
ఇంట్లోని ఇలాంటి చిన్న చిన్న వస్తువులను మన్నికగా, శుభ్రంగా ఉంచడంలో ఇబ్బంది పడుతున్నరా!? అయితే ఈ సూపర్ కిచెన్ టిప్స్ మీకోసమే.
బట్టల మీద పడిన ఇంక్ మరకలు పోవాలంటే.. ఇంక్ మరకలపై కొద్దిగా నీళ్లు చల్లాలి. ఇప్పుడు టూత్ పేస్టును అప్లై చేసి బ్రష్‌తో రుద్ది నీటితో వాష్ చేస్తే ఇంక్ మరకలు ఇట్టే పోతాయి.
మినరల్ వాటర్ క్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, టీస్పూను బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసం, కొద్ది గోరువెచ్చని నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తరువాత క్యాన్‌ను పైకీ కిందకు బాగా గిలకొట్టాలి. పది నిమిషాలపాటు ఇలా గిలకొట్టి రెండుమూడుసార్లు నీటితో కడగాలి. తరువాత డిష్ వాష్ లిక్విడ్‌తో వాటర్ క్యాన్ బయటవైపు తోముకుంటే క్యాన్ మురికి వదిలి కొత్తదానిలా మెరుస్తుంది.
స్ప్రే బాటిల్‌లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీ స్పూను డిష్ వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్‌ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములూ దరిచేరవు. దీనిలో ఎటువంటి రసాయనాలు లేవు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.
ఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్..
Comments
Please login to add a commentAdd a comment