వంట చేసేటపుడు వంటకు చక్కటి రుచి రావాలన్నా, వంటను సులభంగా పూర్తి చేయాలన్నా, వంట ఇంట్లో పనులను ఈజీగా చక్కబెట్టుకోవాలన్నా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కచ్చితంగా తెలియాలి. అలాంటి వాటిల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాం!
- బెండకాయలు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలంటే వాటి చివర్లను కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిజ్లో పెట్టాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు బియ్యంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం పువ్వులా ఉడుకుతుంది.
- యాలకుల తొడిమలను పొడి చేసి టీ చేసేటప్పుడు చక్కెరతోపాటు అందులో వేయాలి. టీ రుచి అద్భుతంగా, సువాసనగా ఉంటుంది.
- పూరీలు తెల్లగా రావాలంటే వేయించేటప్పుడు నూనెలో కొన్ని జామ ఆకులు వేయాలి.
- అప్పడాలు ఎక్కువ నూనె పీల్చకూడదు అనుకుంటే వేయించే ముందు కాసేపు ఎండలో పెట్టాలి.
- పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్కలు అందులో వేయండి.
- బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలోఉంచితే తొందరగా మెత్తబడవు.
- కూరగాయల్ని, లేదా ఆకుకూరల్ని తరిగే ముందు ఉప్పు, పసుపు వేసిన నీటిలో కడిగితే క్రిములు పైకి తేలతాయ. అపుడు సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.
- కారంపొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే తొందరగా పురుగుపట్టదు.
- నెయ్యి కాచేటపుడు రెండు లవంగాలుగానీ, తమలపాకు గానీ వేస్తేమంచి వాసన వస్తుంది.
- పాలు గడ్డగా తోడుకోవాలంటే.. పాలు బాగా మరిగించి, కాస్త వేడిగా ఉండగానే మజ్జిగ లేదా ఉండలులేని పెరుగు వేసి బాగా కలపాలి.
- అల్లం వెల్లుటి పేస్ట్ తయారు చేసేటపుడు, అల్లం, వెల్లుల్లి పొట్టు తొందరగారావాలంటే నీళ్లలో నానబెడితే మంచిది.
- ఇడ్లీ, దోసె పిండి, ఎక్కువ రోజులుతాజాగా ఉండాలంటే..పైన రెండు తమలపాకులు వేయండి.
Comments
Please login to add a commentAdd a comment