Food processing
-
మీ రుణం మాకొద్దు
సాక్షి, అమరావతి: చెప్పేదొకటి.. చేసేది మరొకటి. పైకి పరిశ్రమలు తెస్తామంటారు.. వస్తున్న పరిశ్రమలకూ మోకాలడ్డుతారు. వాటి కోసం కేటాయించిన స్థలాలను లాగేసుకోవడం ప్రధాన ఉద్దేశం. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలోని కీలక నేతల కుతంత్రాలివి. ఇందుకు రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటున్న వైనమే ఇందుకు తార్కాణం. ఈ పరిశ్రమల కోసం రుణాలిస్తానన్న బ్యాంకుకు తమ ‘పాలసీ’మారిందని, రుణం అవసరం లేదంటూ కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. వీటికోసం జిల్లా కేంద్రాలకు సమీపంలో సేకరించిన విలువైన భూములపై టీడీపీ పెద్దలు కన్నేసినందునే ప్రభుత్వ ‘పాలసీ’ మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పంట ఉత్పత్తులకు డిమాండ్ కల్పించడం ద్వరా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో రూ.3,559.11 కోట్లతో 27 ఆహార శుద్ధి యూనిట్లు, రూ.65 కోట్లతో ఉమ్మడి జిల్లాకి ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. తొలుత రెండు దశల్లో రూ.1,250 కోట్లతో 10 ఆహార శుద్ధి యూనిట్లు, 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి కోసం జిల్లా కేంద్రాలకు సమీపంలోనే 322.61 ఎకరాలు సమీకరణ చేసి లాండ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసింది.115 కంపెనీలు ఆసక్తిఈ పరిశ్రమల ద్వారా వచ్చే 15 ఏళ్లలో పన్ను రూపంలో రూ. 9వేల కోట్ల రాబడితో పాటు జీడీపీ 1,500 కోట్లకుపైగా పెరుగుతుందని అంచనా వేశారు. ప్రభుత్వమే స్వయంగా వీటిని నిర్మించి ఆసక్తి చూపే బహుళ జాతి సంస్థలకు 15 ఏళ్లకు లీజు పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ముడి సరుకును ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, మార్క్‌ఫెడ్, ఆర్బీకేల ద్వారా కొనాలని నిర్దేశించింది. తొలి దశ ప్రాజెక్టుల కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు ఆపరేటర్ల ఎంపిక కోసం టెండర్లు పిలవగా హల్దీరామ్స్, ఐటీసీ వంటి 115 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. వీరికి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఇవ్వాలని సంకల్పించింది. తొలిదశ యూనిట్ల ఏర్పాటు కోసం సిడ్బీ రూ.1,000 కోట్లు రుణం అందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌ను కూడా విడుదల చేసింది. ఫేజ్–1లో అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద రూ.72.47 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్‌తో పాటు ఒక్కొక్కటి రూ.5 కోట్ల అంచనాతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు గతేడాది అక్టోబర్‌లో శ్రీకారం కూడా చుట్టారు. ఇలా పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా రంగం సిద్ధమైన తరుణంలో వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. తాము ఈ పాలసీని పునః సమీక్షిస్తున్నామని, రుణం అవసరం లేదంటూ బ్యాంకుకు చెప్పేసింది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రశ్నార్ధకంగా మారింది.రూ.1,000 కోట్ల విలువైన భూములను కొట్టేయాలన్న కుట్రతోనే..ఆహార శుద్ధి పరిశ్రమలకు జిల్లా కేంద్రాల సమీపంలో సమీకరించిన విలువైన భూములపై టీడీపీ బడా నేతల కన్ను పడినందునే వీటి ఏర్పాటును అడ్డుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పీపీపీ మోడ్‌లో ఇచ్చే పేరుతో వేల కోట్ల విలువైన ఈ భూములను కొట్టేయాలని కుతంత్రం పన్నినట్లు సమాచారం. ప్రభుత్వమే పరిశ్రమలు ఏర్పాటు చేయించి, బహుళ జాతి సంస్థల ద్వారా రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు తలపెట్టిన గొప్ప కార్యక్రమానికి తూట్లు పొడిచి ఆ స్థలాల్లో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.యూనిట్లు ఏర్పాటు ఇలా..తొలిదశ : ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్ల లోపువేరుశనగ – అనంతపురంకాఫీ – అరకుమామిడి తాండ్ర – కాకినాడబెల్లం అనుబంధ ఉత్పత్తుల తయారీ – అనకాపల్లి కందులు – గుంటూరు, ఒంగోలువీటితోపాటు ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లురెండో దశ: ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్లకు పైబడ్చిఅరటి – పులివెందులటమాటా – నంద్యాలపండ్లు, కూరగాయలు – రాజంపేటసుగంధ ద్రవ్యాలు – నరసరావుపేట -
చిరాగ్ పాశ్వాన్‌కు జెడ్– కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ/పాట్నా: ఎన్డీయే కీలక భాగస్వామి, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు జెడ్– కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు ఇప్పటిదాకా శశస్త్ర సీమాబల్‌కు చెందిన చిన్న బృందం రక్షణ కల్పించేది. 41 ఏళ్ల చిరాగ్ పాశ్వాన్.. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు కూడా. లోక్ జనశక్తి బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పొత్తుపెట్టుకొని పోటీచేసిన ఐదు లోక్‌సభ స్థానాలను నెగ్గిన సంగతి తెలిసిందే. -
పండ్లకే నష్టం ఎక్కువ!
సాక్షి, అమరావతి: పంటల కోత అనంతరం పండ్లకు అత్యధికంగా నష్టం వాటిల్లుతోందని, ఆ తరువాత ఆ నష్టం ఎక్కువగా కూరగాయల్లో ఉందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పండ్లు, కూరగాయలు కోత అనంతరం అధిక ఉష్ణాగ్రతల కారణంగా నాణ్యత క్షీణించడం, వృధా అవ్వడం జరుగుతోందని పేర్కొంది. పండ్ల కోత అనంతరం దేశంలో 6.02 శాతం నుంచి 15.05 శాతం మేర నష్టపోతున్నాయని, ఆ తరువాత కూరగాయల్లో 4.87 శాతం నుంచి 11.61 శాతం మేర నష్టం వాటిల్లుతోందని అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, విలువ జోడింపులు పెంచడం తదితర చర్యలను తీసుకుంటోందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెగా ఫుడ్ పార్క్‌లు, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, విలువ పెంపు మౌలిక సదుపాయాలను, ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లను, ఫుడ్ ప్రాసెసింగ్–ప్రిజర్వేషన్ కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1,680 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం బ్యాంకులు, ఇతర రుణ సంస్థల ద్వారా దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడానికి సులభతరం చేసిందని తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. -
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీక్.. 17 మందికి అస్వస్థత
పుణె: అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో మహారాష్ట్ర పుణె జిల్లాలోని ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని 17 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భంద్‌గావ్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ యూనిట్లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఈ యూనిట్‌ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను ఉంచడానికి అమ్మోనియా గ్యాస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అది ప్రమాదవశాత్తూ లీకైంది.ప్రమాద సమయంలో యూనిట్లో 25 మంది పనిచేస్తున్నారని.. వీరిలో చాలా మంది మహిళలేనని పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ్ దేశ్‌ముఖ్ తెలిపారు. లీకైన తర్వాత అమ్మోనియా రెగ్యులేటర్‌ను వెంటనే ఆఫ్ చేసినట్లు వివరించారు. బాధిత కార్మికులను వేగంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడ వారు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.అయితే గ్యాస్ లీక్ పాయింట్‌కు దగ్గరగా ఉన్న ఓ మహిళకు మాత్రం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు ధ్రువీకరించారని దేశ్‌ముఖ్ వెల్లడించారు. -
ఫాస్టింగ్ని.. ఇలా బ్రేక్ చేద్దాం!
రేపు ఉదయం దోసెలు కావాలంటే... ఈ రోజు ఉదయమే పప్పు నానబెట్టాలి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే... ఇదిగో... ఇవి ప్రయత్నించండి. దినుసుల కోసం బజారుకెళ్లక్కర్లేదు. పోపుల పెట్టె ముందు పెట్టుకోండి. ఫ్రిజ్ తెరిచి అరలన్నీ వెతకండి. ఇక బాణలి పెట్టి స్టవ్ వెలిగించండి..బ్రెడ్ ఉప్మా..కావలసినవి..బ్రెడ్ ముక్కలు – 3 కప్పులు;నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు;అల్లం తురుము – టీ స్పూన్;వెల్లుల్లి తురుము – టీ స్పూన్;పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;టొమాటో ముక్కలు – కప్పు;పసుపు – అర టీ స్పూన్;మిరప్పొడి – టీ స్పూన్;టొమాటో కెచప్ – టేబుల్ స్పూన్;నిమ్మరసం– 2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;ఆవాలు – 2 టీ స్పూన్లు;కరివేపాకు– 1 రెమ్మ;తరిగిన కొత్తిమీర– టేబుల్ స్పూన్;నీరు– 2 టేబుల్ స్పూన్లు.తయారీ..వెడల్పుగా ఉన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి.ఆవాలు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల పాటు వేయించాలి.ఇప్పుడు టొమాటో ముక్కలు, పసుపు, మిరప్పొడి, నీరు వేసి కలిపి మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి.ఇప్పుడు టొమాటో కెచప్, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి ఓ నిమిషం పాటు మగ్గనివ్వాలి.చివరగా బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర వేసి సమంగా కలిసేటట్లు కలుపుతూ ఓ నిమిషం పాటు వేయించి దించేయాలి. గమనిక: బ్రెడ్ ఉప్మా చేయడానికి తాజా బ్రెడ్ మాత్రమే కాదు గట్టిపడిపోయిన బ్రెడ్‌తో కూడా ఉప్మా చేసుకోవచ్చు.వీట్ వెజిటబుల్ చీలా..కావలసినవి..గోధుమపిండి – 2 కప్పులు;టొమాటో ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి);ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి);క్యారట్ తురుము – పావు కప్పు;తరిగిన పచ్చిమిర్చి – టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నీరు – 2 కప్పులు (చిక్కదనం చూసుకుని అవసరమైతే పెంచుకోవచ్చు);నూనె – టేబుల్ స్పూన్;తయారీ..గోధుమ పిండిలో ఉప్పు వేసి నీరు పోసి పెరుగు చిలికే బీటర్‌తో చిలకాలి.ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.పెనం వేడి చేసి పెనాన్ని పచ్చి ఉల్లిపాయతో రుద్దాలి.ఇప్పుడు గోధుమపిండి మిశ్రమం ఒక గరిటె వేసి జాగ్రత్తగా రుద్దాలి.దోశెలాగ పలుచగా రుద్దకూడదు. ఊతప్పంలాగ మందంగా ఉంచాలి.ఈ గోధుమపిండి అట్టు చుట్టూ అర టీ స్పూన్ నూనె వేయాలి.మీడియం మంట మీద కాలనివ్వాలి. ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా కాలనివ్వాలి.ఇలాగే పిండినంతటినీ అట్లు వేసుకోవాలి. ఈ వీట్– వెజిటబుల్ చీలాని చట్నీ లేదా సాంబార్‌తో తింటే రుచిగా ఉంటుంది. మల్టీగ్రెయిన్ మేథీ థెప్లా..కావలసినవి..గోధుమపిండి – కప్పు;జొన్న పిండి – అర కప్పు;రాగి పిండి – అర కప్పు;సజ్జ పిండి– అర కప్పు;మెంతి ఆకులు – అర కప్పు (తరగాలి);నువ్వులు – టేబుల్ స్పూన్;అల్లం – పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్;నూనె – టీ స్పూన్;అవిశె గింజలు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె– 3 టేబుల్ స్పూన్లు.తయారీ..పైన చెప్పుకున్న పదార్థాల్లో నూనె మినహా మిలిగినవన్నీ ఒక వెడల్పు పాత్రలో వేసి గరిటెతో కలపాలి.తర్వాత నీటిని పోసి చపాతీ పిండిలా కలపాలి.పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకుని చపాతీలా వత్తి పెనం మీద వేసి, కొద్దిగా నూనె చిలకరించి రెండు వైపులా చపాతీ కాల్చినట్లే దోరగా కాలిస్తే మల్టీగ్రెయిన్ మేథీ థెప్లా రెడీ.వీటిని ఇక వేరే కాంబినేషన్ అవసరం లేకుండా నేరుగా తినవచ్చు.పప్పు లేదా కూరలతో కూడా తినవచ్చు. లంచ్‌కి ప్యాక్ చేసుకుని వెళ్లడానికి కూడా అనువుగా ఉంటాయి.ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు తింటే చాలు, మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. -
ఊరూరా ఉపాధికి బాటలు
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థాయిలో సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తద్వారా ఊరూరా ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ.. పదిమందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. ఈ తరహా పరిశ్రమలు దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ఉంటే.. మన రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని ఆధునికీకరించేందుకు అవసరమైన తోడ్పాటు ఇవ్వడమే కాకుండా కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ‘వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రోడక్ట్’ కింద జిల్లాకో ఉత్పత్తిని ఎంపిక చేసి.. ఆ ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్‌ప్రైజస్ (పీఎం ఎఫ్ఎంఈ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో ఆర్థిక చేయూత ఇస్తున్నాయి. 2021లో ప్రారంభించిన ఈ పథకం కింద ఐదేళ్లలో రూ.460 కోట్ల ఆర్థిక చేయూతతో 10 వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. మూడేళ్లలో 3,843 పరిశ్రమలకు రూ.300 కోట్లకు పైగా ఆర్థిక చేయూత అందింది. రూ.10 లక్షల వరకు చేయూత వ్యక్తిగత కేటగిరీతో పాటు వ్యవసాయ సహకార సంఘాలు (ఎఫ్‌పీఓ), ఉత్పత్తిదారుల సంఘాలు (పీఓ), స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణ అనుసంధాన గ్రాంట్ మంజూరు చేశారు. పచ్చళ్లు, తినుబండారాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందే ఎస్‌హెచ్‌జీల్లోని çసభ్యులకు రూ.40 వేల వరకు సీడ్ క్యాపిటల్ కింద అందించారు. వ్యక్తిగత కేటగిరీలో ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు రుణ అనుసంధాన రాయితీ (క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ) గరిష్టంగా రూ.10 లక్షల వరకు అందించారు. ఇందులో 10 శాతం లబ్దిదారు భరిస్తే మిగిలిన 55 శాతం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో అందించారు. కల్పించిన సౌకర్యాలివే.. ఈ స్కీమ్ కింద పొందే రుణాలతో కామన్ ప్రోసెసింగ్ ఫెసిలిటీ కింద వ్యవసాయ ఉత్పత్తులను సారి్టంగ్, గ్రేడింగ్, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలతోపాటు ఉత్పత్తులను ప్రోసెస్ చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్, ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కెపాసిటీ బిల్డింగ్‌లో భాగంగా 9 కేటగిరీల్లో ఫుడ్ ప్రోసెసింగ్ టెక్నాలజీలు, తయారీ పద్ధతులు, ఆహార ప్రమాణాలు, నిబంధనలు, ఫుడ్ లైసెన్సింగ్ వంటి వాటిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. మనుగడలో ఉన్న పరిశ్రమల క్రమబద్దీకరణతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్‌లో శిక్షణ, రిటైల్ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో చేయూత ఇచ్చారు. బ్రాండింగ్ ఉత్పత్తుల ద్వారా మెరుగైన వాణిజ్యానికి సహకారం అందించారు. యంత్రాలు కొన్నాం మాది గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్. మసాలా దినుసులు తయారు చేస్తాం. పరిశ్రమను విస్తరించాలనుకున్నాం. కరోనా వల్ల వెనక్కి తగ్గాం. ఆ సమయంలో ఉద్యాన శాఖ అధికారులొచ్చి ఈ స్కీమ్ గురించి చెప్పారు. దగ్గరుండి దరఖాస్తు చేయించారు. 35 శాతం సబ్సిడీతో రూ.30 లక్షల రుణం తీసుకున్నాం. కొత్త యంత్రాలు కొనుగోలు చేశా. వ్యాపార విస్తరణకు ఇది ఎంతగానో దోహదపడింది. – బలుసు వీణ, గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్, కడప జీడిపప్పు వ్యాపారానికి చేయూత కొన్నేళ్లుగా జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాం. మెషినరీ కొనుగోలు కోసం ఆలోచిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో రూ.7.50 లక్షల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తం పరిశ్రమకు అవసరమైన మెషినరీ కొనుగోలుకు ఉపయోగపడింది. – మణిదేవి, వజ్జిలపేట, తూర్పు గోదావరి జిల్లా పప్పు పరిశ్రమకు విస్తరించాం పప్పు ప్రోసెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్తాం. వ్యాపారం విస్తరించుకోవాలని అనుకున్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. పీఎంఎఫ్ఎ స్కీమ్ కింద దరఖాస్తు చేశాం. రూ.28 లక్షల రుణమిచ్చారు. మెషినరీ కొనుగోలుతోపాటు వ్యాపారాన్ని మరింత విస్తరించుకోగలిగాం. – జోడు లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు -
ఫుడ్ ప్రాసెసింగ్‌కు జీఐఎస్ బూస్ట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి పరిశ్రమల హబ్‌గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు పాడి, మత్స్య ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఆహారశుద్ధిలోనూ అగ్రగామిగా నిలుస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాలనిస్తోంది. గతేడాది విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్(జీఐఎస్)లో జరిగిన మెజార్టీ ఒప్పందాలు ఏడాది తిరగకుండానే కార్యరూపం దాలుస్తున్నాయి. ఈ సదస్సులో రూ.5,765 కోట్ల విలువైన 33 ఒప్పందాలు జరగ్గా, వీటి ద్వారా ప్రత్యక్షంగా 12,600 మందికి, పరోక్షంగా మరో 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంచనా వేశారు. ఇప్పటికే వీటిలో రూ.1,350 కోట్ల పెట్టుబడితో ఏటా 11.90 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నాలుగు మేజర్ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించగా, వీటి ద్వారా పరోక్షంగా 5,380 మందికి ఉపాధి లభిస్తుండగా, 23 వేల మంది రైతులకు లబ్ది చేకూరుతోంది. మరొక వైపు రూ.2,227 కోట్ల విలువైన మరో ఆరు పరిశ్రమలు శంకుస్థాపన పూర్తి చేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో అధికారులు వేగంగా అనుమతులు మంజూరు చేయడం వల్ల జీఐఎస్ ఒప్పందాల్లో 60 శాతం పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలివే.. ఏలూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రూ.1,350 కోట్ల పెట్టుబడితో నాలుగు భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ► అనా ఓలీయో ప్రైవేట్ లిమిటెట్ సంస్థ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం వద్ద రూ.650 కోట్ల పెట్టుబడితో ఎడిబుల్ ఆయిల్ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రోజుకు 1,000 టన్నుల సామర్థ్యంతో పామ్ ఆయిల్, రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో సన్‌ఫ్లవర్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ ద్వారా 2,100 మందికి నేరుగా ఉపాధి కల్పిస్తోంది. ► డీపీ కోకోవా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతిలోని శ్రీసిటీ వద్ద రూ.350 కోట్ల పెట్టుబడితో కోకో బట్టర్, ఫౌడర్, మాస్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఏటా 40 వేల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 1,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ► గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్థ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం వద్ద రూ.250 కోట్ల పెట్టుబడితో ఎడిబుల్ ఆయిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఏడాదికి 4.20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 1,150 మందికి ఉపాధి కల్పిస్తోంది. ► గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం వద్ద రూ.100 కోట్లతో ఎడిబుల్ ఆయిల్ రిఫనరీ అండ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్‌తో పాటు రోజుకు 200 టన్నుల సామర్థ్యంతో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్ ద్వారా 1,130 మందికి ఉపాధి కల్పించగా, 5 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. నిర్మాణ దశలో ఉన్నవి ఇవీ.. తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో రూ.2227 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఆరు పరిశ్రమలకు భూమిపూజ జరగ్గా, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏటా 3,39,300 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలతో 2,180 మందికి ఉపాధి లభించనుండగా, 24,100 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ► మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ తిరుపతి శ్రీసిటీ వద్ద రూ.1,600 కోట్ల పెట్టుబడితో చాక్లెట్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. కాడ్బరీ, టాంగ్, బోర్నవిటా, ఒరియా, ఫైవ్‌స్టార్ వంటివి ఈ కంపెనీ ఉత్పత్తులే. ఏటా 2.20 లక్షల టన్నుల కోకోవాను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 500 మందికి ఉపాధి కల్పించనుండగా, 18వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చనుంది. ► సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజస్ కంపెనీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కువ్వకొల్లి గ్రామం వద్ద రూ.400 కోట్ల పెట్టుబడితో భారీ ఇన్స్టెంట్ కాఫీ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. ఏటా 16వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కాబోతున్న ఈ పరిశ్రమ ద్వారా 950 మందికి ఉపాధి కల్పించనుండగా, 2,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► శ్రీ వెంకటేశ్వర బయోటెక్ కంపెనీ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొమ్మూరు వద్ద రూ.144 కోట్లతో రోజుకు 400 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొక్కజొన్న పిండి తయారీ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 310 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,500 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం వద్ద ఒరిల్ ఫుడ్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ఇన్స్టంట్ విజిటబుల్ చట్నీస్ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. ఏటా 7,500 టన్నుల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేస్తూ రెడీమేడ్ చట్నీలు తయారు చేసే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 175 మందికి ఉపాధి కల్పించనుండగా, 1,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► అరకు కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 కోట్లతో అనకాపల్లి జిల్లా కొండవాటిపూడి వద్ద కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఏటా వెయ్యి టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి కల్పించనుండగా, వెయ్యి మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ► విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొనాడ వద్ద బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.13 కోట్ల పెట్టుబడితో పొటాట చిప్స్, పాస్తా, నూడిల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఏటా 3,600 టన్నుల గోధుములు, 480 టన్నుల మిల్లెట్స్, 720 టన్నుల పొటాటో ప్రాసెస్ చేయనుంది. 45 మందికి ఉపాధి లభించనుండగా, 100 రైతులకు లబ్ధి చేకూరనుంది. కాగా జీఐఎస్‌లో జరిగిన మిగిలిన ఒప్పందాలు కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
మెరుగైన సదుపాయాలు కల్పించండి
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్‌లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది. ఎగుమతి నిబంధనలు సడలించాలి.. ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు. అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్‌గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్‌లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరిన్ని సబ్సిడీలు కావాలి.. మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్‌టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్టెక్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్‌లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు. -
‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!
సాక్షి, సాగుబడి డెస్క్: వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటివరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఎంత ఎక్కువంటే.. కనీసం ఊహకు కూడా అందనంత ఎక్కువగా.. ఏడాదిలో 12.7 లక్షల కోట్ల డాలర్లు అని పేర్కొంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు (20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు (12.3%) కాగా ఆ తర్వాత స్థానంలో భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు (8.8%) ఉండటం గమనార్హం. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్ఏఓ లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ప్రకారం డాలర్ మార్పిడి విలువను నిర్థారించింది. భారత్‌కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ.21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం అపసవ్యమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ.25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ.14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ.6.2 లక్షల కోట్ల మేర పర్యావరణ, జీవవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1 లక్షల కోట్ల వరకు పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఏఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగు మందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘పరోక్ష మూల్యం’లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపితే దాని అసలు ధర పూర్తిగా తెలుస్తుంది. అయితే వైద్య ఖర్చులు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని కలిపి ‘హిడెన్ కాస్ట్’అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’అనే తాజా నివేదికలో ఎఫ్ఏఓ వెల్లడించింది. ఈ ఆహారాలే జబ్బులకు మూలం వ్యవసాయంలో భాగంగా అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ మనల్ని దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవలి దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఏఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్‌లో 60% మేరకు ఉండటం గమనార్హం. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశంలో బాగంగా పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యమని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తామని తెలిపారు. -
ఈ కొత్త రకం కుక్కర్ లో వంటలు చాలా సులభం
ఈ ఆటోమేటిక్ ప్రెజర్ కుకర్.. ఆహారంలో పోషకాలు పోకుండా హెల్దీ ఫుడ్‌ని అందిస్తుంది. ఇందులో చాలా ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. కర్రీ, సూప్, దాల్, గ్రేవీ, బిర్యానీ, పులావ్.. ఇలా గాడ్జెట్ ముందువైపు ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఉంటాయి. మల్టీపర్పస్ కోసం తయారైన ఈ గాడ్జెట్.. చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పైనున్న ప్రెజర్ మూతతో పాటు.. అదనంగా లభించే ట్రాన్స్పరెంట్ మూత.. చాలా రకాల వంటకాలకు అనువుగా ఉంటుంది. ప్రత్యేకమైన గ్లాస్, గరిటె, సేఫ్టీ గాడ్స్.. వంటివి డివైస్‌తో పాటు లభిస్తాయి. అవసరాన్ని బట్టి 3 స్థాయిల్లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. దీనిలోని మన్నికైన నాన్–స్టిక్ 3 లీటర్స్ పాట్.. నలుగురికి లేదా ఐదుగురికి సరిపోతుంది. యాంటీ–స్కిడ్ బేస్‌తో పెద్ద ఇన్సులేట్ హ్యాండిల్ భద్రతను కలిగిస్తుంది. దీన్ని వంటరాని వారు కూడా వినియోగించడం చాలా సులభం. (చదవండి: సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ ) -
కొత్త టెక్నిక్ తో రుచికరమైన వంటలు..
ఉదయం నుంచి రాత్రి వరకు కావాల్సిన రుచులను తయారు చేసుకోవడంలో ఈ న్యూ టెక్నాలజీ బర్నర్ భలే చక్కగా పనిచేస్తుంది. ఇది సౌకర్యవంతమైనదే కాదు.. సురక్షితమైనది కూడా. సాధారణ హాట్ ప్లేట్ బర్నర్‌తో పోలిస్తే ఇది ఫార్–ఇన్ఫ్రారెడ్ ఎనర్జీ అసెంబ్లింగ్ టెక్నాలజీతో తరచుగా ఉపయోగించడానికి, ఉష్టోగ్రతను తట్టుకునేందుకు వీలుగా రూపొందింది. ఐరన్ పాన్, స్టెయిన్ లెస్ స్టీల్, సిరామిక్, అల్యూమినియం.. ఇలా అన్ని రకాల పాత్రలనూ దీనిపై పెట్టి, కావల్సిన వెరైటీలను సిద్ధం చేసుకోవచ్చు. ఈ బర్నర్ చాలా తేలిగ్గా ఉండటంతో.. క్యాంపింగ్‌లకు తీసుకుని వెళ్లడం, చిన్నగా ఉండటంతో.. వంటగదిలో స్టోర్ చెయ్యడమూ చాలా ఈజీ. అలాగే కుకింగ్ బౌల్స్ ఉంచే క్రిస్టల్ గ్లాస్ ప్లేట్‌ను తడి వస్త్రంతో క్లీన్ చేయొచ్చు. వేరియబుల్ హీట్ సెట్టింగ్స్ కలిగిన ఈ గాడ్జెట్పైన ఫ్రై, డీప్ ఫ్రై, బాయిలింగ్, కుకింగ్ ఇలా చాలానే చేసుకోవచ్చు. హైక్వాలిటీ టెక్నాలజీ కారణంగా ఎలాంటి ప్రమాదాలూ తలెత్తవు. ఇదే మోడల్లో రెండు మూడు బర్నర్స్ ఉన్న డివైస్‌లు కూడా మార్కెట్లో అమ్ముడు పోతున్నాయి. అయితే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: Dried Prawns Pickle Recipe: నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు! ) -
రైతన్నలకు మరింత ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రసిద్ధి చెందిన ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) తేవడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు విలువ చేకూర్చడం ద్వారా వారు మరింత ఆదాయం పొందేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరో కీలక ముందడుగు వేసింది. ఒకేసారి మూడు సంస్థలతో గురువారం మౌలిక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సహకార, వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సమక్షంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎఫ్పీఎల్), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎంవోయూలు చేసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో కలిసి సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. భౌగోళిక గుర్తింపు కోసం సాంకేతిక సహకారం రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు (జీఐ) తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ వచ్చింది. ఇదే రీతిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32కు పైగా ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ చేస్తున్న కృషికి వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. తద్వారా రాష్ట్రానికే ప్రత్యేకమైన ఆయా గొప్ప వంటల వారసత్వాన్ని సంరక్షించడంతోపాటు వాటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు తగు రీతిలో ప్రచారం చేయడానికి వీలవుతుంది. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు.. సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు అవసరమైన సాంకేతికతను ఇప్పటివరకు మహారాష్ట్రకు చెందిన ఎస్4ఎస్ అనే సంస్థ అందిస్తోంది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే ఉల్లి, టమాటా ఫ్లేక్స్ (ముక్కలు)ను కిలో రూ.2.50 చొప్పున కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అదే రీతిలో రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న మిగిలిన యూనిట్లకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన రహేజా సోలార్ ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కనీసం 2 వేల యూనిట్లకు సహకారం అందిస్తుంది. ఉల్లి, టమాటాలను సమకూర్చడంతో పాటు రైతుల నుంచి ఉల్లి, టమాటా ఫ్లేక్స్‌ను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఏపీజీబీ చైర్మన్ రాకేశ్ కష్యప్, జీఎం పీఆర్ పడ్గెటా్వర్, దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్ జోగినాయుడు, రహేజా సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ లీడ్ సుభాష్, మేనేజర్ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లకు ఆర్థిక చేయూత టమాటా, ఉల్లి పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, పొదుపు సంఘాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేకంగా 5 వేల సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా సొసైటీ ముందుకెళ్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) ముందుకొచ్చింది. సొసైటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన లబి్ధదారులకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను బ్యాంక్ అందించనుంది. యూనిట్ మొత్తంలో 35 శాతాన్ని సొసైటీ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. -
13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో ఉపాధి
-
పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సాయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మొత్తం 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు. చదవండి: పవన్ వ్యాఖ్యలు.. పోలీసు నోటీసులు -
ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
CM Jagan: ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడింది. ఏపీలో ఆహార శుద్ధి, ఇథనాల్ తయారీ పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. 90, 700 వందల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పరిశ్రమల రంగంలో మరో ఏడు ప్రాజెక్టుల పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ► అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా ►తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్‌లామ్ సౌత్ ప్రాజెక్టు ►బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద రూ.225 కోట్లతో శ్రావణి బయో ఫ్యూయల్ ►శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్ ►తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్ ►శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్ ►శ్రీసత్యసాయి జిల్లా మడక శిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ -
రూ.2,851 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,851 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి ద్వారా 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా ఆహార శుద్ధి యూనిట్ల ద్వారా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా వీటికి భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల పనులకు శ్రీకారం పరిశ్రమల రంగంలో రూ.2,294 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా భూమి పూజ నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా, తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్‌లామ్ సౌత్, బాపట్ల జిల్లా కొరిసిపాడు వద్ద శ్రావణి బయో ఫ్యూయల్ రూ.225 కోట్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా కంచరపాలెం వద్ద రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్ యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు. విశాఖపట్నం జిల్లా మద్ది వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఓరిల్ ఫుడ్స్ నిర్మాణ పనులకు, అనకాపల్లి జిల్లా కొడవాటిపూడి వద్ద రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నేటివ్ అరకు కాఫీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అయ్యవర్తం వద్ద రూ.350 కోట్లతో 3 ఎఫ్ ఆయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కడప జిల్లా పులివెందులలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. -
ఎల్లలు దాటనున్న మాడుగుల హల్వా!
సాక్షి, విశాఖపట్నం : నోట్లో వేసుకోగానే మైమరపించే మాడుగుల హల్వా రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనిని ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చేయడంతో పాటు.. భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు అడుగులేస్తోంది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఒప్పందం కుదుర్చుకుంది. జీడి పప్పు.. బాదం పలుకులు.. కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే.. గోధుమ పాలు.. వీటన్నింటినీ రాతి రుబ్బు రాయితో గంటల పాటు సానబెట్టి.. ఆపై కట్టెల పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపెట్టగానే పుట్టుకొస్తుందీ హల్వా. మాడుగులలో 1890వ సంవత్సరంలో దంగేటి ధర్మారావు కుటుంబం మాత్రమే దీనిని తయారు చేసేది. ప్రస్తుతం ఈ వ్యాపారంపై అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మొట్టమొదటిగా ‘మాడుగుల హల్వా’ ఎంపిక మాడుగుల హల్వా వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తేవడమే కాకుండా విదేశాల్లో దర్జాగా విక్రయించేందుకు అవసరమైన చేయూతనందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ)లో భాగంగా ఈ పరిశ్రమని అభివృద్ధి చేయనుంది. ఇందుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తాయి. యంత్రాల్ని సమకూర్చడం, స్కిల్స్ అప్‌గ్రేడ్ చేయడం, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వంటివి కల్పిస్తారు. వీటితో పాటు.. మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలో తొలిసారి మాడుగుల హల్వాని ఎంపిక చేశారు. ఇకపై ఈ హల్వా.. ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్‌గా మార్కెట్లో లభించనుంది. ఇందుకు కావాల్సిన వసతుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పథకంలో భాగంగా ఏడాది పాటు ప్యాకేజింగ్ మెటీరియల్, గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అద్దె, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఎలాంటి పెట్టుబడి భారం లేకుండా హల్వాని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన వ్యయంలో 50 శాతం వరకూ గ్రాంట్ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. భౌగోళిక గుర్తింపునకు ఒప్పందం.. వందేళ్ల చరిత్ర గల మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీ శుక్రవారం ఎంవోయూను కుదుర్చుకుంది. ఈ గుర్తింపు కోసం అవసరమయ్యే రుసుములు, ఇతర ఖర్చులకు సంబంధించి రూ.3 లక్షల వరకూ ప్రభుత్వమే భరించనుంది. వచ్చే ఆరు నెలల్లోపు మాడుగుల హల్వాకు కూడా భౌగోళిక గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ గుర్తింపు వస్తే ఇక ఈ పేరుతో ఇక్కడి నుంచి తప్ప మరెవరూ, ఎక్కడా మాడుగుల హల్వాను తయారు చేయలేరు. వారసత్వ సంపదగా గుర్తింపు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చిరు వ్యాపారం మాదిరిగానే మిగిలిపోయాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేసి.. వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాదిరిగా దీని అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం. ఆ తర్వాత మిగిలినవాటిపైనా దృష్టిపెడతాం. – కేజే మారుతి, ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ -
సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు చేయూత
సాక్షి. అమరావతి: రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, పారిశ్రామిక అభివృద్ధి సాధించడంతోపాటు అటు రైతులను ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేయడం, ఇటు యువతకు ఉపాధి కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. రాష్ట్ర ప్రగతికి తోడ్పడే ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. 35 శాతం సబ్సిడీతోపాటు కేవలం 6 శాతం వడ్డీకే రుణాలు లభించేలా ఏర్పాట్లు చేసింది. ఈ యూనిట్లకు రుణాలిచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. ఈమేరకు మంగళవారం సచివాలయంలో ఎస్బీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి సమక్షంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్‌పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) వి.హేమ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ. 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు ఈ ప్రాజెక్టు కింద రూ.10లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 35 శాతం సబ్సిడీపై ఎస్బీఐ రుణం మంజూరు చేస్తుంది. రూ.10 లక్షల నుంచి రూ.కోటి అంచనా వ్యయంతో పెట్టే యూనిట్లకు మాత్రం పూచీకత్తుతో రుణాలు మంజూరు చేస్తారు. సబ్సిడీ 35 శాతం లేదా గరిష్టంగా రూ.10 లక్షలుగా నిర్ణయించారు. తాజా ఒప్పందం ద్వారా కనీసం 7,500 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఆధునికీకరణ, స్థాపనకు చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. కుల, మత, లింగ భేదాల్లేకుండా 18 ఏళ్లు పైబడిన వారెవరైనా వ్యక్తిగత యూనిట్లు పెట్టుకోవచ్చు. యూనిట్ వ్యయంలో లబ్దిదారులు 10 శాతం వాటాగా భరిస్తే తొలుత 90 శాతం రుణంగా ఎస్బీఐ మంజూరు చేస్తుంది. రుణ ప్రక్రియ పూర్తి కాగానే ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం ప్రభుత్వం సబ్సిడీ జమ చేస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఎఐఎఫ్) కింద అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే 6 శాతం వడ్డీకే ఈ రుణాలు లభిస్తాయి. అంతేకాదు యూనిట్ ప్రారంభ దశలో 3 నెలలపాటు మారటోరియం వ్యవధి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద వ్యక్తిగతంగానే కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూడా సూక్ష్మ ఆహార శుద్ధి ప్రాజెక్టుల విస్తరణకు చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒప్పందం ద్వారా అనకాపల్లి బెల్లం, గువ్వలచెరువు పాలకోవా, మాడుగుల హల్వా వంటి సంప్రదాయ ఆహార క్లస్టర్లలోని మైక్రో ప్రాసెసింగ్ యూనిట్లను అత్యాధునిక యంత్రాలతో అప్‌గ్రేడ్ చేయవచ్చు. గతేడాది రూ.8 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటైన 500 యూనిట్లకు 55 శాతం సబ్సిడీపై ఎస్బీఐ ఆర్థిక చేయూతనిచ్చి ంది. ఆహారశుద్ధి పరిశ్రమల విస్తరణ మరింత వేగం: చిరంజీవి చౌదరి రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమాభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చిరంజీవి చౌదరి చెప్పారు. ఇటీవలే సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు ఆరి్ధక చేయూతనిచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పుడు సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఎస్బీఐతో కలిసి ముందుకెళ్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ గత ఆర్ధిక సంవత్సరం 500 యూనిట్లకు రుణాలిచ్చిన ఎస్బీఐ.. ఇప్పుడు పెద్ద ఎత్తున యూనిట్ల విస్తరణకు ప్రధాన రుణభాగస్వామిగా ఉద్భవించడం శుభపరిణామమన్నారు. పూచీకత్తు లేకుండా రూ.10లక్షల వరకు రుణాలిస్తామని ఎస్బీఐ డీజీఎం హేమ చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సహకారంతో ఏర్పాటయ్యే యూనిట్లకు మద్దతు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డిప్యూటీ సీఈవో ఈ.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మరింత లాభసాటిగా వ్యవసాయం
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్రంలో అత్యధిక శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుండటంతో రైతులకు మరింత ఆదాయం సమకూర్చడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఓవైపు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఇంధన తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకోసం రాష్ట్రంలో బయో ఇథనాల్ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. బయో ఇథనాల్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో అస్సాగో యూనిట్‌కు స్వయంగా శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా క్రిభ్కో, డాల్వకోట్ యూనిట్లకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే అస్సాగో, క్రిభ్కో, అవేశా ఫుడ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్, చోడవరం షుగర్స్, రోచే గ్రీన్ ఆగ్రో, నితిన్‌సాయి, గ్రేస్ వెంచర్స్ వంటి 20కిపైగా సంస్థలు రాష్ట్రంలో రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ఈ యూనిట్ల అన్నింటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిపి చూస్తే రోజుకు 5,000 కిలో లీటర్లకు పైగా బయో ఇథనాల్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది దేశంలోనే అత్యధికమని చెబుతున్నాయి. –సాక్షి, అమరావతి పెట్టుబడుల ఆకర్షణ.. రాష్ట్రంలో రైతులు ధాన్యం, మొక్కజొన్నలను అత్యధికంగా సాగు చేస్తుండటమే కాకుండా భారీగా ఎగుమతులు చేస్తున్నారు. దీంతో ఇథనాల్ తయారీలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 13 మిలియన్ టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అలాగే మూడు మిలియన్ టన్నులకు పైగా మొక్కజొన్న ఉత్పత్తి అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రాష్ట్రం నుంచి 6 మిలియన్ టన్నుల బియ్యం (నాన్ బాస్మతి), ఒక మిలియన్ టన్ను మొక్కజొన్నను ఎగుమతి చేశారు. మిగులు ఆహార ఉత్పత్తుల నుంచి ఇథనాల్‌ను తయారు చేయడానికి కేంద్రం అనుమతించడంతో పెట్టుబడిదారుల చూపు మనరాష్ట్రంపై పడింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తోంది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోంది. దీంతో వ్యవసాయం నుంచి ఇంధన తయారీకి హబ్‌గా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోంది. ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం.. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి 2025–26 నాటికి అదనంగా 1,016 కోట్ల లీటర్లు అవసరమవుతుందని అంచనా. ఇథనాల్ కలపడాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 20 శాతానికి పెంచడం వల్ల ఏటా ఇంధన దిగుమతి వ్యయంలో రూ.51,600 కోట్ల మేర విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని నీతిఆయోగ్ అంచనా. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా 16 కోట్ల లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో 20 శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. క్లీన్ ఎనర్జీకి పెద్దపీట.. పర్యావరణహిత క్లీన్ ఎనర్జీ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, బయో ఇథనాల్ తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో రోజుకు 5,000 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో 20కుపైగా ఇథనాల్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. – ప్రవీణ్ కుమార్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ–ఎండీ, ఏపీఈడీబీ సీఈవో -
రైతులకు చేయూత.. మహిళలకు ఉపాధి
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటాలతో పాటు కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. పొదుపు సంఘాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుచేయనుంది. వీటికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకొ చ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)తో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఎపీఎఫ్‌పీఎస్) నేడు (సోమవారం) అవగాహనా ఒప్పందం చేసుకోబోతుంది. తొలిసారి కర్నూలు జిల్లాలో ఏర్పాటు.. ఉల్లి, టమాటా రైతుల వెతలు తీర్చేందుకు ఏపీఎఫ్‌పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారి కర్నూలు జిల్లాలో రూ.కోటి అంచనాతో 100 సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్స్ (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటుచేశారు. రూ.లక్ష అంచనా వ్యయంతో కూడిన ఈ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 35% సబ్సిడీతో వీటిని మంజూరు చేశారు. ఒక్కో యూనిట్ ఆరు టన్నుల చొప్పున ఏటా 7.200 వేల టన్నుల ఉల్లి, టమాటాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కల్గిన ఈ యూనిట్ల 100 మందికి ఉపాధి లభిస్తుండగా, ఆయా ప్రాంతాలకు చెందిన 500 మంది ఉల్లి రైతులకు లబ్ధిచేకూరుతోంది. వీటిని ఇటీవలే సీఎం జగన్ ప్రారంభించారు. ఇంట్లోనే ఏర్పాటుచేసుకునే ఈ యూనిట్ల ద్వారా ప్రతీనెలా రూ.12వేల నుంచి రూ.18వేల వరకు అదనపు ఆదాయాన్ని పొదుపు సంఘాల మహిళలు ఆర్జిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5వేల యూనిట్లు మంజూరుచేయాలని సంకల్పించింది. బీఓబీ ఆర్థిక చేయూత.. మరోవైపు.. ఈ సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల విస్తరణ పథకానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొ చ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు సబ్సిడీపై వీటిని మంజూరు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో రూ.లక్ష అంచనాతో ఒక్కో యూనిట్ ఏర్పాటుచేయగా, ఇక నుంచి రూ.2లక్షల అంచనా వ్యయంతో రెట్టింపు సామర్థ్యంతో వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు వె చ్చిస్తున్నారు. ఈ మొత్తంలో రూ.35 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఖర్చుచేయనుండగా, లబ్దిదారులు తమ వాటాగా రూ.10కోట్లు భరించాల్సి ఉంటుంది. రూ.65 కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక చేయూతనిస్తోంది. ఇక బీఓబీ–ఏపీఎఫ్‌పీఎస్‌లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు నేడు అవగాహనా ఒప్పందం చేసుకోబోతున్నాయి. -
కళ్లేపల్లిరేగలో చిరుధాన్యాల ప్రోసెసింగ్ ప్లాంట్ ప్రారంభం
-
11 ఆహార శుద్ధి పరిశ్రమలకు వర్చువల్ గా సీఎం వైఎస్ జగన్ శ్రీకారం
-
రైతుకు మరింత రొఖ్ఖం!
ప్రారంభమైన ఎఫ్‌పీవోలు ► చిత్తూరు జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పండ్లు, కూరగాయల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభం. ► విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం రేగ గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం. ► కర్నూలు జిల్లా తడకనపల్లెలో 100 మైక్రో యూనిట్స్‌తో ఆనియన్, టమాటా సోలార్ డీ హైడ్రేషన్ క్లస్టర్ ప్రారంభం. వీటికి సీఎం శంకుస్థాపన ► తిరుపతి జిల్లా శ్రీసిటీలో మోన్ డ లీజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌కు శంకుస్థాపన. ► శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో గ్రౌండ్నట్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమిపూజ. ► అనంతపురం జిల్లా, శ్రీసత్యసాయి జిల్లాల్లో మూడు టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన. సాక్షి, అమరావతి: రైతన్నలు పండించే పంటలకు మరింత మెరుగైన ధరలను కల్పించే లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆర్బీకేల స్థాయిలో ప్రైమరీ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, జిల్లా స్థాయిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటి వల్ల రైతులు పండించిన పంటలకు మరింత విలువ తోడై మెరుగైన ధర లభిస్తుందన్నారు. గత నాలుగేళ్లలో పంటలు ధరలు తగ్గిన ప్రతిసారి మార్కెట్ జోక్యం ద్వారా రూ.8,000 కోట్లతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించని పంటలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ప్రకటించిందని తెలిపారు. చిరుధాన్యాలకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి పలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు (ఎఫ్‌పీవోలు) వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆర్బీకేల స్థాయిలో అనుసంధానం.. ఇవాళ 421 ప్రైమరీ ప్రాసెసింగ్ కలెక్షన్ సెంటర్లను ప్రారంభించుకున్నాం. ఇవన్నీ 1,912 ఆర్బీకేలతో మ్యాపింగ్ చేసినవి. మొత్తం 945 కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తొలిదశలో 344 కోల్డ్ రూమ్‌ల పనులు జరుగుతుండగా 43 కోల్డ్ రూమ్‌లను ఇవాళ ప్రారంభించుకున్నాం. ఇవి 194 ఆర్బీకేలతో అనుసంధానమయ్యాయి. ప్రతి ఆర్బీకేను కోల్డ్ రూమ్స్, కలెక్షన్ సెంటర్లకు మ్యాపింగ్ చేస్తూ ప్రైమరీ ప్రాసెసింగ్‌లో డ్రయ్యింగ్ ప్లాట్‌ఫామ్‌లు, కలెక్షన్ సెంటర్లు, వ్యవసాయ ఉపకరణాలు లాంటి వాటిని రైతు భరోసా కేంద్రం పరిధిలోకి తేవాలి. గ్రేడింగ్, సెగ్రిగేషన్ లాంటివి ఆ స్ధాయిలో జరిగితే సెకండరీ ప్రాసెసింగ్ జిల్లా స్థాయిలో చేపట్టేలా అడుగులు పడుతున్నాయి. పోటీ పెంచేలా మద్దతు ధరల ప్రదర్శన రైతులు పండించిన ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకు సైతం కనీస మద్దతు ధర కల్పిస్తూ ఆర్బీకేలలో పోస్టర్ల ద్వారా ప్రదర్శిస్తున్నాం. తద్వారా మార్కెట్లో పోటీ నెలకొనేలా చర్యలు తీసుకున్నాం. ఏదైనా పంటకు ధరలు పడిపోతే సంబంధిత ఆర్బీకే స్థాయిలోనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నాం. ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఇందుకు ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో ఈ మార్పులన్నింటితో రైతు తాను పండించే పంటకు ఇంకా మెరుగైన రేటు పొందే పరిస్థితి వస్తుంది. మార్కెట్లో రైతులకు మద్దతు ధరలు తగ్గిన ప్రతిసారి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టి తోడుగా నిలుస్తున్నాం. ఆర్బీకేలో ప్రదర్శించే రేటు కన్నా రైతులకు ఎక్కడైనా తక్కువ ధర వస్తుంటే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ పంటలను సేకరిస్తుంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఏటా రూ.3 వేల కోట్లు కేటాయిస్తూ నాలుగేళ్లలో పంటల కొనుగోలు కోసం దాదాపు రూ.8 వేల కోట్లు వెచ్చించాం. ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం శ్రీసిటీలో మరో రూ.1,600 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం ఆనందాన్ని కలిగిస్తోంది. ‘మోన్ డ లీజ్’ కంపెనీ రెండో విడతలో రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. చాక్లెట్, క్యాడ్బరి, బోర్న్‌వీటా లాంటివి తయారు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ దినదినాభివృద్ధి చెంది మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. ధర్మవరం వేరుశెనగ రైతులకు లబ్ధి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో వేరుశెనగ పంటకు మరింత విలువ పెరిగి స్థానిక రైతన్నలకు ప్రయోజనం చేకూరుతుంది. వేరుశెనగ రైతులకు మెరుగైన ధరలు ఇవ్వగలిగే పరిస్థితి రావాలని ఈ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించాం. రూ.75 కోట్లతో వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ ధర్మవరంలో ఏర్పాటవుతోంది. 55,620 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్ 15 వేల మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరో 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా వేరుశెనగ పంట నుంచి చిక్కీ, వేరుశెనగ నూనె, పీనట్ బటర్ లాంటి ఉప ఉత్పత్తులు తయారై పంటకు మార్కెటింగ్ పెరుగుతుంది. దీనివల్ల స్థానికంగా రైతన్నలకు చాలా మేలు జరుగుతుంది. రెండు జిల్లాల్లో 4 ఎఫ్‌పీవోలు ఇవాళ చిత్తూరు జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభిస్తున్నాం. దాదాపు 14,400 మెట్రిక్ టన్నులకు సంబంధించి పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి రావడం ద్వారా మార్కెటింగ్ సౌకర్యం పెరిగి రైతులకు మంచి ధరలు లభిస్తాయి. విజయనగరంలో మిల్లెట్స్ ప్రాసెసింగ్ మిల్లెట్స్‌లో దాదాపు 13 సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 32 పైచిలుకు ప్రైమరీ ప్రాసెసింగ్ మిల్లెట్ యూనిట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మిల్లెట్స్‌కు కూడా ఎంఎస్పీ అందిస్తోంది మన రాష్ట్రంలోనే. మిల్లెట్స్ రేటు పడిపోతే జోక్యం చేసుకుని కొర్రలు లాంటి చిరుధాన్యాలకు ఎంఎస్పీ అందించాం. విజయనగరంలో 7,200 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ రావడం వల్ల ఈ ప్రాంతంలో రైతులకు మంచి జరుగుతుంది. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. కర్నూలు ఉల్లి రైతన్నకు ఆదాయాన్నిచ్చేలా కర్నూలులో ఆనియన్ డీహైడ్రేషన్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద వంద చోట్ల చేస్తున్నాం. రూ.లక్ష పెట్టుబడితో ప్రతి ఒక్కరికి దాదాపు రూ.12 వేల ఆదాయాన్నిచ్చే కార్యక్రమమిది. రానున్న రోజుల్లో ఈ యూనిట్లను మరింత విస్తరిస్తూ ఐదువేల వరకు పెంచుతాం. 10,800 టన్నుల టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 3,588 మంది రైతులుకు మేలు చేస్తూ 10,800 టన్నుల టమాటా ప్రాసెసింగ్ యూనిట్లకు ఇవాళ శంకుస్ధాపన చేస్తున్నాం. మరో నాలుగు నెలల్లో వీటిని ప్రారంభించుకోబోతున్నాం. దీనివల్ల టమాటా రైతులందరికీ మంచి జరుగుతుంది. 250 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో టమాటా రైతుల ఇబ్బందులు తీరతాయి. మార్కెట్లో ధరలు పడిపోయినా అయినకాడికి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. మంచి ధరలకు విక్రయించుకునే అవకాశం కలుగుతుంది. చిరుధాన్యాల రైతులకు లబ్ధి నాబార్డు సహకారంతో చిరుధాన్యాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 1,500 మంది సభ్యులున్నారు. ఎక్కడ విక్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో సీఎం జగన్ మా కష్టాలు తీర్చారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా రూ.4 కోట్ల విలువైన యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో నేరుగా 30 మంది ఉపాధి పొందుతున్నాం. ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 10 వేల మంది రైతులు లబ్ధి పొందుతున్నాం. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే అన్నీ అందుతున్నాయి. సచివాలయ వ్యవస్థ చక్కగా పని చేస్తోంది. – సరస్వతి, సీఈవో, ఆరోగ్య మిల్లెట్స్ ఎఫ్‌పీవో, విజయనగరం జిల్లా సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం గత 30 – 35 ఏళ్లుగా రైతులతో కలిసి పనిచేస్తున్నాం. రైతులతో కలిసి ‘ధరణి’ ఎఫ్‌పీవోని ప్రమోట్ చేస్తున్నాం. సేంద్రీయ వ్యవసాయాన్ని, మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. మేం నెలకొల్పిన సొసైటీలో 2 వేల మందికి పైగా రైతులున్నారు. 115 ఉత్పత్తులను తయారు చేసి 500 రీటెయిలర్స్ ద్వారా 13 రాష్ట్రాలలో వ్యాపారం చేస్తున్నాం. సేంద్రీయ కూరగాయలు, పండ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పుడు మాకు అవకాశం లభించింది. – మేరి, కో ఫౌండర్, ద టింబక్తు కలెక్టివ్, అనంతపురం జిల్లా నేరుగా పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ పలమనేరులో కూరగాయలు పండించే రైతులతో నాబార్డు సహకారంతో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రైతులు పండించే కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్ చేసి కార్పొరేట్ సంస్థలకు అందించే మా ఎఫ్‌పీవోను గుర్తించి ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.4 కోట్లతో మిషనరీ, కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. 720 మంది రైతులు ఈ యూనిట్‌ను వినియోగించుకుని దళారీలతో సంబంధం లేకుండా నేరుగా తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసుకుంటున్నారు. మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. దాదాపు 1000 మంది రైతులు దీనిని వినియోగించుకుని లబ్ధిపొందుతున్నారు. – హరిబాబు, పలమనేరు రైతు ఉత్పత్తిదారుల సంస్థ సీఈవో -
ఆహార శుద్ధి పరిశ్రమలకు శ్రీకారం