తమిళసినిమా: సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రోమియో. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా వినాయక్ వైద్యనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి మృణాళిని రవి నాయకిగా నటించిన ఇందులో యోగిబాబు, వీటీవీ.గణేశ్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా, శీజా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం రంజాన్ సందర్భంగా వచ్చే నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. రోమియో చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఇందులో చిత్ర దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ ఒక స్త్రీ తన భర్తను ఎలా ప్రేమగా చూసుకోవాలి అన్నదే ఈ చిత్ర ప్రధానాంశం అని పేర్కొన్నారు. ఈ కథకు స్ఫూర్తి తన తల్లి అని అన్నారు. తాను ఒక షార్ట్ ఫిలిం చేసి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజయ్‌ఆంటోని నుంచి ఫోన్‌కాల్ వచ్చిందన్నారు. తాను చేసిన షార్ట్ ఫిలిం గురించి ఎంతో డిటైల్‌గా వివరించి మంచి కథ ఉంటే చెప్పండి అని ఆయన అన్నారన్నారు. దీంతో ఆయన హీరోగా ఒక లవ్‌స్టోరీని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు కథను రెడీ చేయడానికి ఏడాది గడువు అడిగినట్లు చెప్పారు. అలా మొదలైంది రోమియో చిత్రం అని చెప్పారు.
విజయ్‌ఆంటోని మాట్లాడుతూ మృణాళిని ఆత్మవిశ్వాసం కలిగిన మంచి అమ్మాయి అని పేర్కొన్నారు. రోమియో చిత్ర ప్రచారం కోసం తమ గురించి కిచుకిచులు చేయాలని ప్రయత్నించామని, అయితే అవేవి వర్కౌట్ కాలేదన్నారు. తాను తొలిసారిగా ఒక ప్రేమ కథా చిత్రంలో నటించినట్లు చెప్పారు. ఒక స్త్రీ మగవాడిని హింసిస్తుందీ, అతను దాన్ని ఎలా భరిస్తాడు? అన్న ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం రోమియో అని చెప్పారు. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment