Mirnalini Ravi
-
చిన్ననాటి కల.. ఇన్నాళ్లకు నెరవేరిందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా
కోలీవుడ్‌లో విజయ్ ఆంటోని సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రంలో నటించారు. మృణాళిని రవి ఇందులో హీరోయిన్గా నటించింది. విజయ్ ఆంటోని స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఏప్రిల్ 11న తెలుగులో కూడా విడుదలైన లవ్ గురు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా విజయ్ అంటోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ లవ్ గురు సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. సినిమా విడుదలైన నెలలోపే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ ప్రేక్షకులను మెప్పించిన లవ్ గురు చిత్రాన్ని ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి.లవ్ గురు కథేంటి..?అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించాడు. 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోయానే అనే బాధ అతనిలో ఉంటుంది. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్న అరవింద్ ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీనిని గ్రహించిన కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేస్తారు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్‌కు అర్థమవుతుంది. ఈ పెళ్లి ఆమెకు ఎందుకు ఇష్టం లేదు..? లీలా కోరిక ఏంటి..? ఆమె మనసును గెలుచుకునేందుకు అరవింద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. -
Mirnalini Ravi: లవ్ గురు బ్యూటీ కొంటె అందాలు (ఫోటోలు)
-
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్‌తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్‌కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్‌ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్‌కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్‌కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్‌కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్‌గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్‌ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్‌ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్‌ని ఓ పీడకల వెంటాడే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్‌కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్‌గా సాగుతుంది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్‌గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'నా భార్యను వన్ సైడ్ లవ్ చేస్తున్నా మావయ్య..'..ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో విజయ్‌ఆంటోని. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'బిచ్చగాడు -2'తో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'రోమియో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోకు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో లవ్ గురు చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు భరత్ ధనశేఖర్ సంగీతమందించారు. ఈ #LoveGuru చిత్రం specially భార్యామణుల కోసం తీయబడినది 🌹🤔 ▶https://t.co/uzXkprMMcS A Summer Blockbuster. Releasing this Ramzan💥 Telugu Release by @MythriOfficial@vijayantonyfilm @vijayantony @mirnaliniravi @actorvinayak_v #BarathDhanasekar @Bhashyasree @Gskmedia_pr… pic.twitter.com/fPV3Fms1t0 — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024 -
ఆమెతో కిచుకిచులకు ప్రయత్నించా..వర్కౌట్ కాలేదు: విజయ్ ఆంటోని
తమిళసినిమా: సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రోమియో. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా వినాయక్ వైద్యనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి మృణాళిని రవి నాయకిగా నటించిన ఇందులో యోగిబాబు, వీటీవీ.గణేశ్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా, శీజా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం రంజాన్ సందర్భంగా వచ్చే నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. రోమియో చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చిత్ర దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ ఒక స్త్రీ తన భర్తను ఎలా ప్రేమగా చూసుకోవాలి అన్నదే ఈ చిత్ర ప్రధానాంశం అని పేర్కొన్నారు. ఈ కథకు స్ఫూర్తి తన తల్లి అని అన్నారు. తాను ఒక షార్ట్ ఫిలిం చేసి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజయ్‌ఆంటోని నుంచి ఫోన్‌కాల్ వచ్చిందన్నారు. తాను చేసిన షార్ట్ ఫిలిం గురించి ఎంతో డిటైల్‌గా వివరించి మంచి కథ ఉంటే చెప్పండి అని ఆయన అన్నారన్నారు. దీంతో ఆయన హీరోగా ఒక లవ్‌స్టోరీని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు కథను రెడీ చేయడానికి ఏడాది గడువు అడిగినట్లు చెప్పారు. అలా మొదలైంది రోమియో చిత్రం అని చెప్పారు. విజయ్‌ఆంటోని మాట్లాడుతూ మృణాళిని ఆత్మవిశ్వాసం కలిగిన మంచి అమ్మాయి అని పేర్కొన్నారు. రోమియో చిత్ర ప్రచారం కోసం తమ గురించి కిచుకిచులు చేయాలని ప్రయత్నించామని, అయితే అవేవి వర్కౌట్ కాలేదన్నారు. తాను తొలిసారిగా ఒక ప్రేమ కథా చిత్రంలో నటించినట్లు చెప్పారు. ఒక స్త్రీ మగవాడిని హింసిస్తుందీ, అతను దాన్ని ఎలా భరిస్తాడు? అన్న ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం రోమియో అని చెప్పారు. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.