ఈ ఆటోమేటిక్ ప్రెజర్ కుకర్.. ఆహారంలో పోషకాలు పోకుండా హెల్దీ ఫుడ్‌ని అందిస్తుంది. ఇందులో చాలా ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. కర్రీ, సూప్, దాల్, గ్రేవీ, బిర్యానీ, పులావ్.. ఇలా గాడ్జెట్ ముందువైపు ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఉంటాయి. మల్టీపర్పస్ కోసం తయారైన ఈ గాడ్జెట్.. చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పైనున్న ప్రెజర్ మూతతో పాటు.. అదనంగా లభించే ట్రాన్స్పరెంట్ మూత.. చాలా రకాల వంటకాలకు అనువుగా ఉంటుంది. ప్రత్యేకమైన గ్లాస్, గరిటె, సేఫ్టీ గాడ్స్.. వంటివి డివైస్‌తో పాటు లభిస్తాయి. అవసరాన్ని బట్టి 3 స్థాయిల్లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. దీనిలోని మన్నికైన నాన్–స్టిక్ 3 లీటర్స్ పాట్.. నలుగురికి లేదా ఐదుగురికి సరిపోతుంది. యాంటీ–స్కిడ్ బేస్‌తో పెద్ద ఇన్సులేట్ హ్యాండిల్ భద్రతను కలిగిస్తుంది. దీన్ని వంటరాని వారు కూడా వినియోగించడం చాలా సులభం.
(చదవండి: సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ )
Comments
Please login to add a commentAdd a comment