Romeo
-
ఆమెతో కిచుకిచులకు ప్రయత్నించా..వర్కౌట్ కాలేదు: విజయ్ ఆంటోని
తమిళసినిమా: సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రోమియో. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా వినాయక్ వైద్యనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి మృణాళిని రవి నాయకిగా నటించిన ఇందులో యోగిబాబు, వీటీవీ.గణేశ్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా, శీజా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం రంజాన్ సందర్భంగా వచ్చే నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. రోమియో చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చిత్ర దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ ఒక స్త్రీ తన భర్తను ఎలా ప్రేమగా చూసుకోవాలి అన్నదే ఈ చిత్ర ప్రధానాంశం అని పేర్కొన్నారు. ఈ కథకు స్ఫూర్తి తన తల్లి అని అన్నారు. తాను ఒక షార్ట్ ఫిలిం చేసి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజయ్‌ఆంటోని నుంచి ఫోన్‌కాల్ వచ్చిందన్నారు. తాను చేసిన షార్ట్ ఫిలిం గురించి ఎంతో డిటైల్‌గా వివరించి మంచి కథ ఉంటే చెప్పండి అని ఆయన అన్నారన్నారు. దీంతో ఆయన హీరోగా ఒక లవ్‌స్టోరీని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు కథను రెడీ చేయడానికి ఏడాది గడువు అడిగినట్లు చెప్పారు. అలా మొదలైంది రోమియో చిత్రం అని చెప్పారు. విజయ్‌ఆంటోని మాట్లాడుతూ మృణాళిని ఆత్మవిశ్వాసం కలిగిన మంచి అమ్మాయి అని పేర్కొన్నారు. రోమియో చిత్ర ప్రచారం కోసం తమ గురించి కిచుకిచులు చేయాలని ప్రయత్నించామని, అయితే అవేవి వర్కౌట్ కాలేదన్నారు. తాను తొలిసారిగా ఒక ప్రేమ కథా చిత్రంలో నటించినట్లు చెప్పారు. ఒక స్త్రీ మగవాడిని హింసిస్తుందీ, అతను దాన్ని ఎలా భరిస్తాడు? అన్న ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం రోమియో అని చెప్పారు. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
భారత్ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం
-
రోమియోకు కటకటాలు!
సాక్షి, సిటీబ్యూరో: మహిళలు, యువతులకు ఎదురయ్యే వేధింపులను షీ–టీమ్స్ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఓ రోడ్ సైడ్ రోమియోతో పాటు మరో పోకిరీని పట్టుకున్న షీ బృందాలు వారిని కోర్టులో హాజరుపరిచాయి. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం వీరికి జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ షికా గోయల్ సోమవారం తెలిపారు. నిఘా విధుల్లో భాగంగా షీ–టీమ్స్ బృందాలు సంతోష్‌నగర్‌లోని ఓ జూనియర్ కాలేజీ వద్ద కాపుకాశాయి. అదే సమయంలో రెయిన్‌బజార్ పరిధిలోని యాకత్‌పుర కాలనీకి చెందిన మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ ఆతిఫ్ తన బైక్‌పై అక్కడికి వచ్చి పదేపదే ఆ కళాశాల వద్ద రౌండ్లు వేయడం మొదలెట్టాడు. దీనిని గుర్తిచిన షీ–టీమ్స్ అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల జైలు, రూ.200 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే ఓ మహిళను నేరుగా,ఫోన్ ద్వారా వేధిస్తున్న నాగోలు జైపురికాలనీకి చెందిన బి.వెంకటేష్‌ను సైతం షీ–టీమ్స్ పట్టుకున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచాయి. ఇతడికి న్యాయస్థానం ఐదు రోజుల జైలు, రూ.200 జరిమానా విధించింది. -
నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన విద్యార్థిని..
బరంపురం: మహిళా రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా రోడ్‌సైడ్ రోమియోల అగడాలకు అడ్డులేకుండా పోతోంది. ఇందుకు బరంపురం నగరమే ఉదాహరణగా నిలిచిందనడానికి మూడు రోజుల క్రితం నగరంలోని గాంధీనగర్ మెయిన్ రోడ్లో జరిగిన సంఘటన రుజువు చేస్తోంది. మూడు రోజుల క్రితం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్ సాయి కాంప్లెక్స్ దగ్గర మహామాయి మహిళా కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని కళాశాలకు వెళ్తున్న సమయంలో రోడ్‌సైడ్ రోమియో తీవ్రంగా కామెంట్ చేయడంతో బాధిత విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించి తన చెప్పు తీసి రోమియో చొక్కా పట్టుకుని చెంపలు వాయించింది. ఈ సంఘటనపై స్థానికులు సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. మరి కొన్ని చానల్స్ రోజంతా పదే పదే చూపించడంతో రాష్ట్ర హోం శాఖ తీవ్ర స్థాయిలో స్పందించి ంది. ఈ నేపథ్యంలో వెంటనే రోడ్‌సైడ్ రోమి యోను అరెస్ట్ చేయాలని ఇటువంటి రోమియాలపై గట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ మేరకు బరంపురం ఎస్పీ పినాకి మిశ్రా టౌన్ పోలీసులను ఆదేశించగా శనివారం టౌన్ పోలీసులు జుమోటోగా రోడ్‌సైడ్ రోమియోను అరెస్ట్ చేసి సాయంత్రం ఎస్డీజేఎం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
రోమియో... జూలియట్
గ్రౌండ్ అప్ ఈవారం విశేషాల రౌండప్ ఒకే హాస్పిటల్లో, పక్క పక్క వార్డులలో 18 గంటల తేడాతో రోమియో, జూలియట్లు జన్మించిన ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. మార్చి 19న ఆదివారం నాడు యు.ఎస్.లోని కోస్టల్ కరొలినా హాస్పిటల్లో మధ్యాహ్నం 2 గంటల 6 నిముషాలకు రోమియో జన్మించాడు! తర్వాతి రోజు ఉద్యం 8 గంటల 14 నిముషాలకు జూలియట్ జన్మించింది. ఈ సంగతి వారిద్దరి తల్లిదండ్రులకు తెలియదు. కేసీ క్లేషల్ట్ అనే మహిళా ‘న్యూబార్న్ ఫొటోగ్రాఫర్’ ఎప్పటిలా హాస్పిటల్లో కొత్తగా పుట్టిన పిల్లల్ని ఫొటోలు తీసేందుకు వచ్చినప్పుడు ఈ అపురూపమైన సందర్భంగా గురించి తెలిసింది. అది కూడా అనుకోకుండా. యు.ఎస్.లో ఇంకా ఇతర పాశ్చాత్య దేశాలలో సాధారణంగా బిడ్డ పుట్టకముందే ఒక పేరు అనుకుంటారు. అలా... ‘మీ అబ్బాయి పేరు ఏమిటి? అని కేసీ అడిగినప్పుడు ఈ వార్డు దంపతులు ‘రోమియో ఆర్కెంజల్ హెర్మాండజ్’ అని చెప్పారు. ‘మీ అమ్మాయి పేరు ఏమిటి?’ అని అడిగినప్పుడు ఆ పక్క వార్డు దంపతులు ‘జూలియట్ ఎవాంజిలిన్ షిప్లెట్’ అని చెప్పారు. ఇకనేం ఇద్దరి పేర్లలో రోమియో, జూలియట్లు ఉన్నాయని, ఇద్దరినీ రోమియో–జూలియట్లలాగే ముస్తాబు చేసి, షేక్స్పియర్ కాలం నాటి కావ్య నాయికానాయకులు గుర్తుకు వచ్చేలా ఫొటోలు తీశారు కేసీ. ఎంత ముద్దుగా ఉన్నారో చూశారుగా! టైటానిక్ ట్రిప్! అట్లాంటిక్ సముద్ర గర్భంలో ఉపరితల జలాలకు 4 వేల మీటర్ల అడుగున చిక్కుకుని ఉన్న టైటానిక్ ‘శకల నౌక’ దగ్గరికి... వచ్చే ఏడాది మే నెల నుంచి ఔత్సాహికుల వన్ టైమ్ సాహస యాత్ర మొదలౌతోంది! ఎనిమిది రోజులపాటు భద్రమైన ఒక మానవ జలాంతర్గామిలో సాగే ఈ టైటానిక్ యాత్రను లండన్ ట్రావెల్ కంపెనీ ‘బ్లూ మార్బుల్ ప్రైవేట్’ నిర్వహిస్తోంది. కెనడా లోని న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి ఈ టైటానిక్ సందర్శక ప్రయాణికులు బయల్దేరుతారు. టిక్కెట్ ధర మనిషికి లక్షా 5 వేల 129 డాలర్లు! సుమారుగా 68 లక్షల 20 వేల రూపాయలు. 1912 ఏప్రిల్‌లో ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నుంచి యు.ఎస్.లోని న్యూయార్క్‌కు బయల్దేరిన టైటానిక్ నౌక మార్గం మధ్యలో మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. నౌకలో మొత్తం 2,224 మంది ప్రయాణీకులు (నౌక సిబ్బందితో కలిసి) ఉండగా, వారిలో 1500 మందికి పైగా మరణించారు. నౌక మునిగిన 93 ఏళ్ల తర్వాత రాబర్ట్ బల్లార్డ్, ఆయన అన్వేషకుల బృందం న్యూఫౌండ్లాండ్ దగ్గరి సెయిట్ జాన్స్‌కు 380 నాటికల్ మైళ్ల దూరంలో టైటానిక్ ప్రధాన శకలాన్ని కనుగొంది. ఇప్పుడు అక్కడికే మనవాళ్ల ప్రయాణం. పాదాక్రాంతం ఎడమవైపు ఉన్న ఆవిడ నికోలా స్టర్జన్. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ (ప్రధాని). కుడివైపు ఉన్న ఆవిడ థెరిసా మే. బ్రిటన్ ప్రధాని. ఇటీవల ఇద్దరూ గ్లాస్గోవ్లో కలుసుకున్నారు. గ్లాస్గోవ్ స్కాట్లాండ్లో ఉంటుంది. ‘ఐరోపా సమాఖ్య’ (ఇ.యు.) నుంచి గత ఏడాది బ్రిటన్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు బ్రిటన్ నుంచి విడిపోతానని స్కాట్లాండ్ పట్టుపట్టింది (స్లాట్లాండ్ 1707 నుంచి యు.కె.లో భాగంగా ఉంది). ఈ సమస్యను చక్కబరచుకోవడం కోసమే ఈ ఇద్దరు ప్రధానమంత్రులూ ఇలా ఒకచోట కూర్చున్నారు. విషయం చాలా సీరియస్ అని తెలుస్తూనే ఉంది కదా. అయితే దాన్ని వదిలేసి, బ్రిటన్ పత్రిక ‘డైలీ మెయిల్’ వీళ్లిద్దరి కాళ్లపై దృష్టిని కేంద్రీకరించింది! ఎవరి కాళ్లు అందంగా ఉన్నాయో చెప్పండి అని పేద్ద హెడ్డింగ్ పెట్టింది. పైగా ఈ దేశాధినేతల కాళ్ల విలక్షణతను కూడా వర్ణించింది. నికోలా కాళ్లు... ఏక్దమ్ ఫ్లర్టీ అట! టాంటలైజింగ్లీ క్రాస్డ్ అట!! ఎ డైరెక్ట్ అటెంప్ట్ ఎట్ సెడెక్షన్ కూడానట! కవ్వించేలా, ఆశపెట్టి వేధించేలా, – ఎట్ ద సేమ్ టైమ్– వ్యామోహం మూతి పగలగొట్టేలా ఉన్నాయని దీనంతటికీ అర్థం. ఇక థెరిసా మే. పొంచి ఉన్న తీవ్రవాది బుద్దిగా దగ్గర పెట్టుకున్న ఆయుధాల్లా ఉన్నాయట ఈవిడ కాళ్లు! జనం డెయిలీ మెయిల్‌ను ఎలా తిడుతున్నారంటే... మాటల్లో చెప్పలేం. మహిళలను కించపరిచే వెర్రిరాతల్ని రాయడం తక్షణం మానుకోవాలని ఫోన్ చేసి మరీ... తలా ఒకటి అంటిస్తున్నారు. ట్విటర్లోనైతే ఇక చెప్పలేం. తిట్లే తిట్లు. కరుణ రసం రేయాన్‌కు తొమ్మిదేళ్లు. అకస్మాత్తుగా ఇటీవల ఒక రోజు న్యూ మెక్సికోలోని ఒక రోడ్డు పక్కన నిమ్మరసం అమ్మడం మొదలు పెట్టాడు! రేయాన్కి రిచర్డ్ శాంఛెజ్ అనే తాతగారు ఉన్నారు. ఆ తాతగారిని బతికించుకోడానికే రేయాన్ ఇలా వ్యాపారిగా అవతారమెత్తాడు. తాతగారికి రెండు రకాల క్యాన్సర్లు! అవి రెండూ మూడో స్టేజ్‌లో ఉన్నాయి. డాక్టర్లు ఆయనకు సర్జరీ చేసి కడుపులోని కణితి తొలగించారు. ఇక మిగిలింది కీమో థెరపీ ఇవ్వడం. దానికి డబ్బులు కావాలి. కనీసం 5 వేల డాలర్లన్నా కావాలి. అంత మొత్తం తాత దగ్గర లేదు. మనవడే సంపాదించడానికి పూనుకున్నాడు. నిమ్మరసం అమ్మి అంత డబ్బూ సంపాదించాడు. చిన్న పిల్లవాడు... పెద్ద బిజినెస్‌మ్యాన్‌లా లెమన్ అమ్మడం చూసి ముచ్చట పడినవారితో, వాడి కథ విని హృదయం ద్రవించిన కస్టమర్లతో ఆ రోడ్డంతా కిక్కిరిపోయింది. ఇంకెవరైనా అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టేవారే కానీ, రేయాన్ని చూశాక.. ‘అమ్ముకో’ అని స్పెషల్ పర్మిషన్ కూడా ఇచ్చారు! మహానుభావుడు కర్నాటకలో లీటరు పెట్రోలు 76.28 రూ. లీటరు డీజిల్ 63.16 రూ. పెట్రోలు కన్నా డీజిలు 13.12 రూ. తక్కువ. (నిన్నమొన్న తగ్గిన రేట్లకు ముందు ధరలు). అయితే ఇదే డీజిలు మంగుళూరు ఎమ్మెల్యే మొహియుద్దీన్ బవా చేత లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది! ఈ మధ్య ఆయన కోటీ 65 లక్షల రూపాయలు పెట్టి వాల్వో ఎక్స్‌సి90 టి8 హైబ్రిడ్ ఎక్సెలెన్స్ లగ్జరీ కారు కొన్నారు. అది పెట్రోల్ కారు. తన కొడుకు పేరిట కొన్నారు. ఆ పుత్రరత్నం కారును తీసుకెళ్లి, పెట్రోల్ కొట్టమని చెప్పి ఎవరితోనో హస్క్ కొడుతూంటే... పెట్రోల్ బంక్ కుర్రాళ్లు దీనికి డీజిల్ కొట్టేశారు. బండి స్ట్రక్ అయిపోయింది. దాన్ని వేరే ఇంకో వెహికల్లో రిపేర్ కోసం బెంగుళూరు తరలించారు. ఇంత జరిగినా ఎమ్మెల్యే గారికి కొడుకు మీద కానీ, పెట్రోల్ బంకు కుర్రాళ్ల మీద గానీ కోపం రాలేదు! పొరపాట్లు మనుషులు చేయకపోతే, మిషన్లు చేస్తాయా అని నవ్వుతూ అంటున్నారు! నాట్ ఓకే క్రియేటివిటీ కొన్నిసార్లు వికటిస్తుంది. నార్త్ కరోలినాలోని ఒక ఆభరణాల కంపెనీ తన ప్రచార హోర్డింగ్‌లో ఇలాగే మితిమీరిన క్రియేటివిటీని ప్రదర్శించి, అప్రతిష్ట తెచ్చుకుంది. ‘సమ్‌టైమ్స్ ఇట్ ఈజ్ ఓకే టు త్రో రాక్స్ ఎట్ గర్ల్స్’ అని ప్రధాన కూడలిలో ఆ కంపెనీ పెట్టించిన హోర్డింగ్... ఇప్పుడు ఆ కంపెనీ మీదే రాళ్లు పడేలా చేస్తోంది. పాపం ఆ కంపెనీ ఉద్దేశం మంచిదే. అమ్మాయిలకు... అమూల్యమైన రాళ్లు, రత్నాలను కానుకగా ఇవ్వండి అని చెప్పడం. కానీ చెప్పిన విధానమే బాగోలేదు. ‘కొన్నిసార్లు అమ్మాయిల మీద రాళ్లు విసరడం కూడా మంచిదే’ అని సృజనాత్మకంగా రాయించింది! ‘ఉద్దేశాలను పిల్లలు అర్థం చేసుకోలేరు కదా, ఆ మాటల్ని ఉన్నవి ఉన్నట్లే తీసుకుంటే ఎంత ప్రమాదం’ అని ఆ బోర్డును చూసినవాళ్లు చికాకు పడుతున్నారు. తిక్క మనిషా?! బాబ్ డిలాన్ తనకు వచ్చిన నోబెల్ బహుమతిని స్వీకరించడానికి నేటికీ స్వీడన్ వెళ్లలేదు! ఆయన గనుక ఈ జూన్ 10 లోపు స్వీడన్‌లోని స్టాక్హోమ్కి వెళ్లి చిన్న స్పీచ్ అయినా ఇవ్వకపోతే నోబెల్ బహుమతి ద్వారా ఆయనకు వచ్చే 9 లక్షల 10 వేల డాలర్ల నగదు రాకుండాపోతుంది! పెద్ద స్పీచ్ అక్కర్లేదు. ఓ చిన్న పాట కచేరి, ఓ వీడియో, కనీసం ఓ పాట... ఏదైనా సరే, నోబెల్ సందర్భాన్ని గుర్తుచేస్తూ ప్రదర్శిస్తే చాలు ఈ నగదు బహుమతికి ఆయన యోగ్యుడైనట్లే. ఇది సంప్రదాయం కూడా. ఏటా విజేతను అక్టోబర్‌లో ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్10న విజేతకు బహుమతిని ప్రదానం చేస్తారు. ఏ విజేతైనా స్టాక్‌హోమ్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంటే... డిసెంబర్ పది నుంచి ఆరు నెలల లోపు వెళ్లి తీసుకోవాలి. కానీ నేటికీ బాబ్ డిలాన్ స్పందించలేదు! నిజానికి అవార్డు విషయంలో మొదటి నుంచి ఆయన పెద్ద ఉత్సాహంతో లేరు! నోబెల్ కమిటీవాళ్లు అవార్డును ప్రకటించిన చాలా కాలం తర్వాత ఎప్పుడో డిలాన్ థ్యాంక్ గివింగ్ నోట్ మాత్రం పంపారు. అంతే తప్ప నోరు తెరిచి ధన్యవాదాలు తెలియజేయలేదు! ఏప్రిల్ 9న స్వీడన్‌లోని లుండ్‌లో డిలాన్ కచేరీ ఉంది. బహుశా అప్పుడేమైనా పెద్ద మనసుతో నోబెల్‌ను స్వీకరిస్తాడేమో చూడాలి. అయితే ఆ కచేరీ... నోబెల్ అవార్డుల ప్రకటనకు చాలా ముందే ఖరారైనది కావడంతో ఒక వేళ డిలాన్... లుండ్కి వచ్చినా, బహుమతి తీసుకోకుండా అటునుంచి అటే వెనక్కు వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. ఏంటో ఈ తిక్క మనిషి! తొమ్మిది లక్షల పది వేల డాలర్లంటే మాటలా?! ఐదు కోట్ల 90 లక్షల రూపాయాలకు పైమాటే! వేడి భోజనం... వెచ్చటి కబుర్లు! ఈయన పేరు జార్జి లాఫ్టస్. వయసు 100. ఇక ఈయన భార్య ఫిలిస్. ఈమె వయసు 94. ఫిలిస్కు జార్జితో 17 ఏళ్ల వయసులో 1940 ఆగస్టు 10న పెళ్లయింది. ఈ ఏడాది వీళ్లు తమ 77వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. బ్రిటన్‌లో ప్రస్తుతం జీవించి ఉన్న జంటల్లో ఇంత దీర్ఘకాలం ఆరోగ్యంగా, అనందంగా ఉన్న జంట వీళ్లే కావచ్చు. ఎంత దీర్ఘకాలం అంటే.?. పదహారు మంది ప్రధానమంత్రుల ప్రమాణ స్వీకారాలను వీళ్లు చూశారు. రెండేళ్ల క్రితం వీళ్ల 75వ పెళ్లి రోజుకు బ్రిటిష్ మహారాణి రెండవ ఎలిజబెత్ అభినందన లేఖ కూడా పంపారు. ఇంతకీ ఏమిటి వీళ్ల దాంపత్య విజయ రహస్యం? సింపుల్. వేడి వేడిగా భోజనం చేస్తారట. వెచ్చటి కబుర్లు చెప్పుకుంటారట!రుచికరమైన తిండి, శుచికరమైన సంభాషణ ఉంటే భార్యాభర్తల లైఫ్ హ్యాపీగా ఎన్నేళ్లయినా సాగిపోతూనే ఉంటుందట! -
ఇక రోమియోలకు చెక్
పోలీసుల ఆధ్వర్యంలో ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు శివమొగ్గ ఎస్పీ నూతన ప్రయోగం శివమొగ్గ:అమాయిలు, మహిళలు, బాలికల వెంటపడి వేధించే రోమియోలకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. ఇందు కోసం నగరంలో ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేసింది. బాధితులు సమస్యను వివరిస్తూ బాక్స్‌లో వేస్తే వెంటనే కార్యాచరణ మొదలు పెట్టి రోమియోల ఆటకట్టిస్తామంటూ పోలీస్ శాఖ భరోసానిస్తోంది. ఈ మేరకు వివరాలను ఆదివారం మీడియా సమావేశంలో శివమొగ్గ జిల్లా ఎస్పీ రవి.డి.చెణ్ణన్నవర్ వెల్లడించారు. ఫిర్యాదు దారులు ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్, మెయిన్ బస్టాండ్, సహ్యాద్రి కాలేజీ, మహాత్మాగాంధీ పార్క్, సవళంగరోడ్డు, ఉషా నర్సింగ్ హోం సర్కిల్, దేవరాజు అరసు రోడ్డు, కస్తూరిబా హాస్టల్ రోడ్డు, కువెంపు రంగ మందిరం, ఏటీఎన్సీసీ కాలేజీ, ృష్ణ కెఫే బస్టాఫ్, అణ్ణానగర్, గోపాల బస్టాండు, వినోభ నగర పోలీసు చౌకీ, సోమినకొప్ప లే ఔట్,ృఫథ్వీ బిల్డింగ్, సాగర్ రోడ్డులోని పెసట్ కాలేజీ, గోపాల మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, బీహెచ్ రోడ్డులోని మీనాక్షి భవన్, కస్తూరిబా కాలేజీ ఎదురుగా, రాగి గుడ్డ సర్కిల్, మిళఘట్ట బస్టాఫ్, గాంధీ బజార్, మండ్లి సర్కిల్ ప్రాంతాల్లో ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే భద్రావతిలోని బసవేశ్వర సర్కిల్, సీగేబాగి బస్టాండు, ఎన్ఎంసీ రోడ్డు, తమిళ కాలేజీ ఎదురుగా, మామినకెరె గ్రామ బస్టాండు, హొసనగరలోని బస్టాండు, బట్టిమల్లప్ప సర్కిల్, పోలీస్ స్టేషన్, నిట్టూరు బస్టాఫ్, రిప్పన్‌పేట, వినాయక సర్కిల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ. తీర్థహళ్లిలోని ఆగుంబే పోలీస్ స్టేషన్, మేగరహళ్లి గర్ల్స్ కాలేజీ, ఆగుంబె బస్టాండ్ ప్రాంతాల్లో బాక్స్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
సమకాలీన అంశాలతో అందమైన ప్రేమకథ
ఇటీవలే ‘రోమియా’గా పలకరించిన సాయిరామ్ శంకర్ మరో కొత్త షూటింగ్లో బిజీగా ఉన్నారు. విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తయారవుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని సాయిరామ్ శంకర్ సరసన రేష్మీ మీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ సూపర్‌స్టార్ శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ నెల 21 నుంచి ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘‘అందమైన ప్రేమకథకు సమకాలీన అంశాలను జోడించి, సినిమాగా తీస్తున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. యై వంశీధర్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘రెండో షెడ్యూల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ఓ ప్రముఖ హీరోయిన్‌పై ప్రత్యేక గీతాన్ని కూడా తీయనున్నాం’’ అని చెప్పారు. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, మహత్ నారాయణ్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘‘కథ, కథనం, నా వేషభాషలు, పాత్రచిత్రణ-ఇలా ప్రతి అంశంలో వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ తీస్తున్న సినిమా ఇది’’ అని సాయిరామ్ శంకర్ నమ్మకంగా చెబుతున్నారు. -
‘రోమియో’మూవీ సక్సెస్‌మీట్
-
సినిమా రివ్యూ: రోమియో
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ రాసిన ప్రేమ కథ అంటూ భారీ బిల్డప్ కారణంతో చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులు భారీగానే 'రోమియో' ఆశలు అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సినీ ప్రేమికులకు రోమియో చాలా కాలంగానే దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు అక్టోబర్ 10(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోమియో ఎలాంటి ఫలితాన్ని చవిచూశాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ: న్యూయార్క్ లో ఉండే సమంత(అడోనిక)కు ఒంటరిగా ట్రావెలింగ్ చేయడమంటే అంటే చాలా ఇష్టం. ఇంట్లోవాళ్లను ఒప్పించి యూరప్ పర్యటనకు వెళ్తుంది. యూరప్ పర్యటనలో భాగంగా ఇటలీలోని రోమ్ చేరుకుంటుంది. రోమ్ నగరంలో సమంతను కిట్టు (సాయిరాం శంకర్) చూసి వెంటాడటం ప్రారంభిస్తాడు. ప్లాన్ ప్రకారం సమంతకు దగ్గరై పాస్ పోర్ట్ ను తన దగ్గరే పెట్టుకుని ఏడిపిస్తుంటాడు. కావాలనే తన పాస్ పోర్ట్ తన వద్ద పెట్టుకుని ఏడిపిస్తున్నాడని తెలుసుకున్న సమంత.. కిట్టూని నిలదీస్తుంది. దాంతో కిట్టు తన ఫ్యాష్ బ్యాక్ ను చెపుతాడు. అయితే కిట్టు ఫ్లాష్ బ్యాక్ కు, సమంతకు లింకేమిటి? ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషించిన రవితేజ, ఆలీ, జయసుధ, నాగబాబులకు పాత్రల ఎంటీ? కిట్టు, సమంతల కథ చివరకు ఏమైందనేదే 'రోమియో' సినిమా. ఆకట్టుకునే అంశాలు: యూరప్, ముఖ్యంగా రోమ్ నగర అందాలు పీజీ విందా ఫోటోగ్రఫి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిరాశ పరిచే అంశాలు: కనీస స్థాయిలో కూడా దర్శకుడి ప్రతిభ ఆకట్టుకోకపోవడం తలా తోకాలేని కథ పట్టులేని కథనం నటీనటుల పనితీరు విశ్లేషణ: కిట్టూగా పూరి సోదరుడు సాయిరాం శంకర్, సమంతగా అడోనికలు నటించారు. కథలో దమ్ము లేకపోవడంతో, కథనం సాదాసీదాగా ఉండటం, తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎలాంటి ట్విస్టులు లేకపోవడం ప్రేక్షకుడ్ని ఓ స్థాయిలోనూ ఆకట్టుకోని విధంగా ఉంది. హీరో కారెక్టర్ ఎంటో, యూరప్ ఎందుకెళ్లాడో అనే చిన్న లాజిక్ ను కూడాదర్శకుడు పట్టించుకోలేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసే అంశాల్లో ఒకటి. కనీసం వైజాగ్ లో పద్దుతో హీరో ప్రేమ కథను ఫ్లాష్ బ్యాక్ లో చూపించగలిగి ఉండే కొంత సమంజసంగా ఉండేదేమో. ఇక మధ్య మధ్యలో రవితేజ, ఆలీ కనిపించడం కొంత ఊరటతోపాటు, కొంత హాస్యాన్ని పండించినా..సినిమాకు బలంగా మారుతుందని చెప్పడం కష్టమే. ఓ సినిమా కన్నా ట్రావెల్ గైడ్ గానే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకే దర్శకుడు దృష్టి సారించారా అనిపిస్తుంది. సినిమా కంటే యూరప్ అందాలే ప్రేక్షకుడికి కొంత ఊరటనిచ్చాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాలంటే పీజి విందా ఫోటోగ్రఫి మాత్రమే. ఇక సునీల్ కాశ్యప్ సంగీతం కూడా అంతంతమాత్రేమే. పాటలు కూడా ఆలరించలేకపోయాయి. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారలేకపోయింది. పూరి రాసిన ప్రేమకథ ఇంత నాసిరకంగా ఉంటుందా? లేదా ఆయన చెప్పిన కథను తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యారా అనే ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడటం చాలా కామన్ పాయింట్ గా మిగిలింది. పూరి మదిలో మెదిలిన 'రోమియో' ప్రేక్షకులను ఆకట్టుకోవడమనేదా అనే మిలియన్ డాలర్ ప్రశ్నే అని చెప్పవచ్చు. -రాజబాబు అనుముల -
రవితేజ నటించడంతో రోమియో స్థాయి పెరిగింది
‘‘అన్నయ్య పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోల పాత్రలు ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాయో, ఇందులో నా పాత్ర కూడా అంత ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అన్నయ్య ఎంతో ప్రేమించి రాసుకున్న కథ ఇది’’ అన్నారు సాయిరామ్‌శంకర్. ఆయన కథానాయకునిగా గోపీగణేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోమియో’. ‘పూరీ రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ‘టచ్‌స్టోన్’ దొరైస్వామి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో సాయిరామ్‌శంకర్ ముచ్చటిస్తూ -‘‘రోమియో-జూలియట్ కథ జరిగిన ప్రాతం యూరప్ లోని వెరోనా. ప్రేమికులకు అదొక పుణ్యక్షేత్రం. చాలామంది అక్కడకొచ్చి తమ ప్రేమ సఫలం కావాలని మొక్కుకుంటుంటారు. ఆ ప్రాంతానికెళ్లి స్ఫూర్తి పొంది అన్నయ్య రాసిన కథ ఇది. ‘బంపర్ ఆఫర్’ తర్వాత మళ్లీ అన్నయ్య కథలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఆద్యంతం కొత్తగా సాగే ఈ సినిమాలో నా పాత్ర స్టయిలిష్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఇందులో కథానాయికగా నటించిన అడోనికా పక్కా తెలుగమ్మాయి. హైదరాబాద్‌లోనే రేడియో జాకీగా పనిచేసింది. చూడటానికి విదేశాల్లో పెరిగిన అమ్మాయిలా అనిపిస్తుంది. అందుకే... తనను కథానాయికగా ఎంపిక చేశారు. అనుకున్న దానికంటే చక్కగా నటించింది. తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుంది’’ అని సాయి చెప్పారు. రవితేజ గురించి చెబుతూ -‘‘కథ మలుపు తిప్పే పాత్రను రవితేజ పోషించారు. అంతటి స్టార్డమ్ ఉన్న ఏ హీరో ఇలాంటి పాత్ర చేయడానికి అంగీకరించడు. కానీ నాపై అభిమానం కావచ్చు, అన్నయ్య ప్రేరణ కావచ్చు, ఏదైతేనేం రవితేజ నటించారు. రెండుమూడు సీన్లలో కనిపించి, సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లిపోతారాయన. ఈ సినిమాలో ఆయన పాత్రే హైలైట్’’ అన్నారు సాయిరామ్ శంకర్. ఈ సినిమా తర్వాత తప్పకుండా దర్శకుడు గోపీగణేశ్ అగ్ర దర్శకుల జాబితాలో నిలబడతాడనీ, తక్కువ సమయంలో, అనుకున్న బడ్జెట్లో ఈ చిత్రాన్ని ఆయన మలిచాడనీ సాయిరామ్‌శంకర్ పేర్కొన్నారు. దర్శకత్వ శాఖలో పనిచేసినా... ప్రస్తుతం నటనపైనే దృష్టిని కేంద్రీకరించాననీ, భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాననీ ఆయన తెలిపారు. తమిళ నటుడు శరత్‌కుమార్‌తో కలిసి ‘జగదాంబ’ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నట్లు సాయిరామ్‌శంకర్ తెలిపారు. -
రోమియోతో చిట్ చాట్
-
‘రోమియో’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
కొత్త దర్శకులతో సినిమాలు తీస్తా... పూరి జగన్నాథ్
శిష్యుడి కోసం... తను రాసుకున్న ‘రోమియో’ కథ ఇచ్చిన పూరి జగన్నాథ్, మరోవైపు వక్కంతం వంశీ కథతో ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన సోదరుడు సాయిరామ్‌శంకర్ హీరోగా రూపొందిన ‘రోమియో’ చిత్రం గురించి పూరి మీడియాతో ముచ్చటించారు.నాలుగేళ్ల క్రితమే: వెనీస్‌లో రోమియో, జూలియట్ నివసించిన ప్రాంతాన్ని చూసి ప్రేరణ పొంది నాలుగేళ్ల క్రితమే ఈ కథ రాశాను. నిజమైన ప్రేమకథకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న కథ ఇది. ఎమోషన్స్‌తో పాటు వినోదం కూడా మెండుగా ఉంటుంది. అన్నయ్యగా రవితేజ చేశాడు: సాయి కోసమే ఈ కథ రాశాను. సినిమా చేయడానికి నేనేమో బిజీ. అప్పుడే గోపీ దర్శకుడు కావాలని ప్రయత్నిస్తుండడంతో అతనికి ఈ కథ ఇచ్చాను. నా తొలి సినిమా కంటే.. వందరెట్లు గొప్పగా తీశాడు తను. ఇందులో కథకు కీలకమైన సాయి అన్నయ్య పాత్రను రవితేజ పోషించాడు. కాసేపే కనిపించినా కావల్సినంత వినోదాన్ని పంచాడు. ఆయన చెప్పింది అక్షర సత్యం: 16మంది టీమ్‌తో రోమ్, స్విట్జర్లాండ్, వైజాగ్ల్లో అనుకున్న టైమ్‌కి ఈ సినిమాను పూర్తి చేశారు. ఇలా తక్కువ టైమ్‌లో చిన్న సినిమాలు తీయడమంటే నాకిష్టం. మొదట్లో అలాగే తీసేవాణ్ణి. ఓ సారి దాసరిగారన్నారు. ‘ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు... చిన్న సినిమాలు కూడా తీయ్. పెద్ద హీరోలు నీకు అవకాశం ఇవ్వని సందర్భం ఏదో ఒకరోజు రావచ్చు. అప్పుడు చిన్న సినిమాలు నీకు కొత్త కాకూడదు. వంద చిన్న సినిమాల వల్ల పరిశ్రమ బాగుపడుతుంది కానీ... పది పెద్ద సినిమాల వల్ల కాదు’ అని. ఆయన చెప్పింది అక్షర సత్యం. అందుకే నేను తీయడంతో పాటు, కొత్త రచయితలను, దర్శకులను పరిచయం చేస్తూ ప్రొడక్షన్ మొదలుపెట్టబోతున్నాను. ముందు స్టోరీలైన్‌తో వస్తే దాన్ని బట్టి ఛాన్స్ ఇస్తాను. వచ్చే ఏడాది ఈ ప్రక్రియ మొదలౌతుంది. వక్కంతం వంశీ కథతో చేస్తోంది అందుకే: ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే.. ముందు ఎన్టీఆర్‌కు ఓ కథ చెప్పాను. ఎన్టీఆరేమో వక్కంతం వంశీ రాసిన పోలీస్ స్టోరీ లైన్ వినిపించాడు. నా కథకంటే అదే బావుంది. డెవలప్ చేసి షూటింగ్ మొదలుపెట్టాం. రాత్రింబవళ్లూ షూటింగ్ చేస్తున్నాం. జనవరి 9న సినిమా విడుదల చేస్తాం. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. మహేశ్‌కి ఓ కథ రెడీ చేశాను. రానాతో కూడా ఓ సినిమా ఉంటుంది. -
'రోమియో' పోస్టర్ లాంఛ్
-
రోమియో మూవీ స్టిల్స్, పోస్టర్స్
-
రోమియో మూవీ ఆడియో లాంచ్
-
మరోసారి జయం రవితో
జయం రవి, హన్సికల కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇంతకుముందు ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేసిన హన్సిక ఈసారి ఏకంగా ఆయన్ని రోమియో చేసి తను జూలియట్‌గా మారనుంది. వీరిద్దరు తాజాగా నటించనున్నట్లు చిత్రానికి రోమియో జూలియట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నవ దర్శకుడు లక్ష్మణ్ మెగా ఫోన్ పడుతున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో, హీరోయిన్లపై ఫొటో షూట్ చేశారు. నటి హన్సిక మాట్లాడుతూ ఈ ఏడాది తన కాల్షీట్స్ డైరీ ఫుల్ అయిపోయిందన్నారు. అయినా రోమియో జూలియట్ కోసం కాల్షీట్స్ అడ్జెస్ట్ చేసి కేటాయించానని చెప్పారు. కారణం చిత్ర స్క్రిప్ట్ అన్నారు. ఇది సీరియస్‌గానో, ఎమోషనల్ గానో ఉండే చిత్రం కాదన్నారు. అదే విధంగా ఒరిజినల్ రోమియో జూలియట్‌గా ఈ చిత్రానికి సంబంధం ఉండదని వివరించారు. ఇది మోడ్రన్ రోమియో జూలియట్ల కథ అని తెలిపారు. లవ్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం సాధారణ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుందని అన్నారు. వచ్చే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్టు హన్సిక వెల్లడించారు. ఇంతకుముందు జయంరవితో జత కట్టిన ఎంగేయుమ్ కాదల్ ఆశించిన విజయం సాధించలేదు. ఈ సారన్నా జయం రవి, హన్సికలు హిట్ పెయిర్‌గా నిలుస్తారో లేదో చూడాల్సిందే. ఈ చిత్రాన్ని మద్రాసు ఎంటర్ ప్రైజస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్నారు. సంగీత బాణీలు ఇమాన్ అందిస్తున్నారు. -
పోకిరి డ్రైవర్‌ను ఉతికి ఆరేసిన విద్యార్ధులు