Kitchen items
-
ఇంటిప్స్: మురికిని ఇకపై సులభంగా వదిలించండి..
'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..' ఇలా చేయండి.. వాటర్ బాటిల్లో సగం వరకు నీళ్లుపోయాలి. మిగతా సగంలో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, ఐస్ ముక్కలను వేసి బాగా షేక్ చేయాలి. ఇలా పది నిమిషాలు చేసిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధానంలో బాటిల్ కడగడం వల్ల బాటిల్లో సూక్ష్మజీవులు పూర్తిగా పోతాయి. టీస్పూను వంటసోడా, రెండు టీస్పూన్ల వెనిగర్‌ను బాటిల్లో వేసి మూతపెట్టాలి. ఇరవై నిమిషాల తరువాత బాటిల్‌ను బాగా షేక్ చేసి కడగాలి. ఇలా కడిగిన బాటిల్‌ను మూతతీసి పూర్తిగా ఆరిన తరువాత వాడుకోవాలి. వంటసోడా, వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా మాడిన గిన్నె, ఫ్రైపాన్పై రాసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్వాషర్తో రుద్ది కడిగితే మురికి మొత్తం తొలగి పోతుంది. గోరువెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారు గంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి. వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. ఇవి చదవండి: బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు! -
కిచెన్‌లో తుప్పు సమస్యలతో ఇబ్బందా? ఇలా ట్రై చేయండి..
'ప్రతీ ఇంట్లో ఎదుర్కునే సమస్యలలో వంట గది ఒకటి. వంట గది ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యమంటారు. అయితే వంట ఇంటిని అందంగా, హెల్దీగా ఉంచుకోవడం అంత ఈజీకాదు. ఇందుకోసం చాలామంది మహిళలు తెగ ఖంగారుపడుతూ ఉంటారు కూడా. అయితే 24 గంటలూ కిచెన్ అద్దంలా మెరుస్తూ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..' ముఖ్యంగా తిండి పదార్థాలతో పాటు కొన్ని రకాలైన స్టీల్ బౌల్స్ కూడా తుప్పు పడుతూంటాయి. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికిగా మారటం. మరో ప్రధాన సమస్య బల్లులతో పంతం పట్టడం.., లేదంటే దూరంగా పారిపోవటంలాంటిది చేస్తుంటారు.' మరి ఇలాంటి సమస్యలను తేలికగా దూరం చేయడానికి ఈ టిప్స్‌ని ఉపయోగించండి. స్టీల్ పాత్రలు వెలిసిపోయి పాతపడినట్లుగా అనిపిస్తే... అయిపోయిన టూత్ పేస్టు ట్యూబ్‌ని ముక్కలుగా కత్తిరించి, లోపల ఉన్న కొద్దిపాటి పేస్టుని స్టీల్ పాత్రకు రాసి టూత్ బ్రష్‌తో రుద్దాలి. రెండు చుక్కలు నీళ్లు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి. వెండిసామాన్లు కూడా టూత్‌బ్రష్‌తో రుద్దితే మురికి అంతా పోయి కొత్తవాటిలా కనిపిస్తాయి. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికి పట్టి సరిగా కనిపించకపోతే కొద్దిగా టూత్‌పేస్టు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే దుమ్మూధూళి, మరకలు పోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలను సమపాళల్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్ల్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని బల్లులున్న ప్రాంతంలో స్ప్రే చేస్తే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి. ఇవి చదవండి: ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్! -
పాన్ కేక్స్ నుంచి కట్లెట్స్ వరకు..తక్కువ నూనెతో ఎక్కువ వంటలు
శ్రమ లేకుండా సౌకర్యాలను అందించడంతో పాటు.. కిచెన్ కి లగ్జరీ లుక్‌నీ ఇచ్చే ఈ డబుల్ సైడ్ హీటింగ్ బేకింగ్ మెషిన్ .. యూజర్ ఫ్రెండ్లీగా డిమాండ్‌లో ఉంది. ఇందులో ఇండిపెండెంట్ టెంపరేచర్ కంట్రోల్, డబుల్ పాన్ గ్రిల్లింగ్, త్రీ టైప్స్ ఆఫ్ బేకింగ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. మూడు లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ మేకర్.. రకరకాల రుచులను నిమిషాల్లో సిద్ధం చేస్తుంది. ఈ మేకర్లో గ్రిల్ లేదా ఫ్రై చేసుకోవాలంటే నూనె చాలా తక్కువ మోతాదులో సరిపోతుంది. క్లీన్ చేసుకోవడమూ సులభమే. ఇది రోజువారీ వంటకాలకే కాకుండా పార్టీలు, ఫంక్షన్స్‌లో వెరైటీ వంటకాలు చేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో కూరలు, సూప్స్ వంటివి సిద్ధం చేసుకోవడంతో పాటు.. పాన్ కేక్స్,కట్లెట్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. దీనితో షార్ట్ సర్క్యూట్ సమస్య రాదు. దీనికి అటాచ్డ్ మూతతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ మూత విడిగా లభిస్తుంది. -
ఈ కొత్త రకం కుక్కర్ లో వంటలు చాలా సులభం
ఈ ఆటోమేటిక్ ప్రెజర్ కుకర్.. ఆహారంలో పోషకాలు పోకుండా హెల్దీ ఫుడ్‌ని అందిస్తుంది. ఇందులో చాలా ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. కర్రీ, సూప్, దాల్, గ్రేవీ, బిర్యానీ, పులావ్.. ఇలా గాడ్జెట్ ముందువైపు ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఉంటాయి. మల్టీపర్పస్ కోసం తయారైన ఈ గాడ్జెట్.. చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పైనున్న ప్రెజర్ మూతతో పాటు.. అదనంగా లభించే ట్రాన్స్పరెంట్ మూత.. చాలా రకాల వంటకాలకు అనువుగా ఉంటుంది. ప్రత్యేకమైన గ్లాస్, గరిటె, సేఫ్టీ గాడ్స్.. వంటివి డివైస్‌తో పాటు లభిస్తాయి. అవసరాన్ని బట్టి 3 స్థాయిల్లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. దీనిలోని మన్నికైన నాన్–స్టిక్ 3 లీటర్స్ పాట్.. నలుగురికి లేదా ఐదుగురికి సరిపోతుంది. యాంటీ–స్కిడ్ బేస్‌తో పెద్ద ఇన్సులేట్ హ్యాండిల్ భద్రతను కలిగిస్తుంది. దీన్ని వంటరాని వారు కూడా వినియోగించడం చాలా సులభం. (చదవండి: సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ ) -
1 Pot Multi Cooker: నాన్‌స్టిక్ మినీ ఓవెన్.. ధర రూ.12,034..!
అడ్జస్టబుల్ టెంపరేచర్‌తో రూపొందిన ఈ నాన్‌స్టిక్ మినీ ఓవెన్.. స్టూడియో అపార్ట్‌మెంట్స్‌లో.. క్యాపింగ్ సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఒకే బౌల్లో బహురకాల రుచులను నిమిషాల్లో రెడీ చేసుకునే వీలును కలిపిస్తుంది ఈ ఎలక్ట్రిక్ కుకర్. వేయించడం దగ్గర నుంచి ఉడకబెట్టడం వరకు అన్ని రకాలనూ ఇందులో తయారు చేసుకోవచ్చు. 90 డిగ్రీల సెల్సియస్ నుంచి 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఐదు స్థాయిల హీట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ రెగ్యులేటర్ పవర్ కనెక్టర్‌కు.. ఆ కనెక్టర్ మూతకు అమర్చి ఉంటాయి. దాంతో నాన్‌స్టిక్ కోటింగ్‌తో డిష్వాషర్ సేఫ్ పాట్‌ను క్లీన్ చేయడం చాలా సులభం. డివైజ్ మొత్తం నిలబడేందుకు ప్రత్యేకమైన స్టాండ్ కూడా ఉంటుంది. పాట్కి ఇరువైపులా హ్యాండిల్స్ ఉండటంతో సర్వ్ చేసుకోవడం కూడా తేలికే. ►ధర - 154 డాలర్లు (రూ.12,034) చదవండి: కోల్డ్ కాఫీ కోసం కేఫ్‌ల చుట్టూ తిరగకుండా.. ఈ డివైజ్‌తో ఇంట్లోనే.. ధర ఎంతంటే! -
కోల్డ్ కాఫీ కోసం కేఫ్‌ల చుట్టూ తిరగకుండా.. ఈ డివైజ్‌తో ఇంట్లోనే.. ధర మాత్రం!
Cold Drip Coffee Machine: కాఫీల్లో కోల్డ్ కాఫీనే అదుర్స్ అంటుంటారు చాలామంది కాఫీ ప్రియులు. అందుకోసం కేఫ్‌ల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి వారికి ఈ డివైజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని కాఫీ చక్కటి రంగు, రుచి, సువాసనలను మీ కాఫీ మగ్‌లో ఒలకబోస్తుంది. బోరోసిలికేట్ గాజుతో తయారైన ఈ డివైజ్.. 600 ఎమ్ఎల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిలోని ఫిల్టర్, లిడ్(మూత) వంటివి తుప్పు పట్టకుండా అధిక నాణ్యత గల స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందాయి. డివైజ్‌ని ఆన్ చేసినప్పుడు.. పైభాగంలో ఐస్ ముక్కలు వేసుకుంటే.. ఒక్కో చుక్కా కింద ఉన్న కాఫీ పౌడర్‌లో పడుతూ కింద మగ్లోకి కోల్డ్ కాఫీ వచ్చి చేరుతుంది. అయితే ఐస్ ముక్కల నుంచి వచ్చే వాటర్ వేగాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దీనిలోని డబుల్ లేయర్ ఫిల్టర్.. ఎటువంటి అవశేషాలను వదలకుండా పూర్తిగా ఫిల్టర్ చేయగలుగుతుంది. హ్యాండ్ బ్రూ కాఫీ కోసం.. కింద ఉన్న మగ్ను షేరింగ్ పాట్‌గా కూడా ఉపయోగించవచ్చు. అలాగే దీనిలో వేడి వేడి టీ కూడా పెట్టుకోవచ్చు. ఈ డివైజ్‌లోని మగ్ సైజ్ రిఫ్రిజిరేటర్కు అనుకూలంగా ఉంటుంది. దాంతో కోల్డ్ కాఫీని నిలవ ఉంచుకోవడం కూడా సులభమే. ధర -77 డాలర్లు (రూ.5,949 ) చదవండి👉🏾All In One Cooker: చికెన్, మటన్.. పాస్తా, కేక్.. చిలగడ దుంపలు.. అన్నింటికీ ఒకటే! ధర ఎంతంటే! చదవండి👉🏾Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర? -
సింగిల్ స్విచ్‌తో పూటకో వెరైటీ వండివాడ్చేస్తాయి.. సరసమైన ధరల్లోనే..
రోబోటిక్ గ్రిల్ ‘సింగిల్ స్విచ్‌తో పూటకో వెరైటీ ’ అనే పద్ధతికి ఈ ఉరుకుల పరుగుల జీవితాలు బాగా అలవాటు పడిపోయాయి. వంటకు గరిటెతో పని లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే అసలు మనిషి పక్కనుండాల్సిన అవసరమే లేదు. స్విచ్ ఆన్ చేసి వెళ్తే.. ఏ వేళలో వడ్డించుకున్నా.. వేడివేడిగా అందించడం నేటి టెక్నాలజీ స్పెషల్. చిత్రంలోని ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ ఫ్రైయర్ మెషిన్.. గుండ్రంగా తిరుగుతూ క్రిస్పీ రుచులను అందిస్తుంది. గాడ్జెట్లోపల బౌల్ 360 డిగ్రీలు తిరుగుతూ ఆహారాన్ని ఫ్రై చేస్తుంది. ఇంటెలిజెంట్ నాన్‌స్టిక్ డ్రమ్ కలిగిన ఈ రోబోటిక్ మేకర్లో ఒకేసారి ఐదు రకాల ఫుడ్ ఐటమ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఐదు అరలతో కూడిన పార్టిషన్ గ్రిల్ ప్లేట్.. ఈ మేకర్‌తో పాటు లభిస్తుంది. దాన్ని సెట్ చేసి ఒక్కోదానిలో ఒక్కో రకం ఐటమ్‌ని చిత్రంలో ఉన్న విధంగా గ్రిల్ చేసుకోవచ్చు. ఒకే రకాన్ని ఎక్కువ మోతాదులో వండుకోవాలనుకుంటే పార్టీషన్‌ను తీసేసే సౌకర్యమూ ఉంది. ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది. దాన్ని గాడ్జెట్‌కి ఇరువైపులా లాక్ చేసుకునే వీలుంటుంది. గాడ్జెట్ పైభాగంలో ఆప్షన్స్‌తో కూడిన రెగ్యులేటర్ ఉంటుంది. వెనుక వైపు కింది భాగంలో వ్యర్థాలు చేరే ట్రే ఉంటుంది. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! ధర: 181 డాలర్లు (రూ.13,640) పోర్టబుల్ అవుట్ డోర్ గ్రిల్ ఇంట్లో ఉన్నప్పుడు పవర్ సాయంతో నడిచే మేకర్స్ సరే.. కానీ పిక్నిక్స్, హైకింగ్, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ సేవలు అందిపుచ్చుకోవడం ఎలా? ఆ సమస్యకు పరిష్కారమే ఈ అవుట్ డోర్ చార్కోల్ గ్రిల్. ఒక సూట్ కేస్లా వెంట తీసుకుని వెళ్లి.. అవసరమైనప్పుడు గ్రిల్ ప్లేట్స్‌ను చిత్రంలో చూపిన విధంగా అమర్చుకుని.. బొగ్గులపై క్రిస్పీ రుచులను తయారుచేసుకోవచ్చు. హైక్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్ తుప్పు పట్టదు. దీన్ని పట్టుకున్నప్పుడు చేతులు గీసుకోకుండా, బట్టల్లోని దారపు పోగులను లాగకుండా అన్ని అంచులు చక్కగా పాలిష్ చే సి ఉంటాయి. ఇందులో ఒకేసారి ఇద్దరి నుంచి ఐదుగురికి సరిపడే ఆహారాన్ని తయారుచేసుకోవచ్చు. ధర: 34 డాలర్లు (రూ.2,562) మల్టీఫంక్షన్ బ్రేక్‌ఫాస్ట్ మేకర్ చిత్రాన్ని చూసి ఇదేదో హ్యాండ్ బ్యాగ్ అనుకునేరు! కాదు కాదు. ఇదో బ్రేక్‌ఫాస్ట్ మేకర్. అవును.. శాండ్విచ్, బ్రెడ్ టోస్ట్, వాఫిల్స్, గుంత పొంగనాలు ఇలా చాలా రుచులను నిమిషాల్లో అందించగలిగే కుక్వేర్. ఒకరిద్దరికి సరిపడే పరిమాణంలో చాలా వెరైటీలను ఇందులో తయారుచేసుకోవచ్చు. ఈ మేకర్‌తో పాటు ఒక జత గ్రిల్ ప్లేట్స్, మరో జత వాఫిల్స్ ప్లేట్స్, రెండు గుంతపొంగనాల ప్లేట్స్ లభిస్తాయి. అవి డీప్ నాన్–స్టిక్ కోటింగ్ ప్లేట్స్ కావడంతో.. మెషిన్‌కి అటాచ్ చేయడం, వేరు చేయడం చాలా సులభం. ఇక దీనిపైన చికెన్, ఫిష్, రొయ్యలు వంటివీ గ్రిల్ చేసుకోవచ్చు. కట్లెట్స్, కబాబ్స్ లాంటివీ వండుకోవచ్చు. మెషిన్ ఆన్ అయిన తర్వాత రెడ్ లైట్ పవర్ ఆన్ని సూచిస్తుంది. ఇది లైట్ వెయిట్ కావడంతో ఉపయోగించడం చాలా తేలిక. ధర: 214 డాలర్లు (రూ.16,127) చదవండి: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! -
వైరల్ వీడియో: ఉల్లి ఏడిపిస్తోందా.. ఇలా చేయండి!
ఉల్లిపాయలను రకరకాలుగా వాడుతుంటాము. ఉల్లి మేలేమోగానీ దాని ఘాటుకు కళ్ల వెంట నీళ్లు కారడం ఖాయం. ఉల్లిపాయలు కోయాలన్నా, ఆ ఆలోచన మనసులో రాగానే∙వెంటనే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అటువంటి ఉల్లిని ఒక్కచుక్క కన్నీళ్లు రానియకుండా కోయవచ్చు అని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మ్యాక్స్ మెక్కెన్ అనే వ్యక్తి ఇక ఉల్లిపాయలను ఏడవకుండా ఇలా కోయండి అని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. వీడియోలో.. తడిగా ఉన్న ఒక వస్త్రాన్ని తీసుకుని దానిని కూరగాయలు కట్‌చేసే చాపింగ్ బోర్డు మీద ఉంచాలి. తరువాత మీరు ఎన్ని ఉల్లిపాయలు కోయాలనుకుంటున్నారో వాటన్నింటిని ముక్కలుగా తరగండి. అయితే మనం ఎప్పుడు ఉల్లిపాయలు కోసినా.. వాటి నుంచి కొన్ని రకాల ఆమ్లాలు బయటకు వెదజల్లి మన కళ్లని నేరుగా తాకుతాయి. దీంతో కళ్లు మండి నీరు వస్తుంది. అయితే చాపింగ్ బోర్డు మీద తడిగా ఉన్న వస్త్రం ఉంచడం వల్ల ఉల్లి నుంచి వచ్చే ఆమ్లాలను అది పీల్చుకుంటుంది. ఫలితంగా ఉల్లిలో ఉండే ఘాటైన యాసిడ్స్ కళ్లను చేరవు కాబట్టి కళ్లు మండవు.’’ అని మ్యాక్స్ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవడమేగాక వేలల్లో లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. చదవండి: ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు.. చాలామంది నెటిజన్లు నిజంగా ఇది పనిచేస్తుందా? అయితే మేము ఒకసారి ట్రె చేస్తాం అని కొందరు అంటే.. మరికొందరు ఇప్పటికే ఈ ట్రిక్కును మేము ట్రై చేశాము బాగా పనిచేస్తుంది అని చెబుతున్నారు. మీరూ ప్రయత్నం చేసి చూడండి ఇది ఎంతవరకు పనిచేస్తుదో తెలుసుకోండి. -
మార్కెట్లోకి మరిన్ని ఉత్పత్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్, ఎయిర్ ప్యూరిఫయర్ల తయారీ సంస్థ ‘కెంట్ ఆర్వో సిస్టమ్స్’... కిచెన్ అప్లయన్సెస్ శ్రేణిని విస్తృతం చేసే పనిలో ఉంది. ఇప్పటికే కంపెనీ గ్రైండర్/బ్లెండర్, టోస్టర్, జ్యూసర్, శాండ్విచ్ మేకర్, ఎలక్ట్రిక్ రైస్ కుకర్, ఫ్రైయర్, దోస మేకర్ వంటి ఉపకరణాలను విక్రయిస్తోంది. డిమాండ్ ఉన్న అప్లయన్సెస్ తయారీలోకి ప్రవేశిస్తామని కెంట్ ఆర్వో సిస్టమ్స్ సీఎండీ మహేష్ గుప్త తెలిపారు. సోమవారమిక్కడ నూతన శ్రేణి ఆర్వో వాటర్ ప్యూరిఫయర్లను ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 20 మంది సిబ్బందితో కూడిన పరిశోధన, అభివృద్ధి విభాగం కొత్త అప్లయన్సెస్ రూపకల్పనలో నిమగ్నమైందని ఆయన తెలియజేశారు. డిజిటల్ పవర్ ఉపకరణాలను దశల వారీగా ప్రవేశపెడుతున్నామని, వీటి ఆధారంగా ఇంటర్నెట్ ఆధారిత అప్లయన్సెస్ విడుదల చేయడం సులభమని చెప్పారు. మూడేళ్లలో రూ.1,500 కోట్లు..: కెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.950 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయగలమని ఆశిస్తోంది. ‘మూడేళ్లలో రూ.1,500 కోట్లకు చేరుకుంటాం. టర్నోవరులో 10 శాతం నాన్–ప్యూరిఫయర్ విభాగం నుంచి సమకూరుతోంది. రానున్న రోజుల్లో ఈ విభాగం వాటా మరింత అధికం కానుంది. రూ.1,800 కోట్ల వ్యవస్థీకృత ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ల మార్కెట్లో కెంట్కు 40 శాతం వాటా ఉంది. 19 రకాల వాటర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తున్నాం’ అని వివరించారు. కాగా, నూతన శ్రేణి నెక్స్ట్‌జెన్ ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ల ధర రూ.14,500–19,000 మధ్య ఉంది. బ్యాక్టీరియా, ఇతర మలినాలు చేరకుండా వాటర్ ట్యాంకులో అల్ట్రా వయోటెల్ రక్షణ ఏర్పాటు ఉంది. అలాగే ప్యూరిటీ వివరాలు తెలిపే డిజిటల్ డిస్ప్లే పొందుపరిచారు. -
మారుతోన్న వంటిల్లు
ఆధునాతన హంగులు.. అందమైన అలంకరణ సాక్షి, హైదరాబాద్: కాలం మారుతోంది. దానికి అనుగుణంగానే అభిరుచులు కూడా మారుతున్నాయి. ఇంటిని ఎంత అందంగా నిర్మించుకోవాలనుకుంటున్నారో అంతే అందంగా వంటిళ్లు, పడకగది తదితర వాటిని ఉంచుకోవాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్టు గతంలో మాదిరిగా టేకు, ఫ్లయివుడ్, డెకోలానికి కాలం చెల్లింది. ప్రస్తుతం మార్కెట్లో ఎండీఎఫ్, (మీడియం డెనిసిట్ ఫైబర్), మరిన్ ఫ్లయ్ (వంద శాతం నీటిని తట్టుకునే రకం) వచ్చేశాయి. ఇందులో పలు రంగులుంటాయి. అభిరుచిని బట్టి ఇంటి మొత్తాన్ని అరలతో మార్చేస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ సామాను పట్టేలా, అది కూడా ఆకర్షణీయంగా ఎక్కడికక్కడ అమరుస్తారు. ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలు సైతం కిచెన్‌తో పాటు ఇంటీరియల్ డెకరేషన్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఆసక్తి, అభిరుచులకు తగ్గుట్టుగా పలురకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు వంటిళ్లు, పడక గదిలో అరలు ఏర్పాటు చేసుకోవచ్చు. ధరలను బట్టి సామాగ్రి మారుతుంటుంది. గత ఐదేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు నిర్మించే ప్రతి ఇంట్లోనూ అధునాత వంటిళ్లు, పడకగది, ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తున్నారు. స్థాయిని బట్టి వంటిళ్లును మార్చుకునేందుకు వీలుండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అధునాతన సౌకర్యాలు.. వంటింటిలోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా రూపుదిద్దుతున్నారు. వంటింట్లో ప్రధానమైన గ్యాస్ స్టవ్‌ను మార్చేస్తున్నారు. ఇందులో రూ.9 వేల నుంచి మొదలుకొని రూ.25 వేల వరకు ఉన్నాయి. దీంతో వంట సమయంలో పొగబయటకు రాదు. దీంతో పాటు వంట సామాగ్రి చెంచాలు, కప్పులు, ప్లేట్లు వేర్వేరుగా పెట్టుకునేందుకు అరలను అమరుస్తారు. ఇందులో ఏ ఒక్కటి బయటకు కనబడదు. వంటింట్లో ఏమాత్రం స్థలాన్ని వృథా పోనీయకుండా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. లిమెన్స్కార్నర్, పుల్ అవుట్, టాల్ యూనిట్ ఇలా రకరకాల వాటిని మన అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో అర 50 కిలోల బరువును ఆపేలా ఉంటాయి. వేడి, నీటిని తట్టుకునేలా ఉంటాయి.