జీవీతో ఆ ఇద్దరు.. | samantha and hansika with gv prakash kumar! | Sakshi
Sakshi News home page

జీవీతో ఆ ఇద్దరు..

Published Sun, Feb 5 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

జీవీతో ఆ ఇద్దరు..

జీవీతో ఆ ఇద్దరు..

కోలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ యువ కథానాయకుల్లో జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ముందున్నారని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇటు సంగీతదర్శకుడిగా అటు కథానాయకుడిగా రెండు పడవలపై సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్న జీవీకి వద్దంటే అవకాశాలు అన్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఈయన నటించిన బ్రూస్‌లీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం జీవీ 4జీ, అడంగాదే, ఐన్ గరన్  చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు రాజీవ్‌మీనన్  దర్శక్వంలో ఏఆర్‌.రెహ్మాన్  సంగీతం అందించనున్న చిత్రంలోనూ నటించనున్నారు. తాజాగా మరో అవకాశం జీవీ.ప్రకాశ్‌కుమార్‌ తలుపుతట్టిందన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. తెలుగులో మంచి విజయం సాధించిన ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్ర తమిళ రీమేక్‌లో కథానాయకుడి అవకాశం జీవీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.

ఇందులో ఆయనతో అందాల భామలు సమంత, హన్సిక రొమాన్స్  చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ చిత్రాన్ని ఎస్కేప్‌ ఆర్టిస్ట్‌ మోషన్  పిక్చర్స్‌ అధినేత పి.మదన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్‌. అయితే ఇందులో నటించడానికి జీవీ.ఇంకా ఒప్పుకున్నట్లు లేదట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కాస్త టైమ్‌ పడుతుంది. ఇప్పటికే నటి సమంత కోలీవుడ్‌లో మూడు చిత్రాల్లో నటించడానికి అంగీకరించారు. అందులో ఇళయదళపతి విజయ్‌తో నటించే చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఇకపోతే తెలుగులో తనకు కాబోయే మామ నాగార్జునకు జంటగా కొత్త చిత్రంలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా కోలీవుడ్‌లో ప్రస్తుతం ఒక్క చిత్రం లేని నటి హన్సికకు జయం రవికి జంటగా నటించిన భోగన్  విజయం కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు మాలీవుడ్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement