'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..'
ఇలా చేయండి..
- వాటర్ బాటిల్‌లో సగం వరకు నీళ్లుపోయాలి. మిగతా సగంలో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, ఐస్ ముక్కలను వేసి బాగా షేక్ చేయాలి. ఇలా పది నిమిషాలు చేసిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధానంలో బాటిల్ కడగడం వల్ల బాటిల్‌లో సూక్ష్మజీవులు పూర్తిగా పోతాయి.
- టీస్పూను వంటసోడా, రెండు టీస్పూన్ల వెనిగర్‌ను బాటిల్‌లో వేసి మూతపెట్టాలి. ఇరవై నిమిషాల తరువాత బాటిల్‌ను బాగా షేక్ చేసి కడగాలి. ఇలా కడిగిన బాటిల్‌ను మూతతీసి పూర్తిగా ఆరిన తరువాత వాడుకోవాలి.
- వంటసోడా, వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా మాడిన గిన్నె, ఫ్రైపాన్‌పై రాసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్‌వాషర్‌తో రుద్ది కడిగితే మురికి మొత్తం తొలగి పోతుంది.
- గోరువెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారు గంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి.
- వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది.
ఇవి చదవండి: బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు!
Comments
Please login to add a commentAdd a comment