Bhogan
-
చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..
కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మరీ ఈ పర్వదినం రోజున చిన్ని కృష్ణయ్యకు సమర్పించే నైవేద్యాలు ఏంటీ..? ఎలాంటి పదార్థాలు నివేదిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దాం..!.ఈ పర్వదినం పురస్కరించుకుని వీధుల్లో జరిగే ఉట్టికొట్టే వేడుకు కోసం వేలాదిగా ప్రజలు గుమిగూడతారు. చిన్న పెద్దా అనే తారతమ్యం లేకుండా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. మరీ ఈ వేళ చిన్ని కన్నయ్యకి సమర్పించే సంప్రదాయ వంటకాలేంటంటే..చప్పన్ భోగ్ విందు ఏర్పాటు చేస్తారు. ఇది ప్రజలంతా భక్తితో సమర్పించే గొప్ప విందు. ఈ చప్పన భోగ్ విందు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..చప్పన్ భోగ్ వెనుక స్టోరీ..ఉత్తర ప్రదేశ్‌లో మధుర శ్రీ కృష్ణుడు నడయాడిన ప్రదేశం ఉందని తెలుస. అక్కడ బృందావనంలో కృష్ణుడి పెరిగినట్లుగా మనం పురాణల్లో విన్నాం. అక్కడ బృందావన్‌లో ప్రజలు అంతా ముద్దుల కృష్ణయ్య, కన్నయ్య అనే పిలుచుకునేవారు. యశోదమ్మ కృష్ణుడికి చేసిన గారాభం కారణంగా అందరిని ఆటపట్టిస్తూ తుంటరిగా ఉండేవాడు. అంతా.. అమ్మ యశోదమ్మ నీ కృష్ణుని అల్లరి భరించలేకపోతున్నాం అని ఫిర్యాదులు చేస్తే తిరిగి వాళ్లదే తప్పు అన్నట్లు మందలించే యశోదమ్మ కృష్ణ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే ఒకరోజు బృందావనంలోని ప్రజలంతా ఇంద్రుడిని ఆరాధించే నిమత్తం చప్పన్ భోగ్ కార్యక్రమానికి సన్నహాం చేస్తున్నారు. దీన్ని చూసిన చిన్ని కృష్ణుడు తన తండ్రి నందుడుని ఏంటీ వేడుక? ఎందుకు చేస్తున్నాం అని అడగగా..వర్షాలు బాగా పడేలా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న పూజ అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా పండ్లు, కూరగాయాలు, జంతువులకు మేత అందించే గోవర్థన గిరిని పూజించాలని అంటారు. అందుకు గ్రామస్తులు అంగీకరించి గోవర్థన గిరికి పూజ చేస్తారు. దీంతో ఇంద్రుడు కోపంతో ఏకథాటిగా ఎనిమిది రోజులు కుండపోత వర్షం కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు బృందావన ప్రజలను గోవర్థన గిరి వద్దకు వచ్చి తలదాచుకోవాల్సిందిగా చెప్పి ఆ పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఉంచి రక్షించాడు. ఆయన వారందర్నీ రక్షించేందుకు ఎనిమిది రోజులగా నిరాహారంగా ఉండిపోతాడు. అన్ని రోజుల తమ కోసం తినకుండా సంరక్షించిన ఆ జగన్నాథుడికి కృతజ్ఞతగా ఈ చప్పన్ భోగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు బృందావన ప్రజలు. అప్పటి నుంచి కృష్ణుడికి ఇష్టమైన ఆహారాలతో భారీ విందు ఏర్పాటు చేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అలాగే యశోదమ్మను కృష్ణుడు ఇష్టంగా ఏం తింటాడని అడిగిమరీ వండి నివేదించడం జరిగిందని పురాణ వచనం. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ చప్పన భోగ్లో మొత్తం 56 రకాల ఆహారాలను సిద్ధం చేస్తారు. ఇందులో వివిధ రుచులతో కూడిన ఆహార పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా చేదు, ఘాటు, పులుపుతో కూడిన వంటకాల నుంచి మొదలై, తీపి వంటకాలతో ముగుస్తుంది. ఇందులో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలు, మీగడ, పెరుగుకి సంబంధించిన వివిధ తీపి వంటకాలు కూడా ఉంటాయి. (చదవండి: కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!) -
జనవరి నుంచి మాస్ మహరాజ్ కొత్త సినిమా
రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద కనిపించిన మాస్ మహరాజ్ రవితేజ సూపర్ హిట్ తో అలరించాడు. రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడిగా నటించిన రవితేజ గ్రాండ్ విక్టరీతో అభిమానులను ఖుషీ చేశాడు. అదే జోరులో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు సెట్స్ మీద ఉండగా మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ మాస్ హీరో. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను లాంటి చిత్రాలు ఘనవిజయం ఆసాధించిన నేపథ్యంలో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు తమిళ సూపర్ హిట్ భోగన్ రీమేక్ కూడా అదే సమయంలో ప్రారంభ కానుందట. ఈ రెండు సినిమాల్లో ఒకేసారి నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రవితేజ. -
నిశ్చితార్థం చెడగొట్టడానికి మందేశా!
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అన్న ప్రకటనలను చూస్తున్నాం. అలానే మందుబాబులం మేము మందు బాబులం లాంటి మద్యం తాగే పలు పాటలను, సన్నివేశాలను పలు చిత్రాల్లో చూస్తున్నాం. సినిమాల ప్రభావం ప్రజల్లో చాలా ఎక్కువే ఉంటుందంటారు. అయితే మద్యం హానికరం అన్న ప్రకటనలను ఎవరూ పట్టించుకోరు. సినిమాల్లో మద్యం తాగడాన్ని మాత్రం చాలా మంది ఫాలో అవుతుంటారు, ఆచరిస్తుంటారు. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఇటీవల నటి హన్సిక ఒక సినిమాలో ఫుల్‌గా మందు కొట్టి అర్ధరాత్రి స్కూటర్ నడుపుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతారు. ఇలా ఎందుకు నటించావమ్మా? ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలను ఇవ్వదా? అన్న ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ ఏమన్నారో చూద్దాం. నేను భోగన్ చిత్రంలో అలాంటి సన్నివేశంలో నటించాను. ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో మద్యం తాగే సన్నివేశాల్లో నటించమని అడిగినా కాదన్నాను. భోగన్ చిత్రంలో అలా ఎందుకు నటించాల్సి వచ్చిందంటే, కథకు చాలా అవసరం అయ్యింది గనుక. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే నాకు మిలటరీ అధికారి అయిన నాన్న నిర్ణయించిన వివాహం చేసుకోవాలంటారు. అలా పెళ్లి నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా చేస్తారు. ఆ నిశ్చితార్థం చెడ గొట్టాలని నేను టాస్మాక్ దుకాణంలోకి వెళ్లి 90 రూపాయలతో చీప్ సరకు కొనుక్కుని స్నేహితురాలి ఇంటికి వెళ్లి తాగి స్కూటర్లో ఇంటికి వెళ్లి నాన్నతో ధైర్యంగా ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పాలనుకుంటాను. అయితే మధ్యలో పోలీసులకు దొరికి పోవడంతో ప్లాన్ చిత్తై పోతుంది. ఈ సన్నివేశంలో నటించడానికి పది రోజులు పట్టింది. దర్శకుడి సూచనల ప్రకారమే నటించినా, మందు కొట్టిన అమ్మాయిగా నటించడానికి అన్ని రోజులు పట్టింది. స్వతహాగా నేను మద్యం తాగడానికి వ్యతిరేకిని. అలా నటించడం కూడా మొదటి సారి అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. -
జీవీతో ఆ ఇద్దరు..
కోలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్ యువ కథానాయకుల్లో జీవీ.ప్రకాశ్‌కుమార్ ముందున్నారని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇటు సంగీతదర్శకుడిగా అటు కథానాయకుడిగా రెండు పడవలపై సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్న జీవీకి వద్దంటే అవకాశాలు అన్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఈయన నటించిన బ్రూస్లీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం జీవీ 4జీ, అడంగాదే, ఐన్ గరన్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు రాజీవ్‌మీనన్ దర్శక్వంలో ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్న చిత్రంలోనూ నటించనున్నారు. తాజాగా మరో అవకాశం జీవీ.ప్రకాశ్‌కుమార్ తలుపుతట్టిందన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. తెలుగులో మంచి విజయం సాధించిన ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్ర తమిళ రీమేక్‌లో కథానాయకుడి అవకాశం జీవీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆయనతో అందాల భామలు సమంత, హన్సిక రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్ అధినేత పి.మదన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. అయితే ఇందులో నటించడానికి జీవీ.ఇంకా ఒప్పుకున్నట్లు లేదట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కాస్త టైమ్ పడుతుంది. ఇప్పటికే నటి సమంత కోలీవుడ్‌లో మూడు చిత్రాల్లో నటించడానికి అంగీకరించారు. అందులో ఇళయదళపతి విజయ్‌తో నటించే చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఇకపోతే తెలుగులో తనకు కాబోయే మామ నాగార్జునకు జంటగా కొత్త చిత్రంలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా కోలీవుడ్‌లో ప్రస్తుతం ఒక్క చిత్రం లేని నటి హన్సికకు జయం రవికి జంటగా నటించిన భోగన్ విజయం కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు మాలీవుడ్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. -
మాలీవుడ్‌కు హన్సిక
ముద్దుగుమ్మ హన్సిక మాలీవుడ్ ఎంట్రీ షూరూ అయ్యింది. ఇప్పటి వరకూ తమిళం, తెలుగు భాషల్లోనే నటించిన ఈ ఉత్తరాది భామకు ఈ రెండు భాషల్లోనూ ఇప్పుడు అవకాశాలు అడుగంటాయి. కోలీవుడ్‌లో నటించిన ఒకే ఒక్క చిత్రం భోగన్ గురువారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో అమ్మడి నటనను చిత్ర నిర్మాత ప్రభుదేవా, కథానాయకుడు జయంరవి తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ చిత్రంతో హన్సికకు ఇక్కడ అవకాశాలు వస్తాయో, రావో గానీ, మలయాళంలో ఒక అవకాశాన్ని దక్కించుకున్నారు. అక్కడ సూపర్‌స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో ఒక కీలక పాత్రతో హన్సిక మాలీవుడ్‌కు పరిచయం కానున్నారన్నది తాజా సమాచారం. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో తెరకెక్కనున్న ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ముఖ్యపాత్ర పోషించనున్నారు. అది ప్రతినాయకుడి పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. ఈయనకు ఇదే తొలి మలయాళం చిత్రం అవుతుంది. మరో పాత్రలో శ్రీకాంత్ నటించనున్న ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా లింగా చిత్రాన్ని నిర్మించారన్నది గమనార్హం. నటుడు మోహన్ లాల్ ప్రస్తుతం 1971 బియాండ్ బోర్డర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ చిత్రంలో నటిస్తారని సమాచారం. మొత్తం మీద నటి హన్సిక మాలీవుడ్లోకి రంగప్రవేశం చేయనున్నారన్నమాట. -
9న తెరపైకి భోగన్
ఎట్టకేలకు భోగన్ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. జయంరవి, హన్సిక జంటగా నటించిన మూడవ చిత్రం భోగన్ . ఇదే జంటతో ఇంతకు ముందు రొమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్ ఈ చిత్రానికి దర్శకుడు. అదే విధంగా తనీఒరవన్ జయంరవి, అరవిందస్వామి కలిసి నటిస్తున్న చిత్రం భోగన్ . నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా నిర్మాతగా మారి తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న రెండవ చిత్రం బోగన్ . డి.ఇమాన్ సంగీతాన్ని, సౌందర్‌రాజన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా రోజులైంది. గత డిసెంబర్లోనే చిత్రం విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.ఆ తరువాత జనవరి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.అదే తేదీన సూర్య నటించిన సీ–3(ఎస్–3 పేరు మారింది) చిత్రం తెరపైకి రానుండడంతో భోగన్ చిత్రాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించారు. ఇటీవల సరైన విజయాలు లేక వెనకపడిపోయిన నటి హన్సిక ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.ఇది మంచి విజయం సాధిస్తేనే తనకు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమ్మడికి ఇక్కడ చేతిలో ఒక్క చిత్రం లేదన్నది గమనార్హం. -
హన్సికకు లక్కీచాన్స్!
కేరీర్లో ఎత్తుపల్లాలు ఎవరికైనా సహజం. విజయాలే సోపానాలుగా కొనసాగిన వారు ఎవరూ ఉండరు. అయితే అపజయాలను అధిగమించి ముందుకు సాగడమే ప్రధానం. ఇక నటి హన్సిక విషయానికి వస్తే ఆరంభంలోనే విజయ్, సూర్య, జయంరవి, ధనుష్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకున్నారు. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. దర్శకుల నటిగా పేరు సంపాదించుకున్నారు. అయినా ఎందుకనో ఈ మధ్య అవకాశాలు కాస్త వెనుక బడ్డాయి. ప్రస్తుతం జయంరవికి జంటగా నటించిన భోగన్ చిత్రం ఒక్కటే ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉంది. అలాగని హన్సిక కాళీగా ఏమీ కూర్చోవడం లేదు. తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.కోలీవుడ్‌లో అవకాశాలు కొరవడడంతో ఇక హన్సిక పని అయ్యి పోయింది. ఇక్కడ ఇక మూటా ముల్లు సర్దుకోవలసిందే అని చెవులు కొరుక్కునే వారు కొందరు బయలు దేరారు. అలాంటి వారి నోరు మూయించే విధంగా హన్సిక మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. భోగన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాజాగా యువ నటుడు విష్ణువిశాల్‌తో నటించడానికి హన్సిక రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీని మరో అవకాశం వరించింది. విక్రమ్‌ప్రభుకు జంటగా నటించే అవకాశం తలుపుతట్టింది. నవ దర్శకుడు ఎస్ఎస్.సూర్య మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో సూరి హాస్య పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ స్టార్ హీరోలతో నటించిన హన్సిక ఇప్పుడు యువ కథానాయకులతో నటించడానికి రెడీ అవుతున్నారు.