
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో విజయ్‌ఆంటోని. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'బిచ్చగాడు -2'తో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'రోమియో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు అర్థమవుతోంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోకు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో లవ్ గురు చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు భరత్ ధనశేఖర్ సంగీతమందించారు.
ఈ #LoveGuru చిత్రం specially భార్యామణుల కోసం తీయబడినది 🌹🤔
▶https://t.co/uzXkprMMcS
A Summer Blockbuster. Releasing this Ramzan💥
Telugu Release by @MythriOfficial@vijayantonyfilm @vijayantony @mirnaliniravi @actorvinayak_v #BarathDhanasekar @Bhashyasree @Gskmedia_pr… pic.twitter.com/fPV3Fms1t0— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024
Comments
Please login to add a commentAdd a comment