Love guru
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా
కోలీవుడ్‌లో విజయ్ ఆంటోని సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రంలో నటించారు. మృణాళిని రవి ఇందులో హీరోయిన్గా నటించింది. విజయ్ ఆంటోని స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఏప్రిల్ 11న తెలుగులో కూడా విడుదలైన లవ్ గురు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా విజయ్ అంటోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ లవ్ గురు సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. సినిమా విడుదలైన నెలలోపే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ ప్రేక్షకులను మెప్పించిన లవ్ గురు చిత్రాన్ని ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి.లవ్ గురు కథేంటి..?అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించాడు. 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోయానే అనే బాధ అతనిలో ఉంటుంది. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్న అరవింద్ ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీనిని గ్రహించిన కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేస్తారు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్‌కు అర్థమవుతుంది. ఈ పెళ్లి ఆమెకు ఎందుకు ఇష్టం లేదు..? లీలా కోరిక ఏంటి..? ఆమె మనసును గెలుచుకునేందుకు అరవింద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. -
‘లవ్ గురు’ మూవీ టీమ్ బంపరాఫర్.. ఫ్రీగా ఫ్యామిలీ టూర్!
తమ సినిమాను చూస్తే ఫ్రీగా మలేషియా, కశ్మీర్, ఊటీ విహార యాత్రకు తీసుకెళ్తామని చెబుతోంది ‘లవ్ గురు’ టీమ్. విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా రోజు రోజుకూ చేరువవుతోంది. ఈ చిత్రం మరింత మందికి చేరువయ్యేలా చేసేందుకు మేకర్స్ ఓ ఎగ్జైటింగ్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో కొంతమందిని ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కు ఊటీ హాలీడే ట్రిప్ ను తీసుకెళ్తామని "లవ్ గురు" టీమ్ తెలిపింది. నేటి(ఏప్రిల్ 14)బ నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "లవ్ గురు" సినిమా చూసిన ప్రేక్షకులు మీ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్ లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నెంబర్ కు మీ టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం "లవ్ గురు" సినిమా టీమ్ కల్పిస్తోంది. Watch #LoveGuru in theatres with your family and stand a chance to win an all paid trip with your family ✨ 3 lucky winners to 3 exotic holiday destinations, follow the steps mentioned above 🤩 Hurry up, book now 💥 🎟️ https://t.co/ZdTixXBQZE Telugu Release by @MythriOfficial… pic.twitter.com/fnzhbYyhPq — Mythri Movie Makers (@MythriOfficial) April 14, 2024 -
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్‌తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్‌కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్‌ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్‌కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్‌కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్‌కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్‌గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్‌ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్‌ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్‌ని ఓ పీడకల వెంటాడే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్‌కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్‌గా సాగుతుంది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్‌గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘లవ్ గురు’ ప్రేమించడం నేర్పిస్తుంది : విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని, మృణాళినీ రవి హీరో హీరోయిన్లుగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఈ 11న రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఈ కథలో తనంటే ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఓ అబ్బాయి. పెళ్లి తర్వాత తనను అర్థం చేసుకుంటుందని భావిస్తాడు. కానీ పెళ్లి తర్వాత కూడా ఆ అబ్బాయిపై ఆ అమ్మాయికి ఇష్టం ఏర్పడదు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకోవాలనుకుంటాడు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది. మా సినిమా ప్రేక్షకులకు ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుంది. ‘లవ్ గురు’ సినిమా కోసం మైత్రీతో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. ఇక మా ప్రొడక్షన్లో మూడు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. నా దర్శకత్వంలోనే ‘బిచ్చగాడు 3’ ఉంటుంది. 2026 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. -
లవ్ గురు నవ్వులు పంచుతుంది: నిర్మాత రవిశంకర్
‘‘విజయ్ ఆంటోనిగారి ‘బిచ్చగాడు’ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫేవరెట్ మూవీ. ఆయన నటించిన ‘లవ్ గురు’ సినిమా నవ్వులు పంచుతుంది’’ అన్నారు నిర్మాత రవిశంకర్. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. సోమవారం నిర్వహించిన ‘లవ్ గురు’ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ చాలా బాగుంది. ఈ సినిమా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. హీరో, నిర్మాత విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ కథ విన్నాక నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని వినాయక్‌కు చెప్పాను. ఈ సినిమాను హిందీలో వినాయక్ డైరెక్షన్లోనే చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ ప్రపంచంలో ప్రేమ ద్వారా ఏదైనా సాధించొచ్చు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం’’ అన్నారు వినాయక్ వైద్యనాథన్. -
'నా భార్యను వన్ సైడ్ లవ్ చేస్తున్నా మావయ్య..'..ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో విజయ్‌ఆంటోని. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'బిచ్చగాడు -2'తో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'రోమియో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోకు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో లవ్ గురు చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు భరత్ ధనశేఖర్ సంగీతమందించారు. ఈ #LoveGuru చిత్రం specially భార్యామణుల కోసం తీయబడినది 🌹🤔 ▶https://t.co/uzXkprMMcS A Summer Blockbuster. Releasing this Ramzan💥 Telugu Release by @MythriOfficial@vijayantonyfilm @vijayantony @mirnaliniravi @actorvinayak_v #BarathDhanasekar @Bhashyasree @Gskmedia_pr… pic.twitter.com/fPV3Fms1t0 — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024 -
లవ్ గురులా పరిష్కారాలు చెబుతాను
‘‘మనందరిలో దాదాపు 95 శాతం మందికి ప్రేమ సమస్యలు ఉంటాయి. అమ్మాయిలను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. మా ‘లవ్‌గురు’ చూస్తే ప్రేమలో అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో అబ్బాయిలకు తెలుస్తుంది. నేను ‘లవ్ గురు’లా పరిష్కారాలు చెబుతాను’’ అని విజయ్ ఆంటోని అన్నారు. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘లవ్ గురు’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మా లవ్ గురు’ సినిమా చూసిన తర్వాత పెళ్లి చేసుకున్నవారు, చేసుకోనివారు వారి జీవితాల్లోని మహిళలను మరింత అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు’’ అన్నారు. ‘‘లవ్ గురు’ చిత్రం విజయ్ ఆంటోనీగారి 2.ఓ అనుకోవచ్చు’’ అన్నారు వినాయక్. ‘‘ఈ సినిమాలో లీల పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు మృణాళినీ రవి. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
‘బిచ్చగాడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రోమియో’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళినీ రవి హీరోయిన్గా నటిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌పై విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ ధనశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌కి భాష్యశ్రీ సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు. ‘‘విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న చిత్రం ‘లవ్ గురు’. ఇందులో మనసుని కదిలించే చెల్లెలి సెంటిమెంట్ కూడా ఉంటుంది. వేసవిలో ఈ చిత్రం విడుదల చేయనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జే బాష. -
బిచ్చగాడు ఇప్పుడు 'లవ్ గురు' అయ్యాడు!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్‌ఆంటోని.. ఆ తర్వాత నటుడు, ఎడిటర్, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఈ మధ్యే 'బిచ్చగాడు 2'తో దర్శకుడుగాను మారి హిట్ కొట్టారు. తాజాగా 'రోమియో' చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా తీస్తున్నారు. తెలుగులో లవ్‌గురు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!) ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ కాగా, వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన గుడ్ డెవిల్ అనే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇది రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తీస్తున్నట్లు విజయ్ చెప్పుకొచ్చారు. ఇందులో కొత్త విజయ్ ఆంటోనీని చూస్తారని ఆయన చెప్పారు. దీనికి భరత్ ధనశేఖర్ సంగీతాన్ని, ఫరూఖ్ జే.బాషా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రోమియో చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నా తదుపరి చిత్రం #LOVEGURU ని ఎనౌన్స్ చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది🙏😊 Summer 2024#Blockbuster @GoodDevilOffl @mirnaliniravi pic.twitter.com/uNgRh9lvZs — vijayantony (@vijayantony) August 16, 2023 (ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) -
ఒకరిపై ప్రేమ అనేది ఆకర్షణతో మొదలవుతుంది..
హరియాణా : గణిత శాస్త్రం.. ఈ పేరు వింటేనే కొంతమంది స్టూడెంట్స్ బెంబేలెత్తిపోతారు. లెక్కల మాస్టారు తరగతి గదిలోకి ప్రవేశిస్తేనే బోర్‌గా ఫీలవుతారు. ఎప్పుడెప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయిపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ మన లెక్కల మాస్టారు చెప్పే క్లాసులు విద్యార్థులు మాత్రం అస్సలు మిస్సవ్వరు. ఇంకా కాసేపు చెబితే బాగుండు అనేలా క్లాసులు వింటారు. అయితే ఈ మాస్టారు చెప్పే లెక్కలు కొంచెం తేడా. గణితానికి ప్రేమను జోడించి ప్రేమ లెక్కలు చెబుతూ వివాదస్పందంగా నిలిచారు హరియాణా ప్రభుత్వ మహిళా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చరణ్ సింగ్. స్నేహం, ఆకర్షణ, క్రష్‌ల మధ్య తేడాను గణిత రూపంలో వివరిస్తున్న వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. ఆయన చెప్పిన ప్రేమ లెక్కలు.. ఫ్రెండ్షిప్ : సాన్నిహిత్యం నుంచి ఆకర్షణను తీసివేస్తే వచ్చేదే స్నేహం (క్లోజ్‌నెస్- అట్రాక్షన్ = ఫ్రెండ్షిప్). భార్యభర్తలు వృద్ధాప్యంలో స్నేహితులుగా ఉంటారు. వృద్ధాప్యంలో శారీరక ఆకర్షణ తగ్గిపోయి స్నేహితులుగా మారుతారు. లవ్ : సాన్నిహిత్యం, ఆకర్షణల కలయికనే ప్రేమ. (క్లోజ్‌నెస్ + అట్రాక్షన్) . రొమాంటిక్ లవ్ : స్నేహం, సాన్నిహిత్యం, ఆకర్షణల కలయికనే రొమాంటిక్ లవ్ ( రోమాంటిక్ లవ్ = ఫ్రెండ్షిప్ + క్లోజ్‌నెస్ + అట్రాక్షన్). ఏ సంబంధం అయినా ఆకర్షణ, స్నేహం, సాన్నిహిత్యంపైనే ఆధారపడి ఉంటుంది. ‘ఒకరిపై ప్రేమ అనేది ఆకర్షణతో మొదలవుతుంది. వారిమధ్య సాన్నిహిత్యం కొరవడితే వైరం ఏర్పడుతుంది. దీంతో విడిపోతారు. ఇలాంటి ప్రేమ ఎక్కువగా విదేశాలలో ఉంటుంది. కొన్ని దేశాల్లో వాహనాలు, ఇళ్లను మార్చినట్లుగా ఈజీగా జీవిత భాగస్వామిని మారుస్తారు. దానికి గల కారణం సాన్నిహిత్యం లేకపోవడం. కానీ భారతదేశంలో అలాకాదు. వారిలో ఆకర్షణ, సాన్నిహిత్యం తగ్గిపోయినా వారి పిల్లల కోసం కలిసి ఉంటారు’ అని చరణ్ సింగ్ వివరించారు. ఇక క్రష్ గురించి చెబుతూ.. ఆకర్షణ నుంచి సాన్నిహిత్యాన్ని తీసివేస్తే వచ్చేదే క్రష్ అని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రష్ అనేది ఎప్పడో ఒకసారి పుడుతుందని స్టూడెంట్స్‌కు వివరించారు. ఇక ప్రొఫెసర్ చెప్పే ప్రేమ లెక్కలను విద్యార్థులు నవ్వుతూ శ్రద్దగా విన్నారు. వారికి ఉన్న సందేహాలను కూడా తీర్చుకున్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా అతనిపై ఫిర్యాదు చేయలేదు. సామాజిక కార్యకర్త ఒకరు చరణ్ సింగ్‌పై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చరణ్ సింగ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారో లేదో తెలియరాలేదు. -
65 ఏళ్ల ఈ ‘యువకుడి’కి పెళ్లి ప్రపోజల్స్ కష్టాలు!
‘నేను అరవై ఐదేళ్ల యువకుడిని. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావని అందరూ నన్ను అడుగుతున్నారు. ఇంకేం ఉంటుంది.. నేను మరోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతో మంది అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు నా వెంట పడుతున్నారు. పెళ్లి చేసుకోవాలంటూ విసిగిస్తున్నారు. కానీ ఈ విషయంలో తుది నిర్ణయం నా విద్యార్థులదే. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏదో ఒకటి తొందరగా తేల్చేయండి మిత్రులారా’ ఇది బిహార్ ‘లవ్‌గురు’గా పేరొందిన ప్రొఫెసర్ ముథుక్‌నాథ్ చౌదరి ఫేస్బుక్ పోస్ట్ సారాంశం. పదవీ విరమణ పొందిన తర్వాత వస్తున్న పెళ్లి కష్టాల గురించి ఇలా ఏకరువు పెట్టారు ఆయన. పట్నా యూనివర్సిటీకి చెందిన బీఎన్ కాలేజీలో హిందీ ప్రొఫెసర్‌గా పనిచేసే ముథుక్‌నాథ్ చౌదరి.. వయసులో తన కంటే 30 ఏళ్లు చిన్నదైన తన స్టూడెంట్ జూలీని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. 2006లో మొదలైన వీరి బంధం సుమారు దశాబ్ద కాలంపాటు కొనసాగింది. గతేడాది భర్త నుంచి విడిపోయిన జూలీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో బుధవారం పదవీ విరమణ పొందిన చౌదరిని.. మీ తదుపరి నిర్ణయం ఏమిటి అని అడిగిన విద్యార్థులకు ఇలా ఫేస్బుక్ పోస్టుతో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఈ వృద్ధ యువకుడి వాలకం చూస్తుంటే ‘ముసలోడికి దసరా పండుగ’ అనే సామెత గుర్తుకువస్తోంది కదా అంటూ కొంతమంది నెటిజన్లు చమత్కరిస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ఇందులో తప్పేం ఉంది. పెళ్లికి వయసుతో ఏం సంబంధం’ అంటూ ప్రొఫెసర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. మరి మీరేం ఏమంటారో!? -
నేను లవ్ గురూని..!
‘‘ఇందులో నేను లవ్‌గురుగా కనిపిస్తాను. చిలిపి సరదాల దృశ్యరూపంగా అనిపించే అల్లరి ప్రేమికుల కథ ఇది’’ అని శ్రీ అన్నారు. కృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ, హరిప్రియ జంటగా డి.రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మించిన చిత్రం ‘గలాట’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ విలేకరులతో ముచ్చటించారు. ‘కొత్త దర్శకులతో ఇక చేయకూడదు అనుకున్నాను. కానీ... అద్భుతమైన కథ చెప్పి నన్ను ఒప్పించాడు దర్శకుడు కృష్ణ. ఎంత బాగా చెప్పాడో, అంతకు తగ్గ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడు. బామ్మకు నచ్చే లక్షణాలున్న అమ్మాయిని వెతుక్కుంటూ ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ కుర్రాడికి వెతకబోయే తీగ కాలికి తగిలినట్లు తనకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఓ అమ్మాయి గుళ్లో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ మంత్రి వల్ల సమస్యల్లో పడిన ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడి, తనదాన్ని చేసుకున్నాడు? అనేది ఈ సినిమా కథాంశం. కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. జంధ్యాలగారి సినిమా చూస్తున్న ఫీల్ కలిగిస్తుందీ సినిమా’’ అని చెప్పారు. సునీల్ కశ్యప్ శ్రావ్యమైన బాణీలిచ్చారని, కృష్ణ నటించిన ‘గూఢచారి 116’లోని ‘నువ్వునా ముందుంటే..’ పాటను ఏ మాత్రం మార్చకుండా యథాతథంగా పెట్టామని శ్రీ తెలిపారు. ‘ఈ రోజుల్లో, బస్టాప్’ చిత్రాలకు పనిచేసిన కిరణ్ దర్శకత్వంలో ‘సాహసం సేయరా డింభకా’ చిత్రం చేయనున్నట్లు ఆయన చెప్పారు.