వేసవి కాలం వచ్చిందంటే విధ రకాల స్వీట్లు/రుచికరమైన చిరుతిళ్లు, ఐస్ క్రీమ్స్, కుల్ఫీలకు డిమాండ్ ఉంది. పిల్లలు కూడా మార్కెట్లో దొరకేవిధంగా కావాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో పరి శుభ్రంగా లేకుండా, ప్రతీదీ కల్తీ మయం అయి పోతున్న తరుణంలో బయట దొరికే కుల్ఫీలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చాలా సులభంగా థండయ్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలా చూద్దాం.
అయితే కుల్ఫీ అనేది స్వచ్ఛమైన వెన్నతీయని పాలు, చక్కెర, ఏలకులు లేదా కుంకుమపువ్వు వంటి సువాసన పదార్ధంతో తయారు చేసే ఫ్రీజ్‌డ్ డెజర్ట్. మలై కుల్ఫీ, డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, కేసరి కుల్ఫీ అబ్బో ఇందులో చాలా రకాలున్నాయి.
థండయ్ కుల్ఫీ కావలసినవి
వెన్న తీయని పాలు- 2 కప్పులు
కోవా-100 గ్రాములు ; కండెన్స్‌డ్ మిల్క్-కప్పు; పాల పొడి- పావు కప్పు ; బాదం - 10 ; గసగసాలు- టేబుల్ స్పూన్ ; మిరియాలు-5 ; యాలకులు- 2 ; సోంఫు - టీ స్పూన్.
తయారీ: ∙బాదం పప్పులను నానబెట్టి తొక్క వలిచి పలుకుగా గ్రైండ్ చేయాలి ∙గసగసాలను పది నిమిషాల సేపు నీటిలో నానబెట్టి గ్రైండ్ చేయాలి. అవి ఒక మోస్తరుగా మెదిగిన తర్వాత అందులోనే మిరియాలు, యాలకులు, సోంఫు వేసి అవి కూడా మెత్తగా మెదిగే వరకు గ్రైండ్ చేయాలి ∙పాలను ఒక వెడల్పాటి పాత్రలో ΄ోసి మరిగించాలి. కాగిన పాలలో కోవా, కండెన్స్‌డ్ మిల్క్, పాలపొడి వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలి. ఇవి మరిగినంత సేపూ అడుగుపట్టకుండా గరిటెతో అడుగు వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమాన్ని, బాదం పలుకులను వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరగనిచ్చి దించేయాలి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఎనిమిదిగంటలు వెయిట్ చేసిన తరువాత , హ్యాపీగా లాగించేయడమే.
Comments
Please login to add a commentAdd a comment