9న తెరపైకి భోగన్ | bhogan movie ready to release on 9th | Sakshi
Sakshi News home page

9న తెరపైకి భోగన్

Published Fri, Jan 20 2017 4:03 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

9న తెరపైకి భోగన్

9న తెరపైకి భోగన్

ఎట్టకేలకు భోగన్  చిత్ర విడుదల తేదీ ఖరారైంది. జయంరవి, హన్సిక జంటగా నటించిన మూడవ చిత్రం భోగన్ . ఇదే జంటతో ఇంతకు ముందు రొమియో జూలియట్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అదే విధంగా తనీఒరవన్  జయంరవి, అరవిందస్వామి కలిసి నటిస్తున్న చిత్రం భోగన్ . నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా నిర్మాతగా మారి తన ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్న రెండవ చిత్రం బోగన్ . డి.ఇమాన్  సంగీతాన్ని, సౌందర్‌రాజన్  ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా రోజులైంది.

గత డిసెంబర్‌లోనే చిత్రం విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.ఆ తరువాత జనవరి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.అదే తేదీన సూర్య నటించిన సీ–3(ఎస్‌–3 పేరు మారింది) చిత్రం తెరపైకి రానుండడంతో భోగన్  చిత్రాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించారు. ఇటీవల సరైన విజయాలు లేక వెనకపడిపోయిన నటి హన్సిక ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.ఇది మంచి విజయం సాధిస్తేనే తనకు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమ్మడికి ఇక్కడ చేతిలో ఒక్క చిత్రం లేదన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement