అభిమానుల మనసు గెలుచుకోవడమే ప్రధానం | hansika about her movie | Sakshi
Sakshi News home page

అభిమానుల మనసు గెలుచుకోవడమే ప్రధానం

Published Fri, Dec 16 2016 2:19 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

అభిమానుల మనసు గెలుచుకోవడమే ప్రధానం - Sakshi

అభిమానుల మనసు గెలుచుకోవడమే ప్రధానం

అభిమానుల మనసు గెలుచుకోవడం డబ్బును మించిన సంతోషాన్నిస్తోందంటున్నారు నటి హన్సిక. బాలీవుడ్‌లో బాలతారగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అనంతరం కోలీవుడ్‌లో క్రేజీ నాయకిగా ఎదిగారు. ఆదిలోనే విజయ్, ధనుష్, సూర్య, ఆర్య, జయంరవి వంటి స్టార్‌ హీరోలతో నటించి  ముఖ్యంగా దర్శకుల నటిగా పేరు తెచుకున్నారు.అంతే కాదు చిన్న కుషూ్బగా గుర్తింపు పొందిన హన్సికకు ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలే ఉన్నాయి. అందులో ఒకటి జయంరవితో రొమన్స్ చేసిన బోగస్. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. మరో చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇకపోతే చాలా గ్యాప్‌ తెలుగులో ఒక చిత్రం చేస్తున్నారు. పాపులారిటీలోనూ, అధిక అభిమానులున్న నటిగానూ హన్సికనే టాప్‌ అట.

ఈ తరం హీరోయిన్లు  ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లను అధికంగా వాడుతున్నారు. ఆ మాధ్యమాల ద్వారా అభిమానులతో తమ భావాలను పంచుకోవడం, కొత్త చిత్రాల వివరాలను, ఫొటోలను పోస్ట్‌ చేయడం చేస్తున్నారు. అలా అధికంగా అభిమానుల ఫాలోయింగ్‌ ఉన్న నటిగా హన్సిక రికార్డు సృష్టించారు. ఈ అమ్మడికి 60 లక్షల మంది  ఫేస్‌బుక్‌ అభిమానులున్నారు. దీనిపై హన్సిక మాట్లాడుతూ డబ్బు సంపాదించడం ముఖ్యం కాదని, అభిమానుల మనసులను గెలుచుకోవడం ప్రధానం అని పేర్కొన్నారు. తనకు 60 లక్షల మంది ఫేస్‌బుక్‌ అభిమానులుండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement