ఉదయం నుంచి రాత్రి వరకు కావాల్సిన రుచులను తయారు చేసుకోవడంలో ఈ న్యూ టెక్నాలజీ బర్నర్ భలే చక్కగా పనిచేస్తుంది. ఇది సౌకర్యవంతమైనదే కాదు.. సురక్షితమైనది కూడా. సాధారణ హాట్ ప్లేట్ బర్నర్‌తో పోలిస్తే ఇది ఫార్–ఇన్ఫ్రారెడ్ ఎనర్జీ అసెంబ్లింగ్ టెక్నాలజీతో తరచుగా ఉపయోగించడానికి, ఉష్టోగ్రతను తట్టుకునేందుకు వీలుగా రూపొందింది. ఐరన్ పాన్, స్టెయిన్ లెస్ స్టీల్, సిరామిక్, అల్యూమినియం.. ఇలా అన్ని రకాల పాత్రలనూ దీనిపై పెట్టి, కావల్సిన వెరైటీలను సిద్ధం చేసుకోవచ్చు. ఈ బర్నర్ చాలా తేలిగ్గా ఉండటంతో.. క్యాంపింగ్‌లకు తీసుకుని వెళ్లడం, చిన్నగా ఉండటంతో.. వంటగదిలో స్టోర్ చెయ్యడమూ చాలా ఈజీ. అలాగే కుకింగ్ బౌల్స్ ఉంచే క్రిస్టల్ గ్లాస్ ప్లేట్‌ను తడి వస్త్రంతో క్లీన్ చేయొచ్చు. వేరియబుల్ హీట్ సెట్టింగ్స్ కలిగిన ఈ గాడ్జెట్‌పైన ఫ్రై, డీప్ ఫ్రై, బాయిలింగ్, కుకింగ్ ఇలా చాలానే చేసుకోవచ్చు. హైక్వాలిటీ టెక్నాలజీ కారణంగా ఎలాంటి ప్రమాదాలూ తలెత్తవు. ఇదే మోడల్‌లో రెండు మూడు బర్నర్స్ ఉన్న డివైస్‌లు కూడా మార్కెట్‌లో అమ్ముడు పోతున్నాయి. అయితే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
(చదవండి: Dried Prawns Pickle Recipe: నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు! )
Comments
Please login to add a commentAdd a comment