సెప్టెంబరులో స్టార్ట్‌.. చిట్టిబాబు పాత్రని మించి రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్‌ | Ramcharan next movie shooting starts at September | Sakshi
Sakshi News home page

సెప్టెంబరులో స్టార్ట్‌.. చిట్టిబాబు పాత్రని మించి రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్‌

Published Mon, Mar 20 2023 1:11 AM | Last Updated on Mon, Mar 20 2023 7:25 AM

Ramcharan next movie shooting starts at September - Sakshi

హీరో రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్‌ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వెంకట సతీష్‌ కిలారు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ సెప్టెంబరులో స్టార్ట్‌ కానుంది. ‘‘రంగస్థలం’ సినిమాలో నేను చేసిన చిట్టిబాబు పాత్రని మించి ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్‌ ఉంటుంది.

ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో స్టార్ట్‌ చేస్తాం’’ అంటూ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రామ్‌చరణ్‌ అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం మృణాళ్‌ ఠాకూర్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. కాగా ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో రామ్‌చరణ్‌ బిజీగా ఉన్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement