Hyderabad To Host G20 Agriculture Ministers Meet On June 15: Kishan Reddy - Sakshi
Sakshi News home page

HYD: జూన్‌ 15 నుంచి జీ-20 అగ్రికల్చర్‌ మినిస్టర్స్‌ మీటింగ్‌: కిషన్‌రెడ్డి 

Published Mon, Jun 12 2023 4:42 PM | Last Updated on Mon, Jun 12 2023 4:57 PM

Kishan Reddy Says From June 15 G-20 Agriculture Ministers Meeting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 15వ తేదీ నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జీ-20 అగ్రికల్చర్‌ మినిస్టర్స్‌ మీటింగ్‌ జరుగనుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. జీ-20 దేశాలతో పాటుగా మరో 9 గెస్ట్‌ దేశాల వ్యవసాయశాఖ మంత్రులు సమావేశాల్లో పాల్గొంటారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

కాగా, కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో​ మాట్లాడుతూ.. వ్యవసాయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్‌ ఎక్కువగా ఉన్న  హైదరాబాద్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అగ్రికల్చర్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. జీ-20 సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. కరోనా తరవాత తలెత్తిన సమస్యలపై చర్చించడానికి జీ-20 సమావేశాలు వేదికగా మారాయి. 46 సెక్టార్స్‌లో 250 సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 140 సమావేశాలు పూర్తయ్యాయి. హైదరాబాద్ కేంద్రంగా కీలకమైన రంగాలపై సమావేశాలు జరుగనున్నాయి. 

జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లో స్టార్టప్‌ను ప్రోత్సహించడానికి మీటింగ్స్ జరిగాయి. రెండో సమావేశం ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ అంశాలపై చర్చించారు. జూన్ 4,5,6 తేదీల్లో జీ-20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగింది. పర్యాటక రంగానికి సంబంధించి చివరి సమావేశాలు ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించనున్నారు అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రంలో గవర్నర్ల వ్యవస్థపై 2 ప్రశ్నలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement