చప్పన్‌ భోగ్‌ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే.. | Lord Krishnas 56 Chappan Bhog Thali And What All Does It See | Sakshi
Sakshi News home page

చప్పన్‌ భోగ్‌ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..

Published Mon, Aug 26 2024 12:45 PM | Last Updated on Mon, Aug 26 2024 1:12 PM

Lord Krishnas 56 Chappan Bhog Thali And What All Does It See

కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మరీ ఈ పర్వదినం రోజున చిన్ని కృష్ణయ్యకు సమర్పించే నైవేద్యాలు ఏంటీ..? ఎలాంటి పదార్థాలు నివేదిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దాం..!.

ఈ పర్వదినం పురస్కరించుకుని వీధుల్లో జరిగే ఉట్టికొట్టే వేడుకు కోసం వేలాదిగా ప్రజలు గుమిగూడతారు. చిన్న పెద్దా అనే తారతమ్యం లేకుండా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. మరీ ఈ వేళ చిన్ని కన్నయ్యకి సమర్పించే సంప్రదాయ వంటకాలేంటంటే..చప్పన్‌ భోగ్‌ విందు ఏర్పాటు చేస్తారు. ఇది ప్రజలంతా భక్తితో సమర్పించే గొప్ప విందు. ఈ చప్పన​ భోగ్‌ విందు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..

చప్పన్‌ భోగ్‌ వెనుక స్టోరీ..
ఉత్తర ప్రదేశ్‌లో మధుర శ్రీ కృష్ణుడు నడయాడిన ప్రదేశం ఉందని తెలుస. అక్కడ బృందావనంలో కృష్ణుడి పెరిగినట్లుగా మనం పురాణల్లో విన్నాం. అక్కడ బృందావన్‌లో ప్రజలు అంతా ముద్దుల కృష్ణయ్య, కన్నయ్య అనే పిలుచుకునేవారు. యశోదమ్మ కృష్ణుడికి చేసిన గారాభం కారణంగా అందరిని ఆటపట్టిస్తూ తుంటరిగా ఉండేవాడు. అంతా.. అమ్మ యశోదమ్మ నీ కృష్ణుని అల్లరి భరించలేకపోతున్నాం అని ఫిర్యాదులు చేస్తే తిరిగి వాళ్లదే తప్పు అన్నట్లు మందలించే యశోదమ్మ కృష్ణ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే ఒకరోజు బృందావనంలోని ప్రజలంతా ఇంద్రుడిని ఆరాధించే నిమత్తం చప్పన్‌ భోగ్‌ కార్యక్రమానికి సన్నహాం చేస్తున్నారు. 

దీన్ని చూసిన చిన్ని కృష్ణుడు తన తండ్రి నందుడుని ఏంటీ వేడుక? ఎందుకు చేస్తున్నాం అని అడగగా..వర్షాలు బాగా పడేలా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న పూజ అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా పండ్లు, కూరగాయాలు, జంతువులకు మేత అందించే గోవర్థన గిరిని పూజించాలని అంటారు. అందుకు గ్రామస్తులు అంగీకరించి గోవర్థన గిరికి పూజ చేస్తారు. దీంతో ఇంద్రుడు కోపంతో ఏకథాటిగా ఎనిమిది రోజులు కుండపోత వర్షం కురిపిస్తాడు. 

అప్పుడు కృష్ణుడు బృందావన ప్రజలను గోవర్థన గిరి వద్దకు వచ్చి తలదాచుకోవాల్సిందిగా చెప్పి ఆ పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఉంచి రక్షించాడు. ఆయన వారందర్నీ రక్షించేందుకు ఎనిమిది రోజులగా నిరాహారంగా ఉండిపోతాడు. అన్ని రోజుల తమ కోసం తినకుండా సంరక్షించిన ఆ జగన్నాథుడికి కృతజ్ఞతగా ఈ చప్పన్‌ భోగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు బృందావన ప్రజలు. అప్పటి నుంచి కృష్ణుడికి ఇష్టమైన ఆహారాలతో భారీ విందు ఏర్పాటు చేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అలాగే యశోదమ్మను కృష్ణుడు ఇష్టంగా ఏం తింటాడని అడిగిమరీ వండి నివేదించడం జరిగిందని పురాణ వచనం. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. 

ఈ చప్పన భోగ్‌లో మొత్తం 56 రకాల ఆహారాలను సిద్ధం చేస్తారు. ఇందులో వివిధ రుచులతో కూడిన ఆహార పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా చేదు, ఘాటు, పులుపుతో కూడిన వంటకాల నుంచి మొదలై, తీపి వంటకాలతో ముగుస్తుంది. ఇందులో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలు, మీగడ, పెరుగుకి సంబంధించిన వివిధ తీపి వంటకాలు కూడా ఉంటాయి. 

(చదవండి: కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement