మరోసారి జయం రవితో
మరోసారి జయం రవితో
Published Mon, Mar 31 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
జయం రవి, హన్సికల కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇంతకుముందు ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేసిన హన్సిక ఈసారి ఏకంగా ఆయన్ని రోమియో చేసి తను జూలియట్‌గా మారనుంది. వీరిద్దరు తాజాగా నటించనున్నట్లు చిత్రానికి రోమియో జూలియట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నవ దర్శకుడు లక్ష్మణ్ మెగా ఫోన్ పడుతున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో, హీరోయిన్లపై ఫొటో షూట్ చేశారు. నటి హన్సిక మాట్లాడుతూ ఈ ఏడాది తన కాల్‌షీట్స్ డైరీ ఫుల్ అయిపోయిందన్నారు. అయినా రోమియో జూలియట్ కోసం కాల్‌షీట్స్ అడ్జెస్ట్ చేసి కేటాయించానని చెప్పారు. కారణం చిత్ర స్క్రిప్ట్ అన్నారు.
ఇది సీరియస్‌గానో, ఎమోషనల్ గానో ఉండే చిత్రం కాదన్నారు. అదే విధంగా ఒరిజినల్ రోమియో జూలియట్‌గా ఈ చిత్రానికి సంబంధం ఉండదని వివరించారు. ఇది మోడ్రన్ రోమియో జూలియట్‌ల కథ అని తెలిపారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం సాధారణ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుందని అన్నారు. వచ్చే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్టు హన్సిక వెల్లడించారు. ఇంతకుముందు జయంరవితో జత కట్టిన ఎంగేయుమ్ కాదల్ ఆశించిన విజయం సాధించలేదు. ఈ సారన్నా జయం రవి, హన్సికలు హిట్ పెయిర్‌గా నిలుస్తారో లేదో చూడాల్సిందే. ఈ చిత్రాన్ని మద్రాసు ఎంటర్ ప్రైజస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్నారు. సంగీత బాణీలు ఇమాన్ అందిస్తున్నారు.
Advertisement
Advertisement