ఫాస్టింగ్‌ని.. ఇలా బ్రేక్‌ చేద్దాం! | Preparation Of Different Types Of Cooking Flavors With Different Types Of Ingredients | Sakshi
Sakshi News home page

ఫాస్టింగ్‌ని.. ఇలా బ్రేక్‌ చేద్దాం!

Published Fri, Jun 14 2024 9:48 AM | Last Updated on Fri, Jun 14 2024 9:48 AM

Preparation Of Different Types Of Cooking Flavors With Different Types Of Ingredients

రేపు ఉదయం దోసెలు కావాలంటే... ఈ రోజు ఉదయమే పప్పు నానబెట్టాలి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే... ఇదిగో... ఇవి ప్రయత్నించండి. దినుసుల కోసం బజారుకెళ్లక్కర్లేదు. పోపుల పెట్టె ముందు పెట్టుకోండి. ఫ్రిజ్‌ తెరిచి అరలన్నీ వెతకండి. ఇక బాణలి పెట్టి స్టవ్‌ వెలిగించండి..

బ్రెడ్‌ ఉప్మా..
కావలసినవి..
బ్రెడ్‌ ముక్కలు – 3 కప్పులు;
నూనె లేదా నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్‌లు;
అల్లం తురుము – టీ స్పూన్‌;
వెల్లుల్లి తురుము – టీ స్పూన్‌;
పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్‌లు;
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;
టొమాటో ముక్కలు – కప్పు;
పసుపు – అర టీ స్పూన్‌;
మిరప్పొడి – టీ స్పూన్‌;
టొమాటో కెచప్‌ – టేబుల్‌ స్పూన్‌;
నిమ్మరసం– 2 టీ స్పూన్‌లు;
ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
ఆవాలు – 2 టీ స్పూన్‌లు;
కరివేపాకు– 1 రెమ్మ;
తరిగిన కొత్తిమీర– టేబుల్‌ స్పూన్‌;
నీరు– 2 టేబుల్‌ స్పూన్‌లు.

తయారీ..

  • వెడల్పుగా ఉన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి.

  • ఆవాలు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల పాటు వేయించాలి.

  • ఇప్పుడు టొమాటో ముక్కలు, పసుపు, మిరప్పొడి, నీరు వేసి కలిపి మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించాలి. 

  • అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి.

  • ఇప్పుడు టొమాటో కెచప్, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి ఓ నిమిషం పాటు మగ్గనివ్వాలి.

  • చివరగా బ్రెడ్‌ ముక్కలు, కొత్తిమీర వేసి సమంగా కలిసేటట్లు కలుపుతూ ఓ నిమిషం పాటు వేయించి దించేయాలి.  
    గమనిక: బ్రెడ్‌ ఉప్మా చేయడానికి తాజా బ్రెడ్‌ మాత్రమే కాదు గట్టిపడిపోయిన బ్రెడ్‌తో కూడా ఉప్మా చేసుకోవచ్చు.

వీట్‌ వెజిటబుల్‌ చీలా..
కావలసినవి..
గోధుమపిండి – 2 కప్పులు;
టొమాటో ముక్కలు – పావు  కప్పు (సన్నగా తరగాలి);
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి);
క్యారట్‌ తురుము – పావు కప్పు;
తరిగిన పచ్చిమిర్చి – టీ స్పూన్‌;
కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్‌లు;
ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
నీరు – 2 కప్పులు (చిక్కదనం చూసుకుని అవసరమైతే పెంచుకోవచ్చు);
నూనె – టేబుల్‌ స్పూన్‌;

తయారీ..

  • గోధుమ పిండిలో ఉప్పు వేసి నీరు పోసి పెరుగు చిలికే బీటర్‌తో చిలకాలి.

  • ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.

  • పెనం వేడి చేసి పెనాన్ని పచ్చి ఉల్లిపాయతో రుద్దాలి.

  • ఇప్పుడు గోధుమపిండి మిశ్రమం ఒక గరిటె వేసి జాగ్రత్తగా రుద్దాలి.

  • దోశెలాగ పలుచగా రుద్దకూడదు. ఊతప్పంలాగ మందంగా ఉంచాలి.

  • ఈ గోధుమపిండి అట్టు చుట్టూ అర టీ స్పూన్‌ నూనె వేయాలి.

  • మీడియం మంట మీద కాలనివ్వాలి. ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా కాలనివ్వాలి.

  • ఇలాగే పిండినంతటినీ అట్లు వేసుకోవాలి. ఈ వీట్‌– వెజిటబుల్‌ చీలాని చట్నీ లేదా సాంబార్‌తో తింటే రుచిగా ఉంటుంది.  

మల్టీగ్రెయిన్‌ మేథీ థెప్లా..
కావలసినవి..
గోధుమపిండి – కప్పు;
జొన్న పిండి – అర కప్పు;
రాగి పిండి – అర కప్పు;
సజ్జ పిండి– అర కప్పు;
మెంతి ఆకులు – అర కప్పు (తరగాలి);
నువ్వులు – టేబుల్‌ స్పూన్‌;
అల్లం – పచ్చిమిర్చి పేస్ట్‌ – టీ స్పూన్‌;
నూనె – టీ స్పూన్‌;
అవిశె గింజలు – 2 టేబుల్‌ స్పూన్‌లు;
ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
నూనె– 3 టేబుల్‌ స్పూన్‌లు.

తయారీ..

  • పైన చెప్పుకున్న పదార్థాల్లో నూనె మినహా మిలిగినవన్నీ ఒక వెడల్పు పాత్రలో వేసి గరిటెతో కలపాలి.

  • తర్వాత నీటిని పోసి చపాతీ పిండిలా కలపాలి.

  • పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకుని చపాతీలా వత్తి పెనం మీద వేసి, కొద్దిగా నూనె చిలకరించి రెండు వైపులా చపాతీ కాల్చినట్లే దోరగా కాలిస్తే మల్టీగ్రెయిన్‌ మేథీ థెప్లా రెడీ.

  • వీటిని ఇక వేరే కాంబినేషన్‌ అవసరం లేకుండా నేరుగా తినవచ్చు.

  • పప్పు లేదా కూరలతో కూడా తినవచ్చు. లంచ్‌కి ప్యాక్‌ చేసుకుని వెళ్లడానికి కూడా అనువుగా ఉంటాయి.

  • ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు తింటే చాలు, మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement