
ఫొటో చూడగానే.. పిల్లలకు పాఠాలు నేర్పుతున్న టీచరమ్మ అనుకునేరు.. ఈమె ఈ స్కూల్ ఆయమ్మ. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలోని ప్రాథమిక తరగతుల విభాగంలో 750 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులే ఉన్నారు. దీంతో అవసరమైనప్పుడు ఇలా ఆయమ్మే టీచరమ్మ అవతారం ఎత్తాల్సి వస్తోంది.
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 20 శాతంగా ఉంది. 2013–14లో రూ.1.12 లక్షలుగా ఉన్న తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.2.28 లక్షలకు పెరిగింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న పండ్లు, పూలు, కూరగాయలకు రాష్ట్రంలో భారీగా డిమాండ్ పెరిగింది.
ఆ డిమాండ్‌కు అనుగుణంగా పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తి వైపు మన రైతులను మళ్లించేందుకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’పేరుతో ప్రభుత్వం రెండు ప్రదర్శనశాలలను ఏర్పాటు చేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ములుగులోని తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆవరణలో 53 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల సాగు కేంద్రాన్ని నెలకొల్పింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో కూరగాయలు, పూల సాగుపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేసింది.