తెలుగు తమ్ముళ్ల రచ్చ!
గుర్ల : అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా పూర్తికాక ముందే మండల టీడీపీ నాయకుల్లో ముసలందలైంది. మంత్రి మృణాళిని మండ లంలోని కొందరు నాయకులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని, మిగతా వారిని పట్టించుకోవడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మ ండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొందరు నాయకులు మంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కొందరికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ... మిగతా వారిని పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొన్నారు.
ముఖ్యంగా పల్లి గండ్రేడు, కొండగండ్రేడు, తెట్టంగి, గుర్ల, నాగళ్ళవలస, పెనుబర్తి, జమ్ముపేట, నడుపూరు, భూపాలపురం, చోడవరం, గూడెం గ్రా మాలకు చెందిన కార్యకర్తలు పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తక్షణమే కాంగ్రెస్ హయూంలో నియమించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టేంట్లు, సాక్షరభారత్ కో ఆర్డినేటర్లు, సీఎస్‌పీలను తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు కావస్తున్నా.. పాలకులు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదన్నారు. పార్టీని నమ్ముకుని పదేళ్ల పాటు ఉన్న తమకు ఇదేనా మీరిచ్చే గౌరవమంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మృణాళిణి నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదని, ముఖ్యంగాసామాన్య ప్రజానీకాన్ని, పార్టీ కార్యకర్త లు, నాయకులను ఒకే విధంగా చూస్తున్నారని తెలిపారు.
గ్రామ, మండల, నియోజవర్గ స్థాయి నాయకులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది ఇక మాకేంటి అనుకున్న పార్టీ అభిమానుల కోరికలను చిన్నాభిన్నాం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పార్టీలో విబేధాలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు తిరుమలరాజు కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ, ప్రస్తుత తెట్టంగి గ్రామ సర్పంచ్ వెన్నె సన్యాసినాయుడు, మండల విప్ సంచాన సన్యాసినాయుడు, చనమళ్ళ మహేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా కార్యకర్తలు చేసిన డిమాండ్లను తీర్మాణం చేసి, జిల్లా పార్టీ కార్యవర్గానికి పంపనున్నట్టు కొందరు నాయకులు తెలిపారు.