, గన్మన్లకు మంత్రిగారి కోటింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మంత్రి మృణాళిని ప్రసంగానికి అడ్డు తగిలిందెవరు? సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించాలని గన్‌మన్ ద్వారా స్లిప్పు పంపించిన యాంకర్ వెనక ఉన్న వ్యక్తి ఎవరు ? గన్‌మన్ చేసిన పాపమేంటి? ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అయోధ్య మైదానంలో గురువారం జరిగిన చంద్రన్న సంక్షేమ అవగాహన సభలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళినికి అవమాన కర పరిస్థితి ఎదురైంది. మంత్రి ప్రసంగిస్తుండగా ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న మహిళ ముగింపు పలకాలంటూ గన్‌మెన్ ద్వారా స్లిప్పు పంపించారు. దీంతో మంత్రి అసహనానికి లోనై కాసేపు తర్వాత ప్రసంగాన్ని ముగించారు. ఇంకేముంది ఆ తర్వాత చిర్రెత్తిపోయారు. స్లిప్పు ఇచ్చిన గన్‌మన్‌పై విరుచుకుపడ్డారు. ఎవరిచ్చారని గన్‌మన్‌ను గట్టిగా నిలదీశారు. నీ స్థాయి తెలుసుకుని ప్రవర్తించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ ఇచ్చారని చెప్పినా గన్‌మన్ కు మందలింపు తప్పలేదు. ఆ తర్వాత యాంకర్‌కి కోటింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా సభ నిర్వాహకులైన సాంఘి క సంక్షేమ శాఖ డీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలీ యాంకర్ల సంస్కృతేంటి? పెట్టమన్నదెవరని కడిగి పారేశారు. మంత్రికిచ్చే గౌరవమిదేనా? మీ హద్దుల్లో ఉండకపోతే బదిలీ తప్పదని గట్టిగా హెచ్చరించినట్టు కూడా తెలిసింది. ఇకపై యాంకర్లను పెడితే ఊరుకునేది లేదని గట్టిగా మందలించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్తు మంత్రి ప్రసంగాన్నే ఆపాలంటూ స్లిప్పు పంపించడం వెనక ఎవరున్నారన్నదానిపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రూపుల పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నేతలెవరో చెప్పడం వల్లే అధికారులు ఈ సాహసం చేశారని, ఆ క్రమంలో యాంకర్ ద్వారా స్లిప్పు పంపించి ఉండొచ్చన్న వాదనలు విన్పిస్తున్నాయి. అయితే, వెనుకున్న వ్యక్తులెవరో ప్రస్తుతానికి బయటికి రాకపోయినా ఏదో ఒక రోజు అధికారులు బయటపెట్టక మానరని చర్చించుకుంటున్నారు. అంత సులువుగా మంత్రి వదిలేయరని గుసగుసలాడుతున్నారు. ఇదిలా ఉండగా స్లిప్పు మాటెలా ఉన్నా మంత్రి సుదీర్ఘ ప్రసంగాలు కాసింత విసుగు తెప్పిస్తున్నాయన్నది వాస్తవమని కూడా చర్చించుకుంటున్నారు. -
రచ్చబండ దరఖాస్తులకు చెల్లుచీటి!
కర్నూలు(అర్బన్): రచ్చబండ దరఖాస్తులు బుట్టదాఖలు కానున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఇళ్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు నిరాశ మిగలనుంది. జీయో ట్యాగింగ్ సర్వే పూర్తి అయ్యేవరకు కొత్తగా ఎలాంటి ఇళ్లను మంజూరు చేసేది లేదని స్వయంగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని పేర్కొనడమే అందుకు నిదర్శనం. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జియో ట్యాగింగ్ సర్వే నిర్వహిస్తానని పేర్కొంది. ఈ సర్వే ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం ఇందిరమ్మ లబ్ధిదారుల ఆధార్‌కార్డులను అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత సర్వే నిర్వహించే అవకాశం ఉంది. అప్పటి వరకు కొత్తగా ఎలాంటి ఇళ్లను మంజూరు చేసేది లేదని స్వయంగా ఆశాఖ మంత్రి కిమిడి మృణాళిని ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో మూడు విడతలుగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంజూరైన గృహాల్లో నేటికి నిర్మాణాలు ప్రారంభించని గృహాలు, అర్హులుగా తేల్చి మంజూరు కాని ఇళ్లు కూడా రద్దు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మూడు విడతల్లో నిర్వహించిన రచ్చబండలో జిల్లా వ్యాప్తంగా 3,10,948 దరఖాస్తులు అందగా, వీటిలో 2,37,499 దరఖాస్తులు అర్హమైనవేనని అధికారులు తేల్చారు. వీటిలో 1,70,041 దరఖాస్తులకు మాత్రమే గృహాలు నిర్మించుకునేందుకు అనుమతి మంజూరు చేశారు. మిగిలిన 67,458 మంది నిరుపేదలు చేసుకున్న దరఖాస్తులకు నేటికి మోక్షం లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సర్వే నిర్ణయంతో నిరుపేదల సొంత ఇంటి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. జీఓ నెంబర్ 33 ప్రకారం మొదటి విడత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 2011-12లో జిల్లాకు 32,175 గృహాలు మంజూరు కాగా, వీటిలో నేటికి 776 గృహ నిర్మాణాల పనులు ప్రారంభం కాలేదు. అలాగే జీఓ నెంబర్ 44 మేరకు రెండో విడతలో 2012-13లో 25,618 గృహాలు మంజూరు కాగా, వీటిలో 565 గృహ నిర్మాణాల పనులు, జీఓ నెంబర్ 23 ప్రకారం 2013-14 సంవత్సరానికి సంబంధించి మూడో విడతలో 34,752 గృహాలు మంజూరు కాగా, వీటిలో నేటికి 698 ఇళ్ల నిర్మాణాల పనులు ప్రారంభం కాలేదు. ఈ లెక్కన మూడు విడతల్లో నిర్మాణాలు ప్రారంభించని 2039 గృహాలు కూడా రద్దు అయ్యే ప్రమాదం ఉంది. మూడు సెంట్ల స్థలంలో రూ.1.50 లక్షలతో ఇళ్లు హామీ తూచ్ గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ప్రతి పేదవానికి మూడు సెంట్ల స్థలంలో రూ.1.50 లక్షల వ్యయంతో సొంత గృహాన్ని నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఉత్తిదేననే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటిని నిగ్గుతేల్చిన తరువాతే కొత్త గృహాల మంజూరు గురించి ఆలోచిస్తామని పేర్కొనడం అందుకు బలం చేకూరుస్తున్నాయి. రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామనే హామీని నెరవేర్చేందుకే సవాలక్ష మార్గాలను అన్వేశిస్తున్న ముఖ్యమంత్రి ఇళ్లు లేని నిరుపేదలకు సొంత ఇళ్లను నిర్మించలేరనే భావనను ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
తెలుగు తమ్ముళ్ల రచ్చ!
గుర్ల : అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా పూర్తికాక ముందే మండల టీడీపీ నాయకుల్లో ముసలందలైంది. మంత్రి మృణాళిని మండ లంలోని కొందరు నాయకులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని, మిగతా వారిని పట్టించుకోవడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మ ండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొందరు నాయకులు మంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కొందరికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ... మిగతా వారిని పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా పల్లి గండ్రేడు, కొండగండ్రేడు, తెట్టంగి, గుర్ల, నాగళ్ళవలస, పెనుబర్తి, జమ్ముపేట, నడుపూరు, భూపాలపురం, చోడవరం, గూడెం గ్రా మాలకు చెందిన కార్యకర్తలు పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తక్షణమే కాంగ్రెస్ హయూంలో నియమించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టేంట్లు, సాక్షరభారత్ కో ఆర్డినేటర్లు, సీఎస్పీలను తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు కావస్తున్నా.. పాలకులు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదన్నారు. పార్టీని నమ్ముకుని పదేళ్ల పాటు ఉన్న తమకు ఇదేనా మీరిచ్చే గౌరవమంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మృణాళిణి నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదని, ముఖ్యంగాసామాన్య ప్రజానీకాన్ని, పార్టీ కార్యకర్త లు, నాయకులను ఒకే విధంగా చూస్తున్నారని తెలిపారు. గ్రామ, మండల, నియోజవర్గ స్థాయి నాయకులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది ఇక మాకేంటి అనుకున్న పార్టీ అభిమానుల కోరికలను చిన్నాభిన్నాం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పార్టీలో విబేధాలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు తిరుమలరాజు కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ, ప్రస్తుత తెట్టంగి గ్రామ సర్పంచ్ వెన్నె సన్యాసినాయుడు, మండల విప్ సంచాన సన్యాసినాయుడు, చనమళ్ళ మహేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా కార్యకర్తలు చేసిన డిమాండ్లను తీర్మాణం చేసి, జిల్లా పార్టీ కార్యవర్గానికి పంపనున్నట్టు కొందరు నాయకులు తెలిపారు. -
అభినయ రుషి
నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించుకోవడం (రీఎన్వెంటింగ్). ఒక వ్యక్తితోనే ఒక పరిశ్రమ నిలబ డదుగానీ, ఆ వ్యక్తి లేకపోతే ఆ పరిశ్రమలో ఎప్పటికీ పూరించలేని ఒక ఖాళీ ఏర్పడవచ్చు. అక్కినేని లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇలాంటిదే. అక్కినేని జీవిత చరిత్ర, సినిమా చరిత్ర మనకు తెలిసిందే. ఆయనలా అధికంగా ఇంటర్వ్యూలు ఇచ్చినవారు, అసాధారణ జ్ఞాపకశక్తితో గతాన్ని అవలీలగా మనకు అందించిన వారు ఎవరూలేరు. తెలుగు సిని మారంగంలో, ఆమాటకొస్తే దక్షిణ భారత సినిమారంగంలో నటనకు ఉన్న అర్ధాన్నీ , రూపురేఖలనూ మార్చిన ఘనత ఆయనది. దక్షిణ ప్రాంతం సినిమాల్లో నాయకుల నటన నాటక రంగ అభినయానికి దగ్గరగా ఉన్న రోజులలో ఓవరాక్షన్ గొప్ప నటనగా చలామణి అవుతున్న కాలంలో అండర్‌ప్లే అంటే ఏమిటో చేసి చూపించిన ప్రతిభ అక్కినేనిది. నాటకరంగంలో నటనకూ, చలనచిత్ర నటనలో ఉన్న తేడాను బహుశా మొట్టమొదట గుర్తించిన నటుడు నాగేశ్వరరావుగారే. అక్కినేని సినీజీవితాన్ని విహంగవీక్షణం చేస్తే, పురా ణ పాత్రలు, జానపద నాయక పాత్రలతో సినీరంగ ప్రవే శం చేశారు. కానీ ఆ రెండూ నిజానికి ఆయనకు నప్పే పాత్రలు కావు. ఆ విషయాన్ని అందరికంటే ముందు గ్రహించింది బహుశా ఆయనే. పరిమితులు తెలుసునన్నంత మాత్రాన అక్కినేని సవాళ్లకు భయపడ్డారనికాదు. ఎలాంటి సవాలైనా స్వీకరిం చే సత్తా ఆయనకుంది. దేవదాసు పాత్ర ఒప్పుకోవడమే ఒక పెద్ద సవాలు. మిస్సమ్మలో తన ప్రధాన ప్రత్యర్థి ఎన్టీ రామారావు నాయకుడని తెలిసీ అప్రధాన హాస్య పాత్రను స్వీకరించడం మరో సవాలు. అన్నిటికంటే గొప్ప సవాళ్లు భూకైలాస్, శ్రీకృష్ణార్జునయుద్ధం చిత్రాల్లో ఎన్టీఆర్ దేదీప్య మానంగా వెలిగిపోతాడని తెలిసీ, తనకు మామూలుగా ఒప్పని పాత్రలు (నారదుడు, అర్జునుడు) స్వీకరించి మెప్పించడం. నటుడిగా ఆయన ఉన్నత శిఖరాలందుకోవడానికి మరో కారణం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, ప్రేక్ష కుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న సినీ వాతావరణానికి తగ్గట్టుగా తనని తాను పునః సృజించు కోవడం (రీఎన్వెంటింగ్). గంభీరమైన కుటుంబ కథా నాయకుడిగా లెక్కకు మించి బోరు కొట్టించే సంఖ్యలో సినిమాలు చేశాక, 1970లలో గ్రామీణ అల్లరి పిల్ల వాడిగా, స్టెప్పులు వేసిన సాహసం ఈ పునః సృజనలో భాగమే. అన్ని కథలూ ఒకేలా తయారవుతున్న తరు ణంలో నవలలను తెరకెక్కించడానికి సంపూర్ణంగా మద్ద తు ఇవ్వడం, ఆ పాత్రలకు తనదైన సృజనను అందిం చడం కూడా ఇటువంటిదే. వయసు పైబడటంతో సిని మాలకు స్వస్తి చెప్పక, మామూలు యాంత్రికమైన తండ్రి పాత్రలతో సరిపెట్టుకోక, సీతారామయ్యగారిగా నటించ డం కూడా ఈ పునః సృజనలో భాగమే. ఆయనతో స్నేహం గొప్ప అనుభూతి- వెండి తెరమీద చూసి ఆనందించిన నటుడితో పరిచయం అవుతుందనీ, గంటలకొద్దీ వారితో మాట్లాడతామని అనుకోము. కానీ అక్కినేనిగారిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించిన సందర్భంగా 1990లో దూరదర్శన్ కోసం ఇంట ర్వ్యూ చేసిన నాటి నుంచి ఆయనతో ఒక అరుదైన స్నేహం ఏర్పడింది. సాహిత్య సభల్లో నా ప్రసంగాలను ఆయన మెచ్చుకున్నపుడు, మా యూనివర్శిటీలో మహాసభలకు ఆయన కోసం నేను ఆంగ్లంలో ఉపన్యాసం రాసి ఇచ్చినపుడూ, తన పేరిట స్థాపించిన జాతీయ పురస్కారం కోసం తొలిసారిగా దేవానంద్‌ని ఎంపిక చేసి, నన్ను మాస్టర్ ఆఫ్ సెరిమనీస్గా ఉండి, ఆ సభను ఇంగ్లీషులో నిర్వహించమని ఆయన కోరినపుడూ, వరల్డ్ స్పేస్ రేడియో కోసం నాకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చినపుడూ... ఇలా ఎన్నో సంభాషణలూ... అపుడపుడూ ఫోన్లో కూడా. ఒక్క సన్నివేశం బాగా గుర్తు. నేను హడావిడిగా యూని వర్శిటీకి బయల్దేరుతున్నపుడు, నా లాండ్‌లైన్ మోగింది. నేను తీయగానే ‘ఎవరండీ?’ అన్నా. ‘నాగేశ్వరరావు’ని అన్నారు. ‘ఏ నాగేశ్వరరావండీ?’ అని విసుగ్గా అన్నాను, అప్పటికే బస్సు మిస్సయ్యానన్న చికాకుతో. ‘అక్కినేని నాగేశ్వరరావు అంటారండీ నన్ను’ అన్నారు ఎంతో సౌమ్యంగా. మరో సన్నివేశం- వరల్డ్ స్పేస్‌లో ఉన్నప్పుడు మా కొత్త స్టూడియోని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే ఒప్పుకున్నారు. కారు పంపుతానని చెప్పాను. ‘మీకు కారున్నట్టుందిగా’ అన్నారు. ‘ఉంది కానీ అది చిన్నది. మారుతీ జెన్. మంచి కారు పంపుతాను’ అని గొణిగాను. ‘‘మీకు బాగున్నది నాకెందుకు బాగుండదూ. పైగా మీతో వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు.’’ అని నా కారులోనే స్టూడియోకు వచ్చారు. అక్కినేనిగారు మా అమ్మాయి పెళ్లికి వచ్చి, రెండు గంటలకుపైగా ఉండి, మామూలు బంధువులా మా వాళ్లందరితోనూ కలిసిపోయి మాట్లాడారు. అన్నపూర్ణమ్మగారు కాలం చేసినపుడు, పరామర్శకు వెళ్లిన సందర్భంలో ఆయన నాతో గంటకుపైగా ఎన్నో విషయాలు మాట్లాడారు. ‘‘చాలా ఇంటర్వ్యూలు ఇచ్చానుగానీ, మీరు చేసిన ఆ పాత ఇంటర్వ్యూ నాకెంతో ఇష్టం’’ అన్నారాయన. ‘ఎందుకో తెలీదుగానీ మిమ్మల్ని నేను చాలా అడ్మయిర్ చేస్తాను’’ అని అన్నారు అక్కినేనిగారు. ఆయన్ని ఈరోజు ఆఖరిసారిగా చూస్తున్నప్పుడు ‘‘మనిషంటే ఇలా తృప్తిగా, పరిపూర్ణ జీవితం గడిపి, ప్రశాంతంగా శాశ్వత నిద్ర చేస్తూ తనలా ఉండమని మనకు స్ఫూర్తినివ్వాలి’’ అనిపించిది. బహుశా అదే మనం ఆయనకు ఇవ్వగలిగిన నివాళి. మృణాళిని, విమర్శకురాలు, సాహిత్యవేత్త -
మగ మహారోజు!
ఏం తక్కువైంది ఈ మగమహారాజులకు?! ఏం మునిగిందని వీళ్లకో ‘ఇంటర్నేషనల్ మెన్స్‌డే’?! జెంట్స్ సీట్లో కూర్చొని, లేడీస్ ఎవరైనా లేవట్లేదా? ఆఫీస్‌లో ‘ముద్దారగా నేర్పిస్తాం’ అని చెప్పి... ఫిమేల్ స్టాఫ్ వచ్చి మీద మీద పడుతున్నారా?! క్యాబ్స్‌లో ప్రయాణిస్తున్న మగవాళ్లపై... లేట్ నైట్ అఘాయిత్యాలు జరుగుతున్నాయా?! ఆడవాళ్లకు ‘మహిళా దినోత్సవం’ ఉన్నట్లే... మగవాళ్లకు ‘మెన్స్‌డే’ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిపై మన స్త్రీవాదులు, మానవవాదులు ఏమంటున్నారు? ఇదే ఈవారం మన ‘ప్రజాంశం’ నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 1999లో ట్రినిడాడ్ టొబాగో దేశంలో మొదటిసారి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న కొందరు సుప్రసిద్ధ మహిళల అభిప్రాయాలివి. ఇద్దరూ అభివృద్ధి చేతి పావులే ప్రకృతిపరంగా ఆడ, మగ తేడాలేమీ ఉండవు. జీవులన్నీ ఒక్కటే. సమాజంలో మనుషులు కృత్రిమంగా సృష్టించిన అంతరాలలో కులం, వర్గం, జాతి, మతం వంటి అణచివేతల్లో జెండర్ కూడా ఒకటి. ఆడ, మగ అనే జెండర్ వ్యత్యాసం కూడా నిర్మాణాత్మకమైనదే. స్త్రీలు, బలహీన పురుషులు బలమైన పురుషాహంకార బాధితులే. ఎక్కువ క్రూరంగా ఉండమని రాజ్యాల్ని, మరింత మగవాడిగా ఉండమని పురుషుల్ని అభివృద్ధి నిర్దేశిస్తుంది. ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రపంచీకరణ, కులస్వామ్యాలన్నీ పురుషస్వామ్య రక్తమాంసాలతో నిర్మిస్తున్నవే. ఈ నిర్మాణాలు స్త్రీలనే కాదు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనులైన మగవాళ్లను కూడా నిర్ధేశిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయ ఎన్జీవోల వరకూ స్త్రీల సాధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా... మహిళలు మానవహక్కులు లేకుండా విధ్వంసమవుతున్నారంటే పితృస్వామ్యంలో నిజాయితీ లేకపోవడం వల్లనే. పురుషుల్లో మార్పు రావాలి. ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకంలో మగవారి పాత్ర పెరగాలి. ఆధునిక ఉత్పాదక రంగంలో, వ్యవసాయక రంగంలో, రాజకీయాల్లో మహిళల నాయకత్వాన్ని అంగీకరించాలి. వాళ్ల ప్రాతినిధ్యాన్ని, ప్రవేశాల్ని ప్రోత్సహించాలి. మన దేశంలో 22 నిమిషాలకొక లైంగికదాడి జరుగుతోంది. ఇది మానవ నాగరికతకు సిగ్గుచేటు. కాని... ప్రతి 22 గంటలకూ కనీసం 22 రోజులకు ఒక బాలికను పాఠశాలలో చేర్పించగలిగితే, ఒక మహిళకు ఉపాధి అవకాశాన్ని అందించగలిగితే ఈ దేశంలోనే సమానత్వం సిద్ధిస్తుంది. - జూపాక సుభద్ర, రచయిత్రి రెండు దినోత్సవాలెందుకు? ‘మగవాళ్లు’ అనగానే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న వేమన గుర్తుకొస్తాడు నాకు. నిజంగానే పురుషులు అనేకరకాలు. నా మటుకు నాకు కొందరిని చూస్తే గౌరవం, కొందరిని తలుచుకుంటేనే అసహ్యం, కొందరిని చూస్తే జాలి, ఇంకా కొందరంటే ఇష్టం. ఏమైనా... ఈ రోజుల్లో పురుషులు కొంత అయోమయంలో ఉన్నారనిపిస్తుంది. వాళ్లకు పాత తరాలవారి కంటే తాము ఉన్నతం (వారి భాషలో ఆదర్శప్రాయం) గా ఉండాలని ఉంటుంది. కానీ తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన పురుషత్వం ఆ ఉదాత్తతను నీరుగార్చేస్తుంటుంది. ఈ రెండింటి మధ్య ఇరుక్కుని నేటి పురుషులు (20 -50 మధ్య వయస్కులు) తికమకపడిపోతున్నారు. తను స్త్రీలను గౌరవంగా, తనతో సమానంగా చూస్తే గౌరవించబడతాడో లేక చులకనకు గురౌతాడో సగటు పురుషుడికి అర్థం కావడం లేదు. మొత్తానికి ఈనాటి స్త్రీలకు తమ వ్యక్తిత్వాల పట్ల, జీవనవిధానం పట్ల, పురుషులతో సంబంధాల పట్ల ఉన్నంత స్పష్టత ఇంకా ఈనాటి పురుషులకు రాలేదు. అంతేనా, పురుషులు అబలలు. (వ్యాకరణం మాట చిన్నయసూరి ఎరుగు) - ఎందుకంటే స్త్రీల కంటే ఎక్కువగా వాళ్లు సమాజానికి భయపడతారు. సంప్రదాయానికి వెరుస్తారు. స్త్రీ పురుష సంబంధాల్లో తెగింపు అన్నది ఎప్పుడైనా మనకు కనిపిస్తే అది స్త్రీ చొరవ తీసుకున్నప్పుడే, స్త్రీ సమాజాన్ని లెక్కచేయనపుడే సాధ్యం. మగవాళ్లకు సంబంధించి ప్రచారంలో ఉన్న సామెత ‘ఏడ్చే మగవాడిని నమ్మకు’ అన్నదాన్ని నేను నమ్మను. మగవాళ్లకు కూడా ఏడ్చే హక్కు ఉంది. దొంగ ఏడుపు అంటారా? అది ఆడవాళ్లు కూడా ఏడవగలరు కనక, కన్నీళ్లలోని నిజాయితీని గుర్తించాలి తప్ప, ఏడ్చింది పురుషుడా, స్త్రీనా అన్నది కాదు. పురుషుల దినోత్సవం సందర్భంగా తోటి పురుషులకు చిన్న సూచన: స్త్రీలను మీతో సరిసమానంగా చూడడం వల్ల మీ ఔన్నత్యం పెరుగుతుందే తప్ప, తరగదు. స్త్రీపురుషుల మధ్య అధికార సంబంధాల వల్ల స్త్రీలు మాత్రమే కాదు నష్టపోయేది, పురుషులు కూడ ఎంతో జీవితానందాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే అసమ సంబంధాల్లో ఇరుపక్షాలూ బాధే తప్ప ఆనందాన్ని పొందలేవు. ఆ స్పష్టత స్త్రీపురుషులిద్దరిలోనూ వస్తే, ఇక స్త్రీల దినోత్సవాలూ, పురుష దినోత్సవాలూ అని రెండూ వేర్వేరుగా జరుపుకోవలసిన అవసరం ఉండదు. - ప్రొఫెసర్ మృణాళిని, కేంద్రసాహిత్య అకాడెమీ జనరల్ కౌన్సెల్ సభ్యురాలు అర్థం చేసుకొనేలా ఎదగాలి అంతర్జాతీయ పురుష దినోత్సవం సందర్భంగా వారిలో మానవ త్వం మేలుకోవాల ని కోరుకుంటున్నా ను. మగవాళ్లకు తరతరాలుగా సమాజం ఇచ్చిన అనవసరమైన, అన్యాయమైన అహంకారాన్ని పెంచే అవకాశాలను వాళ్లు ఐచ్ఛికంగా వదులుకుని సమానత్వం వైపుగా అడుగులు వేయడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. తమలో పేరుకుపోయిన వివక్షాపూరితమై న ఆలోచనలను, హింసాత్మక ఆచరణను అమానుష వైఖరిని కడిగి వేసుకుని స్త్రీల స్వేచ్ఛా కాంక్షను అర్థం చేసుకునేలా ఎదగాలని కాంక్షిస్తున్నాను. యుద్ధాన్ని వదిలి శాంతిని, ద్వేషాన్ని వదిలి స్నేహాన్ని మనసులో నింపుకుని ప్రపంచాన్ని... శాంతి, సమానత్వం దిశగా అభివృద్ధి చేయడంలో స్త్రీలతోపాటు భాగస్వామ్యం పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే ఈ పనులు చేస్తున్న సంస్కారవంతులైన కొందరు పురుషులకు నా అభినందనలు. - ఓల్గా, స్త్రీవాద రచయిత్రి Olga ఆధిపత్యం అడగడం లేదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులకు కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. స్త్రీపురుష వివక్ష మొదట్నించీ ఉన్నది కాదు. ఆదిమ వ్యవస్థలో ఆహారాన్ని కనిపెట్టింది స్త్రీ. కానీ సమాజం పురోగమనంలో మాతృస్వామిక వ్యవస్థ దాటి పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. అప్పటినుంచి స్త్రీ అణచివేత ప్రారంభమైంది. తర్వాత నాగరిక సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఒక హక్కుగా రాజ్యాంగం ఇచ్చింది. ఈనాటికీ ఆ సమానత్వాన్ని గుర్తించలేకపోవడం బాధాకరం. స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆధిపత్యం కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. కాని స్త్రీకి కావాల్సింది పురుషులపై ఆధిపత్యం కాదు, కేవలం సమానత్వం మాత్రమే. సమాజంలో పురుషాధిపత్య భావజాలం భారంగా మారితే పురుషులు కూడా బాధితులవుతారు. చాలామంది ఒంటరిస్త్రీలు, వితంతువులు... భర్త తోడు లేకుండా కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. ఎవరి అండా లేకుండానే పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేస్తున్నారు. పురుషులు ఆ పని చేయలేకపోతున్నారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. స్త్రీ తోడు లేకుండా బతకగలిగే పురుషులెందరు? కనీసం ఈ వాస్తవాైన్నైనా ఎందుకు గుర్తించరు? సమాజంలో హింసలేని జీవితాన్ని మనుషులందరూ కోరుకుంటున్నారు. అది మానవహక్కు కూడా. కాని స్త్రీలు, పిల్లలు హింసలేని జీవితాన్ని తమ హక్కుగా గుర్తించలేకపోతున్నారు. సమాజంలో శాంతియుత కుటుంబాలు కావాలి. అది ఆధిపత్య సంబంధాలు రద్దయినపుడే సాధ్యమవుతాయి. ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఆధిపత్యం కోరుకోకూడదు. బాధ్యతాయుతమైన మానవ సంబంధాలు మాత్రమే ఉండాలి. మానవజాతి మనుగడ కోసం త్యాగాలు చేసిన పురుషులు, స్త్రీలు ఉన్నారు. పురుష వ్యతిరేకత కాకుండా పురుషాధిపత్య భావజాలాన్ని తొలగించినపుడు మిగిలేది స్త్రీ, పురుషులు. ఎక్కువ తక్కువలు కాదు. - సంధ్య, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు Sandhya రెండుముఖాలు వద్దు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మనదేశంలోని పురుషులందరికీ నా అభినందనలు. ఈరోజైనా పురుషులందరూ ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘మీరూ మేము సగం సగం... మీరూ మేము సమం సమం’ అనే మహిళల మాటతో పురుషులందరూ గొంతు కలపాలని ఊరుకుంటే సరిపోదు, ఆచరించాలి. మన సమాజంలో రెండుముఖాలున్న మగవారి సంఖ్య బాగా ఎక్కువ. కొందరు మగవాళ్లు బయటికి స్త్రీవాద కబుర్లు చెప్పి ఇంటికెళ్లి భార్యల్ని హింసిస్తారు. మనసా వాచా మహిళల్ని గౌరవించే మగవారి సంఖ్య చాలా తక్కువ. దీనికి అనాదిగా వస్తున్న పురుష ప్రాధాన్య కట్టుబాట్లే కారణం కాదు, మహిళ తమని మించిపోతోందన్న అభద్రతా భావం కూడా. చదువుల్లో, ఉద్యోగాల్లో, తెలివితేటల్లో మహిళలు రోజురోజుకీ మెరుగవుతున్నారు. కాని మగవారి ఆలోచనలు మాత్రం ఏ కాలంలోనో ఆగిపోయాయి. మహిళల్లో వస్తున్న మార్పుకు తగ్గట్టు మగవారి ఆలోచనతీరు మెరుగవడం లేదు. కొందరిలో మైండ్‌సెట్ మారుతోంది కాని మనసు మారడం లేదు. బిడ్డగా స్త్రీ ఎదుగుదలను కోరుకుంటున్న మగవాళ్లే, భార్యగా ఎదిగితే మాత్రం అడ్డుపడుతున్నారు. మగవారి హృదయం మారడం లేదనడానికి ఇలాంటి ధోరణులే ఉదాహరణలు. వారి అభద్రతాభావం ఏస్థాయికి చేరిందంటే.. స్త్రీల కోసం కొత్త చట్టాలు వచ్చినప్పుడల్లా వాటిని పురుష వ్యతిరేక చట్టంగా భావిస్తున్నారు. అవి కేవలం స్త్రీలను రక్షించడానికి వచ్చిన చట్టాలు కాని పురుషుల్ని వ్యతిరేకించేవి కావు. ఆ మధ్య ఢిల్లీలో నిర్భయ ఘటన సందర్భంగా చాలామంది మగవాళ్లు ‘తాము మగవాళ్లుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాంటి సందర్భాల్లో పురుషుల నుంచి స్త్రీలు ఆశించేది సానుభూతి కాదు, తిరుగుబాటు. పురుషుడిగా తోటి పురుషులలో మార్పు తేవాలి. దాని కోసం ఎంతటి పోరాటాలైనా చేయాలి. లేదంటే స్త్రీల రక్షణకోసం పోరాడుతున్నవారికి సాయంగానైనా ఉండాలి. దాన్నే సమానత్వం అంటారు. స్త్రీలకు అన్యాయం జరిగితే తోటి స్త్రీలు స్పందించడం, పురుషులకు అన్యాయం జరిగితే పురుషులు స్పందించడం సమానత్వంలోకి రాదు. దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా లింగభేదం లేకుండా అంతా అండగా నిలబడాలి. అప్పుడే ఆడ, మగ అనే భేదం పోయి అందరం ఒక్కటేనన్న భావం వస్తుంది. - కొండవీటి సత్యవతి, కోఆర్డినేటర్ ‘భూమిక’ హెల్ప్‌లైన్ Kondaveeti Satyavati