లవ్‌ గురు నవ్వులు పంచుతుంది: నిర్మాత రవిశంకర్‌ | Love guru Release on April 11th | Sakshi
Sakshi News home page

లవ్‌ గురు నవ్వులు పంచుతుంది: నిర్మాత రవిశంకర్‌

Apr 9 2024 12:12 AM | Updated on Apr 9 2024 12:12 AM

Love guru Release on April 11th - Sakshi

రవిశంకర్, నవీన్, విజయ్‌ 

‘‘విజయ్‌ ఆంటోనిగారి ‘బిచ్చగాడు’ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫేవరెట్‌ మూవీ.  ఆయన నటించిన ‘లవ్‌ గురు’ సినిమా నవ్వులు పంచుతుంది’’ అన్నారు నిర్మాత రవిశంకర్‌. విజయ్‌ ఆంటోని, మృణాళినీ రవి జంటగా వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌ గురు’. మీరా విజయ్‌ ఆంటోని సమర్పణలో విజయ్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది.

తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. సోమవారం నిర్వహించిన ‘లవ్‌ గురు’ ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాత నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘లవ్‌ గురు’ చాలా బాగుంది. ఈ సినిమా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి హిట్‌ అవుతుంది’’ అన్నారు. హీరో, నిర్మాత విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ– ‘‘లవ్‌ గురు’ కథ విన్నాక నా కెరీర్‌లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్‌ అవుతుందని వినాయక్‌కు చెప్పాను. ఈ సినిమాను హిందీలో వినాయక్‌ డైరెక్షన్‌లోనే చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ ప్రపంచంలో ప్రేమ ద్వారా ఏదైనా సాధించొచ్చు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం’’ అన్నారు వినాయక్‌ వైద్యనాథన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement