
విజయ్ ఆంటోని, మృణాళినీ రవి హీరో హీరోయిన్లుగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఈ 11న రిలీజ్ చేస్తోంది.
ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఈ కథలో తనంటే ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఓ అబ్బాయి. పెళ్లి తర్వాత తనను అర్థం చేసుకుంటుందని భావిస్తాడు. కానీ పెళ్లి తర్వాత కూడా ఆ అబ్బాయిపై ఆ అమ్మాయికి ఇష్టం ఏర్పడదు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకోవాలనుకుంటాడు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది.
మా సినిమా ప్రేక్షకులకు ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుంది. ‘లవ్ గురు’ సినిమా కోసం మైత్రీతో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. ఇక మా ప్రొడక్షన్‌లో మూడు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. నా దర్శకత్వంలోనే ‘బిచ్చగాడు 3’ ఉంటుంది. 2026 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment